
దివంగత నటులు, సూపర్ స్టార్ కృష్ణలో ఏదో ఆకర్షణ శక్తి ఉండేదంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీనియర్ నటులు చంద్రమోహన్. రీసెంట్‌గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆయన సూపర్ కృష్ణ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కృష్ణ ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఎవరికి వారు అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవాళ్లం. మద్రాసులో నేను, రామ్మోహన్ ఒకే రూంలో ఉండేవాళ్లం. కృష్ణ సపరేట్‌గా ఉండేవాళ్లు. అప్పుడప్పుడు మా రూంకు ఆయన వస్తూ ఉండేవారు’ అని చెప్పారు.
‘‘కృష్ణ మొదటి నుంచి చాలా చురుగ్గా ఉండేవారు. ఆయన చాలా స్పీడ్. అనుకున్నది వెంటనే చేసేవారు. సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నిస్తూనే ఆయన నిర్మాతలతో టచ్‌లో ఉండేవారు. మా రూంకి వచ్చినప్పుడల్లా ‘ఫలానా సినిమాలో నన్ను తీసుకున్నారు. ఈ సినిమాకు నేను బుక్ అయ్యాను’ అని కృష్ణ చెబుతుంటే మేం ఆశ్చర్యపోయేవాళ్లం. ఒకసారి కృష్ణతో సినిమా చేసినవారు మళ్లీ ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపేవారు. అంత ఆకర్షణ శక్తి కృష్ణలో ఉండేది’’ అంటూ చెప్పుకొచ్చారు.
అప్పట్లో శోభన్ బాబు, రామకృష్ణ వంటి ఇతర హీరోలు ఉన్నప్పటికీ, కృష్ణతోనే తనకు ఎక్కువ అనుబంధం ఉండేదన్నారు. పెద్ద హీరో కావాలనీ.. ఫారిన్ కారు కొనడమే తన కల అని కృష్ణ అంటుంటే.. అంత తేలికైన విషయం కాదని తాను అంటుంటే వాడినన్నారు. కానీ చూస్తుండగానే ఆయన తాను అనుకున్నవి సాధిచారన్నారు. ఇక తాను పద్మాలయా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్లోనే దాదాపు 40 సినిమాలకు పైగా చేశానని, తానంటే కృష్ణ - విజయనిర్మలకు అంతటి అభిమానమంటూ చంద్రమోహన్ ఎమోషనయ్యారు.
చదవండి:
బిగ్‌బాస్ 6: ఆర్జీవీతో డాన్స్ వీడియోపై ఇనయా సుల్తానా ఏమందంటే..
యశోద మూవీ వివాదంపై స్పందించిన నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment