surya peta
-
ప్రేమించలేదని బాలిక గొంతు కోసేశాడు
సాక్షి, సూర్యాపేట: ప్రేమించలేదని ఓ దుండగుడు బాలిక గొంత కోసిన దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నేరెడుచర్లలో ఓ బాలికతో తనను ప్రేమిస్తున్నట్లు బాల సైదులు అనే వ్యక్తి తెలిపాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో గత కొంత కాలంగా ప్రేమ పేరుతో తనని వేధిస్తూ వచ్చాడు. ఎంతకీ తాను ఒప్పుకోలేదనే కోపంతో బాలిక గొంతు కోసేశాడు. ఈ ఘటన అరబిందో కాలేజ్ సమీపంలో జరిగింది. దాడిలో బాలికకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం.. -
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కంపించిన భూమి
సాక్షి, సూర్యాపేట: చింతలపాలెం మండల కేంద్రంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతలపాలెం వాసుల్ని వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆదివారం ఉదయం రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 7:40, 8:20 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 1.8గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్ ధ్రువీకరించారు. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భూమి కంపించడంతో జనం ఇళ్లల్లోనుంచి పరుగులు పెట్టారు. -
భగ్గుమంటున్న కూరగాయల ధరలు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలకు కూరగాయల కొనుగోళ్లు భారంగా మారాయి. రూ.200 పెట్టినా.. సగం సంచి నిండడం లేదు. గత ఏడాదితో పరిశీలిస్తే.. ఈ ఏడాది వానాకాలం అంతటా కూరగాయల సాగు పడిపోవడమే ఇందుకు కారణం. నీటి పారుదల వనరులతో మెట్ట ప్రాంతాల్లో తరి పంటలే ఎక్కువగా సాగయ్యాయి. వరి సాగుకు రైతులు మొగ్గు చూపడంతో కూరగాయల సాగు పడిపోయింది. గత ఏడాది 1,32,610 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగయితే, ఈ ఏడాది 61,153 ఎకరాల్లోనే ఈ పంట సాగు విస్తీర్ణం నమోదైంది. ఈ పరిస్థితితో కూరగాయల ధరలు పెరిగాయి. రాజధాని చుట్టూ తగ్గిన సాగు రాజధాని చుట్టు పక్కల ఉన్న జిల్లాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో గత ఏడాది సాగు విస్తీర్ణం కన్నా ఈసారి 50 శాతం లోపే సాగు చేశారు. ఈ వానాకాలం రాష్ట్రంలో భారీ వర్షాలు పడటంతో భూగర్భ జలాలు అనూహ్యంగా పైకివచ్చాయి. దీంతో రైతులు మెట్ట పంటలను వదిలి తరి పంటల సేద్యం బాట పట్టారు. టమాట, బెండకాయ, వంకాయ, దొండకాయ, దోసకాయ, పచ్చిమిర్చి, సొరకాయ వంటి కూరగాయలు ప్రతి గ్రామాల్లో కొన్ని ఎకరాల్లోనైనా పండేవి. నీటి వనరుల కళతో రైతులు కూరగాయల సాగును పక్కన పెట్టి ఎక్కువగా వరి సాగు చేశారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం జలాలతో మెట్ట ప్రాంతమంతా తరిగా మారడంతో ఈ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లోనూ కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో దీని ప్రభావం ధరలపై పడింది. ఏ కూరగాయలను కొనుగోలు చేయాలన్నా ధరను చూసి సామాన్య ప్రజలకు దడ పుడుతోంది. పచ్చి మిర్చి కేజీ రూ.100, బెండకాయ, వంకాయ, టమాట రూ.60 పైనే పలుకుతోంది. గత ఏడాది కన్నా రెండు, మూడు రెట్లు పెరిగాయి. ఐదు నెలలుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయనీ కానీ దిగి రావడం లేదు. అయితే ఈ పంటలు కొద్దిగొప్పో సాగు చేసిన రైతులకు మాత్రం దండిగా ఆదాయం సమకూరుతోంది. ఒకప్పుడు మార్కెట్లో టమాటకు కిలో రూ. 2 కూడా పెట్టలేదని, గత ఐదు నెలలుగా కేజీ హోల్‌సేల్‌గా తోట వద్దే రూ.40కి పైగా అమ్ముతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. గత ఏడాది, ఈ ఏడాది పలు జిల్లాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) .. జిల్లా గత ఏడాది ఈ ఏడాది రంగారెడ్డి 37,579 13,652 వికారాబాద్ 5,664 6,328 సంగారెడ్డి 6,823 3,535 నల్లగొండ 4,269 1,191 సిద్దిపేట 9,902 4,696 సూర్యాపేట 2,418 825 -
చేతబడి నేపథ్యంలోనే మాధవయ్య హత్య
ఆత్మకూర్(ఎస్) (సూర్యాపేట) : ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన మాధవయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యలో పాలుపంచుకున్న నిందితులను పట్టుకుని రిమాండ్ చేశారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ ప్రవీణ్‌కుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.బొప్పారం గ్రామానికి చెందిన ఎడ్ల మాధవయ్యను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో కిరాతకంగా నరికి హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం కాగా పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపారు. గురువారం గ్రామానికి చెందిన ఎడ్ల జలేందర్, ఎడ్ల జనార్దన్, ఎల్క మధు, ఎర్ర శ్రీకాంత్‌లు అనుమానాస్పదంగా గ్రామంలో తిరుగుతుండడంతో పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ఆ హత్య తామే చేశామని ఒప్పుకున్నారు. గతంలో నిందితుల బంధువులు ఎడ్ల రాందాస్, ఎడ్ల నారాయణలు మృతి చెందారు. వారి మృతికి మాధవయ్య చేతబడే కారణమని భావించి మాధవయ్యపై కక్షపెంచుకున్నారు. బుధవారం రాత్రి ఇంటి ఆరుబయట నిద్రించడంతో హత్య చేయడానికి పూనుకున్నామని నిందితులు ఒప్పుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. 24 గంటల్లో కేసును చేధించినందుకుగాను ఎస్ఐ హరికృష్ణ, సిబ్బందిని అభినందించి ఎస్పీ రివార్డు ప్రకటించినట్టు విలేకరులకు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ రంగాచార్యులు, సిబ్బంది భగవాన్‌నాయక్, జనార్దన్, అశోక్‌రెడ్డి, అంజయ్య, గౌస్షాష తదితరులు ఉన్నారు. -
మామిడి రైతు నిలువు దోపిడీ
సూర్యాపేట, న్యూస్‌లైన్ : సూర్యాపేటలోని జనగాం ఎక్స్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన మూడు ప్రైవేటు మార్కెట్‌యార్డులు ఉన్నాయి. ఇక్కడినుంచి రోజూ 30లారీల మామిడికాయ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఈ యార్డులకు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి రైతులు మామిడికాయలు విక్రయించేందుకు వస్తున్నారు. రైతుల నుంచి లోకల్ కాయను టన్నుకు 16 వేల నుంచి 23 వేల వరకు, ఇతర ప్రాంతాల కాయలను టన్నుకు రూ.13 నుంచి రూ.15 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. వాటినే రూ.30 వేల నుంచి రూ. 40 వేల వరకు భోపాల్, ఇండోర్, కోల్‌కతా, నాగ్‌పూర్, ముంబై, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో లారీకి 15టన్నుల చొప్పున ఎగుమతి అవుతుంది. సుమారు 450 టన్నుల మామిడికాయ ప్రతిరోజూ ఎగుమతి అవుతుంది. కానీ ఈ మార్కెట్ యార్డులకు ఎలాంటి అనుమతులూ లేవు. మార్కెట్‌కు చెల్లించాల్సిన సెస్‌ను కూడా చెల్లించడం లేదు. ఒక్క శాతం సెస్ రూపేణా చెల్లించినా ప్రతిరోజు రూ.45వేల ఆదాయం మార్కెటింగ్ శాఖకు వస్తుంది. కానీ వ్యాపారులు ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండానే మామిడికాయను ఖరీదు చేస్తుండడంతో మార్కెట్ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఎగుమతి ఇలా.. మార్కెట్‌కు వచ్చిన పచ్చి మామిడికాయను గ్రేడింగ్ విధానంలో నాలుగు రకాలుగా విభజిస్తున్నారు. కాయసైజును బట్టి డబ్బాలను తయారుచేసి లోడింగ్ చేస్తున్నారు. వాటిలో కార్బైడ్‌ను పెట్టి సీజ్ చేయడంతో మూడు రోజుల్లో ఆకుపచ్చగా ఉన్న మామిడికాయలు పసుపురంగులోకి మారుతుంటాయి. వారు పంపించాల్సిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత నేరుగా డబ్బాలను ఇప్పితే రంగుమారి నిగనిగలాడుతుంది. వాటిని ఆయా ప్రాంతాల్లో టన్నుకు రూ.లక్ష వరకు విక్రయిస్తున్నారు. కార్బైడ్ ప్యాకింగ్.. కార్బైడ్‌ను బహిరంగ ప్రదేశాల్లో ప్యాకింగ్ చేయడం వల్ల దానికి గాలిసోకి ఊపిరితిత్తుల వ్యాధి భారీన పడే ప్రమాదముందని డాక్టర్లు తెలుపుతున్నారు. మామిడికాయల ప్యాకింగ్ సమయానికి ముందే మహిళలు, పిల్లలతో కార్బైడ్ పొట్లాలను తయారుచేస్తున్నారు. ఆయా పొట్లాలను మామిడికాయ డబ్బాల్లో అమరుస్తున్నారు. నష్టాల బాటలో కౌలు రైతులు.. లక్షలాది రూపాయలు వెచ్చించి తోటలను కౌలుకు తీసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ యేడు వాతావరణం అనుకూలించక 25 శాతం కూడా దిగుబడి రాలేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. డిసెంబర్ నెలలో పూత రావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత వచ్చి రాలిపోయిందని వాపోతున్నారు. దీంతో ఇప్పటికీ 30 శాతం దిగుబడి మాత్రమే వచ్చిందని, మరోనెల రోజుల పాటు మరికొంత దిగుబడి వచ్చే అవకాశముందంటున్నారు. నియంత్రణ లేని చెక్‌పోస్టులు.. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్ద నియంత్రణ కొరవడింది. మార్కెటింగ్ శాఖ నుంచి అనుమతి పత్రం ఇవ్వకుండానే కొన్ని లారీలను తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల డ్యూటీ లో ఉండాల్సిన అధికారులు కూడా డుమ్మా కొట్టి ప్రైవేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. రోజూ 45 లారీల మామిడికాయ వెళ్తుంటే వ్యాపారుల వద్ద లారీకి రూ.300 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చెక్పోస్టులపై నియంత్రణ చేస్తే మార్కెట్ ఆదా యం పెరుగుతుంది. పాత మార్కెట్లో మామిడి కాయను ఖరీదు చేయాలి సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో మామిడికాయ ఖరీదు చేసేందుకు వసతులు కల్పించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు దూర ప్రాంతాల్లో ఇబ్బందులు పడకుండా పాత మార్కెట్లో ఉన్న షెడ్లలో కాయను పోసుకునేందుకు ఏర్పాటుచేసి వ్యాపారులను మార్కెట్లోకి పిలిపించాలని రైతు సంఘం నాయకుడు మల్లు నాగార్జున్‌రెడ్డి తెలిపారు. -
పాలేరు.. తేలేరా?
సూర్యాపేట పట్టణవాసులకు పాలేరు జలాలు అందని ద్రాక్షగానే మారాయి. పాలేరు జలాల నినాదం.. ఇక్కడి నాయకులకు ఎన్నికల వాగ్దానంగా మారిపో యింది. ఈ జలాలు అందిస్తామని ప్రతి సారి ఎన్నికల సమయంలో నేతలు హామీలివ్వడం ఆ తరువాత మరచిపోవడం పరిపాటిగా మారింది. దీంతో ఇక్కడి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడంలేదు. మున్సిపాలిటీ వారు సర ఫరా చేస్తున్న నీరు ఏమూలకూ సరిపోవడంలేదు. ఇది కూడా మురికిగా ఉండడంతో ప్యూరిఫైడ్ నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. సూర్యాపేట పురపాలక సంఘం ఆర్భాటంగా సరఫరా చేసేది పేరుకు మంచినీరు.. అందిం చేది మాత్రం మురుగునీరు. సాధారణ అవసరాలకు కూడా పనికిరాని నీటిని అందిస్తుండడంతో స్థాని కులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం లో లక్షా 5 వేల జనాభా ఉండగా డివిజన్ కేంద్రం కావడంతో నిత్యం వ్యాపార, వాణిజ్య, విద్యా అవసరాల కోసం సుమారు 40 వేల మందికి పైగా పట్టణానికి వచ్చి పోతుంటారు. ఒక్కొక్కరికి నిత్యం 125 లీటర్లు అవసరముండగా వారందరికీ మొ త్తం 18 ఎమ్‌ఎల్‌డీలు(మిలియన్ లీటర్ ఫర్ డే ) కావాల్సి ఉంది. కానీ పట్టణానికి సరఫరా చేసే దోసపహాడ్ రిజర్వాయర్ నుంచి 5 ఎమ్‌ఎల్‌డీలు, మూసీ నుంచి 8 ఎమ్‌ఎల్‌డీలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. దీంతో మరోఐదు ఎమ్ఎల్డీల కొరత ఏర్పడింది. ఇవి కూడా ప్రస్తుతం ఒక్కోప్రాంతానికి ఒక్కో రోజు చొప్పున మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే అందుతున్నాయి. ముందుచూపు లేకే దోసపహాడ్, మూసీలకు నిధుల మళ్లింపు.. పట్టణ జనాభాకు సరిపోను నీటి అవసరాలపై గత మున్సిపల్ పాలకులకు ముందు చూపులేకే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు భావిస్తున్నారు. గత మున్సిపల్ పాలకుల్లో ఒకరు దోసపహాడ్, మరొకరు మూసీ నుంచి అదనపు పైపులైన్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చించారని అప్పుడే పాలేరు పథకాన్ని ముందుకు తెస్తే ఈ పరిస్థితి తలెత్తేదేకాదంటున్నారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో.. పట్టణానికి సుమారు వంద కోట్లతో పాలేరు జలాలు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రతిపాదనలు పంపారు. అయితే గతంలో కోట్ల నిధులు దోసపహాడ్, మూసీలకు వెచ్చించారని, తిరిగి పట్టణానికి వంద కోట్లతో పాలేరు పథకాన్ని తీసుకొచ్చేందుకు సాంకేతిక సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో రెండు పథకాలకు డబ్బు వెచ్చించి తిరిగి పాలేరు పథకమంటే ఎలా కుదురుతుందని కేంద్ర స్థాయిలో అధికారులు కొర్రి పెడుతున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. ముందుచూపులేకుండా డబ్బులు వెచ్చించి ప్రజలకు తాగునీరందించలేక పోవడానికి కారణమైన బాధ్యులపై చర్యలు చేపడతామని కేంద్ర స్థాయి అధికారులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహకారంతో సమస్యను పరిష్కరించి పాలేరు పథకాన్ని మం జూరు చేయించే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందన్నారు. లేకపోతే ఇప్పటికే పనులు ప్రా రంభం కావాల్సి ఉండేదని ఎమ్మెల్యే తెలిపారు. తాగునీటికి ఏటా *5వేలు ఖర్చు పాల కంటే.. ఎక్కువ ఖర్చు తాగునీటికి కే టాయించిన దౌర్భాగ్య పరిస్థితి సూర్యాపేట పట్టణ ప్రజలకు దాపురించింది. నిరుపేద, మధ్య తరగతి సంపాదన రోజుకు సుమారు *200 చొప్పున ఏడాదికి *72 వేలు . ఇందులో సుమారు *5 వేలు తాగునీటి కోసం వెచ్చిస్తున్నారు. * 2 లకే 20 లీటర్ల మంచినీటిని సరఫరా చేయాల్సి ఉండగా * 5 నుంచి * 10లకు క్యాన్ విక్రయిస్తున్నారు. నెరవేరని హామీలు 1999 ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మిర్యాలగూడ పార్లమెంటు ని యోజకవర్గం నుంచి పోటీ చేసి సూర్యాపే ట వచ్చిన సందర్భంగా పాలేరు ద్వారా కృ ష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.2004 ఎన్నికల్లోనూ తిరిగి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వేదాసు వెంకయ్యలు ఇదే వాగ్దానం చేశారు.మున్సిపల్ ఎన్నికల్లోనూ చైర్మన్ అభ్యర్థులు ప్రతిసారి ఇదే వాగ్దానం చేస్తు -
యూరియా.. భారమయా
సూర్యాపేట మున్సిపాలిటీ / సూర్యాపేటటౌన్, న్యూస్‌లైన్ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్న అన్నదాతపై కేంద్రప్రభుత్వం భారం మోపింది. పం టల సాగుకు అవసరమైన యూరియా ధరను పెంచేసింది. యూరియా టన్నుకు *350 పెంచుతూ ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గసమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులపై రూ.2.89 కోట్ల అదనపు భారం పడనుంది. యూరియా ధర పెరగడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చిన్నకారు రైతులు 2.82 లక్షల మంది, సన్నకారు రైతులు 1.45లక్షల మంది, పెద్ద రైతులు 70వేల మంది ఉన్నారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీసీజన్లకు కలిపి లక్షా 27 వేల మెట్రిక్ టన్నుల యూరి యాను రైతులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో యూరియా ధర టన్నుకు రూ.5684 ఉండేది. కేంద్రప్రభుత్వం దీనికి రూ.350 అదనంగా పెంచింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని రైతులపై రూ. 2.89 కోట్ల అదనపు భారం పడనుంది. 50 కిలోల బస్తాకు అదనంగా రూ17.50 ప్రస్తుతం నీమ్కోటెడ్ యూరియా 50 కిలోల బస్తా ధర రూ.298, నాగార్జున యూరియా రూ. 283.85, క్రిబ్కో రూ. 284కి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. తాజాగా పెరిగిన ధరతో ఒక్కో యూరియా బస్తాపై రూ. 17.50 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇక నుంచి నీమ్కోటెడ్ యూరియా బస్తాకు రూ. 315.50 చెల్లించాలి. రిటైల్ వ్యాపారులు రవాణా, హమాలీ చార్జీలను కలుపుకొని విక్రయించనున్నందున ఈ ధర ఇంకా పెరగనుంది. ఇక ప్రయివేటు వర్తకుల ధరలు చెప్పనవరం లేదు. ఆందోళనలో రైతులు యారియా ధరను పెంచడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. తమ నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో లోవోల్టేజీ, విద్యుత్ కోతలు, అకాల వర్షాలతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక, కొద్దిపాటి పంటకు మద్దతు ధర లభించక రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. రబీలోనైనా ఎక్కువ దిగుబడులు వచ్చి అప్పులు తీర్చవచ్చనుకుంటున్న రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. యూరియా ధర పెంచి భారం మోపిందని అన్నదాతలు మండిపడుతున్నారు. దురదృష్టకరం పెరిగిన విత్తనా లు, ఎరవులు, కూలీల ధరలతో రైతులు అప్పు ల్లో కూరుకుపోతుంటే యూరియా ధర పెంచడం దురదృష్టకరం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సబ్సిడీలిచ్చి రైతులను ప్రోత్సహించాలి. రై తులపై భారం మోపితే వ్యవసాయం ముందుకు సాగదు. - ఏరెడ్ల జగదీశ్వర్‌రెడ్డి, రైతు -
రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలి
సూర్యాపేట, న్యూస్‌లైన్: గౌడ కులస్తులు రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ గౌడ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆది వారం రాత్రి సూర్యాపేటలోని గాంధీపార్కులో జరిగిన జిల్లా గౌడ యువగర్జన సభకు ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, తెలంగాణ రాష్ట్ర డాక్టర్స్ జేఏసీ చైర్మన్ బూర నర్సయ్యగౌడ్, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గౌడ కులస్తులు కట్టున్న కులముగా నిరూపించుకోవాలన్నారు. నేల మీద ప్రవహించే నీళ్లకు ఉన్న డిమాండ్ కల్లుకు లేకపోవడం బాధాకరమన్నారు. 60 ఏళ్ల స్వాతంత్య్రంలో గీత కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. రైతులు పండిస్తున్న పంటలకు కల్పిస్తున్న మద్దతు ధర లాగానే గీత కార్మికులు గీసే కల్లుకు కూడా ప్రభుత్వం ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పాల డైరీలలాగానే జిల్లాలోని మండలాల్లో కల్లు డైరీలను ఏర్పాటు చేసి కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. త్వరలో జరగబోయే తెలంగాణ పునర్నిర్మాణం లో గౌడ కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వా లని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును కేటాయించాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తులు ఏకమై పోటీలో నిలిచిన స్థా నాలను గెలిపించుకోవాలన్నారు. కొడి తే గోల్కొండనే కొట్టాలనే.. నినాదం చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ను యువత ఆదర్శంగా తీసుకోని ముం దుకు సాగాలన్నారు. రానున్న ఉగాది పండగను తెలంగాణలో జరుపుకోనున్నట్లు తెలిపారు. ఇంకా గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సుంకరి మల్లేశంగౌడ్ తది తరులు కూడా మాట్లాడారు. నాతి సవీం దర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ హీరో, సర్వాయిపాపన్నగౌ డ్ ట్రస్టు చైర్మన్ పంజాల జైహింద్‌గౌడ్, బీసీ సంక్షేమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, వట్టికూటి రామారావు, గౌడ మహిళా సం ఘంజిల్లా అధ్యక్షురాలు నిమ్మల ఇందిరాగౌడ్, కేవీఎల్, ఆహ్వాన సంఘం కమిటీ సభ్యులు బైరు వెంకన్నగౌడ్, నేరేళ్ల మధుగౌడ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు నెలలు.. 15 దొంగతనాలు
దొంగతనాలకు అడ్డాగా మారిన సూర్యాపేట.. పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాల అపహరణ భయబ్రాంతులకు గురువుతున్న ప్రజలు టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కలేనా సూర్యాపేట..దొంగలకు అడ్డాగా మారింది. తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రెండు నెలల్లో సుమారు 3కిలోల బంగారు, కిలో వెండి ఆభరణాలతో పాటు రూ.6లక్షల నగదు అపహరణకు గురైంది. సూర్యాపేట హైదరాబాద్-విజయవాడ నగరాల మధ్య ఉండడం, వరంగల్, జనగాం, మిర్యాలగూడ పట్టణాలకు ప్రధాన కూడలిగా ఉంది. దీంతో దొంగతనాలకు పాల్పడి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న పట్టణం దొంగతనాల విషయంలో అదే రీతిలో ఉండడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. సిబ్బంది కొరత... సూర్యాపేటలో పోలీసు సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. సుమారు లక్ష పైచిలుకు జనాభా, అదే విధంగా రోజు వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చివెళ్లే వారు సుమారు 50 వేల మంది ఉంటారు. దీంతో పట్టణంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. పట్టణంలో ఒకటే పోలీస్‌స్టేషన్ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఉన్న సిబ్బందిలో కొంతమంది వివిధ బందోబస్తులకు వెళ్తుంటారు. మిగిలిన వారితో పెట్రోలింగ్ చేయడం ఇబ్బందిగా మారింది. సూర్యాపేట గ్రేడ్-1 మున్సిపాలిటీ. దీంతో పోలీస్తే మిర్యాలగూడ పట్టణంలో రెండు పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి సరిపడా సిబ్బందిని నియమించారు. కానీ సూర్యాపేటలో మాత్రం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడం లేదు. గతంలో హోంమంత్రిగా పనిచేసిన రాష్ట్ర మంత్రి జానారెడ్డి పేటలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనే కాక ఎంతో మంది ప్రజాప్రతినిధులు హామిలిచ్చినా అవి నేటికీ నెరవేరలేదు. రెండు నెలల్లో పేటలో జరిగిన చోరీల్లో ముఖ్యమైనవి.. నవంబర్‌లో 23వ తేదీ రాత్రి హైటెక్ బస్టాం డ్లో నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సులోనుంచి బంగారు దుకాణం గుమాస్తాల వద్ద ఉన్న సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదు అపహరించారు. 29వ తేదీన శ్రీశ్రీనగర్‌లోని పగిళ్ల సతీష్ నివాసంలో తాళం పగలగొట్టి పట్టపగలు 6తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, ఖమ్మం క్రాస్ రోడ్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు నివాసంలో పట్టపగలు తాళం పగలగొట్టి 4తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. డిసెంబర్లో 15వ తేదీన ఉదయం వేళలో ఇంటికి తాళం వేసిన మూడు ఇళ్లలో, జమ్మిగడ్డలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఒకేసారి చోరీలకు పాల్పడ్డారు. కాసం నర్సింహారెడ్డి నివాసంలో 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, తోట శంకర్ ఇంట్లో కిలో వెండి ఆభరణాలు, మూడు తులాల బంగారు ఆభరణాలు, వాసు నివాసంలో రెండు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. జనవరిలో 6వ తేదీన శ్రీశ్రీనగర్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయుల నివాసంలో సుమారు 15తులాల బంగారు ఆభరణాలు, రూ.66 నగదును చోరీ చేశారు. ఇలాంటి సంఘటనలు పట్టణంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. అమలుకు నోచుకోని ఎస్పీ హామీ.. ఇటీవల జిల్లాలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో వాటిని అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ప్రణాళిక రూపొందించారు. దొంగతనాలు జరిగినపుడు జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు ప్రజల వద్ద ఉండే విలువైన బంగారు, వెండి ఆభరణాలను జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న పోలీస్‌స్టేష న్లో భద్రపరిచేందుకు లాకర్ల సౌకర్యం కల్పిస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే పోలీస్‌స్టేషన్‌లో లాకర్లను ఏర్పాటు చేస్తే ప్రజలు ఏదైనా పని నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన పుడు విలువైన వస్తువులను స్టేషన్లలో భద్రపరుచుకునే అవకాశం ఉంది. కానీ ఎస్పీ హామీ అమలుకు నోచుకోవడం లేదు. సీసీ కెమెరాలెక్కడా.. ఏదైనా సంఘటనలు జరిగినపుడు మాత్రం కొన్ని రోజులపాటు అధికారులు ఎక్కువగా హడావుడి చేస్తారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అది చేస్తాం..ఇది చేస్తాం అని మాటలు చెబుతారు. ఆ తర్వాత షరామామూలే. పట్టణంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీస్ అధికారులు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోజులు గడుస్తున్నాయి..దొంగతనాలు జరుగుతూనే ఉన్నా సీసీకెమెరాలు మాత్రం ఏర్పాటు కావడం లేదు. ప్రజల్లో మార్పు రావడం లేదు దొంగతనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నో రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపాం. విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించాం. ఆ విధంగా ఎవరూ చేయడం లేదు. దొంగతనాలను అరికట్టేందుకు తమ వంతుగా చర్యలు చేపడుతున్నాం. జరిగిన చోరీలను ఛేదించేందుకు పాత నేరస్తుల వివరాలు సేకరిస్తున్నాం. త్వరలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లలో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తాం. - ఎస్. శ్రీనివాసులు, సూర్యాపేట ఇన్స్పెక్టర్ రెండు నెలల్లో 15 దొంగతనాలు..పలు చైన్‌స్నాచింగ్‌లు.. ఇదీ..సూర్యాపేటలో దొంగల హల్చల్. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట దొంగతనాలకు అడ్డాగా మారింది. రాత్రి, పగలు తేడా లేకుండా దొంగత నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు వివిధ రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. -న్యూస్‌లైన్, భానుపురి -
మూడు నదుల అనుసంధానం....ముందుతరాలకు జీవనాధారం
సూర్యాపేట, న్యూస్‌లైన్: సూర్యాపేట నియోజకవర్గంలో బిరబిరా పొంగే కృష్ణమ్మ.. గలగల పారే గోదారమ్మ జలాలు పరుగులు తీస్తున్నాయి. ఎగిసి పడే మూసీ ప్రవాహపు జలసిరులు ఉన్నాయి. అయినా సాగు, తాగు నీటి కొరత వేధిస్తూనే ఉంది. ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ కాలువలను మూసీ నదిలోకి అనుసంధానం చేస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుంది. ఈ నేపథ్యంలోనే త్రివేణి సంగమం తెరపైకి వచ్చింది. దీనికోసం కొందరు పోరుబాట పట్టారు. అనుసంధానం ఇలా.. సూర్యాపేట నియోజకవర్గంలోని సోలిపేట గ్రామం వద్ద 1954లో మూసీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, అనంతగిరి పర్వతశ్రేణుల నుంచి ప్రవహిస్తూ వస్తున్న మూసీ నీటిని నిల్వ ఉంచేందుకు ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రాజెక్ట్ 1958నాటికి పూర్తయింది. ఎడమ కాలువ 41 కి.మీ, కుడి కాలువ 38 కి.మీ ప్రవహించి 40 గ్రామాల ప్రజలకు సాగునీరు ఇస్తుంది. 595 అడుగుల లోతు, 571 క్యూసెక్కుల నీటినిల్వ సామర్థ్యంతో 30 క్రస్ట్‌గేట్లతో ప్రాజెక్ట్ నిర్మించారు. ఎడమ కాలువ ద్వారా సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లో 20వేల ఎకరాల వ్యవసాయ భూములకు నీరందుతుంది. కృష్ణాజలాలు మూసీలో ఎలా.. ఎక్కడ కలుస్తాయంటే.. మూసీ ప్రాజెక్ట్‌లోకి కృష్ణానీటిని వదిలితే ఎక్కు వ భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. 1972లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ఎస్ఎల్బీసీ పనులు సర్వే చేయించగా 1983లో అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు *52 కోట్లు విడుదల చేసి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో 30 టీఎంసీల నీటిని 3లక్షల ఎకరాలకు నీరివ్వాలాని ప్రతిపాదించారు. లిఫ్ట్ ద్వారా 22టీఎంసీల నీటిని అక్కంపల్లి, పానగల్లు (ఉదయసముద్రం) నుంచి మూసీ రిజర్వాయర్లకు నీటిని అందిస్తే 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని ప్రణాళిక రూపొందిం చారు. దీని ప్రకారం ఉదయసముద్రం నుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా కట్టంగూరు మండలం అయిటిపాముల చెరువుకు 2003లో కృష్ణా జలాలు చేరుకున్నాయి. 2004లో నకిరేకల్ మండలం నోముల గ్రామం వరకు నీటిని పంపే ఏర్పాటు చేశారు. ఏఎమ్మార్పీ చివరి పాయింట్ మూసీ నది అయినప్పటికీ కృష్ణాజలాలు మూసీలో కలవడంలేదు. నోముల వరకు ఉన్న ఏఎమ్మార్పీ కాలువను మూసీలో కలిపితే కృష్ణానీరు మూసీలో కలుస్తుంది. గోదావరి జలాలు.. 1969లో అప్పటి ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) రెండో దశ నిర్మాణం చేపట్టి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు నీరందిస్తామని ప్రకటించింది. 1996లో ఎస్సారెస్పీ కాలువ పనులకు అనుమతిచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004 నుంచి పనులు వేగవంతమై 2009 నాటికి నీరు విడుదల అయ్యింది. జిల్లా వ్యాప్తంగా దీని ద్వారా 2లక్షల 57వేల 508 ఎకరాలు పంట పొలాలకు నీరందనుంది. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 95 వేల354 ఎకరాలకు నీరందేలా కాలువలు తవ్వారు. కానీ, నేటికీ నీటి విడుదల కాలేదు. ఉపయోగం సరిగా లేదు. ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా వస్తున్న గోదావరి నీటిని ప్రధాన కాలువ ద్వారా మూసీ ప్రాజెక్ట్‌కు తరలిస్తే ఈ ప్రాంత భూములు మరింత ఉపయోగంలోకి వస్తాయి. ఎస్సారెస్పీ ప్రధాన కాలువను మూసీ ఉప నది బిక్కేరు వాగులో కలిపితే గోదావరి జలాలు మూసీ ప్రాజెక్ట్‌కు అందుతాయి. ఈ రకంగా మూసీ ప్రాజెక్ట్‌కు అత్యంత చేరువగా ఉన్న కృష్ణా, గోదావరి జలాలను మూసీలో కలిపితే మూడు నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడటమే కాదు.. తవ్విన అన్ని కాలువలకు నీరందుతుంది. మూసీ నదిలో కృష్ణా, గోదావరి జలాలను కలిపిన తరువాత మూసీ ప్రాజెక్ట్ నుంచి అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామం వద్ద ఉన్న ఎస్సారెస్పీ కాలువల్లోకి నీటిని లిఫ్ట్ ద్వారా చేర్చితే ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లోని కాలువలు జలకళ సంతరించుకుని రైతులకు ప్రయోజనం కలుగుతుంది. త్రివేణిసంగమ పోరుయాత్ర.. మూడు నదుల అనుసంధానం చేసి త్రివేణి సంగమంగా ఏర్పాటు చేయాలనే నినాదంతో ఇటీవల సూర్యాపేట నియోజకవర్గంలో కొంతమంది ఆత్మకూర్(ఎస్) సింగిల్‌విండో చైర్మన్ బీరెల్లి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా పోరుయాత్ర నిర్వహించారు. వివిధ రాజకీయపార్టీల ముఖ్య నేతలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గ్రామాల్లో పర్యటించారు.