టీవీ స్టార్ ఇంట్లోకి చొరబడే యత్నం | Man arrested at Kylie Jenner mansion for attempted break-in | Sakshi
Sakshi News home page

టీవీ స్టార్ ఇంట్లోకి చొరబడే యత్నం

Published Mon, Dec 28 2015 1:03 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

టీవీ స్టార్ ఇంట్లోకి చొరబడే యత్నం

టీవీ స్టార్ ఇంట్లోకి చొరబడే యత్నం

లాస్ ఏంజెలెస్: రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జెన్నర్ కుటుంబ సభ్యులతో కలిసి లాస్ ఏంజెలెస్ లోని కాలాబాసాస్ ఉన్న తన ఇంట్లో క్రిస్మస్ పండుగ సంబరాలు జరుపుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జెన్నర్ భవంతిలోని సెక్యురిటీ గేటు నుంచి లోపలికి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల కాలంలో దాదాపు పదిసార్లు జెన్నర్ భవంతి సమీపంలో అతడు తచ్చాడినట్టు గుర్తించారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని మానసిక సంబంధ పరీక్షలు నిర్వహించారు. తర్వాత బెయిల్ పై అతడిని విడుదల చేశారు. అయితే నిందితుడి వివరాలు, అతడు ఎందుకు జెన్నర్ భవంతి ఉన్నాడనేది వెల్లడికాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement