కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి "వాసవసుహాస" పాటకు, చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయడంలో భాగంగా ఈ చిత్ర బృందం Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్‌తో మ్యాచ్ నిర్వహించింది. ఆ మ్యాచ్‌లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్ సైదులుతో "ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం" సాంగ్ రిలీజ్ చేయించింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'మా ప్రొడ్యూసర్ వాసు గారు ఈ సినిమాను మీకు దగ్గర చెయ్యాలని చెప్పి నెల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల గారు మంచి లిరిక్స్ ఇచ్చారు' అని చెప్పుకొచ్చాడు.
బన్నీ వాసు మాట్లాడుతూ.. 'ఈ సాంగ్‌ను రీల్‌గా చేసి గీతా ఆర్ట్స్‌ను ట్యాగ్ చేయండి. సెలెక్ట్ అయిన 10 మందికి, వాళ్ళ ఫ్యామిలీకి ఈ సినిమాను చూపించడమే కాకుండా వాళ్ళను పుష్ప షూటింగ్‌కు కూడా తీసుకెళ్తాం' అని ప్రకటించారు. వినరో భాగ్యము విష్ణు కథ విషయానికి వస్తే మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment