చంద్రమోహన్కు గుండెపోటు | senior actor chandramohan suffers heart attack | Sakshi
Sakshi News home page

చంద్రమోహన్కు గుండెపోటు

Published Thu, Feb 19 2015 3:28 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

చంద్రమోహన్కు గుండెపోటు

చంద్రమోహన్కు గుండెపోటు

ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్కు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కోలుకుంటే గురువారం రాత్రికే ఆయనను డిశ్చార్జి చేసి ఇంటికి పంపే అవకాశం ఉంది.

ఆయనను వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తోంది. ఆయన శరీరం చికిత్సకు సహకరించిన తీరును బట్టే ఏమైనా చెప్పగలమని వైద్యులు అంటున్నారు. డాక్టర్ మనోజ్ అగర్వాల్ బృందం చంద్రమోహన్ను పరీక్షిస్తోంది. సమయానికి ఆయనను తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్చడంతో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నా, నిలకడగా ఉందని చెబుతున్నారు. పూర్తిస్థాయి సమాచారం అందించేదుకు మాత్రం వైద్యులు నిరాకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement