ఒక్క ట్వీట్‌తో 7వేల కోట్లకు ముంచేసింది | Kylie Jenner Tweet Tanks Snap Chat Shares | Sakshi
Sakshi News home page

Feb 23 2018 9:12 AM | Updated on Aug 25 2018 6:31 PM

Kylie Jenner Tweet Tanks Snap Chat Shares - Sakshi

స్నాప్‌ ఛాట్‌ లోగో.. పక్కన కైలీ జెన్నర్‌

వాషింగ్టన్‌ : రియాల్టీ టీవీ స్టార్‌, ప్రముఖ మోడల్‌ కైలీ జెన్నర్‌ చేసిన ఒక్క ట్వీట్‌ సోషల్‌ మీడియా దిగ్గజం స్నాప్‌ ఛాట్‌ కొంపముంచింది. షేర్లు మొత్తం ఢమాల్‌ అన్నాయి. 1.3 బిలియన్‌ డాలర్లు (సుమారు 7వేల కోట్లకు పైగా) నష్టాన్ని సంస్థకు కలగజేసింది. 

ఇంతకీ విషయం ఏంటంటే.. స్నాప్‌ ఛాట్‌ ఇక మీదట ఎవరైనా తెరవకూడదనుకుంటున్నారా? అది నేనే అనుకుంటున్నారా? ఇది చాలా బాధకరం అంటూ 19 ఏళ్ల కైలీ ఓ ట్వీట్‌ చేసింది. 24.5 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్న ఆమె ట్విట్టర్‌ ఖాతా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే ఆ వెంటనే అయినప్పటికీ నువ్వే నా తొలిప్రేమ.. నువ్వంటే నాకిష్టం అంటూ స్నాప్‌ ఛాట్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

సుమారు 8శాతం పైగా షేర్లు పడిపోయి వాల్‌ స్ట్రీట్‌ వద్ద 6 శాతానికి చేరుకుని.. షేర్‌ విలువ 17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్నాప్‌ ఛాట్‌ స్థాపించిన సమయంలో షేర్‌ ఇదే విలువ ఉండటం విశేషం.

కారణం.. ఇన్‌స్ట్రామ్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటున్న స్నాప్‌ ఛాట్‌ లో మార్పులు కోరుతూ ఖాతాదారులు పెద్ద ఎత్తున్న సంతకాల సేకరణ చేపట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా పిటిషన్‌పై సంతకం చేసి స్నాప్‌ ఛాట్‌కు సమర్పించారు. అయినప్పటికీ మార్పులు చేసేందుకు స్నాప్‌ఛాట్‌ విముఖత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కైలీ కూడా అసంతృప్తి వ్యక్తం  చేయటం.. వేల కోట్ల నష్టం వాటిల్లటం జరిగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement