- సినీగేయ రచయిత చంద్రబోస్
- ఏబీవీ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే
జనగామ : నిరంతర అధ్యయనమే విద్యార్థులను సమున్నత శిఖరాలకు చేర్చుతుందని సినీగేయ రచయిత చంద్రబోస్ అన్నారు. పట్టణంలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె.కృష్ణయ్య అధ్యక్షతన గురువా రం నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొత్తదనం, నిరంతర ప్రయత్నం, సత్ప్రవర్తనలే విజ యానికి సోపానాలన్నారు.
బాధ్యతతో ఉంటూ తల్లిదండ్రులకు, దేశానికి మం చిపేరు తేవాలని విద్యార్థులకు సూచిం చారు. ఏకాగ్రత.. కొత్తదనంతో రాసిన గీతాలు తన గీతను మార్చాయన్నారు. ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..’, ‘తగిలే రాళ్లను పునాదిచేసి ఎదగాలని..’ పాటలు తనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయన్నారు. ఇప్పటి వరకు 750కిపైగా పాటలు రాసినట్టు చెప్పారు.
గురువుల సూచనలతో ఎదగాలి
కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన తేజా ఆర్ట్స్ ఫౌండర్ పోరెడ్డి రంగయ్య మాట్లాడుతూ గురువుల సూచనలను పాటించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. మరో అతిథి శ్రీభాష్యం శేషాద్రి మాట్లాడుతూ లక్ష్యం.. కోరిక.. ఈరెండింటినీ ఒకటిలా మార్చుకుని కృషిచేస్తే విజేతలుగా నిలవొచ్చన్నారు. విజ్ఞాన్ సొసైటీ అధ్యక్షుడు తాడూరి సంజీవరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామన్నారు.
విజయాలకు పొంగిపోకుండా మంచి వక్తలతో విద్యార్థులకు మార్గ నిర్దేశనం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెషర్స్‌డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చంద్రబోస్‌ను కళాశాల యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నాగబండి నరసింహారావు, కేవీ రమణాచారి, రామకృష్ణ, తాతాచార్యులు, నర్సింగరావు, ప్రదీప్ పాల్గొన్నారు.