
+‘వెన్నెల’ పోగ్రామ్‌తో బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన జయతి ఇప్పుడు వెండితెరపైనా మెరవనున్నారు. ఆమె తొలిసారి హీరోయిన్‌గా నటిస్తూ, నిర్మించిన ‘లచ్చి’ సిన్మాలోని తొలి పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈశ్వర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సురేష్ యువన్, పాల్ పవన్ స్వరకర్తలు. ‘‘పలు టీవీ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవంతో ఫస్ట్ టైమ్ సినిమా నిర్మించా.
లచ్చి పాత్ర చుట్టూనే కథంతా తిరుగుతుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. నవంబర్ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జయతి. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వి.ఎన్.ఆదిత్య, నటుడు కృష్ణుడు పాల్గొన్నారు. తేజశ్విని, చంద్రమెహన్, రఘుబాబు, తాగుబోతు రమేష్, ధనరాజ్ నటించిన ఈ సినిమాకి మాటలు: మరుదూరి రాజా.
Comments
Please login to add a commentAdd a comment