chandra mohan
-
రేగళ్ల గుంపునకు తాగునీటి ట్యాంకర్
అశ్వారావుపేట: రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యపై సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గొంతెండుతోంది..’ శీర్షికన ప్రచురితౖ మెన కథనానికి అధికారులు స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ పరిధి రేగళ్ల గుంపులో తాగునీటి సమస్య ‘ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం’ శీర్షికన ఫొటో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్ నివేదిక సమర్పించాలని దమ్మపేట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్‌ను ఆదేశించారు. ఈమేరకు ఆయన అశ్వారావుపేట ఎంపీడీఓ శ్రీనివాస్‌తో మాట్లాడి బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించగా, మంగళవారం రేగళ్ల గుంపునకు ట్యాంకర్ పంపించారు. -
చంద్రమోహన్‌కు ఎన్నారైల ఘన నివాళులు
ప్రముఖ నటుడు,ఇటీవలె స్వర్గస్తులైన చంద్రమోహన్‌కి ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు. వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాల మాధ్యమంగా శనివారం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, చంద్రమోహన్ కుటుంబసభ్యులు, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్‌తో 21 సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు,చంద్రమోహన్ మేనల్లుడు, ప్రముఖ సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, కళాతపస్వి కె. విశ్వనాథ్ తనయుడు కాశీనాధుని నాగేంద్ర సహా పలువురు చంద్రమోహన్‌తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరితో పాటు అమెరికా నుంచి ప్రముఖ గాయని శారద ఆకునూరి, హైదరాబాదు నుంచి హాస్యబ్రహ్మ శంకర నారాయణ, ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి,కువైట్ నుండి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు సుధాకర్ కుదరవల్లి, సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య నుండి మల్లేష్, అనిల్ కడించర్ల, ఉమామహేశ్వరరావు, మలేషియా నుంచి సత్య దేవి మల్లుల తదితరులు పాల్గొని చంద్రమోహన్‌కు ఘన నివాళులు అర్పించారు. -
Chandra Mohan Santhapa Sabha: నటుడు చంద్రమోహన్ సంతాప సభలో భార్య, కుటుంబసభ్యులు (ఫొటోలు)
-
Chandra Mohan Last Rites: ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు (ఫొటోలు)
-
పంజాగుట్టలోని శ్మశానవాటికలో జరగనున్న చంద్రమోహన్ అంత్యక్రియలు
-
ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు
సినీనటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మొదలైన అంతిమయాత్ర పంజాగుట్ట స్మశానవాటిక వరకు కొనసాగింది. ఆయన అంతిమ సంస్కారాలు చంద్రమోహన్ తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించారు. ఈ అంతిమయాత్రకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్‌కు కడసారి వీడ్కోలు పలికారు. నటులు వెంకటేశ్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషగిరిరావు, మాదాల రవి ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. చంద్రమోహన్ పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్ దగ్గర ఉదయం కొద్దిసేపు ఉంచుతారని ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిశ్రమలో చాలామంది ప్రముఖులు ఇప్పటికే చంద్రమోహన్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా.. నవంబర్ 11న చంద్రమోహన్ హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. -
మెగాస్టార్ కంటే చంద్రమోహన్‌కు ఎక్కువ రెమ్యునరేషన్.. ఏ సినిమాలో అంటే?
ప్రముఖ నటుడు, సినీ ఆల్‌రౌండర్ చంద్రమోహన్ శుక్రవారం(నవంబర్ 11న) మరణించారు. ఆయన మరణంతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చిన ఈయన కెరీర్ తొలినాళ్లలో హీరోగా రాణించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి విభిన్న రకాల పాత్రలు పోషించి వాటికి ప్రాణం పోశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తోనే కాకుండా తర్వాతి జనరేషన్ అయిన చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు ఇలా అందరు స్టార్ హీరోలతోనూ నటించారు. అయితే ఓ సినిమాలో చిరంజీవి కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'చిరంజీవి, నేను తొలిసారి 'ప్రాణం ఖరీదు' చిత్రంలో కలిసి నటించాం. అప్పుడు ఆయనకు ఐదు వేలు పారితోషికం ఇస్తే నాకు రూ.25 వేలు ఇచ్చారు. అప్పట్లో చిరు రఫ్‌గా ఉండేవారు. కానీ తనలో తపన, సిన్సియారిటీ ఉంది. చిరంజీవిని చూసి ఇండస్ట్రీలో ఒక మంచి డ్యాన్సర్ వచ్చారనుకున్నారంతా! చిరంజీవి విజయానికి ప్రధాన కారణం అల్లు అరవింద్. చిరంజీవి ఏ పాత్రలు చేయాలి? ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలి? వంటి చాలా విషయాలను ఆయన దగ్గరుండి చెప్తూ తన కెరీర్‌కు దిక్సూచిలా నిలబడ్డారు' అని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు. చదవండి: 900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు ఇతరులకు ‘మాస్’.. శివాజీకి ‘క్లాస్’.. ఇదేం పద్దతి బాసూ..? -
ఎంజీఆర్ సోదరుడిగా మెప్పించిన చంద్రమోహన్
తమిళసినిమా: సినిమా ముద్దు బిడ్డలు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో నటుడు చంద్రమోహన్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఎల్లలు దాటిన నటకులోత్తముడు ఈ చంద్రమోహనుడు. ఐదు దశాబ్దాలకు పైగా అలుపెరుగని నట దురంధరుడు. అందరికీ కావలసిన చంద్రమోహన్ నట జీవితం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చెన్నైనే. ఇక్కడే సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ నటుడిగా ఎదిగిన చంద్రమోహన్. ఆబాల గోపాలానికి ఇష్టుడిగా ముద్రపడ్డారు. అందుకే భాషా భేదం, పక్షపాతం చూడకుండా అన్ని భాషల వారి ఆదరణను పొందిన అతి కొద్దిమంది నటుల్లో ఆయన కూడా స్థానం సంపాదించుకున్నారు. చెన్నై రంగరాజపురంలోని యునైటెడ్ కాలనిలోని చంద్రమోహన్ నివాసం తెలియని చిత్ర ప్రముఖులు, సినీ ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇంటి పక్కనే దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ నివాసం. వీరిద్దరి మధ్య సినిమాకు అతీతమైన అనుబంధం. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. ముఖ్యంగా తమిళంలో మక్కళ్ తిలకం ఎంజీఆర్‌తో కలిసి నటించిన ఘనత సాధించారు. నాన్ నమదే అనే సూపర్ హిట్ చిత్రంలో ఎంజీఆర్ కు తమ్ముడిగా చంద్రమోహన్ నటించి తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోయారు. ఆ చిత్రంలో ఎంజీఆర్‌తో కలిసి చంద్రమోహన్ నటించిన అన్బు మలర్ అనే పాట క్లాసిక్‌గా నిలించింది. మరో విషయం ఏమిటంటే ఇది తెలుగులో ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ కలిసి నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రానికి రీమేక్. ఇకపోతే చంద్రమోహన్ తమిళంలో కథానాయకుడిగా నటించిన చిత్రం నీయా. నటి శ్రీప్రియ కథానాయకిగా నటించి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏ తరహా పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే చంద్రమోహన్ నటుడిగా ఎప్పటికీ చిరంజీవే అంటే అతిశయోక్తి కాదు. -
ఉమ్మడి జిల్లాకు.. ఆత్మీయ 'చంద్రమోహను'డు!
సాక్షి, వరంగల్: కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం కన్నుమూశారు. అందరికీ ఆత్మీయుడైన చంద్రమోహన్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థల కళాకారుడు, డిప్యూటీ డీఈఓ బూర విద్యాసాగర్‌గౌడ్ అధ్యక్షతన 1993లో వరంగల్ నటరాజ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ నాటిక ప్రదర్శనలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు నటులు రాళ్లపల్లి, పీజేశర్మ, సాయికుమార్, నటి కిన్నెర, వందేమాతరం శ్రీనివాస్ నటించారు. చంద్రమోహన్‌తో కలిసి భోజనం చేస్తున్న మైక్రో ఆర్టిస్ట్ అజయ్‌కుమార్ (ఫైల్) ఈ మేరకు రంగస్థల కళాకారుడు బూరవిద్యాసాగర్ గౌడ్, మైక్రోఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్‌కుమార్, ఓరుగల్లు శారదానాట్యమండలి నిర్వాహకుడు జేఎన్ శర్మ, పద్యనాటక కళాకారుడు జూలూరు నాగరాజు, ఫ్రెండ్స్ కల్చరల్ సొసైటీ నిర్వాహకుడు బిటవరం శ్రీధరస్వామి, జేబీ కల్చరల్ సొసైటీ జడల శివ తదితరులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు చంద్రమోహన్ అడుగు ఎత్తుంటే సినీ ఇండస్ట్రీని ఏలే వారని మహానటుడు ఎన్టీఆర్‌తో పాటు పలువురు సీనియర్ నటులు ప్రశంసించారని, చంద్రమోహన్‌కు నాటకాలంటే ప్రాణమని వరంగల్‌కు చెందిన కళాకారులు గుర్తు చేసుకున్నారు. -
చిన్నారి శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది.. గతంలో చంద్రమోహన్ పంచుకున్న విశేషాలు
చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్న చంద్రమోహన్.. నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అనారోగ్యంతో శనివారం (నవంబర్ 11) తుది శ్వాస విడిచారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్స్‌ని చేశారు.వారిలో దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూడా ఉన్నారు. ఆమె గురించి గతంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చంద్రమోహన్. శ్రీదేవి మరణించిన రోజు(2018) ‘సాక్షి’తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ రోజు చంద్రమోహన్ శ్రీదేవి గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే .. (ఇది 2018లో శ్రీదేశి మరణించిన రోజు చంద్రమోహన్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ) శ్రీదేవిగారికి తెలుగులో మీరు ఫస్ట్ హీరో. ‘పదహారేళ్ల వయసులో’ మీ ఇద్దరు జంటగా చేసినప్పటి జ్ఞాపకాలు పంచుకుంటారా? చంద్రమోహన్: ఆ సినిమాకి శ్రీదేవిని హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. కానీ కమల్‌హాసన్‌తో ఇదే సినిమాలో తమిళంలో బాగా చేసిందని రాఘవేంద్రరావుగారు కన్విన్స్ చేశారు. నాక్కూడా శ్రీదేవితో చేయడానికి అభ్యంతరం అనిపించలేదు. తననే కథానాయికగా తీసుకున్నాం. బ్రహ్మాండంగా నటించింది. హీరోయిన్గా అందనంత దూరం వెళ్లిపోయింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీతో ఒక సినిమా చేసినట్లున్నారు? అవును. ‘యశోద కృష్ణ’ సినిమాలో చిన్ని కృష్ణుడు పాత్ర చేసింది. ఆ సినిమాలో నేనేమో నారదుడి పాత్ర చేశాను. అప్పుడు శ్రీదేవికి ఏడెనిమిదేళ్లు ఉంటాయనుకుంటా. ఆ వయసులోనే చాలా క్రమశిక్షణగా ఉండేది. చాలా ముచ్చటేసేది. బిస్కెట్లు తింటూ కూర్చునేది. నా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన తను ఆ తర్వాత మూడేళ్లకు నా పక్కన హీరోయిన్ (‘పదహారేళ్ల వయసులో)గా చేస్తుందని మాత్రం ఊహించలేదు. అయితే ‘యశోద కృష్ణ’ సినిమా చేస్తున్నప్పుడు తను పెద్ద స్థాయికి వెళుతుందనుకున్నాను. (చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) బాలనటిగా ఆమె మీ సినిమాలో చేసినప్పుడు జరిగిన సంఘటనలేమైనా గుర్తు చేసుకుంటారా? ‘యశోద కృష్ణ’ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి వేరే తమిళ సినిమా ఒప్పుకుంది. మర్నాడు మద్రాసు వెళ్లాలి. ట్రైన్ టికెట్స్ దొరకలేదు. అప్పట్లో మేం మద్రాసులో ఉండేవాళ్లం. నా షెడ్యూల్ కంప్లీట్ అయిపోవడంతో నా కారులో శ్రీదేవిని తీసుకు రావడానికి వీలు పడుతుందా? అని ఆమె అమ్మగారు అడగడంతో సరే అన్నాను. దాదాపు 14 గంటలు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది. జాగ్రత్తగా వాళ్ల అమ్మకు అప్పజెప్పాను. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) మీతో సినిమా చేయకముందు నుంచే శ్రీదేవిగారి కుటుంబంతో మీకు పరిచయం ఉందా? మద్రాసు టీ నగర్లో మావి పక్క పక్క ఇళ్లే. మా పిల్లలతో శ్రీదేవి ఆడుకునేది. వాళ్ల అమ్మగారికి కూతుర్ని పెద్ద హీరోయిన్ని చేయాలని ఉండేది. అమ్మ కలని కూతురు నెరవేర్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. హిందీలో చాలా బాగా సక్సెస్ అయిన మన తెలుగు పిల్ల అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. దివి నుంచి భువికి దిగి వచ్చిన సుందరి శ్రీదేవి. తనలా ఎవరూ ఉండరు. పుట్టరు. శ్రీదేవి శ్రీదేవే. మీ పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా ఆ తర్వాత స్టార్ అవుతారనే సెంటిమెంట్ శ్రీదేవిగారి విషయంలో కూడా నిజమైంది కదా? అప్పట్లో ఆ సెంటిమెంట్ ఉండేది. ‘పదహారేళ్ల వయసులో’ సూపర్ డూపర్ హిట్టయి శ్రీదేవికి చాలా మంచి పేరొచ్చింది. అప్పుడు తన అమ్మగారు ‘చంద్రమోహన్‌గారి సినిమాతో హీరోయిన్గా మా అమ్మాయి అరంగేట్రం అయింది. స్టార్ అయిపోయింది’ అనేవారు.జయప్రద, జయసుధ.. ఇలా చాలామంది హీరోయిన్లకు ఆ సెంటిమెంట్‌ని ఆపాదించారు. ‘నాదేం లేదు.. అంతా మీ స్వయంకృషి’ అనేవాణ్ణి. విశేషం ఏంటంటే... తన భర్త బోనీకపూర్‌కి నన్ను పరిచయం చేసినప్పుడు ‘నా ఫస్ట్ హీరో’ అని చెప్పింది. ఓసారి నా తెలుగు సినిమా షూటింగ్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి చేస్తున్న సినిమా షూటింగ్ పక్క పక్కనే జరిగాయి. అప్పుడు అమితాబ్‌కి ‘నా ఫస్ట్ హీరో. లక్కీ హీరో’ అని నన్ను పరిచయం చేసింది. ‘పదహారేళ్ల వయసులో’ తమిళ మాతృకలో కమల్‌హాసన్‌గారు చేశారు. ఎప్పుడైనా నటనపరంగా మీ ఇద్దరికీ శ్రీదేవిగారు పోలిక పెట్టారా? ఆ సినిమా విజయోత్స వేడుకలో నాకన్నా చంద్రమోహన్‌గారు బాగా చేశారు అని కమల్‌హాసన్ అన్నారు. ‘నేను తప్ప ఆ క్యారెక్టర్ని వేరే ఎవరూ బాగా చేయలేరనుకున్నా. ఆ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. చంద్రమోహన్‌గారు గొప్పగా నటించారు’ అని కమల్‌గారు అన్నారు. శ్రీదేవి కూడా ఆ మాటే అంది. వాస్తవానికి ‘స్వాతిముత్యం’ సినిమాలో నేనే చేయాల్సింది. ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా ‘పదహారేళ్ల వయసు’ క్యారెక్టర్లానే ఉంటుంది. అయితే ఆ సినిమాని తమిళ్లో కూడా ప్లాన్ చేశారు. అక్కడ కమల్‌గారికి మార్కెట్ ఉంది కాబట్టి, బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఆయనతో చేయించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నటిగా శ్రీదేవిగారిలో ఉన్న మంచి లక్షణాల గురించి? నేను భానుమతిగారు, సావిత్రిగార్లతో సినిమాలు చేశాను. వాళ్లు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ విషయంలో కూడా రాజీపడేవారు కాదు. ఆ లక్షణాలను శ్రీదేవిలో చూశాను. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అమ్మాయిలు ఆ తర్వాత శ్రీదేవి స్థాయిలో హీరోయిన్లుగా సక్సెస్ కాలేకపోయారు. శ్రీదేవి గొప్ప నటి. ఎన్టీఆర్, ఏయన్నార్, కమల్‌హాసన్, రజనీకాంత్.. ఇలా ఎవరి పక్కన చేసినా తన నటన ప్రత్యేకంగా ఉండేది. ఆడియన్స్ తననే చూసేంత గొప్పగా నటించేది. అందుకే అన్ని లాంగ్వేజెస్‌లో రాణించగలిగింది. చివరిసారిగా మీరు ఆమెను ఎప్పుడు కలిశారు? వైజాగ్‌లో జరిగిన టీయస్సార్ అవార్డు ఫంక్షన్లో కలిశాం. అప్పుడు సన్నిహితులెవరో ‘నీ ఫస్ట్ హీరోయిన్ వచ్చారు’ అంటే, ‘నా ఫస్ట్ హీరో వచ్చారు’ అని శ్రీదేవి నా దగ్గరకు నవ్వుతూ వచ్చింది. ఎంత స్టార్ అయినా తనలో ఎప్పుడూ నేను భేషజం చూడలేదు. నటిగా అందనంత దూరానికి వెళ్లింది. ఇప్పుడు కూడా అందనంత దూరానికి వెళ్లింది. క్షణాల్లో మిస్సయిసోయింది. అని చద్రమోహన్ ఎమోషనల్‌కు గురయ్యారు. -
కంటతడి పెట్టిస్తున్న చంద్రమోహన్ చివరి మాటలు!
ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతితో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం(నవంబర్ 11న) కన్నుమూశారు. చంద్రమోహన్ చివరిసారిగా కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించినప్పుడు మీడియా ముందుకు వచ్చారు. అవే చివరిమాటలు చంద్రమోహన్ పెదనాన్న కుమారుడే విశ్వనాథ్. ఈ దిగ్గజ దర్శకనటుడు ఈ ఏడాది ఫిబ్రవరి 2న మరణించారు. అన్నయ్య మరణం చంద్రమోహన్‌ను ఎంతగానో కుంగదీసింది. విశ్వనాథ్ పార్థివదేహం చూసి ఈయన తల్లడిల్లిపోయారు. చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 'కె.విశ్వనాథ్.. స్వయానా నా పెదనాన్న కొడుకు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నా కజిన్. మా మధ్య సినిమా అనుబంధం కంటే కుటుంబ బాంధవ్యం ఎక్కువ ఉండేది. ఇండస్ట్రీలోని అందరికంటే కూడా నేను చాలా దగ్గరివాడిని. ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందే. కానీ ఆయన తన జీవితంలో ఎన్నో గర్వకారణమైన సినిమాలు అందించారు. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!.) 25 ఏళ్ల పక్కపక్కనే ఉన్నాం.. విశ్వనాథ్ అన్నయ్య, నేను మద్రాసులో ఒకే చోట స్థలం కొనుక్కుని, ఇళ్లు కట్టుకుని పాతికేళ్లు పక్కపక్కనే ఉన్నాం. మా ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో గర్వకారణమైన సినిమాలు వచ్చాయి. ఆయన నన్ను అద్భుతమైన నటుడిగా చూపించారు. 1966లో విశ్వనాథ్ దర్శకుడిగా, ఎస్పీ బాలు గాయకుడిగా, నేను నటుడిగా పరిచయమయ్యాం. మా మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. మా కుటుంబాలకు ఆయన మరణం తీరని లోటు' అని ఎమోషనల్ అయ్యారు. కళాతపస్విని తలుచుకుంటూ చంద్రమోహన్ మాట్లాడిన మాటలే ఆయన చివరి మాటలుగా మిగిలిపోయాయి. ఆ సమయంలో అన్నయ్య గురించి చంద్రమోహన్ కంటతడి పెట్టుకున్న వీడియో చివరి వీడియోగా మిగిలిపోయింది. చదవండి: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో.. చంద్రమోహన్ మృతి.. చిరంజీవి సహా టాలీవుడ్ సెలబ్రిటీల నివాళులు -
నటుడు చంద్రమోహన్ మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్
-
చంద్రమోహన్ భౌతికకాయానికి తారల కన్నీటి నివాళి (ఫోటోలు)
-
చంద్రమోహన్ దశాబ్దాల సినీ జీవితం.. ఆయనకిష్టమైన పాటలు ఇవే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే సినీ దిగ్గజం నింగికెగిసింది. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తన కెరీర్లో హీరోగా, విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన తీరు తెలుగువారికి చిరకాలం గుర్తుండిపోతాయి. తన సినీ జీవితంలో దాదాపు 932 చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రంగుల రాట్నంతో మొదలైన ఆయన సనీ ప్రస్థానం.. గోపిచంద్ చిత్రం ఆక్సిజన్‌తో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలా ఆయన నటించిన చిత్రాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమాల్లో ఆయనకు ఇష్టమైన టాప్ హిట్ సాంగ్స్ గురించి వివరాలు పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్‌గా..) చంద్రమోహన్‌కు ఇష్టమైన 30 పాటలు. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ లేత చలిగాలులు– మూడు ముళ్లు దాసోహం దాసోహం – పెళ్లి చూపులు సామజవరాగమనా – శంకరాభరణం ఈ తరుణము – ఇంటింటి రామాయణం ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం అటు గంటల మోతల – బాంధవ్యాలు ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం ఏమని పిలవాలి – భువనేశ్వరి మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి ఐ లవ్ యు సుజాత– గోపాల్ రావ్ గారి అమ్మాయి నీ తీయని పెదవులు– కాంచనగంగ నీ చూపులు గారడీ– అమాయకురాలు (ఇది చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) వ్యక్తిగత జీవితం.. చంద్రమోహన్ భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. వీరికి ఇద్దరమ్మాయిలు సంతాన కాగా.. వారికి పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మాసిస్ట్ కాగా అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే కావడంతో వీరంతా చెన్నైలో ఉంటున్నారు. -
శోభన్‌బాబు ఇంట్లోకి రానిచ్చాడా? చంద్రమోహన్ పంచ్‌లకు లెక్కేలేదు!
చంద్రమోహన్ విలక్షణ నటుడే కాదు ఆయన మాటల్లో హాస్యం తళుక్కుమంటుంటుంది... పంచ్‌లు కూడా పడుతుంటాయి. కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ 'రంగుల రాట్నం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోగా, కమెడీయన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 900లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన నేడు(నవంబర్ 11న) ఉదయం కన్నుమూశారు. ఆయనను కలుసుకున్న అదృష్ణవంతుణ్ని చంద్రమోహన్‌ను ఓసారి కలుసుకున్న అదృష్ణవంతుణ్ని నేను. జర్నలిజం స్కూల్లో కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు సినీ జర్నలిజం విద్యార్థుల్ని చెన్నైకి తీసుకెళ్ళాను. అప్పుడు కలిసిన చాలా మంది సినిమా ప్రముఖుల్లో చంద్రమోహన్ ఒకరు. ఆయన వద్దకు వెళ్ళే సరికి సాయంత్రం అయ్యింది. అంతకు ముందే హీరో శోభన్ బాబుగారితో మట్లాడి వచ్చాము. మమ్మల్ని చూడగానే సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. సినీ జర్నలిజం విద్యార్థులని పరిచయం చేశాను. ఇంట్లోకి రానిచ్చాడా, గేటు వద్దే పంపించేశాడా? చంద్రమోహన్ గారు నవ్వుతూ... వెరీ గుడ్... మున్ముందు మీరడిగే చాలా ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో అంటూనే ఒకమాట గుర్తుంచుకోండి. కవరేజీ ఎలా చేశామనే అలోచించండి. ఎందుకంటే చాలామంది మీ వాళ్ళు కవరేజీ కన్న కవర్లేజీ పైనే మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు అని ఓ పంచ్ వేశారు. హీరో శోభన్ బాబుగారిని కలిసి వచ్చామని చెప్పగానే.. ఆహా అలాగా... ఇంట్లోకి రానిచ్చాడా, గేటు వద్దే పంపించేశాడా? తనకు ఇవన్నీ ఇష్టముండవు అంటూ చెణుకు విసిరారు. (చదవండి: వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్.. ఒకటో తారీఖు వస్తే చాలు..) నక్క తోక తొక్కారు, లేదంటే.. లేదు సార్ గంటపైగా మాట్లాడారు అని అనగానే అయితే కచ్చితంగా మీరేదో నక్కతోక తొక్కే వచ్చి ఉంటారు. సినిమాకు సంబంధించి ఏ విషయం ఇంట్లో ఆయన మాట్లాడరు. సినిమా వాళ్ళను లోపలికి కూడా రానీయరు. అంతెందుకు... సినిమా పత్రికలు కూడా గేటు దాటే వీల్లేదని చెబుతూనే.. అందుకే చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు అంటూ మరో పంచ్ వేశారు. తనతో ఉన్న గంటసేపు చాలా కబుర్లు చెప్పారు. తమ సినీ జీవన ప్రస్థానం తెలిపారు. ఇప్పటికీ చంద్రమోహన్ అన్న కవరేజా...కవర్లేజా అన్నమాట నాకు గుర్తొస్తునే ఉంటుంది. స్వయంగా ఏఎన్నార్ ఆ మాటన్నారు చంద్రమోహన్ లక్కీ స్టార్ అవునో కాదో తెలీదు కానీ, ఆయనతో నటించిన చాలా మంది హీరోయిన్లు లక్కీస్టార్లుగా ఎదిగిపోయారు. జయసుధ, శ్రీదేవి, రాధికా తదితరుల్ని ఈ జాబితాలో చెప్పవచ్చు. చంద్రమోహన్ మరో అంగుళం పొడుగ్గా ఉంటే మమ్మల్ని తొక్కేసి హీరోగా వెళ్ళిపోయేవాడు.. ఈ మాట సాక్షాత్తు అక్కినేని నాగేశ్వరరావే అన్నారంటే ఆయనెంత విలక్షణ నటుడో తెలుస్తుంది. నవరసాలు అవలీలగా పండించే అలాంటి హీరోతో కాసేపు మాట్లాడానన్న తృప్తి అయితే ఉంది. ఎందుకో ఇవాళ...ఆ హీరో మరో లోకానికి వెళ్ళారనగానే ఆ సందర్భం గుర్తొచ్చింది. - రామదుర్గం మధుసూదన రావు చదవండి: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో.. -
'ఎన్టీఆర్ సినిమాతో చంద్రమోహన్‌కు చేదు అనుభవం'.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ మరో సినీ దిగ్గజం, కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) దాదాపుగా 55 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగించిన చంద్రమోహన్ అప్పటి స్టార్ హీరోయిన్లందరితో సినిమాలు చేశారు. అనారోగ్యంతో కన్నుమూసిన గతంలో పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావు, రామారావుతో తన అనుభవాలను పంచుకున్నారు. రామారావు చిత్రం సందర్భంగా ఆయనకెదురైన ఓ చేదు అనుభవాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. గత ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ..'నాగేశ్వరరావు, నేను దాదాపు 40 సినిమాలు చేశాం. అయితే రామారావుతో నాకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ఓసారి ఎన్టీఆర్ సినిమా వల్ల చేదు అనుభవం ఎదుర్కొన్నా. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా మొదట నన్ను ఎంపిక చేశారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. చివరికీ బాలయ్యను తీసుకున్నారు. ఆ క్షణం నేను చాలా బాధపడ్డా. కానీ.. ఆ తర్వాత అదే సినిమాను తమిళంలో రీమేక్ చేసినప్పుడు ఎంజీఆర్ తమ్ముడిగా చేసే అవకాశం నాకు లభించింది. ఎన్టీఆర్ సినిమా సెట్లో జరిగిన ఘటన వల్లే నాకు ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం వల్లే నాకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది.'అని అన్నారు. తన కెరీర్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్.. చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. కాగా.. అనారోగ్య కారణాలతో ఇవాళ మరణించారు. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్‌గా..) -
చంద్రమోహన్ మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళులు
-
'శోభన్ బాబుకు డబ్బులు ఇచ్చిన చంద్రమోహన్'.. ఎందుకంటే?
టాలీవుడ్లో మరో సినీ దిగ్గజం దివికేగిసింది. దాదాపు 55 ఏళ్ల పాటు కళామతల్లి ముద్దుబిడ్డగా, తనదైన నటనతో అభిమానులను మెప్పించిన నట దిగ్గజం చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. చివరిసారిగా 2017లో వచ్చిన గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. చంద్రమోహన్ హీరోగా నటించిన పదహారేళ్ల వయసు చిత్రం ద్వారానే అందాల నటి శ్రీదేవి అరంగేట్రం చేసింది. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు! ) దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇకలేరన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సమయంలో ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ గురించి ఆసక్తిక విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్న విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత శంకరాభరణం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు గెలిచారు. అప్పటి హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. అంతే కాకుండా శోభన్ బాబు, చంద్రమోహన్ మంచి స్నేహితులు కూడా. అలా వారి మధ్య బలమైన స్నేహబంధం వల్ల ఆర్థికంగా ఇద్దరు డబ్బులు అవసరమైతే ఒకరినొకరు సాయం చేసుకోవారమని గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. శోభన్ తన వద్దనే డబ్బులు తీసుకునేవాడని.. ఇది చూసి తనకు ఆశ్చర్యమేసేదని ఆయన తెలిపారు. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత ) గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'శోభన్‌బాబు, నేను మంచి స్నేహితులం. నాకంటే ఆయనే చాలా ఆస్తిపరుడు. అయినా కూడా నన్ను డబ్బులు అడిగేవారు. ఇది చూసి మొదట నేను ఆశ్చర్యపోయేవాన్ని. ఆ తర్వాత నాకు ఓ విషయం చెప్పాడు. నా దగ్గర డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని శోభన్ బాబు నమ్మేవారు. అందుకే ఏదైనా ఆస్తి కొన్నప్పుడల్లా నా దగ్గరే డబ్బులు తీసుకునేవాడు. శోభన్ బాబు మరణం మనకు తీరని లోటు' అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. నాగేశ్వరరావుతో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. -
నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగానే కాకుండా, అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఆయన నేడు అందరికీ దూరంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతికి గల కారణాలను చంద్రమోహన్ బంధువు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తాజాగా మీడియాకు వెల్లడించారు. కిడ్నీ సమస్య శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. 'చంద్రమోహన్‌గారు నాకు స్వయానా మేనమామ. ఆయన నాలుగేళ్ల నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్య కూడా తలెత్తింది. ఈ రోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చనిపోయారని నిర్దారించారు. ఆయన కూతుర్లలో ఒకరు చెన్నై నుంచి, మరొకరు అమెరికా నుంచి రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత.. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తాము' అని తెలిపారు. ఆరోగ్యం సహకరించికపోవడంతో రిటైర్మెంట్ కాగా చంద్రమోహన్ కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. నిర్విరామంగా పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసుకున్నారు. తాను ఉక్కు మనిషిని, తనకేం జరుగుతుందిలే అనుకున్నారు. ఆ నిర్లక్ష్యమే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. 2006లో రాఖీ సినిమా పూర్తయ్యాక చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ జరిగింది. దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలోనూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరగా గోపీచంద్ 'ఆక్సిజన్' మూవీలో నటించిన తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు! చంద్రమోహన్, కె విశ్వనాథ్, ఎస్పీ బాలు రిలేషన్ ఏంటో తెలుసా? -
చంద్రమోహన్ మరణం బాధాకరం.. చిరంజీవి, ఎన్టీఆర్ సంతాపం..
తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. అత్యద్భుతమైన నటన.. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనసులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథానాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరన్న వార్త ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన.. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం… pic.twitter.com/vLMw4gTXOs — Chiranjeevi Konidela (@KChiruTweets) November 11, 2023 (చదవండి: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి) చాలా బాధాకరం: జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో దశాబ్దాలుగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను. — Jr NTR (@tarak9999) November 11, 2023 అజాత శత్రువు.. స్థాయి ని బట్టి కాకుండా మనిషిని మనిషిగా ప్రేమించిన వ్యక్తి చంద్రమోహన్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి హుందాగా ఉంటూ చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - పోసాని కృష్ణమురళి, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ ఇంటిదగ్గరే చంద్రమోహన్ భౌతిక కాయం గొప్ప నటుడు చంద్రమోహన్. ఆయన చనిపోవడం ఇండస్ట్రీకి బాధాకరం. ఆయన మృతి పట్ల మా అసోసియేషన్ విచారం వ్యక్తం చేస్తోంది. రేపు దీపావళి పండగ కావడంతో ఫిలిం ఛాంబర్లో చంద్రమోహన్ గారిని సందర్శనార్థం ఉంచడం లేదు. ఫిలింనగర్‌లోని ఇంటి వద్ద చంద్రమోహన్ భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచుతాం. ఇంటి వద్దకే ఆర్టిస్టులు రావాలని కోరుతున్నాం. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయి. - మాదాల రవి, మా జనరల్ సెక్రటరీ పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.- దర్శకుడు కె రాఘవేంద్ర రావు His is a face that takes us down the memory lane & puts a smile on our faces every time with his memorable Acting & characters. May your soul rest in peace Chandra Mohan sir. Om Shanti 🙏🏼 pic.twitter.com/2IvyZjPSrv — Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2023 చదవండి: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత -
చంద్రమోహన్ నటించిన చిత్రాలమాలిక (ఫొటోలు)
-
చంద్రమోహన్, కె విశ్వనాథ్‌కు రిలేషన్.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
తెలుగు సినిమారంగంలో కళాతపస్విగా గుర్తింపు తెచ్చుకున్న కె.విశ్వనాథ్ చేసిన సేవలు ఎనలేనివి. ఆయన చివరి శ్వాస వరకు కళామతల్లికి సేవలందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన కన్నుమూశారు. తాజాగా మరో సినీ దిగ్గజాన్ని టాలీవుడ్ కోల్పోయింది. దాదాపు 932 సినిమాల్లో నటించిన మరో కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో ఓకే ఏడాదిలో రెండు సినీ దిగ్గజాలను కోల్పోవడాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కె. విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య రిలేషన్ ఏంటి? అసలు వీరిద్దరికీ ఉన్న బంధుత్వమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం. అదే విధంగా ఎస్పీబాలుకు, వీరిద్దరికి బంధుత్వం ఎలా వచ్చిందో చూద్దాం. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) కె విశ్వనాథ్‌కి, సీనియర్ నటుడు చంద్రమోహన్‌తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. శంకరాభరణం చిత్రానికి విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించగా.. చంద్రమోహన్ కీలపాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే సూపర్ హిట్‌గా నిలిచి..జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎస్పీ బాల సుబ్రమణ్యం పాటలు పాడారు. అయితే కె విశ్వనాథ్ 1966లో ఆత్మ గౌరవం అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయం కాగా.. అదే ఏడాది రంగులరాట్నం చిత్రంతో నటుడిగా చంద్రమోహన్ టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) పెదనాన్న కుమారుడే విశ్వనాథ్! ఇదిలా ఉండగా మా పెదనాన్న కుమారుడే కె.విశ్వనాథ్ అని చంద్రమోహన్ చెప్పారు. తన అన్నయ్య విశ్వనాథ్ చనిపోయినప్పుడు పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. చంద్రమోహన్ పెదనాన్న రెండో భార్య కొడుకు కె.విశ్వనాథ్ కాగా.. చంద్రమోహన్ తల్లి, కె.విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య అక్కా చెల్లెల్లు కావడంతో వీరద్దరు అన్నదమ్ములు అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సీతకథ చిత్రాలు వచ్చాయి. నాలో ఉన్న ప్రతిభను బయటికి తీసి అద్భుతమైన నటుడిగా తీర్చిదిద్దింది ఆయనేనని చంద్రమోహన్ గతంలో వెల్లడించారు. గతంలో కె. విశ్వనాథ్ గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ..'సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బాంధవ్యమే ఎక్కువ. అందరికంటే నేను ఆయనకు చాలా దగ్గరివాడిని. మద్రాసులో ఉన్నప్పుడు ఒకేచోట స్థలం కొనుకున్నాం. పక్క పక్కనే ఇళ్లు కూడా కట్టుకుని 25 ఏళ్ల ఉన్నాం. అంతటి అనుబంధం మాది' అని అన్నారు. ఎస్పీ బాలుతోనూ బంధుత్వం సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యంతోనూ వీరిద్దరి బంధుత్వం ఉంది. చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అనుకోకుండా ముగ్గురికి కుటుంబాల పరంగా మంచి అనుబంధం ఉంది. చివరికీ వరుసకు ముగ్గురు అన్నదమ్ములు కావడం మరో విశేషం. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం సినిమా ఇండస్ట్రీలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్‌గా..
హీరోగా మెప్పించారు.. కమెడియన్‌గా నవ్వించారు.. తండ్రిగా ఎమోషన్స్ పండించారు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయారు నటుడు చంద్రమోహన్. ఎమోషనల్ పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించగల సమర్థుడు. ఆయన నేడు(నవంబర్ 11న) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి యావత్ తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఏడిపించారు. 35 ఎకరాల ద్రాక్ష తోట 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దిగ్గజ నటుడు వెయ్యి సినిమాల మార్క్‌ను చేరుకుంటాడనుకునే సమయంలో రిటైర్మెంట్ ప్రకటించారు. అనారోగ్యంతో కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అయితే 900కు పైగా చిత్రాలు చేసినప్పటికీ తనకు పెద్దగా ఆస్తి లేదని, ఒకానొక సమయంలో ఉన్న ఆస్తినే కోల్పోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందులో చంద్రమోహన్ ఏమన్నారంటే.. హైదరాబాద్‌లోని కోంపల్లిలో గొల్లపూడి మారుతీరావు ద్రాక్షతోట కొన్నారు. ఆయనను కూడా కొనమని చెప్పారు. సరేనంటూ.. చంద్రమోహన్ 35 ఎకరాల దాకా కొన్నారు. శోభన్‌బాబు వద్దన్నా వినలేదు కానీ తర్వాత దాన్ని చూసుకోవడం వీలుపడలేదు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని అలాగే తన దగ్గర పెట్టుకోవడమని ఒక్క ఎకరం కూడా ఉంచుకోకుండా అంతా అమ్మేశారు. అంతేకాదు, ఉన్న భూమిని అమ్ముకోవద్దని శోభన్‌బాబు చెప్తున్నా వినకుండా చెన్నైలో 15 ఎకరాలు అమ్మేశారు. ఇప్పుడు దాని విలువ రూ.30 కోట్లపైనే ఉంది. అటు శంషాబాద్‌లో ప్రధాన రహదారి పక్కన ఆరెకరాలు కొన్నారు. కానీ చివరకు దాన్ని కూడా కాపాడుకోకుండా అదీ అమ్మేశారు. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ! ఇలా దాదాపు వందకోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నానని సదరు ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువని బాధపడ్డారు. చంద్రమోహన్ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందంటారు చాలామంది. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో.. జనవరి ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి తన భర్త చేతుల మీదుగా డబ్బు తీసుకుంటారని చంద్రమోహన్ భార్య, రచయిత్రి జలంధర వెల్లడించింది. స్టార్ నటుడిగా జేజేలు అందుకున్న ఆయన తన చివరి రోజుల్లో సాదాసీదా జీవితం గడిపారు. చదవండి: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత -
చంద్రమోహన్ మృతికి కారణాలు ఇవే !
-
హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ఆరంభించి.. హీరోగా పదుల సంఖ్యలో సినిమాలు తీసి మెప్పించిన సీనియర్ నటుడు చంద్రమోహన్. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్..ఇలా ఏ పాత్రలో అయినే ఒదిగిపోయే దిగ్గజ నటుడాయన. 55 ఏళ్ల తన సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. (చదవండి: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) ♦ఇప్పటి తరానికి చంద్రమోహన్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే తెలుసు కానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. ఆయనతో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. అతన్ని నిర్మాత హీరో అనేవాళ్లు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయవంతం అయినవే. అందుకే నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. ఒకే ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. ♦ చంద్రమోహన్‌పై ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన్ను హీరోయిన్లకు లక్కీ హ్యాండ్ అనేవాళ్లు. ఎందుకంటే ఆయనతో కలిసి నటిస్తే చాలు.. ఆ హీరోయిన్ స్టార్ అయిపోతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు చంద్రమోహన్‌తో నటించేందుకు ఆసక్తి చూపించేవాళ్లు. ♦ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్ హీరో. జయప్రద హీరోయిన్. అప్పటి వరకు జయప్రదకు గుర్తింపు లేదు. కానీ ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ♦దివంగత నటి శ్రీదేవి తొలి హీరో కూడా చంద్రమోహన్‌గారు. ‘పదహారేళ్ల వయసు’చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ చిత్రం తర్వాత శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో చేదు అనుభవం.. కానీ మంచే జరిగింది ♦ జయసుధకు కూడా చంద్రమోహన్ సినిమాతోనే స్టార్డమ్ వచ్చింది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి భళే కాపురం, స్వర్గం, శ్రీమతి ఒక బహుమతి తదితర చిత్రాల్లో నటించారు. ♦ లేడి మెగాస్టార్ విజయశాంతి సైతం...చంద్రమోహన్‌తో నటించిన తర్వాతే స్టార్‌గా ఎదిగింది. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత విజయశాంతికి వరుసగా అవకాశాలు లభించాయి. వీరిద్దరు కాంబోలో వచ్చిన ‘ప్రతి ఘటన’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇలా చాలామంది హీరోయిన్లను స్టార్స్ చేస్తూ..‘లక్కీ హ్యాండ్’గా పేరు సంపాదించుకున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)