
Travis Scott: హాలీవుడ్ స్టార్ కైలీ జెన్నర్, ట్రావిస్ స్కాట్ రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే! ఇటీవలే వీరు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి చర్చనీయాంశంగా మారింది. అందులో కైలీ డైమండ్ రింగ్ ధరించి ఉంది. దీంతో ఆమె ట్రావిస్ స్కాట్‌ను గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు ఎవరికివారే తెగ ఊహించేసుకుంటున్నారు.
కాగా గతంలోనూ కైలీ పెళ్లి చేసుకుందంటూ కథనాలు వెలువడ్డాయి. 2018లో ఆమె JW(ట్రావిస్ అసలు పేరు జేక్వ్స్ వెబ్‌స్టర్) అక్షరాలు ఉన్న బ్యాండు ధరించడంతోపాటు వేలికి వజ్రాల ఉంగరం ఉండటంతో ఆమె పెళ్లి జరిగిపోయిందని ప్రచారం జరిగింది. కానీ కొంతకాలానికి అది వట్టి పుకారేనని తేలిపోయింది. ఇదిలా ఉంటే కైలీ, ట్రావిస్ 2017 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరికి నాలుగేళ్ల వయసున్న కూతురు స్టోర్మీ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొడుకు జన్మించగా, అతడికి వోల్ఫ్ వెబ్‌స్టర్ అని నామకరణం చేశారు.
చదవండి: స్టార్ హీరో సినిమాకు బాయ్ కాట్ సెగ.. ట్విటర్‌లో ట్రెండింగ్
Comments
Please login to add a commentAdd a comment