K. Viswanath
-
కంటతడి పెట్టిస్తున్న చంద్రమోహన్ చివరి మాటలు!
ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతితో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం(నవంబర్ 11న) కన్నుమూశారు. చంద్రమోహన్ చివరిసారిగా కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించినప్పుడు మీడియా ముందుకు వచ్చారు. అవే చివరిమాటలు చంద్రమోహన్ పెదనాన్న కుమారుడే విశ్వనాథ్. ఈ దిగ్గజ దర్శకనటుడు ఈ ఏడాది ఫిబ్రవరి 2న మరణించారు. అన్నయ్య మరణం చంద్రమోహన్‌ను ఎంతగానో కుంగదీసింది. విశ్వనాథ్ పార్థివదేహం చూసి ఈయన తల్లడిల్లిపోయారు. చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 'కె.విశ్వనాథ్.. స్వయానా నా పెదనాన్న కొడుకు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నా కజిన్. మా మధ్య సినిమా అనుబంధం కంటే కుటుంబ బాంధవ్యం ఎక్కువ ఉండేది. ఇండస్ట్రీలోని అందరికంటే కూడా నేను చాలా దగ్గరివాడిని. ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందే. కానీ ఆయన తన జీవితంలో ఎన్నో గర్వకారణమైన సినిమాలు అందించారు. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!.) 25 ఏళ్ల పక్కపక్కనే ఉన్నాం.. విశ్వనాథ్ అన్నయ్య, నేను మద్రాసులో ఒకే చోట స్థలం కొనుక్కుని, ఇళ్లు కట్టుకుని పాతికేళ్లు పక్కపక్కనే ఉన్నాం. మా ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో గర్వకారణమైన సినిమాలు వచ్చాయి. ఆయన నన్ను అద్భుతమైన నటుడిగా చూపించారు. 1966లో విశ్వనాథ్ దర్శకుడిగా, ఎస్పీ బాలు గాయకుడిగా, నేను నటుడిగా పరిచయమయ్యాం. మా మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. మా కుటుంబాలకు ఆయన మరణం తీరని లోటు' అని ఎమోషనల్ అయ్యారు. కళాతపస్విని తలుచుకుంటూ చంద్రమోహన్ మాట్లాడిన మాటలే ఆయన చివరి మాటలుగా మిగిలిపోయాయి. ఆ సమయంలో అన్నయ్య గురించి చంద్రమోహన్ కంటతడి పెట్టుకున్న వీడియో చివరి వీడియోగా మిగిలిపోయింది. చదవండి: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో.. చంద్రమోహన్ మృతి.. చిరంజీవి సహా టాలీవుడ్ సెలబ్రిటీల నివాళులు -
నేను చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నాను: కె. విశ్వనాథ్
-
ఆ అర్హత నాకు లేదు.. దాని గురించి నేను ఏమి మాట్లాడను : కె.విశ్వనాథ్
-
కె. విశ్వనాథ్ కడసారి చూపు కోసం తరలి వచ్చిన సినీ ప్రముఖులు
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు పరిశ్రమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్ ఇక లేరన్న వార్త తెలుసుకొని చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కె. విశ్వనాథ్ చివరి చూపు కోసం సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెంకటేశ్, మణిశర్మ, గుణశేఖర్, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయికుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కె. విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ►విశ్వనాథ్ గారు లేరనే వార్త నన్ను బాధకు గురిచేసింది నాకు పితృసమానులు. విశ్వనాథ్ చిత్రాలు పండితుల నుంచి పామరుల వరకు అలరించాయి జనరంజకం చేస్తూ బ్లాక్ బస్టర్ చేయడం అనేది ఆయన కృషికి నిదర్శనం.తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు ఆయన దర్శకత్వంలో నేను నటించడం అదృష్టం. మా లాంటి నటులకు విశ్వనాథ్ ఓ గ్రంథాలయం. ఆయన చేత్తో అన్నం తినిపించిన గొప్ప వ్యక్తి. 'ఇంద్ర' సమయంలో వారణాసికి పిలవడంతో వచ్చారు ఆయన ప్రేమ వాత్సల్యం పొందిన నేను తండ్రిని పొగొట్టుకున్నంత బాధగా ఉంది- చిరంజీవి ► కె. విశ్వనాథ్ గారి మరణం చాలా బాధాకరం.ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం.ఆయన తెలుగు సినిమాకు మూలస్తంభం. తన సినిమాల ద్వారా సంస్కృతిని తెలియజేశారు. విశ్వనాథ్ గారి మరణం సినిమా రంగానికి తీరని లోటు అంటూ పపన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ► విశ్వనాథ్ గారు ఈరోజు లేరనే వార్త చాలా షాకింగ్‌గా, బాధగా అనిపిస్తుంది. దేశంలోని అత్యత్తుమ డైరెక్టర్లలో ఆయన ఒకరు. పాత తరమే కాదు, ఈనాటి జనరేషన్ కూడా ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటాయి - విక్టరీ వెంకటేశ్ ► పుట్టినప్రతివాడికి మరణం తప్పదు. కానీ విశ్వనాథ్ గారి మరణం చాలా గొప్పది. - ఆయాన సినిమాల్లో నేను నటించాను. - ఎప్పుడు ఆప్యాయంగా పలకరించేవారు. - ఆయన కుటుంబంతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. - ఆయన లేడు అనేది చాలా బాధాకరం. - భారతీయ చలన చిత్రాలలో విరబూసిన కమలం ఆయన - బ్రహ్మానందం ► కళా తపస్వి అన్న పేరుకు ఆయనే నిలువెత్తు సాక్ష్యం. ఆయన కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అలాంటి మనిషి ఈరోజు లేరన్నది నిజం. కానీ ఇప్పుడు ఆయన్ను చూస్తుంటే యోగ నిద్రలో ఉన్నట్లున్నారు. ఒక భీష్మాచార్యుడిలాగా కనిపించారు. ఆయన ఆశీస్సులు మన అందరికి ఉండాలి. తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో సినిమాలు తీయాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి - సాయికుమార్ ► దర్శకత్వపు ప్రాథమిక సూత్రాలు ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. ఆయన సినిమాలు మాలాంటి వాళ్లు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. కాబట్టి ఆయన ఎప్పుడూ సజీవంగానే ఉంటారు. పాతతరమే కాదు యువతరం కూడా ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి - గుణశేఖర్ ►కె. విశ్వనాథ్ గారు గొప్ప మనిషి. ఆయనతో పనిచేసిన రోజుల్ని మర్చిపోలేను. ఈమధ్యే ఆయన్ను కలిశాను. ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లిపోయింది. కానీ దానికి పునాదులు వేసింది మాత్రం కె. విశ్వనాథ్ గారే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి - సినీ నటి రాధిక ► ఒక తరం కదిలి వెళ్లిపోయినంత బాధగా ఉంది. అద్భుతమైన కళాఖండాలను చిత్ర పరిశ్రమకు అందించిన గొప్పవాళ్లలో కె. విశ్వనాథ్‌ది అగ్రతాంబూలం - పరచూరి గోపాలకృష్ణ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
K.Viswanath: ఆయన కళ అజరామరం- కమల్ హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్‌కు తెలుగులో స్టార్‌డమ్‌ను తీసుకొచ్చిన వ్యక్తి.. కళాతపస్వి కే. విశ్వనాథ్. వాళ్లిద్దరి మధ్య అనుబంధం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఆయన మృతిపై కమల్ ఎమోషనల్ అయ్యారు. కళాతపస్వి కె విశ్వనాథ్ గారు జీవిత పరమార్థాన్ని, కళ యొక్క అమరత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందువల్లే జీవితకాలం దాటినా.. ఆయన కళకు గుర్తింపు ఉంటూనే ఉంటుంది. ఆయన కళ అజరామరం. అమితమైన అభిమాని కమల్ హాసన్ అంటూ ట్వీట్ చేశారాయన. Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM — Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023 కిందటి ఏడాది హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో తన మాస్టర్ విశ్వనాథ్‌ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు కమల్. ఆ సమయంలో పాత విషయాలను గుర్తు చేసుకున్నట్లు కమల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాగర సంగమంతో మొదలైన వీళ్ల కాంబోలో.. స్వాతి ముత్యం, శుభ సంకల్పం లాంటి కల్ట్ క్లాసిక్లు వచ్చాయి. శుభ సంకల్పంతో పాటు కురుతిపునాల్(ద్రోహి), ఉత్తమ విలన్ చిత్రాల్లో కలిసి నటించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గురించి స్పందిస్తూ.. కమల్ హాసన్‌కు సినిమా గురించి అపారమైన నాలెడ్జ్ ఉంది. నటనలో, దర్శకత్వంలో అతనికి తెలియనిది అంటూ లేదు. అంత నాలెజ్డ్ ఉండడం తప్పు సినిమా రంగంలో అంటూ విశ్వనాథ్ చమత్కరించారు. అంతేకాకుండా..కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఎలాంటి నటన రాబట్టాలనే విషయాన్ని ఆలోచిస్తానన్నారాయన. K. Vishwanath Ji you taught me so much, being on set with you during Eeshwar was like being in a temple… RIP My Guru 🙏 pic.twitter.com/vmqfhbZORx — Anil Kapoor (@AnilKapoor) February 2, 2023 ఇక.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.. కే విశ్వనాథ్ మృతిపై ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. విశ్వనాథ్‌గారూ తనకెంతో నేర్పించారని, ఈశ్వర్ షూటింగ్ సందర్భంలో.. ఒక దేవాలయంలో ఉన్న అనుభూతి చెందానని ట్వీట్ చేశారు అనిల్ కపూర్. కమల్ హాసన్ ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని బాలీవుడ్లో ఈశ్వర్ పేరుతో రీమేక్ చేశారు విశ్వనాథ్. అందులో అనిల్ కపూర్, విజయశాంతి లీడ్ రోల్లో నటించారు. ఉత్తమ కథగా ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ కూడా అవార్డు దక్కింది. -
పాత రోజులు గుర్తొచ్చాయి.. విశ్వనాథ్ మెచ్చిన పాట
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. సినిమా పేరుకు తగ్గట్లే అచ్చమైన తేనెలొలికించే తెలుగు పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. వాసవసుహాస.. అంటూ సాగే పాటను కళా తపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా విడుదల చేశారు. కల్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్, కారుణ్య గాత్రం పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. వాసవసుహాస కమనసుధ.. ద్వారవతీతిరనాడ్వటీవసుధ.. అంటూ రమ్యంగా సాగుతుందీ పాట. ఈ పాటను విన్న విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాట చూస్తుంటే నా పాత రోజులు గుర్తొస్తున్నాయని, వినరో భాగ్యము విష్ణు కథ టైటిల్ కూడా చాలా బాగుందని ప్రశంసించారు. కాగా ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడుగా పరిచయం కానున్నాడు. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. చదవండి: ఐదేళ్లుగా నటి సీక్రెట్ లవ్.. బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే? కృష్ణం రాజు కోసమే కైకాల ఆ పనికి ఒప్పుకున్నారు: శ్యామలా దేవి -
శంకరాభరణం, సాగరసంగమం యుగాంతం వరకు నిలిచిపోతాయి!
సాక్షి, కొరుక్కుపేట(తమిళనాడు): తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ అని సీనియర్ నటుడు శరత్‌కుమార్ కొనియాడారు. తెలుగు కళావేదిక సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రచయిత్రి డాక్టర్ కోడూరు సుమనశ్రీ రచించిన సామవేదంలో సామాజిక సృహ (కళా తపస్వి జీవన చిత్ర ప్రస్థానం) పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. మైలాపూరులోని ఆంధ్ర మహిళా సభలో ప్రముఖ సాహితీవేత్త ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ సభాధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు శరత్‌బాబు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కె.విశ్వనాథ్ జీవిత విశేషాలతో పొందుపరిచిన ఈ పుస్తకం చదవటం మరపురాని అనుభూతిని కలిగించిందన్నారు. సంగీత సాహిత్యాలకు.. వెండితెర ద్వారా కె.విశ్వనాథ్ చేసిన కృషి అపారమన్నారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం వంటి చిత్రాలన్నీ యుగాంతం వరకు నిలిచి ఉంటాయని కొనియాడారు. అనంతరం విశిష్ట అతిథి ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ వేదాంతం రాధేశ్యాం మాట్లాడుతూ కూచిపూడి నాలుగు వేదాల సారాంశం అని, కళా తపస్వి తన చిత్రాల ద్వారా నిరూపించగలిగారని కొనియాడారు. ఆత్మీయ అతిథులుగా ప్రముఖ గాయని ఎస్పీ వసంత, సంగీత చక్రకర్త ఎల్.రమేష్ పాల్గొన్నారు. రచయిత్రి కోడూరు సుమనశ్రీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు రచించానన్నారు. తెలుగు భాషపై, కళలను జీవింపచేసిన విశ్వనాథ్ అంటే నాకు ఎంతో ఇష్టమని అన్నారు. సభా పరిచయాన్ని ఎల్.శ్రీదేవి చేయగా, అను సిస్టర్స్, చక్రవర్తి, రాముల గానార్చన, దుర్గ మంత్రవాది నాట్యార్చనతో అలరించారు. వందన సమర్పణను పి.చంద్రకళ చేశారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ -కె విశ్వనాథ్
-
కళా తపస్వి
-
సీతామాలక్ష్మి రైల్వేస్టేషన్
సాక్షి,చిత్తూరు : ‘సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం.. సీతామాలచ్చిమంటే... శ్రీలక్ష్మి అవతారం..’ అరే ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందే అన్పిస్తుంది కదూ..అవును ఇది సీతామాలక్ష్మి సినిమా పాట. పెద్ద తరం వారికి బాగా తెలుసు. 1978లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికీ ఈ పాట వింటే మనసు పులకరి స్తుంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కొట్టింది. కళాతపస్వి కె.విశ్వనా«థ్ దర్శకత్వంలో హీరో చంద్రమోహన్, హీరోయిన్గా తాళ్లూరి రామేశ్వరి నటించారు. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా..కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..’అనే పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఈ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలు కురబలకోట రైల్వేస్టేషన్లో తీశారు. వంకాయల సత్యనారాయణ స్టేషన్ మాస్టర్‌గా హీరో హీరోయిన్లపై ఈ పాట రసరమ్యంగా సాగింది. రైల్వేస్టేషన్లో అద్భుతంగా చిత్రీకరించారు. దీంతో అప్పటి నుంచి ఈ స్టేషన్‌ను సీతామాలక్ష్మి స్టేషన్‌గా వ్యవహరిస్తున్నా రు. ఆనాటి స్టేషన్ ఆధునీకరణలో రూపురేఖలు మారినా ఆ సినిమా ఊహలు మాత్రం ఇంకా చెక్కుచెదరలేదు. ఈ సినిమా టీవీలో వస్తే ఈ ప్రాంతంలో ఇంటిల్లిపాది కూర్చుని చూడటం పరిపాటిగా మారింది. -
ఇది తెలుగు జాతికి ఇచ్చిన పురస్కారం
హైదరాబాద్ : కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, దర్శకుడు కె. విశ్వనాథ్‌ను హైదరాబాద్‌లో కలిసి సత్కరించారు. చలన చిత్ర పరిశ్రమలో 6 దశాబ్దాలుగా ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించి, క్రమశిక్షణకు మారుపేరు అయిన విశ్వనాథ్‌ని కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడం ప్రతి తెలుగువారు గర్వంగా భావిస్తున్నారని కేతిరెడ్డి అన్నారు. ఈ అవార్డు తెలుగు జాతికి వచ్చిన అవార్డుగా ఆయన అభివర్ణించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన కళాతపస్వికి గతంలో ఎన్నో పురస్కారాలు దక్కాయని కేతిరెడ్డి అన్నారు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇవ్వడం తెలుగు వారందరికి దక్కిన గౌరవమని తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, మంచి సందేశాలు ఆయన చిత్రాల్లో ఉంటాయన్నారు. స్వయం కృషి, శుభలేఖ, జీవనజ్యోతి, సిరిసిరిమువ్వ, చిన్ననాటి స్నేహితులు లాంటి ఎన్నో చిత్రాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన కళాతపస్వి విశ్వనాథ్ భూమి, ఆకాశం ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. -
చాలా ఆనందంగా ఉంది: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: కళాతపస్వి కె.విశ్వనాథ్ దేశం గర్విందగ్గ సినిమాలు తీశారని జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరు విశ్వనాథ్ దంపతులను శాలువాతో సత్కరించారు. కళాతపస్వికి ఫాల్కే అవార్డు ప్రకటించడం తనకెంతో ఆనందం కలిగించిందని, ఇది ప్రతి తెలుగువాడికి గర్వకారణమని పవన్ అన్నారు. శంకరాభరణం చిత్రాన్ని చిన్నప్పుడు చాలాసార్లు చూశానని చెప్పారు. విశ్వనాథ్ సినిమాల్లో శుభలేఖ, శంకరాభరణం, స్వాతిముత్యం తనకు ఇష్టమన్నారు. స్వయంకృషి సినిమా షూటింగ్ చూసేందుకు చాలాసార్లు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ తీసిన చిత్రాలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యమని తివిక్రమ్ అన్నారు. ఆయన తీసిన 12 ఉత్తమ చిత్రాలతో ఒక డిస్క్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మంగళవారం విశ్వనాథ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో సినీ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆదిభిక్షువు వాడినేది కోరేది...
పాటతత్వం సిరివెన్నెల చిత్రం కోసం కె.విశ్వనాథ్ కోరిక మేరకు ‘విధాత తలపున ప్రభవించినది’ పాట రాశారు సీతారామశాస్త్రి. షూటింగ్ జరిగేటప్పుడు మేమంతా లొకేషన్‌కి వెళ్లేవాళ్లం. నందిహిల్స్‌లో షూటింగ్ జరుగుతుండగా, ఒకసారి నేను, సీతారామశాస్త్రి కలిసి శివాలయానికి వెళ్లాం. అక్కడ దర్శనం పూర్తి చేసుకుని, వెనుకకు వస్తుండగా, ‘నాకు మంచి పాట వస్తోంది’ అంటూ ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది... బూడిదిచ్చేవాడినేది అడిగేది...’ అంటూ పాట వినిపించాడు. పాట వినగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఆ పాటను సినిమా కోసం రాయలేదు. తన ఆనందం కోసం రాసుకున్నారు. పాటను పూర్తిగా విన్నాక, విశ్వనాథ్‌గారికి వినిపించాను. పాట వినడం, ఓకే చేయడం వెంటనే జరిగిపోయాయి. ఈ పాటను రాజస్థాన్‌లోని బ్రహ్మ దేవాలయంలో చిత్రీకరించారు. ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది... అనే పల్లవితో ప్రారంభమైన ఈ పాట నిందాస్తుతిలో సాగింది. బూడిదిచ్చేవాడు అంటే సర్వసంపదలు ఇచ్చేవాడని మరో అర్థం ఉంది. అడగకుండానే అన్నీ ఇచ్చేవాడిని ఇంకేమీ కావాలని అడగక్కర్లేదని నిందిస్తూనే స్తుతించాడు పల్లవిలో. చరణం – 1 తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేదిఎంతో మధురంగా గానం చేసే కోయిలమ్మకు నల్లని రంగునిచ్చాడు ఆ మహాశివుడు. కరకుగా గర్జించే మేఘాలకు మాత్రం తెల్లని రంగును హంగుగా కూర్చాడు. అటువంటి వాడిని ఏమివ్వమని అడగాలి అంటూ నిందిస్తాడు. ప్రతివారిలోనూ చూడవలసింది అంతఃసౌందర్యమే కాని బాహ్య సౌందర్యం కాదు అని స్తుతిస్తూ చెబుతాడు. నల్లగా ఉన్న కోయిల ఎంతో తీయగా గానం చేస్తుంది. తెల్లగా ఉన్న మేఘం భీకరంగా గర్జిస్తుంది. కాని అందరూ కోయిలనే ఇష్టపడతారు. ఆ గానమాధుర్యాన్ని ఆస్వాదిస్తారు... అనే అంతరార్థాన్ని స్ఫురింపచేస్తాడు. చరణం – 2 తేనెలొలికే పూలబాలలకు మూణ్నాళ్ల ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్లను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఈ చరణంలో... పువ్వులు ఎంతో సుకుమారంగా ఉంటాయి. తేనెను స్రవిస్తాయి. అటువంటి పూలకు మూడునాలుగు రోజుల ఆయుష్షు మాత్రమే ఇచ్చాడు. కాని బండరాళ్లను మాత్రం చిరకాలం జీవించమన్నాడు. అటువంటివాడిని ఏమడగాలి అని నిందించాడు. అందులోనే కాకిలా కలకాలం జీవించడం కంటె, హంసలా ఆరు నెలలు జీవించినా చాలు అనే విషయాన్ని పరోక్షంగా స్తుతించాడు. చరణం – 3 గిరిబాలతో తనకు కల్యాణమొనరింప దరిజేరు మన్మ«థుని మసి చేసినాడు... వాడినేది కోరేదివర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు... వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు మూడవ చరణంలో... పార్వతిని తనకిచ్చి వివాహం చేయాలనే సత్సంకల్పంతో వచ్చిన మన్మథుడిని బూడిద చేశాడు. సాక్షాత్తు ఆ పరమశివుడు ఇచ్చిన వరగర్వంతో లోకాలను పీడిస్తున్న రాక్షసులను మాత్రం కరుణించాడు. ముఖస్తుతులు కోరే ఆ శంకరుడిని ఏమి కోరుకుంటాం. అసలే ఆయన ముక్కోపి, ముక్కంటి... అంటూ నిందించాడు. మన్మధుడిని మసి చేసి, మళ్లీ ప్రాణం పోశాడు. రాక్షసులకు వరం ఇచ్చాడు, ఆ తరువాత అంతం చేశాడు. ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో ఆయనకు తెలుసు అని అంతర్లీనంగా స్తుతించాడు. నిందాస్తుతిలో సాగిన ప్రత్యేకమైన పాట, సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గా చేసిన పాట. ఆకెళ్ల సినీ రచయిత – డా. వైజయంతి -
కార్మికుల జీవితాలతో చెలగాటమాడొద్దు
- జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం హైదరాబాద్: సింగరేణి కార్మికుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడవద్దని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం హెచ్చరించారు. ఆదివారం ఓయూ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ ఆడిటోరియంలో ఐఎఫ్టీయూ అనుబంధ సంఘం సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఎస్సీసీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్ అధ్యక్షత వహించగా ప్రొ.కోదండరాం ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు వ్యవస్థతో కార్మికులు తమ హక్కులను నష్టపోతున్నారన్నారు. సింగరేణి కాలరీస్ దివాళాకు గత ప్రభుత్వాలే కారణమని, ఇకనైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకుడు ఎం.శ్రీనివాస్, ఎండీ రాసొద్దీన్, కొండపర్తి శంకర్‌లతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
'ధ్రువతార రాలిపోయింది'
హైదరాబాద్: ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ మరణంతో ధ్రువతార రాలిపోయిందని కళాతపస్వి కె. విశ్వనాథ్ అన్నారు. ఆయన మరణం గ్రేటెస్ట్ షాక్ అని వ్యాఖ్యానించారు. తమలాంటి వారందరికీ ఆయన టెక్ట్ బుక్ లాంటి వారని పేర్కొన్నారు. ఆయన దగ్గర వారం రోజులు పనిచేస్తానని బాలచందర్ ను అడిగానని వెల్లడించారు. ఆయన దగ్గర పనిచేసే అవకాశం రాకపోయినా తెర పంచుకునే భాగ్యం దక్కిందన్నారు. ఉత్తమ్ విలన్ సినిమాలో ఆయనతో కలిసి నటించానని గుర్తు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే కుతూహలం, ఎవరిచేతైనా నటింపచేయగల సామర్థ్యం ఆయన సొంతమన్నారు. అనారోగ్యం బారిన పడిన ఆయన క్రమంగా కోలుకుంటున్నారని అనుకున్నామని, కానీ ఇంతలోనే ఆయన వెళ్లిపోయారని విశ్వనాథ్ వాపోయారు. -
ఇవాళ్టికీ అదే తపన... అతనికి అదే శ్రీరామరక్ష!
ఒకరు అద్భుతమైన నటుడు... మరొకరు అంకితభావం ఉన్న నటి... వేరొకరు తెలుగు సినిమా దారేది అని చాలామంది వాపోతున్న తరుణంలో తళుక్కుమన్న రచయిత - దర్శకుడు. ముగ్గురివీ మూడు వేర్వేరు మార్గాలు... మూడు వేర్వేరు మనస్తత్వాలు... కానీ, ఇవాళ సినీ రంగం సగర్వంగా చెప్పుకొనే స్థాయి కృషి ఈ ముగ్గురి సొంతం. కమలహాసన్, అనుష్క, త్రివిక్రమ్ - ఈ ముగ్గురి పుట్టినరోజూ చిత్రంగా ఒకటే... నవంబర్ 7. సినిమాల్లోనే కాదు... బయటా జనం తలెత్తి చూసే ఈ ముగ్గురి గురించి... వారిని సన్నిహితంగా చూసిన మరో ముగ్గురు దిగ్గజాలు మనసు కిటికీ తెరిచి ‘సాక్షి’తో పంచు కుంటున్న అను భవాలు, అను భూతులు ఇవాళ్టి ఫ్యామిలీ గిఫ్ట్. - ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్ అప్పుడే కమలహాసన్‌కు అరవై ఏళ్ళు నిండాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇవాళ్టికీ అతనిలోని ఉత్సాహం, ఉద్వేగం చూస్తుంటే, అతనికి అంత వయసుందని అనిపించదు. దర్శకుడిగా కమలహాసన్‌తో నేను తీసిన చిత్రాలు మూడే! మా మొదటి సినిమా ‘సాగర సంగమం’. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారి వద్ద కమల్ డేట్లున్నాయి కాబట్టి, అతణ్ణి దృష్టిలో పెట్టుకొనే ‘సాగరసంగమం’ కథ అల్లుకొన్నా. బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించిన కమల్ పెద్దయ్యాక కొన్నాళ్ళు డ్యాన్స్‌మాస్టర్ తంగప్పన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ‘సాగర సంగమం’లోని బాలు పాత్రను రాసుకున్నాను. కొన్ని ఘట్టాల్లో అతను చూపిన నటన ఇవాళ్టికీ చూస్తుంటే, ‘తీసింది నేనేనా, చేసింది అతనేనా’ అనిపిస్తుంటుంది. ఇన్నేళ్ళ తన కెరీర్లో అత్యుత్తమమైన 10 చిత్రాల జాబితా వేస్తే, అందులో ‘సాగర సంగమం’ ఒకటని కమల్ పదే పదే ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అన్ని భావోద్వేగాలూ ఉన్న ఆ చిత్ర రూపకల్పన ఇవాళ్టికీ ఓ తీపి గుర్తు. ఏది చేసినా అందులో ప్రత్యేకత, పర్ఫెక్షన్ ఉండాలని కమల్ భావిస్తాడు. దాని కోసం ప్రతి సన్నివేశంలో, సందర్భంలో ప్రయత్నిస్తాడు. సరిగ్గా అలాంటి తపనతో సినిమాలు తీసే మా లాంటి దర్శకులకు అతను బాగా ఉపయోగపడతాడు. అతను ఎంత ప్రొఫెషనల్ అంటే, దర్శకుడు ఆశించినది ఇచ్చే వరకు, చాలాసార్లు అంతకు మించి ఇచ్చేవరకు రాజీ పడడు. షాట్ తీస్తున్నప్పుడు మన రియాక్షన్లో ఏదైనా తేడా ఉన్నా, మనం సరేనని కట్ చెప్పడం ఒక్క సెకన్ ఆలస్యమైనా చటుక్కున గ్రహించేస్తాడు. ఆశించినంత తృప్తిగా రాలేదని గ్రహించి, మళ్ళీ చేయడానికి సిద్ధపడతాడు. అంత సునిశితమైన గ్రహణశక్తి అతనిది. మనం ఎదైనా చెబితే సహృదయంతో తీసుకుంటాడు. చాలామంది లాగా అహంభావానికి పోడు. అతనిలో కళాతృష్ణ ఇవాళ్టికీ తీరలేదు.తీరని దాహంతో ఆయన నిరంతరం కొత్త పాత్రలు, కథల కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. అందుకే, అప్పటి ‘పుష్పక విమానం’ మొదలు ఇటీవలి ‘దశావతారం’ దాకా రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అలాంటి కథలు, పాత్రలతో ఎవరు వచ్చినా ధైర్యంగా ముందుకు వస్తాడు. ‘నీ పాత్ర గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడి పాత్ర. కానీ, దురదృష్టవశాత్తూ రెండు కాళ్ళూ లేవు’ అని ఒక లైన్ చెప్పామనుకోండి. వెంటనే, సవాలుగా నిలిచే ఆ పాత్ర పోషించడానికి సిద్ధమైపోతాడు. పెపైచ్చు, చాలామందిలా అతనిది ఆరంభ శూరత్వం కాదు. సవాలుగా నిలిచే చిత్ర నిర్మాణాన్నో, పాత్రనో తీసుకున్న తరువాత చివరిదాకా అదే తపనను నిలుపుకొంటూ, పూర్తి చేస్తాడు. ఎక్కడా రాజీ పడడు. ఒక్కమాటలో చెప్పాలంటే, దర్శకుల నటుడు - కమల్. ఒక పాత్రను ఎలా మలుచుకోవాలనుకున్నా సరే, నటుడిగా అతణ్ణి ఎంచుకోవచ్చు. దర్శకుడు నిశ్చింతగా కళ్ళు మూసుకొని పాత్రను అతని చేతుల్లో పెట్టవచ్చు. తీసుకున్న పాత్రలోకి ఇమిడిపోవడానికి ఏవేం కావాలో అవన్నీ కమల్ సమకూర్చుకుంటాడు. ఆ పాత్రను పండించడం కోసం హోమ్‌వర్క్ చేస్తాడు. మొదటి రోజుల నుంచి ఇప్పటికీ అతని పద్ధతి అదే! అలాగే, షూటింగ్ జరుగుతుండగా అక్కడికక్కడ, అప్పటికప్పుడు బుర్రలో తళుక్కున మెరిసిన ఆలోచనను అమలు చేసేసి, సన్నివేశం అద్భుతంగా రావడానికి సహకరించే అరుదైన లక్షణం కమల్‌కు ఉంది. ఉదాహరణకు, ‘సాగర సంగమం’లో జయప్రదతో కలసి ఆలిండియా డ్యాన్స్ ఫెస్టివల్ ఆహ్వానపత్రిక చూసే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ఆ షాట్ చివరలో నాకేదో అనిపించి, ‘కమల్! ఒక్కసారిగా నవ్వేసెయ్’ అని పక్క నుంచి అరిచా. చాలామంది ఆర్టిస్టులు అలాంటి సందర్భాల్లో గందరగోళపడతారు. ‘కట్’ చెప్పారనుకుంటారు. కానీ, క్షణంలో వెయ్యోవంతులో కమల్ నా మాట గ్రహించి, అప్పడికప్పుడు నవ్వును జత చేర్చి, తన నట ప్రతిభతో ఆ సీన్‌ను పండించాడు. ‘దర్శకుడి భావం ఇదై ఉంటుంది, ఇలా చేయాలన్న’ సిక్స్త్సెన్స్ అతనికి బాగా పనిచేస్తుంది. ఇవాళ ఇంత పెద్ద స్టార్‌గా ఎదిగినప్పటికీ, ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న తపన ఉంది. అదే అతనికి శ్రీరామరక్ష. ‘శుభసంకల్పం’ చిత్రం అయిపోయిన తరువాత తమిళులకు పెద్ద పండుగ దీపావళికి అతను స్వయంగా మా ఇంటికి వచ్చి, మా దంపతులిద్దరికీ కొత్త బట్టలు పెట్టి, నమస్కారం చేసి వెళ్ళిన సంఘటన నాకిప్పటికీ గుర్తు. ఇవాళ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, అదే భక్తి, గౌరవంతో ఉండడం అతని సంస్కారం. ఇక, సినీ జీవిత గురువు కె. బాలచందర్ అంటే భక్తి గౌరవాలే కాక, చనువు కూడా! ఇప్పటికీ తన కష్టసుఖాలన్నీ ఆయనతో మనసు విప్పి చెప్పుకుంటాడు. నన్ను బలవంతాన ఒప్పించి, నటుణ్ణి చేసింది కమలహాసన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాలే. వాళ్ళిద్దరూ పట్టుబట్టి, ‘శుభసంకల్పం’లో తొలిసారిగా నన్ను నటింపజేశారు. ఆ సినిమా అయిపోయాక కూడా, ‘ఇక్కడితో ఆపవద్దు. నటన కొనసాగించండి’ అని నాకు సలహా ఇచ్చింది కూడా కమలే! అలా నా రెండో ఇన్నింగ్స్ నటుడిగా మొదలై తాజా ‘ఉత్తమ విలన్’, రజనీకాంత్ ‘లింగా’ వరకు కొనసాగుతోంది. కమల్లో వెర్సటాలిటీ ఉంది. వినోదింపజేయగలడు. అంతే గొప్పగా విషాదమూ పలికించగలడు. ఇవాళ, దక్షిణభారతావని నుంచి వచ్చిన అత్యుత్తమ సినీ ప్రతిభాసంపన్నుల్లో అతను ఒకడని నిస్సందేహంగా చెప్పవచ్చు. అతను పుస్తకాలు బాగా చదువుతాడు. బాగా రాస్తాడు కూడా! తమిళంలో కొన్ని పాటలు అతనే రాశాడు. ఇక, సినిమాల్లో డైలాగులైతే, పేరుకు వేరొక డైలాగ్ రైటర్ ఉన్నా, కమల్ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందట! విభిన్నమైన కథాంశాలతో స్వయంగా చిత్రాలు నిర్మిస్తుంటాడు. ఇన్ని లక్షణాలున్న అతను దర్శకుడిగా కూడా వ్యవహరించడం పెద్ద విశేషమేమీ కాదు. అయితే, నేరుగా అతని దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పటి దాకా రాలేదు. టీవీ, చలనచిత్రోత్సవాలు, ప్రపంచ సినిమా గురించి అతనికి ఉన్న అవగాహన కూడా చాలా ఎక్కువ. అందుకే, ఎప్పుడైనా వాటి ప్రస్తావన వచ్చి, మాట్లాడితే - అన్నీ పూసగుచ్చినట్లు చెబుతాడు. అలాంటి వ్యక్తికి తాజా సినీ సాంకేతిక పరిజ్ఞానం క్షుణ్ణంగా తెలిసుండడంలో ఆశ్చర్యం లేదు. ఒక్కమాటలో, ఇటు సృజనాత్మక అంశాల్లోనూ, అటు సాంకేతికంగానూ అతను దిట్ట. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక అంశాలూ గొప్పగా మాట్లాడతాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా - ఇంత సాధించిన వ్యక్తికి ఇవాళ మా లాంటి వాళ్ళం కొత్త కథ, పాత్ర రూపకల్పన చేయడం కూడా కష్టమే. నిజం చెప్పాలంటే, అతని ఇమేజ్ ఇవాళ మాబోటి వాళ్ళకు అందకుండా వెళ్ళిపోయింది. ‘దశావతారం’, ‘విశ్వరూపం’ లాంటి స్థాయి ప్రయోగాలు తాజాగా చేసిన నటుడికి ఎలాంటి పాత్ర రాయాలన్నది పెద్ద సవాలే. అందుకే, ‘ఇప్పుడు నీకు తగ్గ కథ రాయడం కష్టం’ అని నవ్వుతూ అంటూ ఉంటా. అయితే, ‘నందనార్’, ‘రామానుజాచారి’ లాంటి చారిత్రక ప్రసిద్ధమైన పాత్రలకు అతను చక్కగా సరిపోతాడు. అలాంటి పాత్రలు చేయడం అతనికిష్టం కూడా! ఆ ప్రయోగాలు కూడా అతను చేస్తే, ఒక సినీ ప్రియుడిగా చూడాలని ఉంది. ఎప్పుడూ బద్ధకించకుండా, మనసులో ఏదో ఆలోచిస్తూ, కొత్తదనం కోసం అన్వేషించే కమల్‌ది మన సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అతని కన్నా వయసులో పెద్దవాణ్ణి కాబట్టి, అతనికి ఈ షష్టిపూర్తి క్షణంలో చెప్పేదొక్కటే - ‘‘శతమానం భవతి.’’ -
కార్డులిచ్చాం.. వైద్యం చేరుుస్తాం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ‘ఆరోగ్య రక్ష.. అందని ద్రాక్ష’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సర్వశిక్షాభియూన్ ప్రాజెక్ట్ అధికారి కె.విశ్వనాథ్, డీఎంహెచ్‌వో కె.శంకరరావు స్పందించారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం కింద విద్యార్థులందరికీ ఆరోగ్య రక్ష కార్డులు ఇచ్చామని, త్వరలోనే వైద్య పరీక్షలు జరిపించి మందులు ఇచ్చేందుకు, అవసరమైతే మెరుగైన వైద్యం చేరుుంచేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని శుక్రవారం విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు 3.96 లక్షల మంది ఉన్నారని, సర్వశిక్షాభియాన్, విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం వారందరి కోసం ఆరోగ్య రక్ష కార్డులను పాఠశాలలకు పంపించామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమాలు, బంద్‌ల కారణంగా గత ఏడాది ఈ పథకం అమలుపై పర్యవేక్షణ చేయలేకపోరుునట్టు వివరణ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, సర్వశిక్షాభియాన్ సమన్వయంతో సమగ్ర ప్రణాళికను రూపొందించామని తెలిపారు. దీనికోసం నియమించిన కమిటీ సమావేశాలను జూన్ 30న, జూలై 7న రెండు శాఖల సమన్వయంతో నిర్వహించామని పేర్కొన్నారు. పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే సూచనలు ఇచ్చామన్నారు. జూన్ 12న పాఠశాలల్ని తెరిచినప్పటికీ వేసవి తీవ్రత కారణంగా ఆరోగ్య రక్ష కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించలేకపోయామన్నారు. ఇకపై పూర్తిస్ధాయిలో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.