కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి నెల గడిచిపోయింది. ఈ లాక్‌డౌన్‌లో అందరూ ఇంటికే పరిమితమ్వగా వైద్యులు, నర్సులతో పాటు ఇతర ఆరోగ్య సిబ్బంది మాత్రం నిరంతరం మహమ్మారితో పోరాడుతున్నారు. అదే విధంగా కరోనా సంక్షోభం నుంచి ప్రజలకు కాస్తా ఊరటనిచ్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది యువ డాక్టర్లు ఒకటిగా చేరి అందరిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. లాక్‌డౌన్ విధించి నెలరోజులు గడిచిన సందర్భంగా వారంతా డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫారెల్ విలియమ్స్ ఫేమస్ ‘హ్యాపీ.. హ్యాపీ’ సాంగ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది డాక్టర్లు ఒక్కటిగా చేరి డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ‘దీ సాంగ్ ఆఫ్ హోప్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడమే కాకుండా ప్రజలను మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అవగాహన కల్పించేందుకు వారు చేసిన ఈ వినూత్న ప్రయాత్నాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. (భారీ ఊరట : వారి నుంచి వైరస్ సోకదు..)
ఇక కరోనా మహమ్మారి వంటి సంక్షోభ సమయంలో మానసిక ఆరోగ్య పరిస్థితి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం కూడా. కాగా ఈ క్రమంలో దేశంలోని ముంబై, బెంగుళూరు, చెన్నై, కన్యాకుమారికి రాష్ట్రాలకు చెందిన 60 మంది యువ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాహుల్ కెడియా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మీ మొహంలో నవ్వు తెప్పించడానిక దేశంలో డాక్టర్లంతా ఒక్కటిగా చేరారు.అంతేగాక ఈ యువ డాక్టర్లంతా ప్రపంచలోని మానసిక ఆరోగ్య పరిస్థితి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాడానికి ఇలా వినూత్న ప్రయత్నం చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా దేశవ్యాప్తంగా 27000 లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 800లకు పైగా మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment