
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. సినిమా పేరుకు తగ్గట్లే అచ్చమైన తేనెలొలికించే తెలుగు పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. వాసవసుహాస.. అంటూ సాగే పాటను కళా తపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా విడుదల చేశారు. కల్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్, కారుణ్య గాత్రం పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి.
వాసవసుహాస కమనసుధ.. ద్వారవతీతిరనాడ్వటీవసుధ.. అంటూ రమ్యంగా సాగుతుందీ పాట. ఈ పాటను విన్న విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాట చూస్తుంటే నా పాత రోజులు గుర్తొస్తున్నాయని, వినరో భాగ్యము విష్ణు కథ టైటిల్ కూడా చాలా బాగుందని ప్రశంసించారు. కాగా ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడుగా పరిచయం కానున్నాడు. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
చదవండి: ఐదేళ్లుగా నటి సీక్రెట్ లవ్.. బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే?
కృష్ణం రాజు కోసమే కైకాల ఆ పనికి ఒప్పుకున్నారు: శ్యామలా దేవి
Comments
Please login to add a commentAdd a comment