సీతామాలక్ష్మి రైల్వేస్టేషన్‌ | Kurabalakota Railwaystation Is Famous For Seetamalakshmi Movie | Sakshi
Sakshi News home page

సీతామాలక్ష్మి రైల్వేస్టేషన్‌

Published Sun, Sep 15 2019 7:13 AM | Last Updated on Sun, Sep 15 2019 7:15 AM

Kurabalakota Railwaystation Is Famous For Seetamalakshmi Movie - Sakshi

సాక్షి,చిత్తూరు : ‘సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం.. సీతామాలచ్చిమంటే... శ్రీలక్ష్మి అవతారం..’ అరే ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందే అన్పిస్తుంది కదూ..అవును ఇది సీతామాలక్ష్మి సినిమా పాట. పెద్ద తరం వారికి బాగా తెలుసు. 1978లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికీ ఈ పాట వింటే మనసు పులకరి స్తుంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ కొట్టింది. కళాతపస్వి కె.విశ్వనా«థ్‌ దర్శకత్వంలో హీరో చంద్రమోహన్, హీరోయిన్‌గా తాళ్లూరి రామేశ్వరి నటించారు. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా..కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..’అనే పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఈ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలు కురబలకోట రైల్వేస్టేషన్‌లో తీశారు.

వంకాయల సత్యనారాయణ స్టేషన్‌ మాస్టర్‌గా హీరో హీరోయిన్లపై ఈ పాట రసరమ్యంగా సాగింది. రైల్వేస్టేషన్‌లో అద్భుతంగా చిత్రీకరించారు. దీంతో అప్పటి నుంచి ఈ స్టేషన్‌ను సీతామాలక్ష్మి స్టేషన్‌గా వ్యవహరిస్తున్నా రు. ఆనాటి స్టేషన్‌ ఆధునీకరణలో రూపురేఖలు మారినా ఆ సినిమా ఊహలు మాత్రం ఇంకా చెక్కుచెదరలేదు. ఈ సినిమా టీవీలో వస్తే ఈ ప్రాంతంలో ఇంటిల్లిపాది కూర్చుని చూడటం పరిపాటిగా మారింది. 

              

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement