సూర్యాపేట, న్యూస్‌లైన్: గౌడ కులస్తులు రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ గౌడ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆది వారం రాత్రి సూర్యాపేటలోని గాంధీపార్కులో జరిగిన జిల్లా గౌడ యువగర్జన సభకు ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, తెలంగాణ రాష్ట్ర డాక్టర్స్ జేఏసీ చైర్మన్ బూర నర్సయ్యగౌడ్, టీఆర్‌ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గౌడ కులస్తులు కట్టున్న కులముగా నిరూపించుకోవాలన్నారు. నేల మీద ప్రవహించే నీళ్లకు ఉన్న డిమాండ్ కల్లుకు లేకపోవడం బాధాకరమన్నారు.
60 ఏళ్ల స్వాతంత్య్రంలో గీత కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. రైతులు పండిస్తున్న పంటలకు కల్పిస్తున్న మద్దతు ధర లాగానే గీత కార్మికులు గీసే కల్లుకు కూడా ప్రభుత్వం ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పాల డైరీలలాగానే జిల్లాలోని మండలాల్లో కల్లు డైరీలను ఏర్పాటు చేసి కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. త్వరలో జరగబోయే తెలంగాణ పునర్నిర్మాణం లో గౌడ కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వా లని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును కేటాయించాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తులు ఏకమై పోటీలో నిలిచిన స్థా నాలను గెలిపించుకోవాలన్నారు. కొడి తే గోల్కొండనే కొట్టాలనే.. నినాదం చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ను యువత ఆదర్శంగా తీసుకోని ముం దుకు సాగాలన్నారు. రానున్న ఉగాది పండగను తెలంగాణలో జరుపుకోనున్నట్లు తెలిపారు.
ఇంకా గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సుంకరి మల్లేశంగౌడ్ తది తరులు కూడా మాట్లాడారు. నాతి సవీం దర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ హీరో, సర్వాయిపాపన్నగౌ డ్ ట్రస్టు చైర్మన్ పంజాల జైహింద్‌గౌడ్, బీసీ సంక్షేమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, వట్టికూటి రామారావు, గౌడ మహిళా సం ఘంజిల్లా అధ్యక్షురాలు నిమ్మల ఇందిరాగౌడ్, కేవీఎల్, ఆహ్వాన సంఘం కమిటీ సభ్యులు బైరు వెంకన్నగౌడ్, నేరేళ్ల మధుగౌడ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలి
Published Mon, Feb 10 2014 4:11 AM | Last Updated on Mon, Sep 17 2018 5:43 PM
Advertisement
Advertisement