గొంతు నొప్పి ప్రమాదకరమా?
అధ్యయనం
గొంతునొప్పిగా ఉంటే ఎవరైనా సాధారణంగా మొదటగా ఇంటివైద్యాన్నే ఆశ్రయిస్తారు. వారం రోజులకూ తగ్గకపోతే, గొంతునొప్పితోపాటు అనుబంధ సమస్యలు తోడవుతూ ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
మొదటగా...
దేహం పూర్తిగా విశ్రాంతి పొందేవరకు నిద్రపోవాలి
గొంతుకు విశ్రాంతి కావాలి (మాట్లాడడం, పాడడం తగ్గించాలి లేదా మానేయాలి)
తరచుగా ద్రవాహారం తీసుకోవాలి(గొంతు పొడిబారకుండా ఉండడానికి). చల్లని ద్రవాలను మినహాయించాలి. వేడి లేదా గోరువెచ్చని ద్రవాలను తీసుకుంటే మంచిది
గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలుపుకుని పుక్కిలించాలి (నీరు గొంతును తాకేటట్లు (గార్గిలింగ్) చేయాలి)
చల్ల గాలిలో తిరగకూడదు
ధూమపానాన్ని, ఆల్కహాల్ సేవనాన్ని మానేయాలి
ఘాటుగా ఉండే పదార్థాలను తినడం మానేయాలి లేదా మోతాదు తగ్గించాలి
డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలంటే...
వారానికి పైగా గొంతునొప్పి, బొంగురు తగ్గనప్పుడు
101 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ జ్వరం వస్తున్నప్పుడు
లాలాజలంలో, కళ్లెలో రక్తం కనిపిస్తున్నప్పుడు
మింగడం మరీ కష్టమవుతున్నప్పుడు
ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తున్నప్పుడు
నోరు తెరవడం సాధ్యం కానంతగా గొంతు పట్టేస్తున్నప్పుడు
కీళ్ల నొప్పులు, చెవినొప్పి, తలతిరగడం, వాంతి వచ్చినట్లనిపించడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు
ఒంటి మీద దద్దుర్లు, అలసట, ఆయాసం వస్తున్నప్పుడు
మెడ దగ్గర ఉండే లింఫ్‌నోడ్స్‌లో వాపు
టాన్సిల్స్‌లో తెల్లని మచ్చలు రావడం... వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.