సింగరేణి కార్మికుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడవద్దని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం హెచ్చరించారు.
- జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం
హైదరాబాద్: సింగరేణి కార్మికుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడవద్దని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం హెచ్చరించారు. ఆదివారం ఓయూ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ ఆడిటోరియంలో ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘం సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఎస్‌సీసీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్ అధ్యక్షత వహించగా ప్రొ.కోదండరాం ప్రారంభ ఉపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు వ్యవస్థతో కార్మికులు తమ హక్కులను నష్టపోతున్నారన్నారు. సింగరేణి కాలరీస్ దివాళాకు గత ప్రభుత్వాలే కారణమని, ఇకనైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకుడు ఎం.శ్రీనివాస్, ఎండీ రాసొద్దీన్, కొండపర్తి శంకర్‌లతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.