ఇద్దరూ.. ఇద్దరే.. | Vijaykumar finally transferred | Sakshi
Sakshi News home page

ఇద్దరూ.. ఇద్దరే..

Published Tue, Nov 18 2014 3:40 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM

ఇద్దరూ.. ఇద్దరే.. - Sakshi

ఇద్దరూ.. ఇద్దరే..

విద్యారణ్యపురి : వివాదాలు.. వినూత్న కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచిన జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార్ ఎట్టకేలకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో మహబూబ్‌నగర్ డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా వస్తున్న డీఈఓపైనా వివాదాస్పద ముద్ర ఇదివరకే ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారుు. హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ గత ఏడాది  మే 22న విజయ్‌కుమార్ జిల్లాకు డీఈఓగా వచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల తనిఖీలతో ఆయన ఉపాధ్యాయులను హడలెత్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం రాకుంటే సంబంధిత ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒకేసారి ఒకటి, రెండు మండలాల్లోని పలు పాఠశాలలను తనిఖీ చేసి.. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠినంగా వ్యవహరించారు. పలువురు ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేయడమే కాకుండా.. ఇంక్రిమెంట్లలో కోత పెట్టారు. దీంతో పలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. కొన్ని సంఘాలు ఏకంగా ఆందోళన బాట పట్టగా.. మరి కొన్ని సంఘాలు విజయ్‌కుమార్‌కు బాసటగా నిలిచారు.

ఈ క్రమంలో డీఈఓ కార్యాలయ బ్యూటిఫికేషన్‌పై పెద్ద దుమారం చెలరేగింది. ఆయన పర్యవేక్షణలో ఈ పనులు జరిగారుు. డీఈఓ కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించారు. అరుుతే బ్యూటిఫికేషన్ కోసం సమీకరించిన నిధుల్లో అవకతవకలక పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తారుు. ఈ నేపథ్యంలో డీఈఓ విజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళనకు దిగారుు. అవకతవతకలకు సంబంధించిన వ్యవహారం ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్లింది. ఇలా వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌కుమార్‌పై వినూత్న కార్యక్రమాలు చేపట్టి పలువురి మన్ననలనూ పొందారు.

జిల్లాలోని ఆత్మకూరు, గీసుకొండ, ధర్మసాగర్ మండలాలకు చెందిన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పించారు. క్యాంపులు నిర్వహించి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో సైన్స్‌పై సక్తి పెంపొందేలా కృషి చేశారు. ఉపాధ్యాయులు మెరుగైన బోధన చేసేలా వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. జఫర్‌గఢ్ మండలంలో కొందరు విద్యార్థులకు వంద గంటల్లో ఇంగ్లిష్ నేర్పించడం వంటి వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని సొషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లతో  కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఏర్పాటు చేసి... దాని ద్వారా బాలవక్త, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈనెల 14న జిల్లాస్థాయి ఫైనల్  పోటీలు నిర్వహించి విజేతలైన ఇద్దరి విద్యార్థులకు ఓరుగల్లు సేవా ట్రస్టు నుంచి రూ. లక్ష ఇప్పిం చారు.

ఓరుగల్లుసేవా ట్రస్టుకు కోశాధికారిగా ఉన్న ఆయన ఇటీవల రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యూరు. అదేవిధంగా.. దాతలపై ఆధారపడి నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సృజనోత్సవాలకు ఓరుగల్లు సేవాట్రస్టు ద్వారా కలెక్టర్ కిషన్‌తో రూ.1.50 లక్షలు ఇప్పించారు. బదిలీ అరుున సోమవా రం కూడా  ప్రాక్టిసింగ్ పీఎస్‌లో తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలడంతో హెచ్‌ఎంను సస్పెం డ్ చేయడంతోపాటు ఐదుగురు టీచర్లకు ఇంక్రిమెంట్ కట్ చేశారు. కాగా,  బదిలీ అరుున డీఈఓ విజయ్‌కుమార్‌కు ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement