క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ఆరంభించి.. హీరోగా పదుల సంఖ్యలో సినిమాలు తీసి మెప్పించిన సీనియర్ నటుడు చంద్రమోహన్. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్..ఇలా ఏ పాత్రలో అయినే ఒదిగిపోయే దిగ్గజ నటుడాయన. 55 ఏళ్ల తన సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.
(చదవండి: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత)
♦ఇప్పటి తరానికి చంద్రమోహన్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే తెలుసు కానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. ఆయనతో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. అతన్ని నిర్మాత హీరో అనేవాళ్లు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయవంతం అయినవే. అందుకే నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. ఒకే ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి.
♦ చంద్రమోహన్‌పై ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన్ను హీరోయిన్లకు లక్కీ హ్యాండ్ అనేవాళ్లు. ఎందుకంటే ఆయనతో కలిసి నటిస్తే చాలు.. ఆ హీరోయిన్ స్టార్ అయిపోతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు చంద్రమోహన్‌తో నటించేందుకు ఆసక్తి చూపించేవాళ్లు.
♦ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్ హీరో. జయప్రద హీరోయిన్. అప్పటి వరకు జయప్రదకు గుర్తింపు లేదు. కానీ ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
♦దివంగత నటి శ్రీదేవి తొలి హీరో కూడా చంద్రమోహన్‌గారు. ‘పదహారేళ్ల వయసు’చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ చిత్రం తర్వాత శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో చేదు అనుభవం.. కానీ మంచే జరిగింది
♦ జయసుధకు కూడా చంద్రమోహన్ సినిమాతోనే స్టార్‌డమ్ వచ్చింది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి భళే కాపురం, స్వర్గం, శ్రీమతి ఒక బహుమతి తదితర చిత్రాల్లో నటించారు.
♦ లేడి మెగాస్టార్ విజయశాంతి సైతం...చంద్రమోహన్‌తో నటించిన తర్వాతే స్టార్‌గా ఎదిగింది. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత విజయశాంతికి వరుసగా అవకాశాలు లభించాయి. వీరిద్దరు కాంబోలో వచ్చిన ‘ప్రతి ఘటన’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇలా చాలామంది హీరోయిన్లను స్టార్స్ చేస్తూ..‘లక్కీ హ్యాండ్’గా పేరు సంపాదించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment