అలీబాబావి దొంగ లెక్కలా....?
చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా హోల్డింగ్ లిమిటెడ్ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమవుతున్నాయి. ఫెడరల్ చట్టాలను అతిక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అలీబాబా షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. అలీబాబా అకౌంటింగ్ ప్రాక్టీస్ లపై అమెరికా రెగ్యులేటర్స్ విచారణ కొనసాగిస్తున్నాయి. అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా తప్పుడు ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టిందనే ఆరోపణలతో పాటు, ఆలీబాబా ప్రవేశపెట్టిన "సింగల్ డే" ప్రమోషన్ స్కీమ్ పై వ్యతిరేక ఆరోపణలు ఆ కంపెనీపై వచ్చాయి. దీంతో సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(సెక్) ఈ కంపెనీపై ఈ ఏడాది మొదటి నుంచి విచారణ కొనసాగిస్తోంది.
సెక్ ప్రధానంగా లాజిస్టిక్ సంస్థ కైనియో నెట్ వర్క్ పై ఎక్కువగా దృష్టిసారించింది. అలీబాబా గ్రూప్ లో ఈ సంస్థ 47శాతం వాటా కలిగిఉంది. సాధారణంగా కంపెనీలో జరిగిన లావాదేవీలకు అకౌంటింగ్ ప్రాక్టీస్ లు ఎలా ఉన్నాయి. "సింగల్ డే" అమ్మకాల వార్షిక డేటా ఎలా ఉందో అనే దానిపై సెక్ విచారణ సాగిస్తుందని ఆలీబాబా వార్షిక రిపోర్టు నివేదించింది. అమెరికాలో బ్లాక్ ప్రైడే, సైబర్ మండే షాపింగ్ ఈవెంట్స్ కంటే నవంబర్ 11 సింగల్ డే చేపట్టిన ప్రమోషన్ ఫలితాలు ఎలా ఎక్కువగా ఉన్నాయని కొంతమంది వ్యాపారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గతేడాది 1400 కోట్ల డాలర్ల లావాదేవీలను సింగిల్ డే ప్రమోషన్ పై కంపెనీ ఆర్జించింది.
కాగా అయితే సెక్ అథారిటీల విచారణలకు తాము సహకరిస్తున్నామని అలీబాబా తెలిపింది. సెక్ విచారణలో తమ పారదర్శకత ఎలాగైనా బయటపడుతుందనే ఆశాభావం యక్తంచేస్తోంది.