
photo courtesy : hindustan times
రిషికేష్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదం నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నారని రిషికేష్ ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. వాళ్లు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇళ్లకు వెళ్లిపోవచ్చని చెప్పారు.
టన్నెల్ నుంచి బయటపడ్డ తర్వాత 41 మంది కార్మికులను చికిత్స నిమిత్తం రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. 41 మందిలో యూపీ, జార్ఖండ్, బీహార్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ‘టన్నెల్ నుంచి బయటికి వచ్చిన కార్మికులందరికీ ఇళ్లకు వెళ్లేందుకు మెడికల్ క్లియరెన్స్ ఇచ్చాం. వారంతా వారి రాష్ట్రాల నోడల్ ఆఫీసర్‌లకు టచ్‌లో ఉంటారు. ఈ మేరకు నోడల్ అధికారులకు సమాచారమిచ్చాం’అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు.
ఉత్తరకాశీలో చార్‌దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద నిర్మిస్తున్న టన్నెల్‌లో కొంత భాగం నవంబర్ 12న కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయి 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు.
ఇదీచదవండి...రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి