shares dive
-
స్కామ్‌స్టర్ ‘బాబు’ సెగ: హెరిటేజ్ షేర్లు ఢమాల్
రూ. 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్మాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌తో హెరిటేజ్ స్టాక్ ఢమాల్ అంది. వరుసగా మూడు రోజుల పాటు ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఈ షేరు పాతాళానికి పడియింది. ముఖ్యంగా చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో పెట్టుబడిదారులు కంపెనీ భవిష్యత్తుపై ఆశలో కోల్పోయి, షేర్ల అమ్మకానికి ఎక్కువశాతం మొగ్గు చూపిస్తుండటం గమనార్హం. సోమవారం బీఎస్ఈ హెరిటేజ్ ఫుడ్స్ స్క్రిప్ 7 శాతం నష్టంతో రూ.253 వద్ద ముగిసింది. మంగళవారం కూడా ఈ నష్టాలు కొనసాగాయి. ఏకంగా 13 శాతం కుప్పకూలి 221.45 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్టం రూ. 287.35 , 52 వారాల కనిష్ట ధర రూ.135.15. కాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి డెయిరీ సంస్థ వైస్-ఛైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గాను, కుమారుడు లోకేశ్ భార్య బ్రాహ్మణి నారా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. -
యాపిల్‌కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు
Apple iphone Ban: అమెరికా టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్‌కు భారీ షాక్ తగిలింది. ఐఫోన్ల వాడకంపై నిషేధాన్ని మూడు చైనా మంత్రిత్వ శాఖలతోపాటు, ప్రభుత్వ మద్దతు ఏజెన్సీలు, కంపెనీలకు విస్తరించాలని చైనా యోచిస్తోందన్న నివేదికల నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఏకంగా రెండు రోజుల్లో షేరు సుమారు 6 శాతం నష్టపోయాయి. షేరు ధర సుమారు 175డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ సుమారు 200 బిలియన్ డాలర్లు కోల్పోయింది, గురువారం షేర్లు 2.9 శాతం కుప్పకూలాయి.ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ భారీ పతనాన్ని నమోదు చేసింది. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) యాపిల్ ఉత్పత్తులకు చైనా అతిపెద్ద విదేశీ మార్కెట్. గత ఏడాది కంపెనీ మొత్తం ఆదాయంలో ఐదో వంతు చైనానుంచే. ప్రభుత్వ సంస్థల్లోని అధికారులు ఐఫోన్ల వాడకంపై చైనా ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని తాజాగా మరిన్ని శాఖలకు విస్తరించాలనే, చైనా తాజా నిర్ణయం యాపిల్ మరింత నష్టం తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వార్తపై చైనా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి, యూజర్ల భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం కూడా ఐఫోన్ వాడకంపై నిషేధం విధించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెల కొన్నాయి. 2 కోట్ల ఐఫోన్ అమ్మకాలు ప్రమాదం చైనాలో బ్యాన్, ప్రత్యర్థి హువావే లాంచింగ్స్‌తో కారణంగా యాపిల్ ఏకంగా 20 మిలియన్ల ఐఫోన్ల్అమ్మకాలు ప్రమాదంలోఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, చైనీస్ ప్రభుత్వ ఉద్యోగులు పని కోసం ఐఫోన్లను ఉపయోగించకుండా నిరోధించినట్లయితే యాపిల్ 5 నుండి కోటి ఐఫోన్లు ప్రమాదంలో పడతాయి. కార్యాలయానికి ఐఫోన్లను తీసుకురావడంపై కూడా చైనా నిషేధాన్ని అమలు చేస్తే ఆ సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు , Oppenheimer విశ్లేషకులు యాపిల్ ప్రత్యర్థి Huawei పోటీ కారణంగా మరోకోటి ఐఫోన్ల ఆర్డర్లను కోల్పోయిట్టు అంచనా. హువావే జోరు అతిత్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ కానున్న తరుణంలో చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు Huawei టెక్నాలజీస్ అధునాతన చిప్‌తో Mate 60 స్మార్ట్‌ఫోన్ కొత్త వెర్షన్ ప్రీసేల్స్ను ప్రారంభించింది. అటు ఐఫోన్ల వినియోగంపై అధికారుల నియంత్రణలను చైనా మరింత పెంచే అవకాశం ఉందిన తైపీ మెగా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెన్ హువాంగ్ వ్యాఖ్యానించారు. -
అదానీ గ్రూపు షేర్లకు ఎంఎస్సీఐ షాక్, కానీ..!
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ కార్పొరేట్ మోసాల ఆరోపణల తరువాత అదానీ గ్రూపు భారీగా నష్టాలను మూటగట్టుకుంది. మార్కెట్ క్యాప్‌లో 100 బిలియన్ డాలర్ల కోల్పోయింది. తాజాగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ట్రాకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సీఐ) అదానీ గ్రూపు షేర్ల వెయిటేజీని తగ్గించింది. దీంతో శుక్రవారం కూడా మార్కెట్లో అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ షేర్ల నష్టాలు కొనసాగుతున్నాయి. ఇండెక్స్ ప్రొవైడర్ఎంఎస్సీఐ) నాలుగు అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ డిగ్జినేషన్లను ఫ్రీఫ్లోట్‌ను తగ్గించింది. అయితే దాని గ్లోబల్ ఇండెక్స్‌ల నుండి ఏ స్టాక్లను తొలగించలేదని తెలిపింది. జనవరి 30 నాటికి ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ ఏసీసీ ఫ్రీ ఫ్లోట్లను తగ్గించింది. నువామా ఆల్టర్నేటివ్ & క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంచనాల ప్రకారం, ఈ చర్య తీసుకున్నది. మిగిలిన అదానీ గ్రూప్ కంపెనీలకు ఉచిత ఫ్లోట్లు అలాగే ఉంటాయని తెలిపింది. నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల నుండి మొత్తం 428 మిలియన్ డాలర్ల ఔట్ ఫ్లో ఉంటుందని ఎంఎస్సీఐ అంచనా వేసింది. ఇందులో అదానీ ఎంటర్ప్రైజెస్ 161 మిలియన్ డాలర్ల, అదానీ ట్రాన్స్మిషన్ 145 మిలియన్ డాలర్ల , అదానీ టోటల్ గ్యాస్ 110 మిలియన్ డాలర్లు, ఏసీసీ 12 మిలిన్ డాలర్లు ఉంటాయని తెలిపింది. అలాగే ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, సీసీ పవర్ & ఇండస్ట్రియల్లను జోడించగా బయోకాన్‌ను తొలగించింది. తాజా మార్పులు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయి. షేర్ల పతనం ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ 8శాతం, అదానీ టోటల్ గ్యాస్ 6.4 శాతం అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం అదానీ విల్మార్ 3 శాతం క్షీణించాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ, ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్ లాభాల్లు ఉన్నాయి. -
జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే?
సాక్షి, ముంబై: భారతీయ ఫుడ్ డెలివరీ కంపెనీ జోమాటోకు భారీ షాక్ తగిలింది. సోమవారం నాటి మార్కెట్లో జొమాటో షేర్లు రికార్డు స్థాయిలో 14.3 శాతం కుప్పకూలాయి. లిస్టింగ్ తరువాత షేర్ లాకిన్ పీరియడ్ ముగియడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే జీవితకాలపు కనిష్టం 50.05ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత మరో రికార్డు కనిష్ట స్థాయి రూ.47.50కి చేరుకుంది. 2021 లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు, ఉద్యోగులు ఇతర పెట్టుబడిదారుల ఒక ఏడాది లాక్-ఇన్ పీరియడ్ ముగియడంతో జొమాటో షేర్లు రికార్డు పతనాన్ని నమోదు చేసింది. ఈ రోజు 14 శాతానికిపై గా క్రాష్ కాగా, లిస్టింగ్ అయినప్పటి నుండి జొమాటో విలువలో 60శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి.జూలై 23, 2021న ముంబై మార్కెట్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రానున్న ఆర్బీఐ పాలసి సమావేశాల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. ఫలితంగా సెన్సెక్స్ 400 పాయింట్లు కుప్పకూలగా,నిఫ్టీ 118 పాయింట్లు పతనమైంది. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. అటు ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ షేరు కూడా 4 శాతం నష్టపోయింది. ఇది కూడా చదవండి: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? -
హైకోర్టు షాక్ : ఫ్యూచర్ గ్రూపు షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ తగిలింది. రిలయన్స్ రీటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ కిషోర్ బియానీ డీల్‌కు బ్రేక్ పడిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ గ్రూపు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ముఖ్యంగా ఫ్యూచర్ రిటైల్ రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేసింది. దాదాపు 11 శాతం కుప్పకూలి లోయర్ సర్క్యూట్ అయింది. అంతేకాదు తాజా పరిణామంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,029 కోట్లకు పడిపోయింది. (రిలయన్స్ డీల్‌కు బ్రేక్ : బియానీకి భారీ ఎదురుదెబ్బ) ఫ్యూచర్ రిటైల్ మాత్రమే కాదు, అనేక ఇతర ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి. ఫ్యూచర్ కన్స్యూమర్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో 9.15 శాతం పడిపోగా, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 8.95 శాతం క్షీణించింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ షేర్లు కూడా దాదాపు 10 శాతం, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ షేర్లు 4.99 శాతం తగ్గాయి. గడువులోగా అన్ని రెగ్యులేటరీ ఆమోదాలను పొందడంలో ఫ్యూచర్ రిటైల్ విఫలమైతే, రిలయన్స్ ఈ ఒప్పందానికి దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రభావితమైంది. కాగా ఫ్యూచర్ రిటైల్ రూ .24,713 కోట్ల ఒప్పందానికి వ్యతిరేకంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సియాక్) జారీ చేసిన ఎమర్జెన్సీ అవార్డు (ఇఎ) ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు గురువారం రద్దు చేసింది. కంపెనీ ఉద్దేశపూర్వంగానే ఉత్తర్వులను నిర్లక్క్ష్యం చేసిందని పేర్కొన్న కోర్టు, బియానీతో ఇతర ప్రముఖుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ముత్తూట్‌లో బంగారం క్షేమమేనా? షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : బంగారు రుణ సంస్థ ముత్తూట్ గ్రూపు చైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) అనుమానాస్పద మరణం ఇన్వెస్టర్ల సెంటిమెంటును తీవ్రంగా ప్రభావితం చేసింది. వీంతో సోమవారం బుల్ మార్కెట్లో కూడా ముత్తూట్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆరంభంలోనే 6.57 శాతం క్షీణించి బీఎస్ఈలో 1205 రూపాయల ఇంట్రాడే కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3 శాతం వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు సంస్థ పెద్ద మరణంతో ముత్తూట్ ఫైనాన్స్ లో తమ బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్న వినియోగదారుల్లో భారీ ఆందోళన నెలకొంది. (Muthoot Group: ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ దుర్మరణం) జార్జ్ ముత్తూట్ అకాలమరణంపై విచారం వ్యక్తం చేసిన ముత్తూట్ ఫైనాన్స్ ఆయన నాయకత్వంలో సరికొత్త వృద్ధిని నమోదు చేసిందని, గోల్డ్ లోన్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ అయ్యిందని కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన ఆకస్మిక మరణం కుటుంబం, సన్నిహితులతోపాటు, కంపెనీకి, ఉద్యోగులకు తీరని నష్టమంటూ సంతాపాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ముత్తూట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది, కానీ ఆయన మరణానికి కారణం కంపెనీ ప్రస్తావించలేదు. అయితే తన నివాసంలోని నాలుగో అంతస్తునుంచి పడి జార్జ్ ముతూట్ చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేట్‌ను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు దీనిపై ఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డును ఏర్పాటు చేసింది. ఈ కేసులో వారు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారని, ఎయిమ్స్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా వెల్లడించారు. కాగా జార్జ్ ముతూట్ అనుమానాస్పద పరిస్థితుల్లో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. జార్జ్ ముత్తూట్ 1993లో ముత్తూట్ గ్రూపునకు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంస్థ భారీగా విస్తరించింది. గత దశాబ్దంలో మార్కెట్ క్యాప్‌ను దాదాపు ఎనిమిది రెట్ల మేర వృద్ధి చెందేలా కృషి చేశారు. -
రిలయన్స్‌కు డీల్ అనిశ్చితి సెగ
సాక్షి,ముంబై : ఇంధన దిగ్గజ సంస్థలు సౌదీ అరామ్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మధ్య జరిగిన మెగా డీల్‌కు బ్రేక్ పడనుందన్న వార్తలతో ఆర్ఐఎల్ స్టాక్మార్కెట్లో డీలా పడింది. 15 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్‌పై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం నాటి ట్రేడింగ్ లో ఆర్ఐఎల్ షేరు 3 శాతానికి పైగా నష్టపోయింది. పన్నా ముక్తా తపతి చమురు గ్యాస్ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభాలలో 350 కోట్ల డాలర్ల(రూ. 24500 కోట్లు)ను మధ్యవర్తిత్వ బకాయిలను చెల్లించాల్సింది ఉందనీ, ఈ బకాయిలను చెల్లించకముందే చమురు, కెమికల్స్ బిజినెస్‌లో 20 శాతం వాటాను సౌదీ అరామ్కో కంపెనీకి రిలయన్స్ విక్రయించినట్లు ప్రభుత్వం వివరించింది. ఈ ఒప్పందాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. అయితే తాము బకాయిలు చెల్లించవలసిన అవసరంలేదంటూ ఆర్ఐఎల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు రిలయన్స్ కౌంటర్లో అమ్మకాలకు ఎగబడ్డారు. రిలయన్స్తోపాటు పెట్రో నెట్ ఎనర్జీ, గోవా కార్బన్ లాంటి ఎనర్జీ షేర్లు కూడా నష్టపోవడం గమనార్హం. -
కుప్పకూలిన ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు
సాక్షి, ముంబై: సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు భారీగా కుప్పకూలాయి. జపాన్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ దైచీ శాంకో దాఖలు చేసిన కేసులొ రాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్, శివిందర్ సింగ్‌లు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ తలా 1,175 కోట్ల రూపాయలు జమ చేయాలని కోర్టు తెలిపింది. అలాగే ఫోర్టిస్ ఐహెచ్‌హెచ్ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. దీంతోపాటు ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమో మోటో ధిక్కార చర్యల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. తదుపరి విచారణలో ఓపెన్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఫోర్టిస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 161 రూపాయలను తాకిన తరువాత 17 శాతం పతనమయ్యాయి. అయితే ఫోర్టిస్ అనుబంధ సంస్థ ఎస్కార్ట్ హార్ట్ ఇన్సిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్ (ఇహెచ్ఆర్సిఎల్)కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చి స్వల్ప ఊరటనిచ్చింది. ఢిల్లీలోని ఓఖ్లాలోనుంచి సంస్థను తొలగించే చర్యలను కోర్టు రద్దు చేసిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా 2005లో ఇహెచ్ఆర్సిఎల్ ఆసుపత్రి లీజును ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) రద్దు చేయడంతో సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రిట్ పిటిషన్‌ను 2006లో సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. ఆ తరువాత మరోసారి సంస్థ దాఖలు చేసుకున్నస్పెషల్ లీవ్ పిటీషన్‌ను కూడా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తిరస్కరించింది. -
టీడీపీ ఢమాల్ : బాబు ఫ్యామిలీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి : ముంబై: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు 130కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ముందంజ దూసుకుపోతోంది. దీంతో ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకి భారీ షాక్ తగిలింది. అంతేకాదు ఫలితాల సరళి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఖాయం అన్న సంకేతాలందిస్తున్న నేపథ్యంలో బాబు కుటుంబానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫలితాల్లో టీడీపీ ఢమాల్ అనడంతో ఇన్వెస్టర్లు హెరిటేజ్ ఫుడ్స్ కౌంటర్లో అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ఈ షేర్లో భారీ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. బుధవారం రూ. 475 వద్ద ముగిసిన హెరిటేజ్ షేర్ గురువారం ఓపెనింగ్‌లోనే పది శాతంపైగా నష్టపోయి రూ. 411కి పతనమైంది. ప్రస్తుతం 9శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఫలితాలు ముగిసే సమయానికి ఎన్నికల ఫలితాల ప్రభావంతో మరింత కుదేలయ్యే అవకాశం ఉందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపుతోంది. ఏపీ ఫలితాలతో పాటు 13 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతుండగా, అధికార పార్టీ మంత్రులు పలువురు వెనుకంజలో ఉండటం గమనార్హం. -
ఒక్క ట్వీట్‌తో 7వేల కోట్లకు ముంచేసింది
వాషింగ్టన్ : రియాల్టీ టీవీ స్టార్, ప్రముఖ మోడల్ కైలీ జెన్నర్ చేసిన ఒక్క ట్వీట్ సోషల్ మీడియా దిగ్గజం స్నాప్ ఛాట్ కొంపముంచింది. షేర్లు మొత్తం ఢమాల్ అన్నాయి. 1.3 బిలియన్ డాలర్లు (సుమారు 7వేల కోట్లకు పైగా) నష్టాన్ని సంస్థకు కలగజేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. స్నాప్ ఛాట్ ఇక మీదట ఎవరైనా తెరవకూడదనుకుంటున్నారా? అది నేనే అనుకుంటున్నారా? ఇది చాలా బాధకరం అంటూ 19 ఏళ్ల కైలీ ఓ ట్వీట్ చేసింది. 24.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె ట్విట్టర్ ఖాతా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే ఆ వెంటనే అయినప్పటికీ నువ్వే నా తొలిప్రేమ.. నువ్వంటే నాకిష్టం అంటూ స్నాప్ ఛాట్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 8శాతం పైగా షేర్లు పడిపోయి వాల్ స్ట్రీట్ వద్ద 6 శాతానికి చేరుకుని.. షేర్ విలువ 17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్నాప్ ఛాట్ స్థాపించిన సమయంలో షేర్ ఇదే విలువ ఉండటం విశేషం. కారణం.. ఇన్‌స్ట్రామ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటున్న స్నాప్ ఛాట్ లో మార్పులు కోరుతూ ఖాతాదారులు పెద్ద ఎత్తున్న సంతకాల సేకరణ చేపట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా పిటిషన్‌పై సంతకం చేసి స్నాప్ ఛాట్‌కు సమర్పించారు. అయినప్పటికీ మార్పులు చేసేందుకు స్నాప్‌ఛాట్ విముఖత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కైలీ కూడా అసంతృప్తి వ్యక్తం చేయటం.. వేల కోట్ల నష్టం వాటిల్లటం జరిగిపోయాయి. -
అలీబాబావి దొంగ లెక్కలా....?
చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా హోల్డింగ్ లిమిటెడ్ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమవుతున్నాయి. ఫెడరల్ చట్టాలను అతిక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అలీబాబా షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. అలీబాబా అకౌంటింగ్ ప్రాక్టీస్ లపై అమెరికా రెగ్యులేటర్స్ విచారణ కొనసాగిస్తున్నాయి. అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా తప్పుడు ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టిందనే ఆరోపణలతో పాటు, ఆలీబాబా ప్రవేశపెట్టిన "సింగల్ డే" ప్రమోషన్ స్కీమ్ పై వ్యతిరేక ఆరోపణలు ఆ కంపెనీపై వచ్చాయి. దీంతో సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(సెక్) ఈ కంపెనీపై ఈ ఏడాది మొదటి నుంచి విచారణ కొనసాగిస్తోంది. సెక్ ప్రధానంగా లాజిస్టిక్ సంస్థ కైనియో నెట్ వర్క్ పై ఎక్కువగా దృష్టిసారించింది. అలీబాబా గ్రూప్ లో ఈ సంస్థ 47శాతం వాటా కలిగిఉంది. సాధారణంగా కంపెనీలో జరిగిన లావాదేవీలకు అకౌంటింగ్ ప్రాక్టీస్ లు ఎలా ఉన్నాయి. "సింగల్ డే" అమ్మకాల వార్షిక డేటా ఎలా ఉందో అనే దానిపై సెక్ విచారణ సాగిస్తుందని ఆలీబాబా వార్షిక రిపోర్టు నివేదించింది. అమెరికాలో బ్లాక్ ప్రైడే, సైబర్ మండే షాపింగ్ ఈవెంట్స్ కంటే నవంబర్ 11 సింగల్ డే చేపట్టిన ప్రమోషన్ ఫలితాలు ఎలా ఎక్కువగా ఉన్నాయని కొంతమంది వ్యాపారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గతేడాది 1400 కోట్ల డాలర్ల లావాదేవీలను సింగిల్ డే ప్రమోషన్ పై కంపెనీ ఆర్జించింది. కాగా అయితే సెక్ అథారిటీల విచారణలకు తాము సహకరిస్తున్నామని అలీబాబా తెలిపింది. సెక్ విచారణలో తమ పారదర్శకత ఎలాగైనా బయటపడుతుందనే ఆశాభావం యక్తంచేస్తోంది.