
సినీనటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మొదలైన అంతిమయాత్ర పంజాగుట్ట స్మశానవాటిక వరకు కొనసాగింది. ఆయన అంతిమ సంస్కారాలు చంద్రమోహన్ తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించారు. ఈ అంతిమయాత్రకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్‌కు కడసారి వీడ్కోలు పలికారు. నటులు వెంకటేశ్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషగిరిరావు, మాదాల రవి ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
చంద్రమోహన్ పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్ దగ్గర ఉదయం కొద్దిసేపు ఉంచుతారని ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిశ్రమలో చాలామంది ప్రముఖులు ఇప్పటికే చంద్రమోహన్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా.. నవంబర్ 11న చంద్రమోహన్ హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment