the study
-
‘బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం జరగాలి’
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన కులాలు, సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ల అంశంపై అధ్యయనం చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో బీసీ శాసన సభ కమిటీ చైర్మన్ గంగాధర్‌గౌడ్, సభ్యులు ఆర్.కృష్ణయ్య, విఠల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌లను బీసీ సంఘాల ప్రతినిధులు కలసి రిజర్వేషన్లపై చర్చించారు. సమావేశంలో బీసీ సంఘాలు నేతలు గుజ్జ కృష్ణ, జి.రాంబాబు, భూపేశ్‌సాగర్, రామకృష్ణ పాల్గొన్నారు. -
వహ్.. ఢిల్లీ!
► న్యూఢిల్లీలో జీహెచ్ఎంసీ మేయర్, అధికారుల పర్యటన ► మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి ► ఎన్డీఎంసీ చైర్మన్ నరేష్కుమార్, అధికారులతో సమావేశం ► త్వరలో నగరంలో అమలుకు యోచన సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఢిల్లీలో మౌలిక వసతులకు కల్పనకు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూసి జీహెచ్ఎంసీ మేయర్, అధికారులు కితాబునిచ్చారు. దేశంలో వివిధ నగరాల్లో అమలులో ఉన్న మెరుగైన విధానాలను జీహెచ్ఎంసీలో అమలు చేయాలన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఢిల్లీలో అమలవుతున్న సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, సీసీపీ దేవేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ సురేష్‌కుమార్ తదితరుల బృందం మంగళవారం ఢిల్లీలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు ప్రధాన ప్రాంతాల్లోని బస్షెల్టర్లు, పబ్లిక్ టాయ్లెట్లు, బస్‌బేలు, ఫుట్‌పాత్‌ల నిర్వహణ, చెత్త తరలింపు విధానం, మల్టీ లెవెల్ పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. అందంగా తీర్చిదిద్దిన బస్షెల్టర్లు, ఆక్రమణలు లేని ఫుట్‌పాత్‌లు, ఉచితంగా పబ్లిక్ టాయ్లెట్ల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ కార్యాలయంలో ఎన్డీఎంసీ చైర్మన్ నరేష్కుమార్, సెక్రటరీ చెంచల్యాదవ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణ, పౌరసదుపాయాల కల్పన, రెవెన్యూ వసూళ్లు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై నరేష్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రాంచంద్రుడు, ఆస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి, మేజర్ శివకుమార్, ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర అధ్యయనంతో ఉన్నత శిఖరాలకు..
సినీగేయ రచయిత చంద్రబోస్ ఏబీవీ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే జనగామ : నిరంతర అధ్యయనమే విద్యార్థులను సమున్నత శిఖరాలకు చేర్చుతుందని సినీగేయ రచయిత చంద్రబోస్ అన్నారు. పట్టణంలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె.కృష్ణయ్య అధ్యక్షతన గురువా రం నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొత్తదనం, నిరంతర ప్రయత్నం, సత్ప్రవర్తనలే విజ యానికి సోపానాలన్నారు. బాధ్యతతో ఉంటూ తల్లిదండ్రులకు, దేశానికి మం చిపేరు తేవాలని విద్యార్థులకు సూచిం చారు. ఏకాగ్రత.. కొత్తదనంతో రాసిన గీతాలు తన గీతను మార్చాయన్నారు. ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..’, ‘తగిలే రాళ్లను పునాదిచేసి ఎదగాలని..’ పాటలు తనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయన్నారు. ఇప్పటి వరకు 750కిపైగా పాటలు రాసినట్టు చెప్పారు. గురువుల సూచనలతో ఎదగాలి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన తేజా ఆర్ట్స్ ఫౌండర్ పోరెడ్డి రంగయ్య మాట్లాడుతూ గురువుల సూచనలను పాటించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. మరో అతిథి శ్రీభాష్యం శేషాద్రి మాట్లాడుతూ లక్ష్యం.. కోరిక.. ఈరెండింటినీ ఒకటిలా మార్చుకుని కృషిచేస్తే విజేతలుగా నిలవొచ్చన్నారు. విజ్ఞాన్ సొసైటీ అధ్యక్షుడు తాడూరి సంజీవరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామన్నారు. విజయాలకు పొంగిపోకుండా మంచి వక్తలతో విద్యార్థులకు మార్గ నిర్దేశనం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెషర్స్‌డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చంద్రబోస్‌ను కళాశాల యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నాగబండి నరసింహారావు, కేవీ రమణాచారి, రామకృష్ణ, తాతాచార్యులు, నర్సింగరావు, ప్రదీప్ పాల్గొన్నారు. -
పఠనం వల్ల ప్రయోజనాలు ఎన్నో!
అధ్యయనం ఒకప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య, సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి. చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మచ్చుకు కూడా కనిపించడం లేదు. పుస్తకం స్థానంలో సెల్‌ఫోన్ హస్తభూషణమైంది. ‘క్లాసు పుస్తకాలు చదవడానికి టైమ్ సరిపోవడం లేదు. ఇక సాహిత్య పుస్తకాలు కూడానా’ అనేది ఒక సాకు మాత్రమే. మనసుంటే మార్గం ఉంటుంది. చదవాలని కోరిక ఉండాలే గానీ సమయం తప్పకుండా దొరుకుతుంది. పుస్తకాలు చదవడం అనేది సాహిత్యపరిచయానికో, కాలక్షేపానికో కాదు...పఠన ప్రభావం వల్ల వ్యక్తుల మానసిక పరిధి విస్తరిస్తుందని రకరకాల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నిజానికి బాల్యంలోనే చదవడం మొదలుపెట్టాలి. వీలుకానప్పుడు టీనేజ్‌లో తప్పనిసరిగా పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలి. బ్రిటన్‌లోని నేషనల్ లిటరసీ ట్రస్ట్(ఎన్‌ఎల్‌టి) తాజా అధ్యయనం మరోసారి పుస్తక పఠన విలువను ప్రపంచానికి చాటింది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న టీనేజర్లకు, లేని టీనేజర్లకు మధ్య వ్యత్యాసాలను అధ్యయనం చేశారు. పుస్తకాలు చదవని వారితే పోల్చితే, చదివే వారు లోకజ్ఞానంలోనే కాదు, రకరకాల సామర్థ్యాలలోనూ మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారని ఎన్‌ఎల్‌టి అధ్యయనం చెబుతుంది. పుస్తక పఠనం వల్ల ఉపయోగం ఏమిటి? టీనేజ్‌లో పుస్తకాలు చదివే అలవాటు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది...లక్ష్యాన్ని నిర్దారించుకునే స్పృహ ఏర్పడుతుంది. లక్ష్యాన్ని చేరుకొనే పట్టుదల వస్తుంది. సామాజిక సమస్యలపై అవగాహన, సామాజిక స్పృహ ఏర్పడతాయి. పఠనాన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా భావించే వాళ్లు మిగిలిన వాళ్లతో పోల్చితే భిన్నంగా ఆలోచించగలరు. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాను కనుక్కోగలరు. పదిమందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది. స్వీయవిశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల తప్పులను, లోపాలను వేరొకరు వేలెత్తి చూపడానికి ముందే వాటిని సరిదిద్దుకోవచ్చు. చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుతుంది. అమ్మాయిలే ఫస్ట్... పాశ్చాత్యదేశాలలో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నారు. దీనివల్ల అబ్బాయి కంటే అమ్మాయిలలోనే సానుకూల దృక్పథం ఎక్కువగా కనిపిస్తుంది. -
ప్రమాదం అంచున...
జీవప్రపంచం బ్రిటన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కీటకాలకు సంబంధించిన దురదృష్టకరమైన వాస్తవం ఒకటి బయటపడింది. గత 35 ఏళ్లలో కీటకాల జనాభా ప్రపంచవ్యాప్తంగా 45 శాతం తగ్గిపోయింది. ఒక విధంగా చెప్పాంటే ఇది కీటకాలకు మాత్రమే పరిమితమైన విషాదం కాదు. సమస్త మానవాళిని దిగ్భ్రాంతికి గురి చేసే సందర్భం. వాతావరణ మార్పులు, పట్టణీకరణ పెరగడం, పచ్చదనం తగ్గడం, ఆవాసాలకు అనువైన చోటు లేకపోవడం... మొదలైన కారణాల వలన కీటకాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. పంట ఉత్పత్తికి, పర్యావరణ సమతూకానికి ఉపయోగపడే కీటకాల జనాభా తగ్గిపోవడం ప్రమాదకర సంకేతం అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘‘కీటకాల జనాభా తగ్గుతూ పోవడం అనేది భవిష్యత్తులో అనేక రకాల ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. నిజానికి మనం... తెలిసిన నష్టాల గురించే భయపడుతున్నాం. రాబోయే కాలంలో ఊహకు కూడా అందని ప్రతికూల ఫలితాలను చూడాల్సి రావచ్చు’’ అంటున్నారు లండన్‌లోని ‘బయోసెన్సైస్ డిపార్ట్మెంట్’కు చెందిన డా.బెన్ కోలెన్. ‘‘ఈ పెద్ద ప్రపంచంలో ఈ చిన్న కీటకాల గురించి ఆలోచించే వ్యవధి ఎవరికి ఉంటుంది?’’ అంటున్నాడు స్టాన్ఫోర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ (అమెరికా)కు చెందిన ప్రొఫెసర్ రోడాల్ఫ్ డిర్జో బాధగా. ‘ది డైవర్సిటీ ఆఫ్ లైఫ్’ అనే పుస్తకంలో జీవశాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఒ. విల్సన్ ఇలా అంటారు: ‘‘కీటకాలన్నీ కనిపించకుండా పోయిన కొన్ని నెలలలోనే మనుషులు కూడా కనిపించరు’’ ఆయన హెచ్చరిక నిజం కాకూడదని ఆశిద్దాం. కీటకాల సంరక్షణకు కరాలు కలుపుదాం. -
గొంతు నొప్పి ప్రమాదకరమా?
అధ్యయనం గొంతునొప్పిగా ఉంటే ఎవరైనా సాధారణంగా మొదటగా ఇంటివైద్యాన్నే ఆశ్రయిస్తారు. వారం రోజులకూ తగ్గకపోతే, గొంతునొప్పితోపాటు అనుబంధ సమస్యలు తోడవుతూ ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మొదటగా... దేహం పూర్తిగా విశ్రాంతి పొందేవరకు నిద్రపోవాలి గొంతుకు విశ్రాంతి కావాలి (మాట్లాడడం, పాడడం తగ్గించాలి లేదా మానేయాలి) తరచుగా ద్రవాహారం తీసుకోవాలి(గొంతు పొడిబారకుండా ఉండడానికి). చల్లని ద్రవాలను మినహాయించాలి. వేడి లేదా గోరువెచ్చని ద్రవాలను తీసుకుంటే మంచిది గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలుపుకుని పుక్కిలించాలి (నీరు గొంతును తాకేటట్లు (గార్గిలింగ్) చేయాలి) చల్ల గాలిలో తిరగకూడదు ధూమపానాన్ని, ఆల్కహాల్ సేవనాన్ని మానేయాలి ఘాటుగా ఉండే పదార్థాలను తినడం మానేయాలి లేదా మోతాదు తగ్గించాలి డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలంటే... వారానికి పైగా గొంతునొప్పి, బొంగురు తగ్గనప్పుడు 101 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ జ్వరం వస్తున్నప్పుడు లాలాజలంలో, కళ్లెలో రక్తం కనిపిస్తున్నప్పుడు మింగడం మరీ కష్టమవుతున్నప్పుడు ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తున్నప్పుడు నోరు తెరవడం సాధ్యం కానంతగా గొంతు పట్టేస్తున్నప్పుడు కీళ్ల నొప్పులు, చెవినొప్పి, తలతిరగడం, వాంతి వచ్చినట్లనిపించడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఒంటి మీద దద్దుర్లు, అలసట, ఆయాసం వస్తున్నప్పుడు మెడ దగ్గర ఉండే లింఫ్‌నోడ్స్‌లో వాపు టాన్సిల్స్‌లో తెల్లని మచ్చలు రావడం... వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. -
మానవా... మారవా?!
జూలు ఏనుగు (ఊల్ మామత్)లు, ఇతర పెద్ద జంతువులు... ఎలా అంతరించి పోయాయి? అనే ప్రశ్నకు, ‘వాతావరణ మార్పులు’ అనే జవాబు సిద్ధంగా ఉండేది. నాలుగు వేల సంవత్సరాల క్రితం సైబీరియాలో అంతరించి పోయాయి మామత్‌లు. వాతావరణ మార్పుల వల్ల కాకుండా వేటగాళ్ల వల్లే అవి అంతరించిపోయాయని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. మెరుగైన ఆయుధసంపత్తి లేని ఆ కాలంలో అంత పెద్ద జంతువులను ఎలా వేటాడారు? అనే సందేహం రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మామత్లాంటి పెద్ద జంతువులను చంపడానికి అసాధారణమైన ఆయుధాలేవి వేటగాళ్లు వాడలేదు. పెంపుడు కుక్కల సహకారాన్ని మాత్రం తప్పనిసరిగా తీసుకునేవారు. ‘‘ముందుగా కుక్కలన్నీ మామత్ను చుట్టుముట్టేవి. అది కదలడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో వేటగాళ్లు వచ్చి దాడి చేసేవాళ్లు’’ అంటున్నాడు డెన్మార్క్‌కు చెందిన ఆంత్రోపాలజిస్ట్ పాట్ షిప్మాన్. గత సంవత్సరం విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం... ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యూరప్‌లో శునకాలు పెంపుడు జంతువులుగా ఉండేవి. వాటిని ప్రధానంగా వేటకు వాడుకునేవారు. అన్నట్టు మామత్ ఎముకలతో వేటగాళ్లు ఇండ్లను కూడా నిర్మించుకునేవారు. మొత్తం మీద ‘‘జూలు ఏనుగులు అంతరించిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చుగాక, ప్రధానకారణం మాత్రం వేటగాళ్లే’’ అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన గ్లెన్ మెక్‌డోనాల్డ్ అనే పరిశోధకుడు. ‘‘ఆనాటి నుంచి ఈనాటివరకు ఎన్నోరకాల మార్పులు వచ్చాయి. మనుషుల నుంచి జీవజాతులకు ఏర్పడుతున్న ముప్పు విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. పెపైచ్చు ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగింది’’ అని ఆవేదన చెందుతున్నాడు మెన్డొనాల్డ్. నిజమే కదా మరి!