Chandramohan (actor)
-
చంద్రమోహన్‌కు ఎన్నారైల ఘన నివాళులు
ప్రముఖ నటుడు,ఇటీవలె స్వర్గస్తులైన చంద్రమోహన్‌కి ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు. వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాల మాధ్యమంగా శనివారం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, చంద్రమోహన్ కుటుంబసభ్యులు, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్‌తో 21 సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు,చంద్రమోహన్ మేనల్లుడు, ప్రముఖ సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, కళాతపస్వి కె. విశ్వనాథ్ తనయుడు కాశీనాధుని నాగేంద్ర సహా పలువురు చంద్రమోహన్‌తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరితో పాటు అమెరికా నుంచి ప్రముఖ గాయని శారద ఆకునూరి, హైదరాబాదు నుంచి హాస్యబ్రహ్మ శంకర నారాయణ, ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి,కువైట్ నుండి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు సుధాకర్ కుదరవల్లి, సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య నుండి మల్లేష్, అనిల్ కడించర్ల, ఉమామహేశ్వరరావు, మలేషియా నుంచి సత్య దేవి మల్లుల తదితరులు పాల్గొని చంద్రమోహన్‌కు ఘన నివాళులు అర్పించారు. -
ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు
సినీనటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మొదలైన అంతిమయాత్ర పంజాగుట్ట స్మశానవాటిక వరకు కొనసాగింది. ఆయన అంతిమ సంస్కారాలు చంద్రమోహన్ తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించారు. ఈ అంతిమయాత్రకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్‌కు కడసారి వీడ్కోలు పలికారు. నటులు వెంకటేశ్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషగిరిరావు, మాదాల రవి ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. చంద్రమోహన్ పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్ దగ్గర ఉదయం కొద్దిసేపు ఉంచుతారని ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిశ్రమలో చాలామంది ప్రముఖులు ఇప్పటికే చంద్రమోహన్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా.. నవంబర్ 11న చంద్రమోహన్ హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. -
మెగాస్టార్ కంటే చంద్రమోహన్‌కు ఎక్కువ రెమ్యునరేషన్.. ఏ సినిమాలో అంటే?
ప్రముఖ నటుడు, సినీ ఆల్‌రౌండర్ చంద్రమోహన్ శుక్రవారం(నవంబర్ 11న) మరణించారు. ఆయన మరణంతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చిన ఈయన కెరీర్ తొలినాళ్లలో హీరోగా రాణించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి విభిన్న రకాల పాత్రలు పోషించి వాటికి ప్రాణం పోశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తోనే కాకుండా తర్వాతి జనరేషన్ అయిన చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు ఇలా అందరు స్టార్ హీరోలతోనూ నటించారు. అయితే ఓ సినిమాలో చిరంజీవి కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'చిరంజీవి, నేను తొలిసారి 'ప్రాణం ఖరీదు' చిత్రంలో కలిసి నటించాం. అప్పుడు ఆయనకు ఐదు వేలు పారితోషికం ఇస్తే నాకు రూ.25 వేలు ఇచ్చారు. అప్పట్లో చిరు రఫ్‌గా ఉండేవారు. కానీ తనలో తపన, సిన్సియారిటీ ఉంది. చిరంజీవిని చూసి ఇండస్ట్రీలో ఒక మంచి డ్యాన్సర్ వచ్చారనుకున్నారంతా! చిరంజీవి విజయానికి ప్రధాన కారణం అల్లు అరవింద్. చిరంజీవి ఏ పాత్రలు చేయాలి? ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలి? వంటి చాలా విషయాలను ఆయన దగ్గరుండి చెప్తూ తన కెరీర్‌కు దిక్సూచిలా నిలబడ్డారు' అని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు. చదవండి: 900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు ఇతరులకు ‘మాస్’.. శివాజీకి ‘క్లాస్’.. ఇదేం పద్దతి బాసూ..? -
ఓన్లీ చంద్రమోహన్
పాలూ మీగడ... పెరుగూ ఆవడా..‘నేను.. మా ఆవిడా’ అన్న తెలుగు సినిమా మధ్యతరగతి భర్త. ‘సీతాపతి సంసారం’ చేసి ఆనాటి గృహిణులను నవ్వుల్లో ముంచెత్తాడు.ఏ వూరి ‘సీతామాలక్ష్మి’ ఐనా ఇష్టపడే బంగారు కొండయ్య ఇతడే.‘కలికాలం’ ధాటికి తల్లడిల్లిన మధ్యతరగతి తండ్రి. ఉత్త ‘సగటు మనిషి’. తెలుగు సినిమా ప్రేక్షకుడు ప్రతి ‘శుభోదయాన’ తలుచుకోదగ్గ నట త్రివిక్రముడు.ఓన్లీ చంద్రమోహన్. చంద్రమోహన్ తిని అరాయించుకోని క్యారేజీ లేదు. చేసి నిభాయించని క్యారెక్టరూ లేదు. అగ్రికల్చర్ బిఎస్సీ అంటే వ్యవసాయ విద్య.పంటలు పండించడం తెలియాలి.చంద్రమోహన్ ఆ విద్య చదివాడు.అందుకేనేమో తెర మీద ప్రతి పాత్రా పండించాడు.నటులు అయ్యాము, అయిపోయాము, అవ్వాలనుకుంటున్నాము అనుకున్నవారు ఇది ట్రై చేయండి. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చూడండి. అందులో చలపతిరావు, చంద్రమోహన్ చాలా స్నేహితులు. పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు. కుటుంబాలతో కలిసి అన్నవరం వెళితే ఏనాడో విడిపోయిన చలపతిరావు చెల్లెలు మంజుభార్గవి కనిపిస్తుంది. అయినాసరే చలపతిరావు పలకరించడు. అందుకు లక్ష్మి అభ్యంతరపెడితే చలపతిరావు చెయ్యెత్తుతాడు. చంద్రమోహన్ అడ్డుపడితే– ‘ఇది మా ఇంటి వ్యవహారం’ అంటాడు చలపతిరావు. అందరూ ఊరికి తిరిగొచ్చాక ,ఇంటి తలుపులు తీసి లోపలికి వచ్చాక, చంద్రమోహన్ తన భార్యతో ‘పద మనింటికి’ అంటాడు. అందరూ ‘ఏంటిది కొత్తగా’ అన్నట్టు చూస్తే ఆ క్షణం చంద్రమోహన్ ‘అక్కడ నన్ను అంతమాట అంటారా’ అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ప్రేక్షకుడికి చివుక్కు మంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఎవరైతే ఇవ్వగలరో వారంతా నటులైపోయినట్టే లెక్క. ఏలూరులో ‘అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్’గా ఉద్యోగం వచ్చాక పెళ్లిసంబంధాల గోల మొదలైంది చంద్రమోహన్‌కి. కాని తన తర్వాత 8 మంది చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అప్పటికే తండ్రి చనిపోవడంతో భారమంతా తనదే. కాని నాటకాలంటే ఇష్టం. శరీరాన్ని కండలు తిప్పడం ఇష్టం. సినిమాల్లో చేయాలని కోరిక. ఆదుర్తి తీస్తున్న ‘లేత మనసులు’ కోసం ప్రయత్నించాడు. కాని కృష్ణ, రామ్మోహన్లకు చాన్స్ పోయింది. ఇంకో సినిమా సెలక్షన్‌కు బెజవాడకు పరిగెడితే అక్కడ ఒక పో డవైన మనిషి తనలాగే వచ్చి ఉన్నాడు. తలెత్తి చూసిన చంద్రమోహన్ ‘మీ పేరేమిటండి’ అనడిగితే ‘కృష్ణంరాజు’ అన్నాడు. ఇలాంటి ఆజానుబాహులు ఉండగా నాకెందుకు వేషం ఇస్తారు అని అదే పోత.కాని అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.ఇచ్చినవాడు సాక్షాత్ బి.ఎన్.రెడ్డి.సినిమా పేరు ‘రంగుల రాట్నం’.అది 1966వ సంవత్సరం.తెలుగు వెండితెర మీద ఈ రెండార్ల సంవత్సరంలో ఆరారు కాలాలు నిలబడే నటుడు పుట్టాడు. ‘కోరిక ఒకటి జనించు.. తీరక ఎడద దహించు కోరనిదేదో వచ్చు... శాంతి సుఖాలను ఇచ్చు ఇంతేరా ఈ జీవితం... తిరిగే రంగుల రాట్నము’...‘రంగులరాట్నం‘లో పాట ఇది. కాని చంద్రమోహన్‌కు కోరిందే జరిగింది... శాంతి సుఖాలను ఇచ్చింది. మహా దర్శకుడు బి.ఎన్.రెడ్డి ఈ ‘పమిడిముక్కల పో ట్టివాడు’ మహా గట్టివాడు అని గ్రహించాడు. ఉద్యోగం మాన్పించి, రిస్క్ చేసి, తొలి అవకాశం ఇచ్చాడు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. ‘ఎవరీ చంద్రమోహన్... ఇది మొదటి సినిమానా?... మొదటి సినిమాలో ఎవరైనా ఇంత బాగా చేయగలరా?’ అని అంతా ఆశ్చర్యపోవడమే. మొదటి సినిమాకే చంద్రమోహన్‌కు ‘బంగారు నంది’ వచ్చింది. అంతా బాగానే ఉంది... అయినా సరే నిలదొక్కుకోలేకపోతే? అని భయం. నంది అవార్డుల ఉత్సవంలో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి చేతుల మీద నంది అందుకుంటూ ‘సార్... నా కెరీర్ అటూ ఇటూ అయితే మళ్లీ మీరు నాకు వ్యవసాయ శాఖలోనే ఏదో ఒక ఉద్యోగం వేయించాలి’ అని వేడుకున్నాడు చంద్రమోహన్. ఆయన నవ్వి ‘మా బి.ఎన్ లాంచ్ చేస్తే ఫెయిల్ అవడం ఉండదు లేవయ్యా. భయపడకు’ అని భరోసా ఇచ్చారు.పెద్దల మాట చెక్కుల మూట అన్నారు.వేషాలూ చెక్కులూ ఆ తర్వాత అలాగే వచ్చి పడ్డాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావుల తర్వాత ఎవరు అనుకుంటున్న కాలం అది. హరనాథ్, బాలయ్య ఒకవైపు కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు మరోవైపు అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటే చంద్రమోహన్ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఒక జానెడు ఎత్తుంటే మా అందరినీ తినేస్తావయ్యా’ అని ఎస్.వి.ఆర్, ఏ.ఎన్.ఆర్ ఆ తర్వాతి రోజుల్లో పదేపదే అన్నా చంద్రమోహన్‌కు ఒక జాన తక్కువ ఉండటమే లాభించింది. అతను మిడిల్‌క్లాస్ కథలకు సరిపోయాడు. చిన్న సినిమాల బడ్జెట్‌కు సరితూగాడు. 1970ల నాటికి మధ్యతరగతి తన ఉనికి చాటుకుంటూ భార్యాభర్తలు సంసారాలు ఈదడానికి అవస్థలు పడుతూ ఉన్నప్పుడు వారి సంసారాలకు, వాటిలోని సనిదపనిలకు చంద్రమోహన్ తెర రూపం అయ్యాడు. ‘ఇంటింటి రామాయణం’, ‘తాయారమ్మ–బంగారయ్య’, ‘ఒక చల్లని రాత్రి’, ‘కోరికలే గుర్రాలైతే’, ‘శుభోదయం’, ‘నేను– మా ఆవిడ’, ‘ కలహాల కాపురం’... ఎన్నని. ఆ రోజుల్లో రేడియో వినడం మధ్యతరగతి వారికి దినచర్య.‘సీతాపతి సంసారం’లో భార్యను ఉద్యోగానికి పంపి, ఇంట్లో హౌస్ హజ్బెండ్‌గా చంద్రమోహన్ రేడియోలో వనితావని కార్యక్రమం కింద వెంకాయమ్మ గారు చెప్పే వంకాయకూర వండ బోతాడు. కాని స్టేషన్లు జామ్ అయ్యి యోగా కార్యక్రమం కూడా మధ్యలో వినిపిస్తూ ఉంటుంది. ‘వంకాయలను తరిగాక’... ఒక స్టేషన్... ‘మెడను ముందూ వెనక్కూ మూడుసార్లు ఊపి’... ఇంకో స్టేషన్... ఒకటే నవ్వులు. ఈ సంసారం చూద్దామని ఆ రోజుల్లో మహిళా ప్రేక్షకులు మొగుళ్లను వెంటబెట్టుకుని ఎన్ని హౌస్‌ఫుల్స్ చేశారో! దర్శకుడు బాపు ‘బంగారు పిచుక’ (1968) తీశారు చంద్రమోహన్‌తో. ‘సుఖఃదుఖాలు’ (1968) లాంటి పెద్ద హిట్ పడ్డాక ‘బంగారు పిచుక’ హిట్ అయి ఉంటే చంద్రమోహన్ కెరీర్ ఇంకెంత స్పీడ్‌గా ఉండేదో. కాని అవలేదు. కాలం కంటే ముందు తీసిన కథ అది. ఆ దెబ్బతో చంద్రమోహన్ పో ట్టగడవడానికి తోచిన పాత్ర చేయాల్సి వచ్చింది. అదే బాపు తీసిన ‘సంపూర్ణ రామాయణం’లో చిన్నపాటి భరతుడి పాత్ర కూడా వేయాల్సి వచ్చింది. కాని వరుసకు అన్నయ్య అయ్యే కె.విశ్వనాథ్ తన తమ్ముణ్ణి గట్టిగా నిలబెట్టాలనుకున్నాడు. నిర్మాతను కన్విన్స్ చేసి, తన ఇమేజ్ అడ్డు వేసి ‘సిరిసిరిమువ్వ’ (1976)లో హీరోని చేశాడు. జయప్రదకు కూడా అది హీరోయిన్గా మొదటి సినిమా. విడదలయ్యాక సినిమా పెద్ద హిట్ అయ్యింది. ‘గజ్జె ఘల్లుమంటుంటే... గుండె ఝల్లుమంటోంది’. 1978. చంద్రమోహన్ స్థానాన్ని తెలుగు సినిమాల్లో ఖరారు చేసిన సంవత్సరం. ఆ సంవత్సరమే మురారి తీసిన కె.విశ్వనాథ్ సినిమా ‘సీతామాలక్ష్మి’ వచ్చింది. అదే సంవత్సరం కె.రాఘవేంద్రరావు తీసిన ‘పదహారేళ్ల వయసు’ వచ్చింది. ‘సీతామాలక్ష్మి’ అంటే తెలిసిందే. కె.విశ్వనాథ్ ఎలాగూ హిట్ చేస్తాడు. కాని ‘పదహారేళ్ల వయసు’ సినిమాయే కత్తి మీద సాము. అది తమిళంలో భారతీరాజా తీసిన ‘పదారు వయతినిలే’కి రీమేక్. అందులో పల్లెటూరి వెంగళాయి పాత్రను కమల్‌హాసన్ చేశాడు. డీ గ్లామరైజ్డ్ రోల్. చంద్రమోహన్ అలా గోచి కట్టుకుని ఆ పాత్ర చేస్తే మిగిలేది గోచే అని అంతా భయపెట్టారు. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అన్నారు. అప్పుడే చంద్రమోహన్ తన కొత్తింట్లోకి మారాడు. ‘ఈ సినిమా పోతే సెంటిమెంట్ ప్రకారం పాత ఇంట్లోకి వెళ్లిపోదాం’ అని భార్య జలంధరతో చె΄్పాడు. మొత్తానికి ‘పదహారేళ్ల వయసు’ రిలీజైంది. ఒకే సంవత్సరం ‘సీతామాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ సిల్వర్‌జూబ్లీలు ఇచ్చిన హీరో చంద్రమోహన్. ఎన్టీఆర్, అక్కినేని వంటి టాప్స్టార్ల మధ్యలో ఈ వామనస్టార్ కూడా ఉన్నాడు.‘పదహారేళ్ల వయసు’ తెలుగులో సూపర్‌హిట్ అయ్యిందని తెలిసి ప్రత్యేకంగా చూసిన కమలహాసన్ ‘మీరు చేసిన దాంట్లో పది శాతం కూడా నేను చేయలేకపోయాను’ అన్నాడు. వజ్రం విలువ వజ్రానికే కదా తెలుస్తుంది. సవాలు విసిరే వేషాలు ఎప్పుడూ చంద్రమోహన్‌నే వరించాయి. తమిళంలో కె.భాగ్యరాజా వచ్చి తనే హీరోగా, దర్శకుడుగా గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. అతనితో మేచ్ అయ్యే నటుడు తెలుగులో ఎవరు? చంద్రమోహనే. ‘రాధా కల్యాణం’ (అంద 7 నాటకల్), ‘పెళ్లిచూపులు’ (తూరల్ నిన్ను పోచ్చు), ‘మూడుముళ్లు’ (ముందానై ముడిచ్చు) ఈ భాగ్యరాజ్ సినిమాలన్నీ చంద్రమోహన్ సూపర్‌హిట్ చేశాడు. మెహమూద్ హిందీలో ‘పడోసన్’ తీసి హిట్ కొడితే దాని రీమేక్ ‘పక్కింటి అమ్మాయి’ చంద్రమోహన్ హిట్ కొట్టాడు. హిందీ ‘హీరో’ను నాగార్జునతో తెలుగులో ‘విక్రమ్’ పేరుతో తీస్తున్నప్పుడు ఒరిజినల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర సంజీవ్ కుమార్ చేస్తే అందుకు సరిజోడును దర్శకుడు వి. మధుసూదనరావు, నిర్మాత అక్కినేని వెతికి వెతికి చివరకు చంద్రమోహన్ దగ్గరికే వచ్చారు. ‘అమర్ అక్బర్ ఆంథోని’ రీమేక్ తెలుగులో ‘రామ్ రాబర్ట్ రహీమ్’గా తీయాలనుకున్నప్పుడు తెలుగువారి రిషి కపూర్ ఎవరు? ఇంకెవరు చంద్రమోహన్. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రసిద్ధి.అన్నవరం ప్రసాదానికి ప్రసిద్ధి.అన్నవరం చంద్రమోహన్‌కి కూడా ప్రసిద్ధి.ఏనాడైతే ఆ మెట్ల మీద చంద్రమోహన్, రాజ్యలక్ష్మిలతో ‘శంకరాభరణం’లో అందమైన ప్రేమ చూపులను దర్శకుడు కె.విశ్వనాథ్ తీశాడో ఆ రోజు అన్నవరం ఎవరు వెళ్లినా భక్తితో పాటు శంకరాభరణం కూడా గుర్తు చేసుకుంటారు. ఒక్క సీన్‌తో చంద్రమోహన్ చేసిన మేజిక్ అది. అతని చేతిలో నుంచి నీళ్ల గ్లాసు ఊరికూరికే జారిపోతే ప్రేక్షకులకు ఊరికూరికే నవ్వు వచ్చింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల హయాంలో, కృష్ణ శోభన్‌బాబుల హయాంలో, చిరంజీవి బాలకృష్ణల హయాంలో, రాజేంద్రప్రసాద్ రాజశేఖర్ల హయాంలో కూడా హీరోగా హిట్స్ ఇచ్చినవాడు చంద్రమోహన్. ‘చిన్నోడు–పెద్దోడు’ (1988) వరకూ హిట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ‘అల్లుడు గారు’ (1990)తో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సత్తాను నిరూపించుకుంటూ వెళ్లాడు. అతను హీరో అయినా జనం చూశారు. కేరెక్టర్ ఆర్టిస్ట్ అయినా చూశారు. ఉదయ్‌కిరణ్, తరుణ్‌లకు తండ్రిగా వేసినా చూశారు. కృష్ణవంశీ ‘గులాబీ’ తక్కిన కారణాల రీత్యా ఎంత హిట్టో సరదా తండ్రిగా వేసిన చంద్రమోహన్ వల్ల అంత హిట్టు. ‘మీ అభిమాన నటుడు ఎవరు’ అని జయసుధను అడిగితే ‘ఇంకెవరు చంద్రమోహన్’ అంటుందామె తడుముకోకుండా. జయసుధతో దాదాపు 25 సినిమాల్లో హీరోగా చేశాడు అతను. చంద్రమోహన్ పక్కన యాక్ట్ చేస్తే సూపర్స్టార్లు అవుతారనే సెంటిమెంట్ హీరోయిన్లకు ఉండేది. వాణిశ్రీ, లక్ష్మి, జయసుధ, జయప్రద, కవిత, సులక్షణ, సుహాసిని, రాధిక, విజయశాంతి... వీరంతా చంద్రమోహన్‌తో చేశాక స్టార్లు అయ్యారు. ‘పదహారేళ్ల వయసు’ తర్వాత శ్రీదేవి మళ్లీ ఆయనతో చేయలేనంత పెద్ద హీరోయిన్. మిమిక్రీ ఆర్టిస్టులు అందరినీ అనుకరిస్తారు గాని చంద్రమోహన్‌ని కాదు. అతనిలాగా చేయగల వాడు అతనొక్కడే. ఆ డైలాగ్ మాడ్యులేషన్, ముఖంలో పలికించగల ఎమోషన్, కామిక్ టైమింగ్... ఇతరులకు ఎప్పటికీ రావు. కాని చంద్రమోహన్‌లో ఒక్కటే చిన్న లోపం ఉంది. బి.ఎన్.రెడ్డి గారు హెచ్చరించినా.. మార్చాలని చూసినా మారనిది– చేతులు ఊపనిదే డైలాగ్ చెప్పలేకపోవడం. చంద్రమోహన్‌ది ఎడమచేతి వాటం. ఎడమ చేతిని వేగంగా కదిలిస్తూ ఇరు చేతులూ కదిలిస్తూ డైలాగ్ చెబుతాడు. ఎన్.టి.ఆర్తో చిన్నపాటి విభేదం చంద్రమోహన్‌కు ఎన్.టి.ఆర్కు ఆది నుంచి స్నేహం ఎందుకనో కుదరలేదు. చంద్రమోహన్ అక్కినేనితో దాదాపు 40 సినిమాలు చేస్తే ఎన్టీఆర్‌తో వేళ్ల మీద లెక్కించేన్ని సినిమాలే చేశారు. నిజానికి మేకప్‌మేన్ పీతాంబరం ఎన్టీఆర్‌తో ‘యాదోంకి బారాత్’ రీమేక్ ‘అన్నదమ్ముల అనుబంధం’ తీయాలనుకున్నప్పుడు చిన్న తమ్ముడి పాత్రకు చంద్రమోహన్‌ను, పెద్ద తమ్ముడి పాత్రకు మురళీమోహన్ను తీసుకున్నారు. అయితే ఎన్టీఆర్ చివరి నిమిషంలో ఆ పాత్రను బాలకృష్ణకు ఇచ్చారు. పీతాంబరం ఇరకాటంలో పడ్డారు. షూటింగ్ రోజున మేకప్ వేసుకోవడానికి చంద్రమోహన్ వస్తే అప్పటికే ఆ పాత్ర బాలకృష్ణకు వెళ్లిందని తెలిసింది. ఆ రోజు నుంచి చాలా రోజుల పాటు ఎన్టీఆర్ పట్ల చంద్రమోహన్ కినుకతోనే ఉన్నారు. మరోవైపు నష్టనివారణ కోసం పీతాంబరం అదే యాదోంకి బారాత్‌ను తమిళంలో ఎం.జి.ఆర్తో తీస్తే అందులో తమ్ముడి పాత్రను చంద్రమోహన్‌కు ఇప్పించారు– జరిగిన విషయం ఎం.జి.ఆర్కు చెప్పి. తమిళ యాదోంకి బారాత్‌లో పెద్దన్న, పెద్ద తమ్ముడిగా ఎం.జి.ఆర్ డబుల్ యాక్షన్ చేశారు. చంద్రమోహన్ ఎం.జి.ఆర్ తమ్ముడిగా చేసి హిట్ కొట్టారు. కనీ వినీ ఎరగని భోజన ప్రియుడు చంద్రమోహన్ కనీవినీ ఎరగని భోజన ప్రియుడు. సాధారణంగా సినిమా వారు మితంగా తింటారు. కాని అదృష్టవశాత్తు చంద్రమోహన్ శరీర తత్వానికి ఆయన ఎంత తిన్నా ఏమీ ఒళ్లు పెరిగేది కాదు. షూటింగుల్లో ఆయనకు ఐదు డబ్బాల భారీ క్యారేజీ వచ్చేది. అల్లూరి సీతారామరాజు ఔట్‌డోర్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో చంద్రమోహన్ నలభై యాభై ఇడ్లీలు తినడం చూసి గుమ్మడి, పి.జె.శర్మలాంటి వారు నోరెళ్లబెట్టారు. ‘ఆకాశంలో ఎగిరేవన్నీ తిన్నాను.. నేల మీద పాకేవన్నీ తిన్నాను... నీళ్లలో ఈదేవన్నీ తిన్నాను’ అని సరదాగా తన భోజనప్రియత్వాన్ని అతిశయోక్తితో ఒక ఇంటర్వ్యూలో చె΄్పారు చంద్రమోహన్. అందుకే ఆయన తిని అరాయించుకోని క్యారేజీ లేదు.. వేసి నిభాయించని క్యారెక్టరూ లేదు చంద్రమోహన్‌కు అవార్డులు గివార్డులు పట్టవు. సన్మానాలు గిన్మానాలు నచ్చవు. సినిమా చేశామా... ఇంటికి వెళ్లామా ఇదే ధ్యాస. అందరికీ బిరుదులిచ్చే టి.సుబ్బరామిరెడ్డి ఒకసారి ఆయనకు భారీ బిరుదు ఇచ్చి సత్కారం చేస్తానంటే ‘మీరు ఇచ్చిన వెంటనే దానికి తిలోదకాలు ఇస్తాను’ అని హెచ్చరించినవాడు చంద్రమోహన్. పేరుకు ముందు నట అది.. నట ఇది అని బిరుదులు వేయడం కూడా ఆయనకు ఇష్టం లేదు.‘చంద్రమోహన్‌లా వచ్చాను... చంద్రమోహన్‌లా వెళ్లిపోతాను’ అనేవాడాయన.ఎస్. అలాగే వెళ్లాడు. హి ఈజ్ ఓన్లీ చంద్రమోహన్. – ఖదీర్ చంద్రమోహన గీతాలు – హిట్ సాంగ్స్ – 10 1. మేడంటే మేడా కాదు – సుఖ దు:ఖాలు 2.ఝుమ్మంది నాదం సయ్యంది పాదం – సిరిసిరిమువ్వ 3. మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి 4. నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి 5. కంచికి పోతావా కృష్ణమ్మ – శుభోదయం 6. కలనైనా క్షణమైనా – రాధా కల్యాణం 7. దాసోహం దాసోహం దాసోహం – పెళ్లిచూపులు 8. లేత చలిగాలులు – మూడుముళ్లు 9. పంటచేలో పాలకంకి నవ్వింది – పదహారేళ్ల వయసు 10. నీ తీయని పెదవులు అందకపోతే – కాంచన గంగ. -
900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు
సాక్షి, హైదరాబాద్: కథానాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్యనటుడిగా, కొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ నటించిన ‘ఆల్ రౌండర్’ చంద్రమోహన్ (82) ఇక లేరు. కొన్నాళ్లుగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత, మధుమేహం వ్యాధులతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9.45కు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. తర్వాత ఆయన భౌతికకాయాన్నిఫిలింనగర్‌లోని స్వగృహానికి తీసుకెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు చంద్రమోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి ఉన్నారు. జలంధర ప్రముఖ రచయిత్రికాగా.. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉన్న మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ‘రంగుల రాట్నం’తో మొదలై.. ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు 1942 మే 23న జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ తమకు దగ్గరి బంధువు కావడంతో.. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నై వెళ్లారు. బీఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘రంగుల రాట్నం’(1966) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. హీరోగా సుమారు 175కుపైగా సినిమాలు చేశారు. మొత్తంగా తన 55 ఏళ్ల సినీ కెరీర్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా ఇలా దాదాపు 900కుపైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. విభిన్న పాత్రలతో.. ఎన్నో అవార్డులతో.. ‘సుఖదుఃఖాలు, కాలం మారింది, ఓ సీత కథ, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, పదహారేళ్ల వయసు, శంకరా భరణం’ వంటి క్లాసిక్ చిత్రాల్లో మెప్పించారు చంద్రమోహన్. ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’వంటి చిత్రాల్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కోతలరాయుడు’ (2022) తెలుగులో చంద్రమోహన్ చివరి చిత్రం. తొలిచిత్రం ‘రంగుల రాట్నం’కు నంది అవార్డు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ’ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. -
కురబలకోటలో మెరిసిన మోహనుడు
కురబలకోట : వైవిధ్య పాత్రలతో మెప్పించి.. నట విశ్వరూపం చూపిన చంద్ర మోహనుడితో కురబలకోట వాసులకు విడదీయరాని అనుబంధం ఉంది. అతడి మరణ వార్త విన్న ఆయన అభిమానులు ఉద్వేగానికి గురయ్యారు. అన్నమయ్య జిల్లా కురబలకోట రైల్వే స్టేషన్లో నాడు ఆయన చెప్పిన మాటలు.. చేసిన నటనను గుర్తు చేసుకున్నారు. కళా తపస్వి కె.విశ్వనాఽథ్ దర్శకత్వంలో చంద్రమోహన్, తాళ్లూరి రామేశ్వరిలు సీతామాలక్ష్మి సినిమాలో నటించారు. కురబలకోట మండలంలోని తెట్టు, కురబలకోట రైల్వే స్టేషన్లో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నాడు చిత్రీకరించారు. శ్రీమావి చిగురు తినగానే కోవిల పలికేనా..్ఙ పాట చిత్రీకరణ కురబలకోట రైల్వే స్టేషన్లో జరిగింది. చిత్రంలో ఓ పాత్రధారి వెటకారం చేస్తూ ఏ ఊరు మీది అని ప్రశ్నించినపుడు చంద్రమోహన్ మాది మదనపల్లె వద్ద కురబలకోట అని చెబుతాడు. సినిమాలో డైలాగ్ విన్న కురబలకోట వాసులు అప్పట్లో ఊగిపోయారు. 1978 జూలై, 27న విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమా చంద్రమోహన్‌కు హీరోగా సినీ రంగంలో ఎదగడానికి అవకాశం ఇచ్చింది. ఈ సినిమా విజయంతో ఈ ప్రాంతంలో మరెన్నో సినిమాలు తీయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. ఈ చిత్ర యూనిట్ తెట్టులోని కామకోటి ప్రసాదరావు ఇంట్లో బస చేశారు. ఒకటిన్నర నెలపాటు తెట్టు వేణుగోపాలస్వామి ఆలయం, గ్రామ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ నిర్వహించారు. శనివారం చంద్రమోహన్ మరణవార్త తెలుసుకోగానే.. కళ్లు చెమర్చారు. నాటి అభిమానులు ఆయన పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. కురబలకోట రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారినా.. ఈ ప్రాంత వాసుల మనసుల్లో ఈ సినిమా చెక్కుచెదర లేదు. -
చంద్రమోహన్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న జయసుధ
-
కంటతడి పెట్టిస్తున్న చంద్రమోహన్ చివరి మాటలు!
ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతితో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం(నవంబర్ 11న) కన్నుమూశారు. చంద్రమోహన్ చివరిసారిగా కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించినప్పుడు మీడియా ముందుకు వచ్చారు. అవే చివరిమాటలు చంద్రమోహన్ పెదనాన్న కుమారుడే విశ్వనాథ్. ఈ దిగ్గజ దర్శకనటుడు ఈ ఏడాది ఫిబ్రవరి 2న మరణించారు. అన్నయ్య మరణం చంద్రమోహన్‌ను ఎంతగానో కుంగదీసింది. విశ్వనాథ్ పార్థివదేహం చూసి ఈయన తల్లడిల్లిపోయారు. చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 'కె.విశ్వనాథ్.. స్వయానా నా పెదనాన్న కొడుకు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నా కజిన్. మా మధ్య సినిమా అనుబంధం కంటే కుటుంబ బాంధవ్యం ఎక్కువ ఉండేది. ఇండస్ట్రీలోని అందరికంటే కూడా నేను చాలా దగ్గరివాడిని. ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందే. కానీ ఆయన తన జీవితంలో ఎన్నో గర్వకారణమైన సినిమాలు అందించారు. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!.) 25 ఏళ్ల పక్కపక్కనే ఉన్నాం.. విశ్వనాథ్ అన్నయ్య, నేను మద్రాసులో ఒకే చోట స్థలం కొనుక్కుని, ఇళ్లు కట్టుకుని పాతికేళ్లు పక్కపక్కనే ఉన్నాం. మా ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో గర్వకారణమైన సినిమాలు వచ్చాయి. ఆయన నన్ను అద్భుతమైన నటుడిగా చూపించారు. 1966లో విశ్వనాథ్ దర్శకుడిగా, ఎస్పీ బాలు గాయకుడిగా, నేను నటుడిగా పరిచయమయ్యాం. మా మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. మా కుటుంబాలకు ఆయన మరణం తీరని లోటు' అని ఎమోషనల్ అయ్యారు. కళాతపస్విని తలుచుకుంటూ చంద్రమోహన్ మాట్లాడిన మాటలే ఆయన చివరి మాటలుగా మిగిలిపోయాయి. ఆ సమయంలో అన్నయ్య గురించి చంద్రమోహన్ కంటతడి పెట్టుకున్న వీడియో చివరి వీడియోగా మిగిలిపోయింది. చదవండి: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో.. చంద్రమోహన్ మృతి.. చిరంజీవి సహా టాలీవుడ్ సెలబ్రిటీల నివాళులు -
చంద్రమోహన్ దశాబ్దాల సినీ జీవితం.. ఆయనకిష్టమైన పాటలు ఇవే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే సినీ దిగ్గజం నింగికెగిసింది. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తన కెరీర్లో హీరోగా, విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన తీరు తెలుగువారికి చిరకాలం గుర్తుండిపోతాయి. తన సినీ జీవితంలో దాదాపు 932 చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రంగుల రాట్నంతో మొదలైన ఆయన సనీ ప్రస్థానం.. గోపిచంద్ చిత్రం ఆక్సిజన్‌తో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలా ఆయన నటించిన చిత్రాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమాల్లో ఆయనకు ఇష్టమైన టాప్ హిట్ సాంగ్స్ గురించి వివరాలు పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్‌గా..) చంద్రమోహన్‌కు ఇష్టమైన 30 పాటలు. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ లేత చలిగాలులు– మూడు ముళ్లు దాసోహం దాసోహం – పెళ్లి చూపులు సామజవరాగమనా – శంకరాభరణం ఈ తరుణము – ఇంటింటి రామాయణం ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం అటు గంటల మోతల – బాంధవ్యాలు ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం ఏమని పిలవాలి – భువనేశ్వరి మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి ఐ లవ్ యు సుజాత– గోపాల్ రావ్ గారి అమ్మాయి నీ తీయని పెదవులు– కాంచనగంగ నీ చూపులు గారడీ– అమాయకురాలు (ఇది చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) వ్యక్తిగత జీవితం.. చంద్రమోహన్ భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. వీరికి ఇద్దరమ్మాయిలు సంతాన కాగా.. వారికి పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మాసిస్ట్ కాగా అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే కావడంతో వీరంతా చెన్నైలో ఉంటున్నారు. -
శోభన్‌బాబు ఇంట్లోకి రానిచ్చాడా? చంద్రమోహన్ పంచ్‌లకు లెక్కేలేదు!
చంద్రమోహన్ విలక్షణ నటుడే కాదు ఆయన మాటల్లో హాస్యం తళుక్కుమంటుంటుంది... పంచ్‌లు కూడా పడుతుంటాయి. కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ 'రంగుల రాట్నం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోగా, కమెడీయన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 900లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన నేడు(నవంబర్ 11న) ఉదయం కన్నుమూశారు. ఆయనను కలుసుకున్న అదృష్ణవంతుణ్ని చంద్రమోహన్‌ను ఓసారి కలుసుకున్న అదృష్ణవంతుణ్ని నేను. జర్నలిజం స్కూల్లో కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు సినీ జర్నలిజం విద్యార్థుల్ని చెన్నైకి తీసుకెళ్ళాను. అప్పుడు కలిసిన చాలా మంది సినిమా ప్రముఖుల్లో చంద్రమోహన్ ఒకరు. ఆయన వద్దకు వెళ్ళే సరికి సాయంత్రం అయ్యింది. అంతకు ముందే హీరో శోభన్ బాబుగారితో మట్లాడి వచ్చాము. మమ్మల్ని చూడగానే సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. సినీ జర్నలిజం విద్యార్థులని పరిచయం చేశాను. ఇంట్లోకి రానిచ్చాడా, గేటు వద్దే పంపించేశాడా? చంద్రమోహన్ గారు నవ్వుతూ... వెరీ గుడ్... మున్ముందు మీరడిగే చాలా ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో అంటూనే ఒకమాట గుర్తుంచుకోండి. కవరేజీ ఎలా చేశామనే అలోచించండి. ఎందుకంటే చాలామంది మీ వాళ్ళు కవరేజీ కన్న కవర్లేజీ పైనే మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు అని ఓ పంచ్ వేశారు. హీరో శోభన్ బాబుగారిని కలిసి వచ్చామని చెప్పగానే.. ఆహా అలాగా... ఇంట్లోకి రానిచ్చాడా, గేటు వద్దే పంపించేశాడా? తనకు ఇవన్నీ ఇష్టముండవు అంటూ చెణుకు విసిరారు. (చదవండి: వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్.. ఒకటో తారీఖు వస్తే చాలు..) నక్క తోక తొక్కారు, లేదంటే.. లేదు సార్ గంటపైగా మాట్లాడారు అని అనగానే అయితే కచ్చితంగా మీరేదో నక్కతోక తొక్కే వచ్చి ఉంటారు. సినిమాకు సంబంధించి ఏ విషయం ఇంట్లో ఆయన మాట్లాడరు. సినిమా వాళ్ళను లోపలికి కూడా రానీయరు. అంతెందుకు... సినిమా పత్రికలు కూడా గేటు దాటే వీల్లేదని చెబుతూనే.. అందుకే చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు అంటూ మరో పంచ్ వేశారు. తనతో ఉన్న గంటసేపు చాలా కబుర్లు చెప్పారు. తమ సినీ జీవన ప్రస్థానం తెలిపారు. ఇప్పటికీ చంద్రమోహన్ అన్న కవరేజా...కవర్లేజా అన్నమాట నాకు గుర్తొస్తునే ఉంటుంది. స్వయంగా ఏఎన్నార్ ఆ మాటన్నారు చంద్రమోహన్ లక్కీ స్టార్ అవునో కాదో తెలీదు కానీ, ఆయనతో నటించిన చాలా మంది హీరోయిన్లు లక్కీస్టార్లుగా ఎదిగిపోయారు. జయసుధ, శ్రీదేవి, రాధికా తదితరుల్ని ఈ జాబితాలో చెప్పవచ్చు. చంద్రమోహన్ మరో అంగుళం పొడుగ్గా ఉంటే మమ్మల్ని తొక్కేసి హీరోగా వెళ్ళిపోయేవాడు.. ఈ మాట సాక్షాత్తు అక్కినేని నాగేశ్వరరావే అన్నారంటే ఆయనెంత విలక్షణ నటుడో తెలుస్తుంది. నవరసాలు అవలీలగా పండించే అలాంటి హీరోతో కాసేపు మాట్లాడానన్న తృప్తి అయితే ఉంది. ఎందుకో ఇవాళ...ఆ హీరో మరో లోకానికి వెళ్ళారనగానే ఆ సందర్భం గుర్తొచ్చింది. - రామదుర్గం మధుసూదన రావు చదవండి: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో.. -
హీరోయిన్లకు లక్కీ హీరో చంద్ర మోహన్
-
'శోభన్ బాబుకు డబ్బులు ఇచ్చిన చంద్రమోహన్'.. ఎందుకంటే?
టాలీవుడ్లో మరో సినీ దిగ్గజం దివికేగిసింది. దాదాపు 55 ఏళ్ల పాటు కళామతల్లి ముద్దుబిడ్డగా, తనదైన నటనతో అభిమానులను మెప్పించిన నట దిగ్గజం చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. చివరిసారిగా 2017లో వచ్చిన గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. చంద్రమోహన్ హీరోగా నటించిన పదహారేళ్ల వయసు చిత్రం ద్వారానే అందాల నటి శ్రీదేవి అరంగేట్రం చేసింది. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు! ) దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇకలేరన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సమయంలో ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ గురించి ఆసక్తిక విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్న విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత శంకరాభరణం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు గెలిచారు. అప్పటి హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. అంతే కాకుండా శోభన్ బాబు, చంద్రమోహన్ మంచి స్నేహితులు కూడా. అలా వారి మధ్య బలమైన స్నేహబంధం వల్ల ఆర్థికంగా ఇద్దరు డబ్బులు అవసరమైతే ఒకరినొకరు సాయం చేసుకోవారమని గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. శోభన్ తన వద్దనే డబ్బులు తీసుకునేవాడని.. ఇది చూసి తనకు ఆశ్చర్యమేసేదని ఆయన తెలిపారు. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత ) గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'శోభన్‌బాబు, నేను మంచి స్నేహితులం. నాకంటే ఆయనే చాలా ఆస్తిపరుడు. అయినా కూడా నన్ను డబ్బులు అడిగేవారు. ఇది చూసి మొదట నేను ఆశ్చర్యపోయేవాన్ని. ఆ తర్వాత నాకు ఓ విషయం చెప్పాడు. నా దగ్గర డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని శోభన్ బాబు నమ్మేవారు. అందుకే ఏదైనా ఆస్తి కొన్నప్పుడల్లా నా దగ్గరే డబ్బులు తీసుకునేవాడు. శోభన్ బాబు మరణం మనకు తీరని లోటు' అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. నాగేశ్వరరావుతో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. -
నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగానే కాకుండా, అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఆయన నేడు అందరికీ దూరంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతికి గల కారణాలను చంద్రమోహన్ బంధువు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తాజాగా మీడియాకు వెల్లడించారు. కిడ్నీ సమస్య శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. 'చంద్రమోహన్‌గారు నాకు స్వయానా మేనమామ. ఆయన నాలుగేళ్ల నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్య కూడా తలెత్తింది. ఈ రోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చనిపోయారని నిర్దారించారు. ఆయన కూతుర్లలో ఒకరు చెన్నై నుంచి, మరొకరు అమెరికా నుంచి రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత.. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తాము' అని తెలిపారు. ఆరోగ్యం సహకరించికపోవడంతో రిటైర్మెంట్ కాగా చంద్రమోహన్ కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. నిర్విరామంగా పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసుకున్నారు. తాను ఉక్కు మనిషిని, తనకేం జరుగుతుందిలే అనుకున్నారు. ఆ నిర్లక్ష్యమే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. 2006లో రాఖీ సినిమా పూర్తయ్యాక చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ జరిగింది. దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలోనూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరగా గోపీచంద్ 'ఆక్సిజన్' మూవీలో నటించిన తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు! చంద్రమోహన్, కె విశ్వనాథ్, ఎస్పీ బాలు రిలేషన్ ఏంటో తెలుసా? -
చంద్రమోహన్ నటించిన చివరి సినిమా ఇదే..!
-
చంద్రమోహన్ మరణం బాధాకరం.. చిరంజీవి, ఎన్టీఆర్ సంతాపం..
తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. అత్యద్భుతమైన నటన.. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనసులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథానాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరన్న వార్త ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన.. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం… pic.twitter.com/vLMw4gTXOs — Chiranjeevi Konidela (@KChiruTweets) November 11, 2023 (చదవండి: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి) చాలా బాధాకరం: జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో దశాబ్దాలుగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను. — Jr NTR (@tarak9999) November 11, 2023 అజాత శత్రువు.. స్థాయి ని బట్టి కాకుండా మనిషిని మనిషిగా ప్రేమించిన వ్యక్తి చంద్రమోహన్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి హుందాగా ఉంటూ చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - పోసాని కృష్ణమురళి, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ ఇంటిదగ్గరే చంద్రమోహన్ భౌతిక కాయం గొప్ప నటుడు చంద్రమోహన్. ఆయన చనిపోవడం ఇండస్ట్రీకి బాధాకరం. ఆయన మృతి పట్ల మా అసోసియేషన్ విచారం వ్యక్తం చేస్తోంది. రేపు దీపావళి పండగ కావడంతో ఫిలిం ఛాంబర్లో చంద్రమోహన్ గారిని సందర్శనార్థం ఉంచడం లేదు. ఫిలింనగర్‌లోని ఇంటి వద్ద చంద్రమోహన్ భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచుతాం. ఇంటి వద్దకే ఆర్టిస్టులు రావాలని కోరుతున్నాం. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయి. - మాదాల రవి, మా జనరల్ సెక్రటరీ పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.- దర్శకుడు కె రాఘవేంద్ర రావు His is a face that takes us down the memory lane & puts a smile on our faces every time with his memorable Acting & characters. May your soul rest in peace Chandra Mohan sir. Om Shanti 🙏🏼 pic.twitter.com/2IvyZjPSrv — Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2023 చదవండి: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత -
రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్‌గా..
హీరోగా మెప్పించారు.. కమెడియన్‌గా నవ్వించారు.. తండ్రిగా ఎమోషన్స్ పండించారు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయారు నటుడు చంద్రమోహన్. ఎమోషనల్ పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించగల సమర్థుడు. ఆయన నేడు(నవంబర్ 11న) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి యావత్ తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఏడిపించారు. 35 ఎకరాల ద్రాక్ష తోట 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దిగ్గజ నటుడు వెయ్యి సినిమాల మార్క్‌ను చేరుకుంటాడనుకునే సమయంలో రిటైర్మెంట్ ప్రకటించారు. అనారోగ్యంతో కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అయితే 900కు పైగా చిత్రాలు చేసినప్పటికీ తనకు పెద్దగా ఆస్తి లేదని, ఒకానొక సమయంలో ఉన్న ఆస్తినే కోల్పోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందులో చంద్రమోహన్ ఏమన్నారంటే.. హైదరాబాద్‌లోని కోంపల్లిలో గొల్లపూడి మారుతీరావు ద్రాక్షతోట కొన్నారు. ఆయనను కూడా కొనమని చెప్పారు. సరేనంటూ.. చంద్రమోహన్ 35 ఎకరాల దాకా కొన్నారు. శోభన్‌బాబు వద్దన్నా వినలేదు కానీ తర్వాత దాన్ని చూసుకోవడం వీలుపడలేదు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని అలాగే తన దగ్గర పెట్టుకోవడమని ఒక్క ఎకరం కూడా ఉంచుకోకుండా అంతా అమ్మేశారు. అంతేకాదు, ఉన్న భూమిని అమ్ముకోవద్దని శోభన్‌బాబు చెప్తున్నా వినకుండా చెన్నైలో 15 ఎకరాలు అమ్మేశారు. ఇప్పుడు దాని విలువ రూ.30 కోట్లపైనే ఉంది. అటు శంషాబాద్‌లో ప్రధాన రహదారి పక్కన ఆరెకరాలు కొన్నారు. కానీ చివరకు దాన్ని కూడా కాపాడుకోకుండా అదీ అమ్మేశారు. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ! ఇలా దాదాపు వందకోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నానని సదరు ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువని బాధపడ్డారు. చంద్రమోహన్ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందంటారు చాలామంది. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో.. జనవరి ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి తన భర్త చేతుల మీదుగా డబ్బు తీసుకుంటారని చంద్రమోహన్ భార్య, రచయిత్రి జలంధర వెల్లడించింది. స్టార్ నటుడిగా జేజేలు అందుకున్న ఆయన తన చివరి రోజుల్లో సాదాసీదా జీవితం గడిపారు. చదవండి: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత -
చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023 ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రశేఖర్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర్. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. చదవండి: టాలీవుడ్ సినీ దిగ్గజం చంద్రమోహన్ చివరి సినిమా ఇదే! -
టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
-
Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ నేపథ్యం.. చంద్రశేఖర్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. (చదవండి: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి) సినిమా నేపథ్యం.. చంద్రమోహన్ 1966లో రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో చందమామ రావే చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. పదహారేళ్ల వయసు సినిమాకుగానూ ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామహాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు 932 సినిమాలలో నటించారు. ఆ సినిమాలు తన కెరీర్లోనే స్పెషల్ సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినన్న చంద్రమోహన్ ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్లో సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసు చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు. ఇదీ చదవండి: చంద్రమోహన్ మృతికి కారణాలివే! లక్కీ హీరోగా క్రెడిట్ ఒకప్పుడు హీరోయిన్లకు ఈయన లక్కీ హీరో. చంద్రమోహన్‌తో నటిస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. అలా కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద.. ఈయనతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. చంద్రమోహన్- సుధ కాంబినేషన్ అయితే సూపర్‌హిట్ అయింది. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గజ్వేల్ నియోజకవర్గంలో ‘దళితబంధు’ కోసం రోడ్డెక్కిన దళితులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులు రోడెక్కారు. దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం దళితులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిగుల్, నిర్మల్‌నగర్, బస్వాపూర్, అలిరాజ్‌పేట గ్రామాల దళితులు ఆందోళన చేశారు. జగదేవ్‌పూర్ –భువనగిరి ప్రధాన రహదారిపై గంటసేపు నిర్మల్ నగర్ దళితులు రాస్తారోకో చేపట్టారు. ధర్నా కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర అటుఇటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ చంద్రమోహన్ దళితులతో మాట్లాడి సముదాయించి ధర్నాను విరవింపజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎదుట సర్పంచ్‌కు వ్యతిరేకంగా దళితులు నిరసన చేపట్టారు. తిగుల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో దళితులు బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. బస్వాపూర్‌లోనూ దళితులు నిరసన తెలిపారు. అలిరాజ్‌పేటలో దళితులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల దళితులు మాట్లాడుతూ దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే ఎవరికీ ఇవ్వకూడదని అన్నారు. -
నవరసాలు పండించి మెప్పించే అరుదైన నటుడు
-
సీతామాలక్ష్మి రైల్వేస్టేషన్
సాక్షి,చిత్తూరు : ‘సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం.. సీతామాలచ్చిమంటే... శ్రీలక్ష్మి అవతారం..’ అరే ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందే అన్పిస్తుంది కదూ..అవును ఇది సీతామాలక్ష్మి సినిమా పాట. పెద్ద తరం వారికి బాగా తెలుసు. 1978లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికీ ఈ పాట వింటే మనసు పులకరి స్తుంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కొట్టింది. కళాతపస్వి కె.విశ్వనా«థ్ దర్శకత్వంలో హీరో చంద్రమోహన్, హీరోయిన్గా తాళ్లూరి రామేశ్వరి నటించారు. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా..కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..’అనే పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఈ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలు కురబలకోట రైల్వేస్టేషన్లో తీశారు. వంకాయల సత్యనారాయణ స్టేషన్ మాస్టర్‌గా హీరో హీరోయిన్లపై ఈ పాట రసరమ్యంగా సాగింది. రైల్వేస్టేషన్లో అద్భుతంగా చిత్రీకరించారు. దీంతో అప్పటి నుంచి ఈ స్టేషన్‌ను సీతామాలక్ష్మి స్టేషన్‌గా వ్యవహరిస్తున్నా రు. ఆనాటి స్టేషన్ ఆధునీకరణలో రూపురేఖలు మారినా ఆ సినిమా ఊహలు మాత్రం ఇంకా చెక్కుచెదరలేదు. ఈ సినిమా టీవీలో వస్తే ఈ ప్రాంతంలో ఇంటిల్లిపాది కూర్చుని చూడటం పరిపాటిగా మారింది. -
మే 23న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కె.రాఘవేంద్రరావు (దర్శకుడు), చంద్రమోహన్ (నటుడు) ఈరోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 9. వీరికి ఈ సంవత్సరం ఆస్తుల విలువ పెరుగుతుంది. కోర్టుకేసుల్లో విజయం సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పోలీసులు, మిలిటరీ వారికి ఇది మంచి సమయం. పోలీసు డిపార్ట్మెంట్లో పని చేయాలనుకునేవారి కల నెరవేరుతుంది. సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలోని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. సివిల్ ఇంజినీర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన పనులు చక్కగా పూర్తి చేస్తారు. అయితే కొత్త పనులు మొదలు పెట్టడానికి మాత్రం ఇది తగిన సమయం కాదు. లక్కీ నంబర్స్: 1,5,6,9. లక్కీ డేస్: మంగళ, శుక్ర, ఆదివారాలు. లక్కీ కలర్స్: రోజ్, క్రీమ్, ఆరంజ్, రెడ్. సూచనలు: వాహనాలు నడిపేటప్పుడు మితిమీరిన వేగం పనికిరాదు. పదునైన ఆయుధాలు వాడేటప్పుడు అప్రమత్తత అవసరం. రక్తదానం చేయడం, రక్తదానాన్ని ప్రోత్సహించడం, అనాథ విద్యార్థులకు సాయం చేయడం, సుదర్శన హోమం చేయించుకోవడం. - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్