నాకు క‌రోనా లేదు.. కానీ: కైలీ జెన్నర్ | Kylie Jenner Slams Coronavirus Rumours | Sakshi
Sakshi News home page

నాకు క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు.. కానీ: కైలీ జెన్నర్

Published Sat, Mar 28 2020 11:15 AM | Last Updated on Sat, Mar 28 2020 11:18 AM

Kylie Jenner Slams Coronavirus Rumours - Sakshi

లాస్ ఏంజిల్స్‌: ఇర‌వై ఏళ్ల‌కే బిలియనీర్‌‌గా అరుదైన రికార్డు నెలకొల్పారు టీవి స్టార్, మేక‌ప్ మొగ‌ల్‌ కైలీ జెన్నర్. అది కూడా కేవ‌లం సోష‌ల్ మీడియా ద్వారా బ్యూటీ ప్రొడక్టుల‌ను, కాస్మొటిక్స్ విక్రయిస్తూ ఈ ఘ‌న‌త సాధించారు. 2015లో సొంతంగా ‘కైలీ లిప్‌‌ కిట్స్‌‌’ బ్రాండ్‌‌ను ప్రారంభించిన కైలీ.. ప్ర‌స్తుతం కోట్లాది మంది అమ్మాయిలకు ఫ్యాషన్‌‌ ఐకాన్‌‌. కాగా ప్ర‌స్తుతం కైలీకి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గ‌తేడాది కైలీ.. క‌రోనా వైరస్‌ బారీన ప‌డిన‌ట్లు వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. (కరోనా నుంచి కోలుకున్న హీరోయిన్‌ )

ఘోర మ‌హ‌మ్మారి కోవిడ్-19తో కైలీ పోరాడుతున్నారు అని ఓ అభిమాని సోష‌ల్ మీడియ‌లో పోస్ట్ చేయ‌డంతో.. తాజాగా ఈ వార్త‌ల‌ను కైలీ కొట్టి పారేశారు. ఆమె కేవ‌లం గొంతు ఇన్ఫెక్ష‌న్ కారణంగా ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు తెలిపారు. ‘ఆశ్చ‌ర్యంగా ఉంది. నాకు క‌రోనా లాంటి లక్షణాలు ఎప్పుడూ లేవు. నాకు గొంతులో భయంకరమైన ఇన్ఫెక్షన్ ఉంది. దానితోనే నేను ఇప్ప‌టి వ‌ర‌కు పోరాడుతున్నాను.’ అని కైలీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేశారు. ప్రముఖ అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్‌ను కైలీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. (క‌రోనా: ఒకే రోజులో 70 డ‌బ్బాల కోక్‌, వ‌యాగ్ర డెలివ‌రీ)

వీరికి ఓ ఆడపల్ల కూడా ఉంది. అయితే ఇటీవల కైలీ తన భర్తతో విడిపోయారు. ప్రస్తుతం ప్యాలెస్‌తో తాను తన కూతురు మాత్రమే ఉంటున్నారు. కైలీ ఫేస్‌‌బుక్‌‌ ఫాలోయర్ల సంఖ్య రెండు కోట్లకు పైనే. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 15 కోట్లకుపైనే ఫాలోయర్స్‌‌ ఉన్నారు. ట్వీటర్‌‌ ఫాలోయర్స్‌‌ కౌంట్‌‌ దాదాపు మూడు కోట్లు. కర్దాషియన్‌‌ ఫ్యామిలీ మెంబర్‌‌గా గుర్తింపు ఉన్నప్పటికీ తెలివితేటలతో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు కైలీ జెన్నర్‌‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement