AIIMS Director
-
ఏచూరి పార్థివదేహంను ప్రజా సేవకు అంకితం
-
నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
నిజ జీవితంలోని కొన్ని ఘటనలు సినిమా సీన్లను తలపిస్తాయి. ఇటువంటి ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ వీడియో ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్కు సంబంధించినది. ఈ వీడియోలో ఆసుపత్రిలోకి పోలీసుల వాహనం దూసుకువెళ్లడం కనిపిస్తుంది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తమవాహనంతో సహా ఆసుపత్రిలోనికి దూసుకువచ్చారు. ఆ నిందితుడు అదే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలిని వేధించాడని పోలీసులకు ఫిర్యాదు అందించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆసుపత్రిలోకి వాహనంతో సహా వచ్చిన పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేసి, అదే వాహనంలో తీసుకువెళ్లారు.దీనికి ముందు ఆ నిందితుని చర్యను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది డీన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి, నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆస్పత్రికి తమ వాహనంలో చేరుకున్నారు. ఈ సమయంలో వారు సినిమా తరహాలో వాహనంతో సహా ఆసుపత్రిలోనికి వచ్చి, నిందితుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఇంతకీ పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు వాహనంతో సహా లోనికి ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.The cops drove their car inside AIIMS Rishikesh.pic.twitter.com/rZDkCvHipM— Divya Gandotra Tandon (@divya_gandotra) May 22, 2024 -
ఉత్తర కాశీ టన్నెల్ వర్కర్స్ ఆరోగ్యంపై ఎయిమ్స్ కీలక అప్డేట్
రిషికేష్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదం నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నారని రిషికేష్ ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. వాళ్లు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇళ్లకు వెళ్లిపోవచ్చని చెప్పారు. టన్నెల్ నుంచి బయటపడ్డ తర్వాత 41 మంది కార్మికులను చికిత్స నిమిత్తం రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. 41 మందిలో యూపీ, జార్ఖండ్, బీహార్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ‘టన్నెల్ నుంచి బయటికి వచ్చిన కార్మికులందరికీ ఇళ్లకు వెళ్లేందుకు మెడికల్ క్లియరెన్స్ ఇచ్చాం. వారంతా వారి రాష్ట్రాల నోడల్ ఆఫీసర్లకు టచ్‌లో ఉంటారు. ఈ మేరకు నోడల్ అధికారులకు సమాచారమిచ్చాం’అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఉత్తరకాశీలో చార్దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద నిర్మిస్తున్న టన్నెల్లో కొంత భాగం నవంబర్ 12న కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయి 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. ఇదీచదవండి...రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి -
రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు
ఉత్తరకాశీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు బుధవారం తరలించారు. అక్కడ కార్మికులకు అన్ని రకాల మెడికల్ చెకప్‌లను నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చినూక్ హెలికాఫ్టర్‌లో 41 మంది కార్మికులను రిషికేశ్కు తరలించారు. గత 17 రోజులుగా సొరంగంలోనే చిక్కుకున్న నేపథ్యంలో కార్మికులకు ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకాయా? అని వైద్యులు పరీక్షించనున్నారు. #WATCH | Uttarkashi tunnel rescue | IAF's transport aircraft Chinook, carrying 41 rescued workers, arrives in Rishikesh. It has been flown to AIIMS Rishikesh from Chinyalisaur for the workers' further medical examination.#Uttarakhand pic.twitter.com/hrWm1dlxsM — ANI (@ANI) November 29, 2023 కార్మికులను సొరంగం నుంచి రక్షించిన తర్వాత స్థానికంగా ఉన్న చిన్యాలిసౌర్ ఆస్పత్రికి కార్మికులను తరలించారు. బుధవారం తెల్లవారుజామున, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా కార్మికులను కలిశారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. తదుపరి పరీక్షల కోసం ఎయిమ్స్‌కు తరలిస్తామని వెల్లడించారు. #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami meets and enquires about the health of rescued tunnel workers at Chinyalisaur Community Health Centre, also hands over relief cheques to them pic.twitter.com/fAT6OsF4DU — ANI (@ANI) November 29, 2023 కార్మికులను రక్షించడానికి కీలక సహాయం అందించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను కూడా పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. వారికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్దిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం కార్మికుల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. #WATCH | Matli: Uttarakhand CM Pushkar Singh Dhami meets the ITBP personnel involved in the Uttarkashi Silkyara tunnel rescue. pic.twitter.com/tVlklz4FOl — ANI (@ANI) November 29, 2023 నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. ఇదీ చదవండి:41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్నచీరతో’..
అది 1984, అక్టోబరు 31.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఎవరూ ఊహించని విధంగా ఒక ఘటన చోటుచేసుకుంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీని రక్తమోడుతున్న స్థితిలో బుల్లెట్ గాయాలతో ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆ పరిస్థితిని మాటల్లో వర్ణించడం కష్టం. ఆసుపత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. నాటి ప్రధాని ఇందిరా గాంధీకి శస్త్ర చికిత్స చేసి, ఆమె శరీరం నుంచి బుల్లెట్లు వెలికితీసిన డాక్టర్ పి వేణుగోపాల్ నాటి ఆ భయంకరమైన రోజును ఇప్పటికీ మరిచిపోలేదు. ఆరోజు ఇందిరాగాంధీ ప్రాణాలు కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యులు, సర్జన్లు,నర్సింగ్ సిబ్బంది నాలుగు గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేశారని నాటి తన జ్ఞాపకాల దొంతరలోని వివరాలను వెల్లడించారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ పుస్తకంలో.. వేణుగోపాల్ ఆ రోజల్లో ఎయిమ్స్ కార్డియాక్ సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1994 ఆగస్టులో భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడిని నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. ఇటీవల ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ రాసిన పుస్తకం విడుదలైంది. రక్తంతో తడిసిన ఆమె చీరలోంచి నేలపైకి జారి పడిన బుల్లెట్లు, రక్తమార్పిడి, తదుపరి ప్రధాని ప్రమాణ స్వీకారంపై ఆసుపత్రి కారిడార్‌లో జరిగిన రాజకీయ చర్చ... ఇవన్నీ 39 ఏళ్ల తర్వాత కూడా నాకు స్పష్టంగా గుర్తున్నాయని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇందిరాగాంధీ శరీరం చుట్టూ రక్తపు మడుగు మంచం మీద కదలలేని స్థితిలో ఉన్న ఇందారాగాంధీని చూసి తాను చలించిపోయానని ఆయన ఆ పుస్తకంలో రాశారు. ఆ సమయంలో ఆమె కడుపులో నుంచి రక్తం కారుతోంది. ఆమె శరీరం రక్తంతో పూర్తిగా తడిసిపోయింది. మొహం పాలిపోయింది. శరీరంలోని రక్తం అంతా వేగంగా బయటకు ఉబికివచ్చింది. అక్కడ రక్తపు మడుగు ఏర్పడింది. ఇందిరాగాంధీని ఆమె నివాసంలోని లాన్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు హత్య చేశారు. దుండగులు ఆమెపై 33 బుల్లెట్లు కాల్చారు. వాటిలో 30 ఆమెను తాకాయి. 23 బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయి. ఏడు బుల్లెట్లు మరింత లోపలికి దూసుకెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’ ఆసుపత్రిలో ఎవరికీ ఏమీ అర్థం కాని వాతావరణం.. వేణుగోపాల్ (81) ఆ పుస్తకంలో నాటి వివరాలను తెలియజేస్తూ ఇందిరా గాంధీకి ఓ-నెగటివ్ రక్తం అవసరమయ్యింది. ఆ రక్తం వెంటనే లభించలేదు. ఆసుపత్రిలో ఎవరికీ ఏమీ అర్థం కాని వాతావరణం నెలకొంది. ఎయిమ్స్ సిబ్బంది అక్కడకి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదే రోజు డైరెక్టర్‌గా తన బాధ్యతలకు వీడ్కోలు చెబుతున్న టాండన్.. బాధ్యతలు స్వీకరించబోతున్న డాక్టర్ స్నేహ భార్గవ.. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఏం చెయ్యాలా? అనే సందేహంతో నా వైపు చూశారు. కార్డియాక్ సర్జరీ విభాగం అధిపతిగా నేను వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రక్తస్రావం ఆపడానికి నేను ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లాలని ఆదేశించాను. ముందుగా ఇందిరాగాంధీ శరీరం నుంచి కారుతున్న రక్తస్రావాన్ని బైపాస్ మిషన్ సహాయంతో ఆపాలన్నది నా ప్లాన్. ఇందుకోసం నాలుగు గంటల పాటు వైద్యసిబ్బంది అంతా పోరాడారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇందిరా గాంధీ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ వార్త బయటివారికి ఎంతో నిస్సహాయ స్థితిలో తెలియజేశాను. దేశంలోని తూర్పు ప్రాంతంలో పర్యటిస్తున్న రాజీవ్ గాంధీ ఎయిమ్స్‌కు వస్తున్నారని, ఆయన రాక కోసం వేచి చూడాలని సిబ్బంది అభిప్రాయపడ్డారు. ‘అదే జరిగివుంటే బతికేవారు’ దేశంలో 50,000 గుండె శస్త్రచికిత్సలు చేసిన వేణుగోపాల్ ఆ పుస్తకంలో మరో కీలక విషయం రాశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదటి బుల్లెట్ తగిలిన వెంటనే కిందపడిపోయారని, ఆమెతో పాటు ఉన్నవారు ఆమెను నేలపై ఒంటరిగా వదిలి, వెనక్కి పరిగెత్తారని తనకు తెలిసిందని, వారు అలా చేయకుండా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించివుంటే ఆమె బతికేవారని వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే ఆమెతో పాటు ఉన్నవారు అక్కడి నుంచి పారిపోవడం హంతకుడిలో ధైర్యాన్ని నింపిందని, ఫలితంగానే అతను తన మెషిన్ గన్ నుండి పలు రౌండ్ల బుల్లెట్లను కాల్చగలిగాడని వేణుగోపాల్ ఆపుస్తకంలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు -
AIIMS డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా ఇంటర్వ్యూ
-
బీపీ, షుగర్ రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త
-
లాలూ ప్రసాద్ హెల్త్ కండీషన్ సీరియస్.. టెన్షన్లో తేజస్వీ యాదవ్!
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. మంగళవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని రిమ్స్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఈరోజు ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం సడెన్‌గా మళ్లీ లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్టు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు తెలిపారు. తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. లాలూ జీ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. మంగళవారం రాంచీలో చికిత్స పొందుతున్న సమయంలో ఇన్ఫెక్షన్ స్థాయి 4.5 గా ఉందని.. అనంతరం ఢిల్లీలో పరీక్షించినప్పడు అది 5.1కు పెరిగిందని తెలిపారు. తాజాగా బుధవారం మధ్యాహ్నం పరీక్షించినప్పడు ఇన్ఫెక్షన్ స్థాయి 5.9కు చేరుకుందని వెల్లడించారు. మరోవైపు.. దాణా కుంభకోణం, డోరండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయలను అపహరించిన కేసులో ఇటీవలే ప్రత్యేక సీబీఐ కోర్టు.. లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానాను విధించింది. దీంతో ఆయనను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రిమ్స్‌కు తరలించారు. Lalu Prasad Yadav Ji is undergoing treatment in AIIMS, Delhi. His creatinine level was 4.5 when he was in Ranchi. It increased to 5.1 when it was tested in Delhi. It reached 5.9 when tested again. So the infection is increasing: Tejashwi Yadav, RJD leader and son of Lalu Yadav pic.twitter.com/f1iMxN1vdX — ANI (@ANI) March 23, 2022 -
‘ఎన్ని కోవిడ్ వేవ్‌లు వచ్చినా పర్లేదు.. అయితే, అవి మాత్రం మరవొద్దు’
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఇకపై ఎన్ని వేవ్‌లు వచ్చినా మన దేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదని చెబుతున్నారు. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో పెరిగిన నిరోధక శక్తి వల్ల ఇకపై వచ్చే వేవ్‌లు ప్రభావం చూపలేవని ఎయిమ్స్ ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు. ‘‘కరోనాలో ఇప్పటికే వెయ్యికి పైగా మ్యుటేషన్లు జరిగాయి. వాటిలో ఐదు వేరియెంట్లే ఎక్కువ ప్రభావం చూపాయి. కరోనా రెండో వేవ్ భారత్‌లో తీవ్ర ప్రభావం చూపినా డెల్టా వేరియెంట్ వల్ల అత్యధికుల్లో ఏర్పడ్డ రోగనిరోధక శక్తి ఇకపై వచ్చే వేవ్‌ల నుంచి కాపాడుతుంది’’ అన్నారు. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ జుగల్ కిశోర్ చెప్పారు. కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి తగ్గింపు కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించారు. తొలి డోసు తర్వాత 8 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవడానికి అనుమతిస్తూ నీతి అయోగ్ (ఇమ్యూనైజేషన్) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 12–16 వారాలు (84 రోజులు)గా ఉంది. -
కోవిడ్‌పై ఈసీ సమీక్ష
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రమాదకరంగా పరిణమించిన కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సమీక్ష నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిగతులను ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఆ 5 రాష్ట్రాల్లో కోవిడ్ టీకాకు అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాల్సి ఉందని వారు ఈసీకి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవలతో ఈసీ చర్చలు జరిపింది. దేశంలో ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు ఆమోదయోగ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఈసీకి వివరించారు. ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలకు అనుమతిని ఇవ్వకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూళ్లను ఈసీ త్వరలో ప్రకటించనుంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో యూపీలో పార్టీ ఎన్నికల ర్యాలీలను రద్దుచేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది. డిజిటల్ వేదికగా వర్చువల్ ర్యాలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. -
అత్యవసర వైద్యం మిథ్య..ఆపదొస్తే ఆగమే!
దేశవ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం సంకట స్థితిలో ఉంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు మొదలు గుండెజబ్బులు, ఇతర అత్యవసర వైద్యం కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రులకు వచ్చే బాధితులకు సకాలంలో చికిత్స అందట్లేదు. నిపుణుల కొరత, మౌలిక వసతుల లేమి, సాంకేతిక పరికరాల్లో లోపాలు ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిణామం తీవ్ర ఆందోళనకరం. – నివేదికలో ఢిల్లీ ఎయిమ్స్ రోడ్డు ప్రమాదాల వల్ల అత్యధిక మెడికో లీగల్ కేసులు నమోదవుతున్న దేశంలోని జిల్లా ఆస్పత్రుల్లో కరీంనగర్ జిల్లా ఆస్పత్రిది ప్రథమ స్థానం. 300కుపైగా పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో క్షతగాత్రులకు అత్యవసరంగా రక్తం అందించేందుకు ప్రత్యేక రక్తనిధి కేంద్రం లేదు. అదే సమయంలో అత్యవసర విభాగానికి ప్రత్యేక బ్లడ్ బ్యాంకులు ఉన్న దేశంలోని ఐదు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో హైదరాబాద్ జిల్లా కింగ్‌కోఠి ఆస్పత్రి ఒకటి. ఈ ఆస్పత్రిలో అతితక్కువ సమయంలోనే బాధితులకు రక్తం ఎక్కిస్తున్నారు. – ఎయిమ్స్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అత్యవసర వైద్యం అంతంత మాత్రంగానే అందుతోందని ఢిల్లీ ఎయిమ్స్ అధ్యయనం తేల్చిచెప్పింది. ప్రమాదాల బారినపడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే బాధితులకు అత్యవసర చికిత్సలు అందుతున్న తీరును విశ్లేషించగా ఈ వాస్తవం బయటపడిందని వెల్లడిం చింది. 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాం తాలకు చెందిన 34 జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపిక చేసుకొని ఆయా ఆస్పత్రుల్లోని వైద్య సదుపాయాలు, పాటిస్తున్న ప్రమాణాలు, నెలకొన్న లోపాలు, అందుకుగల కారణాలపై ఢిల్లీ ఎయిమ్స్ అత్యవసర విభాగం ఇటీవల అధ్యయనం చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్ జిల్లా ఆస్పత్రితోపాటు హైదరాబాద్ జిల్లా కింగ్‌కోఠి ఆస్పత్రిని ఇందుకోసం ఎంపిక చేసుకుంది. ‘ఎమర్జెన్సీ అండ్ ఇంజురీ కేర్ ఎట్ డిస్ట్రిక్ట్ హాస్పిట ల్స్ ఇన్ ఇండియా’ పేరిట చేపట్టిన ఈ అధ్యయన నివేదికను నీతి ఆయోగ్‌కు సమర్పించగా ఆ సంస్థ దాన్ని తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఎమర్జెన్సీ కేసుల్లో ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 19% నుంచి 24% నమోదవుతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు కోసం వచ్చే బాధితుల్లో 70% పెద్దలు ఉంటుండగా 30% మంది పిల్లలు ఉంటున్నారు. పరిశీలనలో బయటపడ్డ లోపాలివి... ►ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఆస్పత్రి బెడ్ సామర్థ్యంలో కనీసం మూడో వంతు బెడ్లు కేటాయించాలి. కానీ చాలా చోట్ల ఎమర్జెన్సీ బెడ్ల సంఖ్య 2–3 శాతం మించడం లేదు. ►ఎమర్జెన్సీ విభాగాల్లో నిర్ణీత సిబ్బంది, నిపుణులు ఉండాలన్న నిబంధనను పలు ఆస్పత్రులు పాటించడం లేదు. ► పీడియాట్రిక్ ఎమర్జెన్సీ విభాగాల్లో 96% పరికరాలు లేవు. అత్యవసర సర్జరీలు చేయాల్సిన చోట 41 శాతం వరకే వసతులున్నాయి. ► 24/7 వైద్య సేవలు అందించే ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగికి సగటున 205 నిమిషాల్లో సేవలు కల్పిస్తున్నారు. ఈ జాప్యంతో మరణాలు సంభవిస్తున్నాయి. ► దాదాపు 88 శాతం ప్రధాన ఆస్పత్రుల్లో అంబులెన్స్ సర్వీసులు ఉన్నప్పటికీ వాటిల్లో పనిచేస్తున్న నిపుణులు కేవలం 3 శాతమే ఉండటంతో దాని ప్రభావం అత్యవసర సేవలపై పడుతోంది. ► 90 శాతం అంబులెన్స్‌ల్లో సరైన పరికరాలు, ఆక్సిజన్ సౌకర్యం లేవు. తీవ్ర రోడ్డు ప్రమాదాలకు గురై అత్యవసర సేవలు అందించే క్రమంలో అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వాటిలో బ్రతుకుతున్నది కేవలం 1.5 శాతమే. ►దేశంలో సగటున రోజుకు 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే వాటిలో 30 శాతం బాధితులు మరణిస్తున్నారు. ► ప్రతి ప్రధాన ఆస్పత్రిలో రక్త నిధి కేంద్రాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉండగా... అత్యవసర వైద్య విభాగానికి ప్రత్యేక రక్త నిధిని నిర్వహించాలనే నిబంధన ఉంది. అయితే 50శాతం ప్రధాన ఆస్పత్రుల్లోనే రక్త నిధి కేంద్రాలు ఉన్నాయి. ఇందులోనూ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు ప్రత్యేక బ్లడ్ బ్యాంకులు లేనివే ఎక్కువగా ఉన్నాయి. జనరల్ విభాగాల్లో రక్త నిధి కేంద్రాల నుంచి రక్తంతీసుకొచ్చి బాధితుడి శరీరంలోకి ప్రవేశపెట్టేందుకు ఎక్కువ సమయం పట్టడంతో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ► ప్రధాన ఆస్పత్రుల్లో పోలీస్ నిఘా లోపభూయిష్టంగా మారింది. దీంతో సగటున 47% వైద్యులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న వారి శాతం కనిష్టంగా 23% నుంచి గరిష్టంగా 67% ఉంది. ►ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లో అత్యధికంగా జీవనశైలి వ్యాధికి సంబంధించినవి 62 శాతం ఉండగా సంక్రమిత వ్యాధులతో జరిగే మరణాలు 28 శాతం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సేవలందక జరిగే మరణాలు 10 శాతం ఉన్నాయి. ప్రధాన సూచనలు హృద్రోగులకు ‘స్టెమి’తో అత్యవసర చికిత్స చేస్తున్నాం.. గుండెపోటు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్టెమీ’ (ఎస్టీ–ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) పేరిట దాదాపు అన్ని బోధనాస్పత్రుల్లో అమలు చేస్తున్న కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. హృద్రోగులకు అత్యవసర చికిత్సలో భాగంగా టెలీ–ఈసీజీ పరికరం ద్వారా గుండె పనితీరు తెలుసుకుంటాం. ఇందులో ఉన్న సాంకేతికత వల్ల ఈసీజీ ఫలితం వైద్య శాఖ ప్రధాన కార్యాలయానికి సైతం క్షణాల్లో వెళ్తుంది. అవసరమైన రోగికి రూ.40వేల నుంచి రూ.70వేల విలువ కలిగిన ఇంజక్షన్‌ను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తోంది. క్షణాల్లో రోగికి దాన్ని ఇస్తుండటంతో మరణాలు తగ్గుతున్నాయి. అయితే ఇతర అత్యవసర సేవలు అందించేందుకు మొబైల్ ఎమర్జెన్సీ సేవలను మెరుగ్గా అమలు చేయాలి.– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అత్యవసర సేవలను ఇటీవలే పునరుద్ధరించాం మా ఆస్పత్రికి అత్యవసర చికిత్స కోసం రోజుకు సగటున 10 మంది బాధితులు వస్తున్నారు. సాధ్యమైనంత వరకు వాళ్లందరికీ ఇక్కడే సత్వర వైద్యసేవలు అందిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా ఇప్పటివరకు ఉన్న మా ఆస్పత్రిలో ఇటీవలే అత్యవసర సేవల విభాగాన్ని పునరుద్ధరించాం. – డాక్టర్ రాజేంద్రనాథ్, కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ -
పిల్లలకు కరోనా టీకా ఎలా?
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు కరోనా టీకా వేయించడం ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారింది. 12–18 ఏళ్ల వయసు వారికి టీకా వేయాలంటే తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి. కానీ పిల్లలకు కరోనా వ్యాప్తి పెద్దగా లేదన్న అభిప్రాయంతో చాలామంది తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు రావడం లేదు. గతంలో వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వేలను చూస్తే, అమెరికాలో 50 శాతం మంది తమ పిల్లలకు టీకా ఇవ్వడానికి ఆసక్తి చూపగా, మిగిలిన సగం మందిలో సందిగ్ధత, నిరాసక్తత కనిపించాయి. కెనడాలో 63 శాతం మంది, టర్కీలో 36 శాతం ఆసక్తి చూపారు. మిగిలినవారిలో నిరాసక్తత, సందిగ్ధత నెలకొన్నాయి. ఇక భారత్‌లో ఎయిమ్స్ సంస్థలు, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి, ముంబైకి చెందిన క్రాంతి మెడికల్ కాలేజీలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ సర్వే చేపట్టాయి. పిల్లలకు కరోనా టీకా వేయించే విషయంపై జరిగిన మొదటి సర్వే ఇదే కావడం గమనార్హం. పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించడంపై 45.5 శాతం మంది సందిగ్ధంలో ఉన్నట్లు వెల్లడికాగా.. 21 శాతం మంది తమ పిల్లలకు టీకా వద్దే వద్దంటున్నారు. కేవలం 33.5 శాతం మందే టీకాపై ఆసక్తి చూపించారు. సర్వే నివేదిక మెడ్ ఆర్ఎక్స్ఐవీ మేగజైన్లో ప్రచురితమైంది. టీకా సామర్థ్యంపై అపనమ్మకం దేశంలో అక్టోబర్ 25 నాటికి 100 కోట్ల మంది కనీసం ఒక డోస్ టీకా తీసుకున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు రెండో డోస్ వ్యాక్సినేషన్ వేగంగా నడుస్తోంది. 12–18 ఏళ్ల వయసు గల పిల్లలకు వ్యాక్సినేషన్‌పై ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకట్రెండు టీకా తయారీ కంపెనీలకు అనుమతి కూడా ఇచ్చారు. త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే పిల్లలకు టీకా వేయించేందుకు ఎంతమంది ముందుకు వస్తారన్న నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రులు 30 నుంచి 49 ఏళ్లలోపువారున్నారు. అందులో 23 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు. 32 శాతం మంది ఆదాయం రూ.50 వేలపైనే ఉంటుంది. 41 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారున్నారు. సగం మంది సామాజికంగా ఉన్నతస్థాయిలో ఉన్నారు. భారతీయ వ్యాక్సిన్‌పై 39 శాతం మంది విశ్వాసం వ్యక్తంచేయగా, నమ్మకం లేనివారు 25 శాతం ఉన్నారు. 36 శాతం మంది తటస్థంగా ఉన్నారు. పిల్లలకు వ్యాక్సిన్ వద్దనేందుకు కారణాలు వ్యాక్సిన్ల భద్రత, సామర్థ్యంపై 85 శాతం మందికి అవగాహన లేదు. ► సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా అన్న దానిపై 78 శాతం మందికి అవగాహన లేదు. ► 65 శాతం మందికి కరోనా డోస్‌ల మీద అవగాహన లేదు. ► 62 శాతం మంది వ్యాక్సిన్‌తో రిస్క్ ఉంటుందని భావిస్తున్నారు. ► 50 శాతం మందికి కరోనాకు సంబంధించి శాస్త్రీయమైన సమాచారం అందుబాటులో లేదు. ► చిన్నపిల్లలు కరోనాకు పెద్దగా ప్రభావితం కావడం లేదన్న భావనలో 50 శాతం మంది ఉన్నారు. భయాలను పారదోలాలి తల్లిదండ్రులకు పిల్లల వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి. వారికున్న భయాలను పారదోలాలి. చదువుకున్నవారు మాత్రం టీకాపై మంచి అభిప్రాయంతో ఉన్నారు. కానీ చిన్న పిల్లలకు వేయించడంపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం పోగొట్టాలని సర్వే సూచించింది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ