పలువురు వింతగొలిపే సమస్యలతో బాధపడుతుంటారు. ఒక్కోసారి అవి వైద్య పరిజ్ఞానానికే అందని విధంగా ఉంటాయి కూడా. అలాంటి వింతైన సమస్యతో బాధపడుతున్నాడు 52 ఏళ్ల వ్యక్తి. అయితే అనుహ్యంగా ఓ దురలవాటుకి దూరంగా ఉండటంతో అతని సమస్యను పరిష్కరించడాని వైద్యులకు మార్గం సుగమమయ్యింది. ఇంతకీ అతను ఎలాంటి అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడంటే..
52 ఏళ్ల ఆస్ట్రియన్ అనే వ్యక్తి చాలా అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను కొన్ని రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెరగని దగ్గు, తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్ప్రతిలో చేరాడు. అక్కడ వైద్యులు బ్రోంక్‌స్కోప్‌తో జరిపిన వైద్య పరీక్షల్లో..ఆ వ్యక్తి గొంతులోని పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఊహించని రీతిలో అక్కడ జుట్టు పెరగడం చూసి గందరగోళానికి గురయ్యారు. నిజానికి ఆ వ్యక్తికి పదేళ్ల వయసులో ట్రాకియోటోమీ చేయించుకున్నాడు. ట్రాకియోటోమీ అంటే.. మెడ వెలుపలి నుంచి శ్వాసనాళంలోకి (విండ్‌పైప్) ఓపెనింగ్ సృష్టించడం ద్వారా ఊపిరితిత్తులకు గాలి, ఆక్సిజన్ చేరుకోవడంలో సహాయపడే ప్రక్రియ.
ట్రాకియోటోమీ ఉన్న వ్యక్తి ఓపెనింగ్‌లో చొప్పించిన ట్రాకియోటోమీ ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటాడు. దీని కారణంగా అతని శ్వాసనాళంలో ఓపెనింగ్ ఉంటుంది. అక్కడ అతని చెవి నుంచి తీసిన చర్మం, మృదులాస్థితో అంటుకట్టుట పద్ధతిలో ఆ ఓపెనింగ్‌ని స్థిరీకరించేలా చేశారు వైద్యులు. సరిగ్గా ఆ ప్రాంతంలో అసాధారణ రీతిలో వెంట్రుకలు పెరగడం మొదలయ్యింది.
అవి ఏకంగా ఆరు నుంచి తొమ్మిది వరకు.. సుమారు రెండు అండుళాల మేరు పొడవుగా ఉన్నాయి. అందువల్ల అతని గొంతు బొంగరుపోయి, దగ్గు వంటి సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ వెంట్రుకలను తొలగంచే ప్రక్రియ చేపట్టారు. ఇలా సదురు వ్యక్తి 14 ఏళ్ల పాటు ఆస్పత్రిని సందర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక అతడే తనకున్న ధూమపానం దురలవాటుకి దూరంగ ఉంటూ ఉండటంతో అనూహ్యంగా వాటి పెరుగుదల తగ్గింది. వైద్యులు కూడా అతడిలో వచ్చిన సానుకూల మార్పుకి అనుగుణంగా ఎండోస్కోపిక్ ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్ అనే కొత్త విధానానంతో జుట్టు పెరుగుదల శాశ్వతంగా చెక్కుపెట్టారు. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తుంటే.. మనకున్న దురలవాట్లే మనలను అనారోగ్యం పాలు జేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ .
Comments
Please login to add a commentAdd a comment