Kylie Jenner
-
ఆమెను ఎందుకు ఫాలో అవుతున్నారు.. జాన్వీ కపూర్‌పై దారుణంగా ట్రోల్స్
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ . బాలీవుడ్లో హిందీలో ధడక్‌గా రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంతోనే వెండితెర అరంగ్రేటం చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సాధించింది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం 'మిలి' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది భామ. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తోంది. (ఇది చదవండి: ఆ ఘటనతో అమ్మ ఒక్కసారిగా షాక్‌కు గురైంది: జాన్వీ కపూర్) తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది జాన్వీ కపూర్. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎందుకు కైలీ జెన్నర్‌ను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించారు. మరొకరైతే 'కైలీ జెన్నర్ లైట్ వెర్షన్' అంటూ కామెంట్స్ చేశారు. 'జాన్వీ కూడా ప్లాస్టిక్ సర్జరీ చాట్‌లోకి ప్రవేశించింది' అంటూ జాన్వీ కపూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కైలీ జెన్నర్ ఎవరు?: కైలీ క్రిస్టెన్ జెన్నర్ ఒక అమెరికన్ వ్యాపారవేత్త. రియాలిటీ టెలివిజన్ సిరీస్ 'కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్' 2007 నుంచి 2021 వరకు నటించారు. కైలీ కాస్మెటిక్స్ కంపెనీకి ఆమె యజమానిగా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా నిలిచారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
తల్లయ్యాక సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్!
Travis Scott: హాలీవుడ్ స్టార్ కైలీ జెన్నర్, ట్రావిస్ స్కాట్ రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే! ఇటీవలే వీరు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి చర్చనీయాంశంగా మారింది. అందులో కైలీ డైమండ్ రింగ్ ధరించి ఉంది. దీంతో ఆమె ట్రావిస్ స్కాట్‌ను గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు ఎవరికివారే తెగ ఊహించేసుకుంటున్నారు. కాగా గతంలోనూ కైలీ పెళ్లి చేసుకుందంటూ కథనాలు వెలువడ్డాయి. 2018లో ఆమె JW(ట్రావిస్ అసలు పేరు జేక్వ్స్ వెబ్‌స్టర్) అక్షరాలు ఉన్న బ్యాండు ధరించడంతోపాటు వేలికి వజ్రాల ఉంగరం ఉండటంతో ఆమె పెళ్లి జరిగిపోయిందని ప్రచారం జరిగింది. కానీ కొంతకాలానికి అది వట్టి పుకారేనని తేలిపోయింది. ఇదిలా ఉంటే కైలీ, ట్రావిస్ 2017 నుంచి డేటింగ్లో ఉన్నారు. వీరికి నాలుగేళ్ల వయసున్న కూతురు స్టోర్మీ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొడుకు జన్మించగా, అతడికి వోల్ఫ్ వెబ్‌స్టర్ అని నామకరణం చేశారు. చదవండి: స్టార్ హీరో సినిమాకు బాయ్ కాట్ సెగ.. ట్విటర్లో ట్రెండింగ్ -
‘ప్రపంచ కుబేరులు ఏ విధంగా ఎదిగారో తెలుసా’
ముంబై: ప్రపంచ కుబేరుల గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. అయితే 2018లో ఫోర్బ్స్ జాబితాలో కైలీ కాస్మోటిక్స్ వ్యవస్థాపకురాలు, రియాలిటీ ఫేమ్ కైలీ జెన్నర్ పేరు ప్రముఖ్యత సంతరించుకుంది. 21ఏళ్ల కైలీ జెన్నర్ అంత పాపులర్ కావడానికి ఆమె స్వయం కృషితో ఎదిగినట్లు నామినేషన్ వేసి సంచలనం సృష్టించింది. మరోవైపు ప్రపంచ కుబేరులు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వారు ఈ స్థాయికి ఏ విధంగా ఎదిగారో కచ్చితమైన ఆదారాలున్నాయి. చిన్న వ్యాపారాలు చేసుకుంటు ప్రపంచ కుబేరులుగా ఏ విధంగా ఎదిగారో స్పష్టమైన ఆదారాలున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి అమెజాన్ సంస్థను బెజోస్ చిన్న గ్యారేజిలో స్థాపించిన ఆధారాలను ఫోటో రూపంలో ఇటీవల సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. అయితే కైలీ స్వయం కృషితో ఎదిగినట్టు నామినేషన్ వేయడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆమె కర్దాషియన్ వంశానికి చెందిందని, ఆమె 13ఏళ్లలోనే టీవీ రియాల్టీ షోలో పాల్గొని స్వయం కృషితో ఎదిగిందని ఆమె సన్నిహితులు తెలిపారు. అందువల్ల వ్యక్తిగతంగా ఆమెకు స్వయం కృషితో ఎదిగిన ఇమేజ్ వచ్చిందని, కుటుంబ నేపథ్యం చెప్పాల్సిన అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. (చదవండి: బిల్ గేట్స్ చెప్పిన ఐదు పుస్తకాలు) Cute propaganda. In reality Bezos's mommy and daddy gave him $245,573 to stop Amazon from failing in 1995, but you'd never know it from listening to our right-wing mainstream media that blames poverty on personal failure and attributes wealth to personal virtue. https://t.co/vM15SKIcWs — Aidan Smith ⧖ (@AidanSmith2020) July 6, 2020 -
ఇన్‌స్టాలో ఒక్క పోస్టుకు రూ. 7.59 కోట్లు
హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్.. ఒకప్పుడు రెజ్లింగ్‌లో తన సత్తాను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అనంతరం సినిమాల్లోనూ ప్రవేశించి స్టార్ నటుడిగా రాణిస్తున్నాడు. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న డ్వేన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో 189 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ హ్యాపర్ హెచ్‌క్యూ ప్రకారం.. అతడు అడ్వర్టైజ్మెంట్ల కోసం చేసే ఒక్క పోస్టు ద్వారా 7,59,93,050 కోట్ల రూపాయలు(10,15,000 డాలర్లు) ఆర్జిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అత్యధికంగా డబ్బులు గడించే లిస్టులో డ్వేన్ తొలి స్థానంలో నిలిచాడు. (నాకు కరోనా లక్షణాలు లేవు.. కానీ: కైలీ జెన్నర్) నిజానికి ఈ స్థానంలో టీవీ స్టార్, మేకప్ మొఘల్ కైలీ జెన్నర్ ఉండేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 184 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె గతేడాది ఒక్క పోస్టుకు 1.2 మిలియన్ అంటే అక్షరాలా ఎనిమిది కోట్లకు పైగా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం కాస్త వెనకబడి ఒక్క పోస్టుకు 7,38,21,820 కోట్లు అందుకుంటూ రెండో స్థానానికి పడిపోయారు. తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (6,65,59,430 కోట్లు), జెన్నర్ సోదరి కిమ్ కర్దాషియన్ ( 6,42,38,460 కోట్లు), గాయకుడు, గేయ రచయిత అరియానా గ్రాండే (6,38,64,110) ఉన్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జుమాంజి వంటి పలు వరల్డ్ హిట్ చిత్రాల్లో నటించిన డ్వేన్ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2019లో అత్యధికంగా సంపాదించే హాలీవుడ్ నటుడిగా నిలిచాడు. (అతడు.. ఆమె.. ఓ అన్న!) -
నాకు కరోనా లేదు.. కానీ: కైలీ జెన్నర్
లాస్ ఏంజిల్స్: ఇరవై ఏళ్లకే బిలియనీర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పారు టీవి స్టార్, మేకప్ మొగల్ కైలీ జెన్నర్. అది కూడా కేవలం సోషల్ మీడియా ద్వారా బ్యూటీ ప్రొడక్టులను, కాస్మొటిక్స్ విక్రయిస్తూ ఈ ఘనత సాధించారు. 2015లో సొంతంగా ‘కైలీ లిప్ కిట్స్’ బ్రాండ్‌ను ప్రారంభించిన కైలీ.. ప్రస్తుతం కోట్లాది మంది అమ్మాయిలకు ఫ్యాషన్ ఐకాన్. కాగా ప్రస్తుతం కైలీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది కైలీ.. కరోనా వైరస్ బారీన పడినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. (కరోనా నుంచి కోలుకున్న హీరోయిన్ ) ఘోర మహమ్మారి కోవిడ్-19తో కైలీ పోరాడుతున్నారు అని ఓ అభిమాని సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో.. తాజాగా ఈ వార్తలను కైలీ కొట్టి పారేశారు. ఆమె కేవలం గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ‘ఆశ్చర్యంగా ఉంది. నాకు కరోనా లాంటి లక్షణాలు ఎప్పుడూ లేవు. నాకు గొంతులో భయంకరమైన ఇన్ఫెక్షన్ ఉంది. దానితోనే నేను ఇప్పటి వరకు పోరాడుతున్నాను.’ అని కైలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేశారు. ప్రముఖ అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్‌ను కైలీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. (కరోనా: ఒకే రోజులో 70 డబ్బాల కోక్, వయాగ్ర డెలివరీ) వీరికి ఓ ఆడపల్ల కూడా ఉంది. అయితే ఇటీవల కైలీ తన భర్తతో విడిపోయారు. ప్రస్తుతం ప్యాలెస్‌తో తాను తన కూతురు మాత్రమే ఉంటున్నారు. కైలీ ఫేస్బుక్ ఫాలోయర్ల సంఖ్య రెండు కోట్లకు పైనే. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 కోట్లకుపైనే ఫాలోయర్స్ ఉన్నారు. ట్వీటర్ ఫాలోయర్స్ కౌంట్ దాదాపు మూడు కోట్లు. కర్దాషియన్ ఫ్యామిలీ మెంబర్‌గా గుర్తింపు ఉన్నప్పటికీ తెలివితేటలతో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు కైలీ జెన్నర్. i had strep and staph in my throat and was bleeding from the mouth it was HORRIBLE #kuwtk — Kylie Jenner (@KylieJenner) March 27, 2020 -
ప్రపంచ కుబేరుల్లో ‘చిన్నది’
కైలీ జెన్నర్ (21) అమెరికన్ మోడల్ వేల కోట్ల సంపాదనతో రికార్డుల మోత మోగించింది. ఫోర్బ్స్ తాజా జాబితాలో యంగెస్ట్ బిలియనీర్‌గా రికార్డ్ కొట్టేసింది. దీంతో అతి చిన్నవయసులోనే వేల కోట్ల సంపాదనకు రాణిగా అమెరికన్ బిజినెస్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. 21 ఏళ్ళ వయస్సులోనే ఒక బిలియన్ డాలర్ల విలువైన సంపదను కూడబెట్టిన జెన్నర్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా నిలిచిందని ఫోర్బ్స్ పేర్కొంది. మొత్తం 2153 మంది జాబితాలో కైలీ 2057వ ర్యాంకు సాధించింది. కైలీ జెన్నర్ సంపద 900 మిలియన్ డాలర్లు అని లెక్క తేల్చింది ఫోర్బ్స్. ఈ సంపదకు తోడు 10 శాతం మేనేజ్మెంట్ ఫీజుతో కలిపి ఆమె సంపద బిలియన్ డాలర్ జాబితాలో చేరిందని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. ఫేస్బుక్ అధిపతి మార్క్ జకర్బర్గ్ 23 ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించారని తెలిపింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మొదటి, రెండుస్థానాల్లో నిలిచారు. కైలీ జెన్నర్ 2015 మేలో తల్లి నుంచి వారసత్వంగా లభించిన కాస్మొటిక్ బిజినెస్‌లోకి ప్రవేశించింది. 15వేల లిప్ కిట్స్‌ను పరిచయం చేయగా నిమిషాల్లోనే హాట్ కేకుల్లా రికార్డు స్థాయిలో అమ్ముడు బోయాయ. ఇక అప్పటినుంచీ అమ్మకాల్లో సంచనాలను నమోదు చేస్తూనే ఉంది. ఆ తరువాత కైలీ కాస్మొటిక్స్ పేరుతో ఫిబ్రవరిలో రీలాంచ్ అయిన కంపెనీ 5లక్షల లిప్కాట్లను వివిధ షేడ్లలో లాంచ్ చేసి కాస్మొటిక్ బిజినెస్ వర్గాల్లో గుబులు పుట్టించింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 307 మిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆ తరువాత తన ఉత్పత్తులను అమ్ముకునేందుకు బ్యూటీ సంస్థ ఉల్టాతో జతకట్టింది. తద్వారా 360 మిలియన్ డాలర్లను సాధించింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి బారీ ఫాలోయింగే ఉంది. ఫ్యాషన్ ఐకాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 128 మిలియన్లు, ట్విట్టర్లో 26.7 మిలియన్లమంది ఫాలోయర్లు ఉన్నారు. రాపర్ ట్రావిస్ స్కాట్‌తో రహస్య ప్రేమ, గతేడాది ఫిబ్రవరిలో ఒక బిడ్డకు తల్లి కావడం కూడా సంచలనమే. QUEEN pic.twitter.com/wibRPXxVxo — TRAVIS SCOTT (@trvisXX) March 5, 2019 -
కోహ్లి కంటే 9 రెట్లు ఎక్కువ!
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రూ.82 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిసి నోరెళ్లబెట్టాం.. కానీ అదే ఒక్క పోస్టుకు కోహ్లి కన్నా 9 రెట్లు ఎక్కువ సంపాదిస్తోంది ఓ ప్రముఖ మోడల్. ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తోన్న వారి జాబితాను ఇటీవల హోపర్స్ హెచ్‌క్యూ సంస్థ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో అత్యధికంగా ఆర్జించి తొలి స్థానం దక్కించుకుంది.. రియాల్టీ టీవీ స్టార్, ప్రముఖ అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్. ఆమె ఒక్క వాణిజ్య ప్రకటనకు సంబంధించిన పోస్ట్‌కు ఏకంగా 1 మిలియన్ యూఎస్ డాలర్లు(6 కోట్ల 85 లక్షల,42 వేల రూపాయలు) ఆర్జిస్తోంది. ఆమె తర్వాత ప్రముఖ నటి, సింగర్ సెలెన గోమేజ్ 5 కోట్ల 48 లక్షల రూపాయలతో రెండో స్థానంలో నిలిచింది. గత ఫిబ్రవరిలో కైలీజెన్నర్ ఒక్క ట్వీట్‌తో స్నాప్ చాట్ కొంపముంచింది. ఆమె చేసిన ఒక్క ట్వీట్‌తో స్నాప్ చాట్ సుమారు 7 వేల కోట్లు నష్టపోయిందంటే.. ఆమెకు ఏ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారో అర్థమవుతోంది. ఈ అమెరికా మోడల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 111.9 మిలియన్స్ మంది ఫాలో అవుతుండటం విశేషం. ఇక క్రీడాకారుల జాబితాలో 9వ స్థానంలో నిలిచిన కోహ్లి... ఓవరాల్‌గా 17వ స్థానంలో ఉన్నాడు. thanks @voguemagazine ✨ A post shared by Kylie (@kyliejenner) on Jun 27, 2018 at 12:29pm PDT చదవండి: ఒక్క ట్వీట్‌తో 7వేల కోట్లకు ముంచేసింది కోహ్లి పోస్టుకు రూ. 82 లక్షలు -
కుబేరులకు దిమ్మతిరిగిపోయేలా...
వయసు కేవలం 20 సంవత్సరాలు. అయితేనేం సంపాదనలో మహా మహా మిలీనియర్లతో సైతం పోటీపడింది. చివరకు ఫోర్బ్స్లిస్ట్లో చోటు సంపాదించుకుని కుబేరులకు దిమ్మతిరిగే షాకిచ్చింది. న్యూయార్క్: అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్.. వయసు 20 ఏళ్లు మాత్రమే.. కైలీ ఏం చేస్తే అదే ఫ్యాషన్. యువత బ్లైండ్‌గా ఆమె స్టైల్‌ను ఫాలో అయిపోతుంటారు. రెండేళ్ల క్రితం కైలీ కాస్మోటిక్స్ పేరిట ఓ సంస్థను ప్రారంభించగా.. అది కాస్త 630 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ‘100 పర్సంట్’ పేరిట లిప్ కిట్(29 డాలర్లకు కిట్) అమ్మకాల బిజినెస్‌ను ప్రారంభించి.. రెండేళ్లలో గణనీయంగా ఆదాయాన్ని వెనకేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆదాయం టాక్స్ మినహాయింపులుపోనూ సుమారు 900 మిలియన్ డాలర్లపై(భారత కరెన్సీలో 6 వేల కోట్లకుపై మాటే). ఈ మేరకు ఫోర్బ్స్ మాగ్జైన్ ప్రత్యేక శీర్షికలో ఆమె గురించి ఓ వ్యాసం ప్రచురించింది. యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ యూఎస్ బిలినియర్ పేరిట కైలీ గురించి ఆ ప్రత్యేక కథనం ప్రస్తావించింది. గతంలో ఈ రికార్డు ఫేస్బుక్ యాజమాని మార్క్ జుకర్‌బర్గ్(23) పేరిట ఉండగా.. ఇప్పుడు కైలీ(20) ఆ రికార్డు బద్ధలు కొట్టింది. ఇదిలా ఉంటే కైలీ ప్రముఖ మోడల్, నటి కిమ్ కర్దాషియన్‌కు బంధువు. ట్రావిస్ స్కాట్‌తో రిలేషన్ షిప్లో ఉన్న కైలీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. పలు టీవీ షోలు, సినిమాల్లో సైతం నటించిన ఈ యంగ్ మోడల్‌కు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. -
ఒక్క ట్వీట్‌తో 7వేల కోట్లకు ముంచేసింది
వాషింగ్టన్ : రియాల్టీ టీవీ స్టార్, ప్రముఖ మోడల్ కైలీ జెన్నర్ చేసిన ఒక్క ట్వీట్ సోషల్ మీడియా దిగ్గజం స్నాప్ ఛాట్ కొంపముంచింది. షేర్లు మొత్తం ఢమాల్ అన్నాయి. 1.3 బిలియన్ డాలర్లు (సుమారు 7వేల కోట్లకు పైగా) నష్టాన్ని సంస్థకు కలగజేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. స్నాప్ ఛాట్ ఇక మీదట ఎవరైనా తెరవకూడదనుకుంటున్నారా? అది నేనే అనుకుంటున్నారా? ఇది చాలా బాధకరం అంటూ 19 ఏళ్ల కైలీ ఓ ట్వీట్ చేసింది. 24.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె ట్విట్టర్ ఖాతా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే ఆ వెంటనే అయినప్పటికీ నువ్వే నా తొలిప్రేమ.. నువ్వంటే నాకిష్టం అంటూ స్నాప్ ఛాట్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 8శాతం పైగా షేర్లు పడిపోయి వాల్ స్ట్రీట్ వద్ద 6 శాతానికి చేరుకుని.. షేర్ విలువ 17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్నాప్ ఛాట్ స్థాపించిన సమయంలో షేర్ ఇదే విలువ ఉండటం విశేషం. కారణం.. ఇన్‌స్ట్రామ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటున్న స్నాప్ ఛాట్ లో మార్పులు కోరుతూ ఖాతాదారులు పెద్ద ఎత్తున్న సంతకాల సేకరణ చేపట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా పిటిషన్‌పై సంతకం చేసి స్నాప్ ఛాట్‌కు సమర్పించారు. అయినప్పటికీ మార్పులు చేసేందుకు స్నాప్‌ఛాట్ విముఖత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కైలీ కూడా అసంతృప్తి వ్యక్తం చేయటం.. వేల కోట్ల నష్టం వాటిల్లటం జరిగిపోయాయి. -
సెన్సేషన్: బాత్రూమ్లో సెలబ్రిటీల సెల్ఫీ..
వాషింగ్టన్: పలు దేశాలకు చెందిన సినీ సెలబ్రిటీలు మెట్ గాలా ఫ్యాషన్ షోలో విభిన్న ఆహార్యంతో అదరగొట్టినా ప్రస్తుతం ఓ సెల్ఫీ వైరల్‌గా మారింది. అమెరికాలోని న్యూజెర్సీలో 69వ వార్షిక మెట్ గాలా ఫ్యాషన్ షో అట్టహాసంగా నిర్వహించారు. ఆ షో లో సోషల్ మీడియా స్టార్ కైలీ జెన్నర్ తీసిన ఓ సెల్ఫీ వివాదాస్పదంగా మారింది. మెట్ గాలా వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా దాదాపు 20 మంది సెలబ్రిటీలు ఓ బాత్రూమ్లోకి వెళ్లగా.. కైలీ తన కెమెరాకు పనిపెబుతూ సెల్ఫీ తీసింది. షో నిర్వాహకులు సెల్ఫీలో ఉన్న సెలబ్రిటీలపై మండిపడుతున్నారు. మెట్ గాల్ రూల్స్ ప్రకారం సాధారణంగానే సెల్ఫీలు దిగడం నిబంధనలకు విరుద్దం. కానీ కెండల్ జెన్నర్, కిమ్ కర్దాషియన్ , లిలీ అల్డ్రిడ్జ్, రాకీ, పబ్ డాడీ, బ్రీ లార్సన్, పారిస్ జాక్సన్, తదితరులు బాత్రూమ్లో గుమిగూడగా కైలీ జెన్నర్ సెల్ఫీ తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలో 20 లక్షల మంది లైక్ చేయగా, 5.1లక్షల మంది ఈ ఫొటోపై కామెంట్ చేయడం విశేషం. ఈ ఫ్యాషన్ ఈవెంట్లో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రాలు పాల్గొని సందడి చేశారు. -
బర్త్‌డే రోజు బాయ్‌ఫ్రెండ్‌కు సర్ప్రైజ్!
లండన్: మోడల్ కైలీ జెన్నర్ తన సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు(శనివారం) తన ప్రియుడు టైగ 27వ పుట్టినరోజు వేడుకలను నిర్వహంచాలని జెన్నర్ ప్లాన్ చేసింది. ఇటీవల హాట్ ఫొటోలతో తరచుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈ మోడల్ మరో ఫ్రెండ్ కింగ్ కైరోతో కలిసి టైగ బర్త్‌డేను సెలబ్రేట్ చేసింది. టైగ పుట్టినరోజు వేడుకలను ఎలా సెలబ్రేట్ చేసిందో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోతో పాటు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ వీడియోలో జెన్నర్, టైగ, కింగ్ కైరోతో పాటు మరో వ్యక్తి కనిపిస్తారు. ఆమె ఇంటి కిచెన్‌లో మొత్తం బెలూన్లతో నిండిపోయింది. టైగ వచ్చి డోర్ తెరవగానే.. జెన్నర్ సహా అక్కడున్న వారు 'హ్యాపీ బర్త్‌డే' అంటూ సాంగ్ పాడి విషెస్ చెప్పారు. ఆ తర్వాత జెన్నర్ తన ప్రియుడు టైగకు అతడి కుమారుడు గిమ్మీ తయారుచేసిన ఓ పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చింది. జెన్నర్ ఇచ్చిన సడన్ సర్ప్రైజ్తో టైగ ఎంతో సంతోషించాడు. గిఫ్ట్ తయారుచేసిన గిమ్మీని అభినందించాడు. ఆపై జెన్నర్ ఇచ్చిన పార్టీని అందరూ ఎంజాయ్ చేశారు. -
'మా అక్కకు ఒక తోడు కావాలి'
డేటింగ్ వెబ్సైట్లలో చేరి ఒంటరి జీవితానికి ఓ తోడు వెతుక్కోవడం పాశ్చాత్యులకు అలవాటే. అదేరీతిలో ఇప్పుడు అక్క కౌర్ట్నీ కర్దాషియన్ కోసం ఓ తోడును వెతికేందుకు హాలీవుడ్ టీవీ నటి కిలీ జెన్నర్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కౌర్ట్నీ పేరిట 'బంబుల్' అనే డేటింగ్ వెబ్సైట్లో ఓ అకౌంట్ ఓపెన్ చేసింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన కౌర్ట్నీ కొన్ని నెలల కిందట తన ప్రియుడు స్కాట్ డిసిక్ తో వేరయింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఒంటరిగా ఉంటోంది. 37 ఏళ్ల కౌర్ట్నీ ఇటీవల తనకంటే చాలా చిన్నవాడైన జస్టిన్ బీబర్ (22)తో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు కథనాలు వచ్చాయి. కాగా, కౌర్ట్నీ ఫొటోలు, ఆమె వయస్సు, చదువు, ఇతర వివరాలు తెలియజేస్తూ డేటింగ్ యాప్‌లో కిలీ ప్రొఫైల్ ఏర్పాటుచేసింది. 'నా దగ్గర కౌర్ట్నీ ఫోన్ నంబర్ ఉంది. ఆమె పాస్వర్డ్ నాకు తెలుసు. ఈ అకౌంట్‌కు వచ్చిన మెసెజెస్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఆమె మెసెజ్‌లు చదివితే నన్ను చంపేస్తుందేమో. అయినా బంబుల్ (యాప్)లో ఆమె ఉండాల్సిన అవసరముంది' అని 20 ఏళ్ల కిలీ పేర్కొంది. డేటింగ్ యాప్‌లో అక్క అకౌంట్ తెరిచిన సందర్భంగా తన అక్కలు కౌర్టీ, ఖ్లోహి కర్దాషియన్ లతో కలిసి ఈ అమ్మడు పార్టీ కూడా చేసుకుంది. -
ఇక ఆమె అతడితో ఉండదట!
లాస్ ఎంజెల్స్: ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్ కైలీ జెన్నర్(18).. ఆమె బాయ్ ఫ్రెండ్ ర్యాపర్ టిగా విడిపోతున్నట్లు తెలుస్తోంది. అతడు తన గర్ల్ ఫ్రెండ్‌కు విపరీతంగా అబద్ధాలు చెప్తుండటంతో విసుగు చెందిన ఆమె తనతో కలిసి ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కైలీ గత రెండేళ్లుగా తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడైన టిగా (26)తో డేటింగ్ చేస్తోంది. కానీ, కొద్ది వారాల కిందటే వారిద్దరి మధ్య అపనమ్మకాలు మొదలయ్యాయట. బాయ్ ఫ్రెండ్ అబద్ధం చెప్తుండటంతో చిర్రెత్తిపోయిన ఈ అమ్మడు అతడితో బందాన్ని తెగదెంపులు చేసుకోవాలని బలంగా నిర్ణయం తీసుకుందట. 'అతడు ఆమెకు వరుసగా అబద్ధాలు చెప్తున్నాడు. అందుకే ఇక ఆమె ఎంతో కాలం అతడితో సాగబోదు. అమె అతడి మాటలను ఇక నమ్మబోదు. గత కొద్ది నెలలుగా చాలా అంశాలపై వారు గొడవపడుతూనే ఉన్నారు. చివరకు ఆమె విడిపోవాలని నిర్ణయం తీసుకుంది' అని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. అయితే, అసలు విషయం మాత్రం అతడికి ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరకడం వల్లే కైలీని నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆ విషయం తెలిసే ఆమె ఇక అతడితో ఉండకూడదని నిర్ణయించుకుందట. -
బ్రేకప్ తర్వాతే చాలా బాగున్నాడట!
లాస్ ఏంజిల్స్: ప్రేమ విఫలమైతే ఎవరైనా విషాదంలో మునిగిపోతారు. విరహంతో రగిలిపోతారు. కానీ హాలీవుడ్ ర్యాపర్ టైగా (26) మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్ కిలీ జెన్నర్‌తో బ్రేకప్ అయ్యాకే చాలా బాగున్నాడట. రియాల్టీ టీవీ షో నటి అయిన కిలీ (18)తో రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు టైగా. ఈ ఇద్దరూ మీడియా ముందు తెగ ప్రేమించేసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రేమబాష్యాలు రాసుకున్నారు. అప్పుడప్పుడు దూరంగా ఉన్నా నిన్నమొన్నటి వరకు చాలా ప్రణయ సల్లాపాలు సాగించారు. ఈ ఇద్దరికీ ఈ మధ్య బ్రేకప్ అయింది. మరీ బ్రేకప్ అయిన తర్వాత 'మీరెలా ఉన్నారు' అని మీడియా ప్రశ్నించగా.. 'నాకేం చాలా బాగా ఉన్నాను. ఎప్పటిలాగే మరింత కష్టపడేందుకు ప్రయత్నిస్తున్నాను. మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి, గొప్ప వాటిని సాధించడానికి కృషి చేస్తున్నాను' అని చెప్పాడు. అటు కిలీ మాత్రం తమ బ్రేకప్ గురించి ఇంతవరకు పబ్లిగ్గా స్పందించలేదు. ప్రస్తుతం తల్లి క్రిస్ జెన్నర్ ఇంట్లో ఉన్నానని, మరికొన్ని రోజులూ ఇక్కడే ఉంటానని ఈ భామ 'స్నాప్‌చాట్' వీడియోస్‌లో తెలిపింది. బ్రేకప్‌తో ఈమె తిరిగి సొంతింటికి వెళ్లిపోయినట్టు చెప్తున్నారు. గతంలో ఇతర అమ్మాయిలతో సాగించిన ప్రేమ సల్లాపాలపై అబద్ధాలు చెప్పడం, విశ్వసనీయంగా ఉండకపోవడంతో టైగాతో కిలీ తెగదెంపులు చేసుకుందట. గతంలో వీరు ఒకసారి బ్రేకప్ చేసుకున్నప్పిటికీ మళ్లీ కలిసిపోయారు. ఈసారి మాత్రం అలా కలిసే చాన్సే లేదంటున్నారు సన్నిహితులు. -
మాకు పెళ్లి కాలేదు.. నేను ప్రెగ్నెంట్ కాదు!
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కైలీ జెన్నర్, ఆమె బోయ్‌ఫ్రెండ్ తైగా మధ్య ఏదో గూడుపుఠాణీ జరిగినట్టు పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రేమజంట తాజాగా పెళ్లి చేసుకుందని, కైలీ గర్భం కూడా దాల్చిందంటూ ఒక్కసారిగా వదంతులు గుప్పుమన్నాయి. దీంతో ఈ జంట ఎక్కడికి వెళ్లినా.. 'ఔనా! మీరు పెళ్లి చేసుకున్నారా? మీకు త్వరలోనే బిడ్డ పుట్టబోతున్నదా' అంటూ విలేకరులు ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఈ జంట తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాము ఇంకా పెళ్లికానీ, నిశ్చితార్థం కానీ చేసుకోలేదని, కైలీ గర్భవతి కాలేదని స్పష్టం చేశారు. 'మీరు గర్భవతా? అని ఎక్కడికెళ్లినా కైలీని అడుతున్నారు. ప్రతిరోజూ ఓ కొత్త కథనం ఈ విషయమై వస్తున్నది. మీకు పెళ్లయిందా? గర్భవతా? అని అడుగుతున్నారు. ఇవన్నీ రూమర్స్ మాత్రమే' అని తైగా తాజాగా లైవ్‌లో తెలిపాడు. కైలీ మాట్లాడుతూ 'నేను ప్రెగ్నెంట్‌ను కాదు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయినా పిల్లల కోసం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు' అని చెప్పింది. -
టీవీ స్టార్ ఇంట్లోకి చొరబడే యత్నం
లాస్ ఏంజెలెస్: రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జెన్నర్ కుటుంబ సభ్యులతో కలిసి లాస్ ఏంజెలెస్ లోని కాలాబాసాస్ ఉన్న తన ఇంట్లో క్రిస్మస్ పండుగ సంబరాలు జరుపుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జెన్నర్ భవంతిలోని సెక్యురిటీ గేటు నుంచి లోపలికి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో దాదాపు పదిసార్లు జెన్నర్ భవంతి సమీపంలో అతడు తచ్చాడినట్టు గుర్తించారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని మానసిక సంబంధ పరీక్షలు నిర్వహించారు. తర్వాత బెయిల్ పై అతడిని విడుదల చేశారు. అయితే నిందితుడి వివరాలు, అతడు ఎందుకు జెన్నర్ భవంతి ఉన్నాడనేది వెల్లడికాలేదు. -
విల్లో వైరల్!
హాలీవుడ్ సూపర్‌స్టార్ విల్‌స్మిత్ గారాల కూతురు విల్లో స్మిత్ నెటిజనులకు పిచ్చెక్కిస్తోంది. ఈ టీనేజీ గుమ్మ ఓ గ్రాఫిక్ షర్ట్ మాటున తన అందాలన్నీ బహిరంగంగా ప్రదర్శించేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్చర్స అప్లోడ్ చేసిన ఈ చిన్నది... పురుష పుంగవులను విపరీతంగా ఉత్తేజితులను చేసేస్తోంది. ముచ్చటపడ్డ కైలీ జెన్నర్ తన వెబ్సైట్లో వీటిని పోస్ట్ చేసింది. మొత్తానికి రంగురంగుల స్లీవ్స్ గ్రాఫిక్ ట్రాన్స్ఫరెంట్ షర్ట్‌తో సామాజిక సైట్స్‌లో ‘టాప్’ లేపేస్తోంది విల్లో. దెబ్బకు లెక్కకు మించి లైకులు... అంతకు మించి షేర్లు... రీ పోస్టులతో ఓవర్‌నైట్ స్టార్ ఇమేజ్ తెచ్చేసుకుందీ సొగసరి. అయితే తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో సదరు పిక్చర్స్ డిలీట్ చేసినా... అప్పటికే ఫ్యాన్స్ షేరింగ్లతో ప్రపంచాన్ని చుట్టేశాయి! -
'నా పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు'
లాస్ ఏంజిల్స్ : తాను మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత అందంగా కనబడుతున్నానని రియాల్టీ స్టార్ కెల్లీ జెన్నర్ స్పష్టం చేసింది. జెన్నర్ తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వల్లే మరింత నాజూకుగా కనబడుతుందన్న రూమర్లను ఆమె ఖండించింది. వచ్చే నెలలో ఓ మ్యాగ్ జైన్ కవర్ పేజీకి ఫోజిచ్చే భాగంలో పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే రూమర్లు వ్యాపించాయి. వాటిపై స్పందిస్తూ.. 'ప్రస్తుతం నాకు ఆ కోరిక లేదు. తన పెదాలు పెద్దవిగా కనిపిస్తున్నా మేకప్ తో నే కవర్ చేస్తున్నా. ప్లాస్టిక్ సర్జరీ ఆవశ్యకత అయితే ఇంకా రాలేదు' అంటూ ఈ 17 ఏళ్ల భామ మురిపెంగా రాగాలు తీస్తోంది. తన ముఖ కవలికల్లో చోటు చేసుకున్న ఆకస్మిక మార్పులే ఆ రూమర్లకు కారణమైన ఉండవచ్చన్న జెన్నర్.. తన ఆకారాన్ని కాపాడుకోవడంతో పాటు మేకప్ అనేది ఎలా వేసుకోవాలో బాగా తెలియడం వల్లే ఇంత అందంగా కనబడుతున్నానని తెలిపింది.