
కథానాయకుడిగా ఇండస్ర్టీలోకి వచ్చి ఆ తర్వాత సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించారు నటుడు చంద్రమోహన్. 55ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఆదివారం 81వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ఐదు దశాబ్దాల పాటు సినీ జీవితంలోనే ఉన్నాను. కేవలం హీరో పాత్రలు మాత్రమే చేయాలని కాకుండా, అన్ని రకాల పాత్రలను పోషించాను. ఈ క్రమంలో నిర్విరామంగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. రాఖీ సినిమా షూటింగ్ అయిన వెంటనే బైపాస్ సర్జరీ చేయించుకున్నాను.
దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు షూటింగ్ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక నా వల్ల నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకిష్టం లేదు. అందుకే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని పేర్కొన్నారు. అయితే ఆయన ఇక సినిమాలకు దూరం కావడంతో చంద్రమోహన్ ఆరోగ్యంపై పలు వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలను నమ్మవద్దని నటుడు చంద్రమోహన్ తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇక 'మీ అభిమానానికి, ఆశీస్సులకు ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా. అదే నాకు శ్రీరామ రక్ష' అని పేర్కొన్నారు.
చదవండి : 'ప్రభుదేవాతో గొడవలు'..క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు
Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్.. ఫస్ట్‌లుక్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment