పాలేరు.. తేలేరా?
సూర్యాపేట పట్టణవాసులకు పాలేరు జలాలు అందని ద్రాక్షగానే మారాయి. పాలేరు జలాల నినాదం.. ఇక్కడి నాయకులకు ఎన్నికల వాగ్దానంగా మారిపో యింది. ఈ జలాలు అందిస్తామని ప్రతి సారి ఎన్నికల సమయంలో నేతలు హామీలివ్వడం ఆ తరువాత మరచిపోవడం పరిపాటిగా మారింది. దీంతో ఇక్కడి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడంలేదు. మున్సిపాలిటీ వారు సర ఫరా చేస్తున్న నీరు ఏమూలకూ సరిపోవడంలేదు. ఇది కూడా మురికిగా ఉండడంతో ప్యూరిఫైడ్ నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
సూర్యాపేట పురపాలక సంఘం ఆర్భాటంగా సరఫరా చేసేది పేరుకు మంచినీరు.. అందిం చేది మాత్రం మురుగునీరు. సాధారణ అవసరాలకు కూడా పనికిరాని నీటిని అందిస్తుండడంతో స్థాని కులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం లో లక్షా 5 వేల జనాభా ఉండగా డివిజన్ కేంద్రం కావడంతో నిత్యం వ్యాపార, వాణిజ్య, విద్యా అవసరాల కోసం సుమారు 40 వేల మందికి పైగా పట్టణానికి వచ్చి పోతుంటారు. ఒక్కొక్కరికి నిత్యం 125 లీటర్లు అవసరముండగా వారందరికీ మొ త్తం 18 ఎమ్‌ఎల్‌డీలు(మిలియన్ లీటర్ ఫర్ డే ) కావాల్సి ఉంది. కానీ పట్టణానికి సరఫరా చేసే దోసపహాడ్ రిజర్వాయర్ నుంచి 5 ఎమ్‌ఎల్‌డీలు, మూసీ నుంచి 8 ఎమ్‌ఎల్‌డీలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. దీంతో మరోఐదు ఎమ్‌ఎల్‌డీల కొరత ఏర్పడింది. ఇవి కూడా ప్రస్తుతం ఒక్కోప్రాంతానికి ఒక్కో రోజు చొప్పున మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే అందుతున్నాయి. ముందుచూపు లేకే దోసపహాడ్, మూసీలకు నిధుల మళ్లింపు..
పట్టణ జనాభాకు సరిపోను నీటి అవసరాలపై గత మున్సిపల్ పాలకులకు ముందు చూపులేకే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు భావిస్తున్నారు. గత మున్సిపల్ పాలకుల్లో ఒకరు దోసపహాడ్, మరొకరు మూసీ నుంచి అదనపు పైపులైన్‌ల కోసం కోట్ల రూపాయలు వెచ్చించారని అప్పుడే పాలేరు పథకాన్ని ముందుకు తెస్తే ఈ పరిస్థితి తలెత్తేదేకాదంటున్నారు.
సాంకేతిక సమస్య తలెత్తడంతో..
పట్టణానికి సుమారు వంద కోట్లతో పాలేరు జలాలు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రతిపాదనలు పంపారు. అయితే గతంలో కోట్ల నిధులు దోసపహాడ్, మూసీలకు వెచ్చించారని, తిరిగి పట్టణానికి వంద కోట్లతో పాలేరు పథకాన్ని తీసుకొచ్చేందుకు సాంకేతిక సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో రెండు పథకాలకు డబ్బు వెచ్చించి తిరిగి పాలేరు పథకమంటే ఎలా కుదురుతుందని కేంద్ర స్థాయిలో అధికారులు కొర్రి పెడుతున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.
ముందుచూపులేకుండా డబ్బులు వెచ్చించి ప్రజలకు తాగునీరందించలేక పోవడానికి కారణమైన బాధ్యులపై చర్యలు చేపడతామని కేంద్ర స్థాయి అధికారులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహకారంతో సమస్యను పరిష్కరించి పాలేరు పథకాన్ని మం జూరు చేయించే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందన్నారు. లేకపోతే ఇప్పటికే పనులు ప్రా రంభం కావాల్సి ఉండేదని ఎమ్మెల్యే తెలిపారు.
తాగునీటికి ఏటా *5వేలు ఖర్చు
పాల కంటే.. ఎక్కువ ఖర్చు తాగునీటికి కే టాయించిన దౌర్భాగ్య పరిస్థితి సూర్యాపేట పట్టణ ప్రజలకు దాపురించింది. నిరుపేద, మధ్య తరగతి సంపాదన రోజుకు సుమారు *200 చొప్పున ఏడాదికి *72 వేలు . ఇందులో సుమారు *5 వేలు తాగునీటి కోసం వెచ్చిస్తున్నారు. * 2 లకే 20 లీటర్ల మంచినీటిని సరఫరా చేయాల్సి ఉండగా * 5 నుంచి * 10లకు క్యాన్ విక్రయిస్తున్నారు.
నెరవేరని హామీలు
1999 ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మిర్యాలగూడ పార్లమెంటు ని యోజకవర్గం నుంచి పోటీ చేసి సూర్యాపే ట వచ్చిన సందర్భంగా పాలేరు ద్వారా కృ ష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.2004 ఎన్నికల్లోనూ తిరిగి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వేదాసు వెంకయ్యలు ఇదే వాగ్దానం చేశారు.మున్సిపల్ ఎన్నికల్లోనూ చైర్మన్ అభ్యర్థులు ప్రతిసారి ఇదే వాగ్దానం చేస్తు