
రైతు నేస్తం
మన దేశంలో హైబ్రీడ్ వరి సాగు చేస్తే పుప్పొడిని దులపడానికి కూలీలను పెట్టాల్సిందే... ఇది ఖర్చుతో కూడుకున్నది..
మన దేశంలో హైబ్రీడ్ వరి సాగు చేస్తే పుప్పొడిని దులపడానికి కూలీలను పెట్టాల్సిందే... ఇది ఖర్చుతో కూడుకున్నది.. పట్టే సమయమూ ఎక్కువే.. అదే చైనాలో హైబ్రీడ్ వరిలో ఆడ, మగ మొక్కల పరపరాగ సంపర్కం కోసం హెలికాప్టర్‌లను వాడుతుంటారు. చిత్రంలో చూపినట్లు చిన్నపాటి హెలికాప్టర్ వాడి 2 నిమిషాల్లో ఎకరం పూతను దులుపుతారు. కేవలం 200-300 ఖర్చుతో మగ మొక్కల పూతను, ఆడ మొక్కల పూతపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా దులపవచ్చు. అంతేకాదు పంటపై క్రిమిసంహారక మందులను హెలికాప్టర్ ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో చల్లుతారని చైనాలో పర్యటించి వచ్చిన వరి శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ చెబుతున్నారు.
- సాక్షి, జగిత్యాల