
ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన కులాలు, సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ల అంశంపై అధ్యయనం చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో బీసీ శాసన సభ కమిటీ చైర్మన్ గంగాధర్‌గౌడ్, సభ్యులు ఆర్.కృష్ణయ్య, విఠల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌లను బీసీ సంఘాల ప్రతినిధులు కలసి రిజర్వేషన్లపై చర్చించారు. సమావేశంలో బీసీ సంఘాలు నేతలు గుజ్జ కృష్ణ, జి.రాంబాబు, భూపేశ్‌సాగర్, రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment