సాక్షి, ముంబై: భారతీయ ఫుడ్ డెలివరీ కంపెనీ జోమాటోకు భారీ షాక్ తగిలింది. సోమవారం నాటి మార్కెట్లో జొమాటో షేర్లు రికార్డు స్థాయిలో 14.3 శాతం కుప్పకూలాయి. లిస్టింగ్ తరువాత షేర్ లాకిన్ పీరియడ్ ముగియడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే జీవితకాలపు కనిష్టం 50.05ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత మరో రికార్డు కనిష్ట స్థాయి రూ.47.50కి చేరుకుంది.
2021 లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు, ఉద్యోగులు ఇతర పెట్టుబడిదారుల ఒక ఏడాది లాక్-ఇన్ పీరియడ్ ముగియడంతో జొమాటో షేర్లు రికార్డు పతనాన్ని నమోదు చేసింది. ఈ రోజు 14 శాతానికిపై గా క్రాష్ కాగా, లిస్టింగ్ అయినప్పటి నుండి జొమాటో విలువలో 60శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి.జూలై 23, 2021న ముంబై మార్కెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు రానున్న ఆర్బీఐ పాలసి సమావేశాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. ఫలితంగా సెన్సెక్స్ 400 పాయింట్లు కుప్పకూలగా,నిఫ్టీ 118 పాయింట్లు పతనమైంది. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. అటు ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ షేరు కూడా 4 శాతం నష్టపోయింది.
ఇది కూడా చదవండి: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment