
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరుగుతోంది. ఆరు అంగుళాల పైప్‌లైన్ ద్వారా కూలీలకు ఆహార పదార్థాలు, మందులను పంపిణీ చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న బాధితులకు లోపల రెండు కిలోమీటర్ల మేర సురక్షిత ప్రాంతం ఉంది. మరో రెండు రోజుల్లో కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని రెస్క్యూ నిర్వహిస్తున్న అధికారులు చెబుతున్నారు.
బార్కోట్ ఎండ్ నుండి రెస్క్యూ టన్నెల్ నిర్మాణాన్ని టీహెచ్‌డీసీ ప్రారంభించిందని, ఇందులో ఇప్పటికే రెండు పేలుళ్లు జరిగాయని, ఫలితంగా 6.4 మీటర్ల డ్రిఫ్ట్ ఏర్పడిందని జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) ఎండీ మహమూద్ అహ్మద్ తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో సంప్రదింపులు జరిపామని, వీడియో ద్వారా వారి పరిస్థితిని తెలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
సొరంగంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ లక్ష్యమని ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ నీరజ్ ఖైర్వాల్ తెలిపారు. అన్ని ఏజెన్సీలు 24 గంటలు సంఘటనా స్థలంలో పని చేస్తున్నాయన్నారు. పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అన్ని సంస్థలు/ఏజెన్సీలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. పది కిలోల కిలోల యాపిల్స్, ఆరెంజ్, సీజనల్ పండ్లు, ఐదు డజన్ల అరటిపండ్లను సొరంగం లోపలికి పంపించామన్నారు.
ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల ఫొటోలను ఎండోస్కోపిక్ కెమెరా ఎలా తీసింది?
Comments
Please login to add a commentAdd a comment