
అశ్వారావుపేట: రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యపై సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గొంతెండుతోంది..’ శీర్షికన ప్రచురితౖ మెన కథనానికి అధికారులు స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ పరిధి రేగళ్ల గుంపులో తాగునీటి సమస్య ‘ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం’ శీర్షికన ఫొటో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్ నివేదిక సమర్పించాలని దమ్మపేట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్‌ను ఆదేశించారు. ఈమేరకు ఆయన అశ్వారావుపేట ఎంపీడీఓ శ్రీనివాస్‌తో మాట్లాడి బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించగా, మంగళవారం రేగళ్ల గుంపునకు ట్యాంకర్ పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment