ఆమెను ఎందుకు ఫాలో అవుతున్నారు.. జాన్వీ కపూర్‌పై దారుణంగా ట్రోల్స్ | Janhvi Kapoor gets trolled for her latest pictures in black outfit | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ఆమెను కాపీ కొడుతున్నారు.. జాన్వీ కపూర్‌పై నెటిజన్ల ఆగ్రహం

Published Thu, Dec 8 2022 9:13 PM | Last Updated on Thu, Dec 8 2022 9:15 PM

Janhvi Kapoor gets trolled for her latest pictures in black outfit - Sakshi

దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ . బాలీవుడ్‌లో హిందీలో ధడక్‌గా రీమేక్‌ అయి సూపర్‌ హిట్‌ కొట్టింది. ఈ చిత్రంతోనే వెండితెర అరంగ్రేటం చేసింది హీరోయిన్‌ జాన్వీ కపూర్‌. బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సాధించింది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం 'మిలి' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది భామ. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తోంది. 

(ఇది చదవండి: ఆ ఘటనతో అమ్మ ఒక్కసారిగా షాక్‌కు గురైంది: జాన్వీ కపూర్)

తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది జాన్వీ కపూర్. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎందుకు కైలీ జెన్నర్‌ను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించారు. మరొకరైతే 'కైలీ జెన్నర్ లైట్ వెర్షన్' అంటూ కామెంట్స్ చేశారు. 'జాన్వీ కూడా ప్లాస్టిక్ సర్జరీ చాట్‌లోకి ప్రవేశించింది' అంటూ జాన్వీ కపూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కైలీ జెన్నర్ ఎవరు?:  కైలీ క్రిస్టెన్ జెన్నర్ ఒక అమెరికన్ వ్యాపారవేత్త. రియాలిటీ టెలివిజన్ సిరీస్ 'కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్' 2007 నుంచి 2021 వరకు నటించారు.  కైలీ కాస్మెటిక్స్ కంపెనీకి ఆమె యజమానిగా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా నిలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement