
నిజ జీవితంలోని కొన్ని ఘటనలు సినిమా సీన్‌లను తలపిస్తాయి. ఇటువంటి ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియో ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు సంబంధించినది. ఈ వీడియోలో ఆసుపత్రిలోకి పోలీసుల వాహనం దూసుకువెళ్లడం కనిపిస్తుంది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.
రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తమవాహనంతో సహా ఆసుపత్రిలోనికి దూసుకువచ్చారు. ఆ నిందితుడు అదే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలిని వేధించాడని పోలీసులకు ఫిర్యాదు అందించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆసుపత్రిలోకి వాహనంతో సహా వచ్చిన పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేసి, అదే వాహనంలో తీసుకువెళ్లారు.
దీనికి ముందు ఆ నిందితుని చర్యను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది డీన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి, నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆస్పత్రికి తమ వాహనంలో చేరుకున్నారు. ఈ సమయంలో వారు సినిమా తరహాలో వాహనంతో సహా ఆసుపత్రిలోనికి వచ్చి, నిందితుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఇంతకీ పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు వాహనంతో సహా లోనికి ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.
The cops drove their car inside AIIMS Rishikesh.pic.twitter.com/rZDkCvHipM
— Divya Gandotra Tandon (@divya_gandotra) May 22, 2024