
ప్రముఖ నటుడు, సినీ ఆల్‌రౌండర్ చంద్రమోహన్ శుక్రవారం(నవంబర్ 11న) మరణించారు. ఆయన మరణంతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చిన ఈయన కెరీర్ తొలినాళ్లలో హీరోగా రాణించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి విభిన్న రకాల పాత్రలు పోషించి వాటికి ప్రాణం పోశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తోనే కాకుండా తర్వాతి జనరేషన్ అయిన చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు ఇలా అందరు స్టార్ హీరోలతోనూ నటించారు. అయితే ఓ సినిమాలో చిరంజీవి కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'చిరంజీవి, నేను తొలిసారి 'ప్రాణం ఖరీదు' చిత్రంలో కలిసి నటించాం. అప్పుడు ఆయనకు ఐదు వేలు పారితోషికం ఇస్తే నాకు రూ.25 వేలు ఇచ్చారు. అప్పట్లో చిరు రఫ్‌గా ఉండేవారు. కానీ తనలో తపన, సిన్సియారిటీ ఉంది. చిరంజీవిని చూసి ఇండస్ట్రీలో ఒక మంచి డ్యాన్సర్ వచ్చారనుకున్నారంతా! చిరంజీవి విజయానికి ప్రధాన కారణం అల్లు అరవింద్. చిరంజీవి ఏ పాత్రలు చేయాలి? ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలి? వంటి చాలా విషయాలను ఆయన దగ్గరుండి చెప్తూ తన కెరీర్‌కు దిక్సూచిలా నిలబడ్డారు' అని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.
చదవండి: 900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు
ఇతరులకు ‘మాస్’.. శివాజీకి ‘క్లాస్’.. ఇదేం పద్దతి బాసూ..?
Comments
Please login to add a commentAdd a comment