Huge losses
-
భారీ నష్టాల్లో శ్యాంసంగ్..రికార్డు స్థాయిలో పడిపోయిన సేల్స్
-
10 నిమిషాల్లో రూ. 230 కోట్లు మాయం..! బొక్కబోర్ల పడిన ఇండియన్ వారెన్ బఫెట్..!
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు..! ఓడలు బండ్లు..బండ్లు ఓడలవ్వడానికి ఎంత సమయం పట్టకపోవచ్చు. స్టాక్ మార్కెట్లలో మరీను..! ఎప్పుడూ భారీ లాభాలను తెచ్చి పెట్టే కంపెనీల షేర్లు.. అప్పుడప్పుడు భారీ నష్టాలను కూడా తెచ్చి పెడతాయి. ఇలాంటి సంఘటనే ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు కూడా ఎదురైంది. అప్పుడు లాభాలు..ఇప్పుడు నష్టాలు..! బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో టాటా కంపెనీ షేర్లు అత్యంత ముఖ్యమైనవి. ఒకానొక సమయంలో టాటా కంపెనీ షేర్లు బిగ్‌బుల్‌కు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. గత కొద్ది రోజల నుంచి దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. బలహీనమైన గ్లోబల్ మార్కెట్ల సూచనలు, ఒమిక్రాన్ భయాలు, ఫెడ్ నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ రోజు నిఫ్టీ 381 పాయింట్లు పతనమై 16,604 స్థాయిలను తాకగా, బీఎస్ఈ సెన్సెక్స్ 1250 పాయింట్లు నష్టపోయి 55,761 స్థాయిలను తాకింది. స్టాక్ మార్కెట్స్ నష్టాల బ్లడ్ బాత్‌లో బిగ్ బుల్ రాకేష్ తడిసిపోయారు. సూచీలు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఏకంగా రెండు టాటా స్టాక్స్‌లో సుమారు రూ. 230 కోట్లను కోల్పోయాడు బిగ్బుల్. టైటాన్ కంపెనీ ద్వారా రూ. 170 కోట్లను, టాటా మోటార్స్‌తో రూ. 60 కోట్ల నష్టాలను రాకేష్ మూటకట్టుకున్నారు. టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం... ఈ కంపెనీలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా , అతని భార్య రేఖా ఝున్‌జున్‌వాలా భారీ వాటాలను కలిగి ఉన్నారు. టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 3,37,60,395 షేర్లను, రేఖా ఝున్‌ఝున్‌వాలా 95,40,575 షేర్లను కలిగి ఉన్నారు. అదేవిధంగా టాటా మోటార్స్ షేర్‌హోల్డింగ్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 3,67,50,000 షేర్లను కల్గి ఉన్నారు. భారీగా పతనమైన షేర్లు..! ఈరోజు ఎన్ఎస్ఈలో టైటాన్ కంపెనీ ధర శుక్రవారంతో పోల్చితే రూ. 39.30 తగ్గి రూ. 2238. 15 కు తగ్గింది. అదేవిధంగా టాటా మోటార్స్ షేరు ధర శుక్రవారంతో పోల్చితే రూ. 15.90 తగ్గి రూ. 454.30 కు చేరింది. చదవండి: వేల కోట్ల పన్ను కడుతున్నాడు? ఈ కుబేరుడి దగ్గర ఉన్న సంపద ఎంత? -
మార్కెట్‌పై బేర్ పంజా!
ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. సూచీలు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 871 పాయింట్లు పతనమై 49,180 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 265 పాయింట్లు నష్టపోయి 14,549 వద్ద నిలిచింది. దీంతో ఇరు సూచీలు ఫిబ్రవరి 26 తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు(నేడు) నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు పతనమైంది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు వెంటాడాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఈ ప్రతికూలాంశాలన్నీ దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను, దెబ్బతీశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మేవాళ్లే తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో ఒకదశలో సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 279 పాయింట్ల మేర నష్టపోయాయి. నిఫ్టీ సూచీలోని మొత్తం 50 షేర్లకు గానూ మూడు షేర్లు, సెన్సెక్స్‌లోని 30 షేర్లలో కేవలం రెండు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,952 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.613 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘బేర్స్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరచడంతో బుధవారం సూచీలు రెండుశాతం నష్టపోయాయి. కరోనా ర్యాలీ తర్వాత మార్కెట్లో పెద్దగా దిద్దుబాటు జరగలేదు. అయితే ఇటీవల దేశంలో తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులతో దిద్దుబాటుకు అవకాశాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ పట్ల అప్రమత్తత వహించడంతో పాటు లాంగ్, షార్ట్‌టర్మ్ పొజిషన్లను మెయింటైన్ చేయాల్సిందిగా ట్రేడర్లకు సలహానిస్తున్నాం’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు. ట్రేడింగ్ ఆద్యంతం నష్టాలే.... ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 265 పాయింట్ల నష్టంతో 49,786 వద్ద, నిఫ్టీ 102 పాయింట్ల పతనంతో 14,712 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతతో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేందుకే ఆసక్తి చూపారు. మారిటోరియంపై సుప్రీం తీర్పు తర్వాత బ్యాంకులకు రూ. లక్ష కోట్ల మొండిబకాయిలు(ఎన్పీఏలు) జతవుతాయన్న వార్తలతో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. డాలర్ ఇండెక్స్ బలపడటంతో మెటల్ షేర్లు కరిగిపోయాయి. మిడ్‌సెషన్‌లో విక్రయాల తీవ్రత కాస్త తగ్గి నష్టాలు రికవరీ అవుతున్న తరుణంలో యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం అవడంతో సూచీలు తిరిగి నష్టాల బాటపట్టాయి. ఒకదశలో సెన్సెక్స్ 931 పాయింట్ల నష్టపోయి 49,120 వద్ద, నిఫ్టీ ఇండెక్స్ 279 పాయింట్ల మేర క్షీణించి 14,535 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలను నమోదు చేశాయి. నిమిషానికి రూ.860 కోట్ల నష్టం... సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లు నిమిషానికి రూ.860 కోట్లు నష్టపోయారు. ఆరున్నర గంటల ట్రేడింగ్ సెషన్లో మొత్తం రూ.3.27 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.202 లక్షల కోట్లకు దిగివచ్చింది. అనుపమ్ రసాయన్ వీక్ లిస్టింగ్ 6.6% నష్టంతో రూ. 519 వద్ద ముగింపు న్యూఢిల్లీ: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అనుపమ్ రసాయన్ ఎక్సే్ఛంజీలలో తొలి రోజు నీరసంగా లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 555తో పోలిస్తే బీఎస్ఈలో 3.7% డిస్కౌంట్‌తో రూ.535 దిగు వన ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి 10% వరకూ పతనమై రూ.501కు చేరింది. చివరికి 5.3% నష్టంతో రూ. 526 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ అనుపమ్ రసాయన్ 6.3% తక్కువగా రూ.520 వద్ద లిస్టయ్యింది. ఆపై ఇంట్రాడేలో రూ. 549 వద్ద గరిష్టాన్నీ, రూ.502 వద్ద కనిష్టాన్నీ తాకింది. చివరికి 6.6% కోల్పోయి రూ.519 దిగువన స్థిరపడింది. నష్టాలకు నాలుగు కారణాలు... ► కరోనా భయాలు... మలి దశలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 45 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయి. కేసులు పుంజుకుంటున్న వేళ 18 రాష్ట్రాల్లో కొత్త రకం స్ట్రెయిన్ మరింత కలవరపెడుతోంది. ఊహిం చని రీతిలో పెరుగుతున్న కేసులు క్రమంగా లాక్డౌన్లకు దారితీయవచ్చని, తద్వారా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ తిరిగి కుదేలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ► భౌగోళిక ఉద్రిక్తతలు... అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైన తరువాత ఉత్తర కొరియా తొలిసారిగా పలు క్షిపణులను పరీక్షించడం కలకలం రేపింది. అమెరికా మాత్రం ఈ పరీక్షలను తేలిగ్గానే తీసుకుంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ► బలహీన అంతర్జాతీయ సంకేతాలు... కరోనా వ్యాధి నివారణకు వినియోగించే ఫైజర్ టీకాను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించడంతో ఆసియా ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలతో పాటు ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యల కోసం ఎదురుచూపుల నేపథ్యంలో అంతకుముందు (మంగళవారం)రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. కరోనా కేసుల నివారణకు పలు చోట్ల లాక్డౌన్ విధింపుతో యూరప్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకు చెందిన స్టాక్ సూచీలు బలహీనంగా ప్రారంభమై, స్వల్పనష్టాలతో ముగిశాయి. ► బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ... సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అంతకుముందు రోజు భారీగా ర్యాలీ చేసిన బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. అలాగే మొండిబకీలు భారీగా పెరగవచ్చనే అంచనాలు బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలకు కారణమయ్యాయి. -
బతుకు పూలబాటకాదు
గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుతో బతుకు పూల బాట అవుతుందని, పూలు, కూరగాయల సాగు సిరులు కురిపిస్తుందని భావించారంతా. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రీన్హౌస్ (పాలీహౌస్) పద్ధతిలో సాగు చేపట్టిన రైతులు కోలుకోలేని విధంగా కుదేలయ్యారు. ప్రపంచాన్ని అన్ని విధాలా అతలాకుతలం చేసిన కరోనా గ్రీన్హౌస్ రైతులనూ కాటేసింది. భారీ నష్టాల్లోకి నెట్టేసింది. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. సబ్సిడీ సొమ్ము సైతం రాకపోవడంతో అప్పుల ఊబిలో మునిగిపోయారు. అప్పులు తీర్చేందుకు కొందరు ఇంట్లో బంగారం అమ్ముకుంటే మరికొందరు భూములే అమ్మేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమంది గ్రీన్హౌస్ సాగుకే స్వస్తి పలుకుతున్నారు. సాక్షి, హైదరాబాద్: సాధారణ సాగు పద్ధతులతో ఆదాయం అంతంత మాత్రమే. ఏ పంట వేసినా కాలం కలసివస్తేనే బతుకు. లేకుంటే నష్టాలపాలే. ఈ నేపథ్యంలో 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ను ప్రోత్సహించింది. ప్రత్యేకంగా నిర్మించిన షెడ్ల వంటి వాటి కింద ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ, చీడపీడలకు తావుండని ఈ పద్ధతిలో రైతులు పంటలు పండిస్తే రైతులు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుందని భావించింది. గ్రీన్‌హౌస్‌కు అయ్యే ఖర్చులో ఎక్కువ శాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఏకంగా 95 శాతం, ఇతర వర్గాల రైతులకు 75 శాతం సబ్సిడీ ఇచ్చారు. దీంతో అనేకమంది రైతులు గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుకు ముందుకు వచ్చారు. ఎకరా స్థలంలో గ్రీన్హౌస్ చేపట్టాలంటే రూ. 33.76 లక్షలు వ్యయం కాగా, అందులో ఎస్సీ, ఎస్టీలకు రూ. 32.07 లక్షలు సబ్సిడీ లభిస్తుంది. ఇతర వర్గాలకు రూ. 25.32 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఈ మేరకు 2014–15లో రూ. 250 కోట్లు, 2015–16లో మరో రూ. 250 కోట్లు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మొదటి ఏడాది (2014–15లో) 71 మంది రైతులు 108 ఎకరాల్లో గ్రీన్హౌస్ నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత 2015–16లో ఏకంగా 419 మంది రైతులు వీటిని చేపట్టారు. ప్రస్తుతం వీరి సంఖ్య 988కి చేరింది. 2020–21లో 1,210 ఎకరాల్లో గ్రీన్హౌస్ సాగు జరిగింది. మొదటి ఐదేళ్లూ బాగానే సాగింది. ఈ ఏడాది కరోనా రూపంలో విధి వంచించింది. కరోనా దెబ్బతో విలవిల రాష్ట్రంలో పూలు, కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర అవసరాల్లో కేవలం 30 నుంచి 40% మేరకే స్థానికంగా లభ్యమవుతాయి. మిగతా అవస రాలకు ఇతర ప్రాంతాలపైనే ఆధారపడుతున్నాం. పూలు, కూరగాయల సాగుకు గ్రీన్‌హౌస్‌లు ఎక్కువ అనుకూలమైనవి కావడంతో రాష్ట్ర రైతులు వాటిని సాగు చేయడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు చేశారు. మిగిలిన ఎకరాల్లో కూరగాయల సాగు చేశారు. గతంలో జరబెర వంటి పూల సాగుతో రైతులు మంచి లాభాలు పొందారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి రాష్ట్రాలకు కూడా పూలను ఎగుమతి చేశారు. కానీ ఈ ఏడాది పూలు కోసి మార్కెట్లోకి తీసుకువచ్చే సరికి లాక్డౌన్ మొదలైంది. ఎక్కడికక్కడ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు నిలిచిపోయాయి. పూలను నిల్వ ఉంచడానికి వీలుకాని పరిస్థితుల్లో వందలాది ఎకరాల్లోని క్వింటాళ్ల కొద్దీ పూలు వాడిపోయాయి. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కూరగాయలదీ అదే పరిస్థితి. లాక్డౌన్ ఎత్తేసినా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రైతులకు అందాల్సిన సబ్సిడీ సొమ్ము నిలిచిపోయింది. 2018–19 వరకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌కు నిధులు కేటాయించింది. ఉద్యానశాఖ లెక్కల ప్రకారం రూ.42 కోట్లు రైతులకు బకాయి ఉంది. గ్రీన్హౌస్ నిర్మాణాలకు, ఆ తర్వాత సాగుకు చేసిన లక్షలాది రూపాయల అప్పును తీర్చేందుకు భూములు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. రూ.18 లక్షలు పెడితే పైసా రాలేదు నేను ఈ ఏడాది ఆరెకరాల్లో గ్రీన్హౌస్ సాగు చేపట్టి చామంతి, జరబెర వేశా. చామంతి కటింగ్ చేస్తున్నప్పుడు లాక్డౌన్ వచ్చింది. ఏం చేయడానికీ పాలుపోని పరిస్థితి. రూ.18 లక్షలు పెట్టుబడి పెడితే పైసా రాలేదు. రూ.25 లక్షల విలువైన పూలు మట్టిలో కలిసిపోయాయి. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ సొమ్ము రూ.11.50 లక్షలు కూడా రాలేదు. దీంతో కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయా. ఇప్పుడు పాలీహౌస్లో ఏమీ సాగు చేయడం లేదు. –ఇమ్మడి శ్రీనివాస్, నర్సాపూర్, మెదక్ జిల్లా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు రెండున్నర ఎకరాల్లో గ్రీన్హౌస్ చేపట్టి పూల సాగు చేస్తున్నా. కానీ అనుకున్నంత లాభాలు రాలేదు. ఈ ఏడాది కరోనా దెబ్బకొట్టింది. కీలకమైన సమయంలో పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు జరగకపోవడంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. కరోనా పరిస్థితుల్లో ధైర్యం సరిపోక మళ్లీ జూన్, జూలైల్లో మొక్కలు నాటలేదు. పైగా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు. – నవీన్‌కుమార్, నిజామాబాద్ 23 లక్షల సబ్సిడీ సొమ్ము రావాలి రెండెకరాల్లో పాలీ హౌస్ వేశాను. రూ.30 లక్షలు ఖర్చు చేశాను. ఫ్లాంటేషన్ సబ్సిడీ కింద ఉద్యానశాఖ నుంచి నాకు రూ.23 లక్షలు రావాలి. ఏడాదిన్నర నుంచి రాలేదు. మరోవైపు కరోనా వల్ల పూల మార్కెటింగ్ జరగలేదు. దీంతో నాకు రూ.12 లక్షల నష్టం వాటిల్లింది. – రమావత్ తిరుపతి నాయక్, చెన్నారం, కొండమల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా -
పర్యాటకం పట్టాలెక్కేనా?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం విధించిన లాక్డౌన్ చర్యలతో ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం (టూరిజం), ఏవియేషన్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కరోనా భయంతో ప్రజలు ముఖ్య అవసరాలు మినహాయించి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు తొలి నాళ్లలో సుముఖత చూపలేదు. దీంతో గడిచిన ఏడాది కాలంలో పర్యాటక రంగం భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 1న ప్రకటించే బడ్జెట్లో కచ్చితంగా తమను ఒడ్డెక్కించే చర్యలు ఉంటాయని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. రూ.1.25 లక్షల కోట్ల నష్టం.. కరోనా కారణంగా పర్యాటక రంగం ఒక్కటే 2020లో రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టపోయినట్టు కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పర్యాటక రంగంపై 50 శాతం ప్రభావం పడగా.. మార్చిలో 70 శాతానికి పెరిగింది. ఇదే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో పర్యాటక రంగం రూ.69,400 కోట్ల మేర నష్టపోయిందని కేర్ రేటింగ్స్ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం నష్టాలుగా పేర్కొంది. ఈ రంగం తిరిగి సాధారణ స్థితికి రావాలంటే రెండేళ్లు పడుతుందని అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో పరిశ్రమను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించొచ్చని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశిస్తున్నాయి. పరిశ్రమ డిమాండ్లు.. ► దేశీయంగా చేసే పర్యటనలపై ఆదాయపన్ను మినహాయింపును ఇవ్వాలన్న డిమాండ్‌ను పర్యాటక రంగం ఈ విడత కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. జీఎస్టీ నమోదిత టూర్ ఆపరేటర్లు, ఏజెంట్లు, హోటళ్ల సేవల కోసం రూ.1.5 లక్షల వరకు ఖర్చుపై పన్ను మినహాయింపు ఇవ్వాలి. టూరిజమ్ పరిశ్రమ జీడీపీలో 6.23 శాతం వాటాతో ప్రముఖ పాత్ర పోషిస్తూ.. 8.78 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ సంస్థలు, ఏవియేషన్, ఆతిథ్యం ఇవన్నీ టూరిజమ్ పరిశ్రమ కిందకే వస్తాయి. ► ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వాలని, జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలి. ► గడిచిన 10–12 నెలల కాలంలో దెబ్బతిన్న డిమాండ్‌ను పునరుద్దరించేందుకు తగినన్ని నిధులు కేటాయించి.. కష్టాల నుంచి బలంగా బయటపడేందుకు, డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం సహకరించాలి. ► ఆర్థిక వ్యవస్థ చురుగ్గా మారాలంటే వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ఎత్తివేయాలి. ► ఎంఎస్ఎంఈ మూలధన నిధుల రుణాలను పర్యాటక రంగానికీ విస్తరించడం ద్వారా ఉద్యోగాల కల్పనకు సహకరించాలి. ► రుణాల వడ్డీపై వెసులుబాట్లు, రుణ చెల్లింపులపై మారటోరియం కల్పించాలి. ► ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఎయిర్పోర్ట్ చార్జీలపై లెవీలను, ల్యాండింగ్, నేవిగేషన్ చార్జీలను కూడా తగ్గించాలి. ► లాక్డౌన్లను ఎత్తేసి, ప్రయాణాలపై ఆంక్షలు తొలగించిన అనంతరం పర్యాటక రంగంలో క్రమంగా పురోగతి కనిపిస్తోంది. వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తుండడం, మరోవైపు టీకాల కార్యక్రమం కూడా మొదలైనందున రానున్న నెలల్లో మంచి వృద్ధి ఉంటుందని ఈ రంగం అంచనా వేస్తోంది. ప్రభుత్వపరమైన సహకారం తోడైతే తాము మరింత వేగంగా పురోగమించొచ్చని భావిస్తోంది. ఆతిథ్య రంగాన్ని ముందుగా ఒక పరిశ్రమగా గుర్తించాలి. అద్దె ఇళ్ల విధానాన్ని తీసుకురావాలి. ఈ రెండు ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాము. పరిశ్రమ ఎంత వేగంగా పుంజుకుంటుందన్నది ప్రభుత్వ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. – కృష్ణ కుమార్, సీఈవో, ఇస్తారా పార్క్స్ 2022 నాటికి దేశీయంగా 22 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. ఇందులో భాగంగా పర్యాటక రంగానికి వెన్నెముకగా నిలిచే హోటళ్లకు ప్రభుత్వం పూర్తి మద్దతునివ్వాలి. ఎంఎస్ఎంఈ వర్కింగ్ క్యాపిటల్ రుణాలను టూరిజమ్ పరిశ్రమకూ ఇవ్వాలి. ఎల్‌టీసీజీని వెనక్కి తీసుకోవాలి. – రోహిత్ వారియర్, వారియర్ సేఫ్ సీఈవో వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు దేశీయ పర్యాటక రంగానికి మేలు చేస్తుంది. –దీప్‌కల్రా,మేక్మైట్రిప్ వ్యవస్థాపకుడు -
బీపీసీఎల్ నష్టం రూ.1,361 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలు వచ్చాయి. రిఫైనింగ్ మార్జిన్లు బలహీనంగా ఉండటం, ఇన్వెంటరీ నష్టాలు భారీగా ఉండటం, లాక్డౌన్ కారణంగా అమ్మకాలు తగ్గడం...ఈ కారణాల వల్ల గత క్యూ4లో ఈ కంపెనీకి రూ.1,361 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ రూ.1,261 కోట్ల నికర లాభం సాధించింది. కాగా, ఆదాయం 8 శాతం తగ్గి రూ.68,991 కోట్లకు చేరిందని బీపీసీఎల్ వెల్లడించింది. n అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,703 కోట్ల నిర్వహణ లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.619 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి. n గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రూ.1,081 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. n చమురు ఉత్పత్తి సీక్వెన్షియల్‌గా 0.23 శాతం తగ్గి 8.39 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ 2 శాతం లాభంతో రూ.357 వద్ద ముగిసింది. -
దలాల్ స్ట్రీట్ లో చమురు సెగ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి భారీ నష్టాలతోనే ముగిసాయి. క్రూడ్ సంక్షోభంతో ఆరంభంలోనే దాదాపు 1000 పాయింట్లను నష్టపోయింది. మిడ్ సెషన్ నుంచి మరింత నష్టాల్లోకి జారుకున్న దలాల్ స్ట్రీట్ ఒక దశలో 1250 పాయింట్లకు పైగా పతనమైంది. చివరల్లో కొంచెం పుంజుకున్నా ఆఖరి నిమిషంలో అమ్మకాల వెల్లువ కురిసింది. దీంతో సెన్సెక్స్ 1011 పాయింట్లు నష్టపోయి 30637 వద్ద, 280 పాయింట్లు పతనమైన నిఫ్టీ 8961 వద్ద ముగిసింది. ఫార్మ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిసాయి. (ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం) ఇండస్ ఇండ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హిందాల్కో, జీ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఓఎన్ జీసీ, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, గెయిల్, మారుతి సుజుకి నష్టపోయాయి. మరోవైపు డా.రెడ్డీస్, భారతి ఇన్ ఫ్రాటెల్, భారతి ఎయిర్టెల్, హీరో మోటో, బ్రిటానియా, సిప్లా, రిలయన్స్, నెస్లే లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 29 పైసలు క్షీణించి రికార్డు కనిష్టం 76.83 వద్ద ముగిసింది. (ఆల్ టైం కనిష్టానికి రూపాయి) చదవండి : రియల్ ఛాలెంజ్ : ఈ దంపతులు ఏం చేశారంటే సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా -
మార్కెట్ లాక్డౌన్!
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్ సెషన్లోనూ మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి కిందకుపడిపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఏకంగా 102 పైసలు బలహీనపడి 76.22కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు. ఇంట్రాడేలో రూపాయి విలువ ఏకంగా 76.30నీ చూసింది. వరుసగా 3 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ కొత్త కనిష్టాలను చూస్తోంది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటం, దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు తాజా పరిస్థితి నేపథ్యం. బంగారం 80 డాలర్లు జంప్ మరోవైపు కోవిడ్ భయాలతో బంగారం ఒక్కసారిగా భారీగా పెరిగింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ వార్త రాసే సమయం రాత్రి 11.15కు 84 డాలర్ల లాభంతో 1,568 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లు న్యూఢిల్లీ: కోవిడ్–19 ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో రానున్న 16 రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. స్వల్పకాలిక రెపో వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలను వ్యవస్థలోకి పంప్ చేయాలని నిర్ణయించింది. రూ.50,000 కోట్లకు మొదటి విడత రెపో వేలం సోమవారం జరిగింది. అయితే ఈ మొదటి రెపో వేలం ద్వారా రూ.31,585 కోట్లకు బిడ్లను ఆర్బీఐ పొందింది. 5.16 శాతం కటాఫ్ రేటుకు అన్ని బిడ్లనూ ఆమోదించింది. మరో రూ.50,000 కోట్లకు రెండవ విడత వేలాన్ని మంగళవారం నిర్వహించనుంది. అవసరమైతే తదుపరి కూడా ఇదే విధమైన చర్యలను తీసుకుంటామని ఆర్బీఐ పేర్కొంది. తమ వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను పునఃకొనుగోలు (రీపర్చేజ్) ఒప్పందంపై బ్యాంకులు ఆర్బీఐ వద్ద తనఖాగా ఉంచి ఆ బాండ్ల విలువ మేరకు నిధులను పొందుతాయి. ఈ నిధులపై ఆర్బీఐ కేవలం రెపో రేటు (ప్రస్తుతం 5.15 శాతం) ప్రకారం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. కోవిడ్ నివారణకు యాక్సిస్, వేదాంత చెరో రూ.100 కోట్ల ఫండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్.. కోవిడ్–19 నివారణ చర్యలకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు రూ.100 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్లు, ఉద్యోగులు, వర్తకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ వ్యాప్తికి స్వీయ నియంత్రణే అసలైన మందు అని.. అందుకే బాధ్యత గల పౌరులుగా సామాజిక దూరం పాటించాలని కోరారు. కస్టమర్లు సాధ్యమైనంత వరకు బ్యాంక్‌లకు రావొద్దని, డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అందుకే ఈ నెల 31 వరకు సేవింగ్, కరెంట్ ఖాతాలు, ప్రిపెయిడ్ కార్డ్స్ కస్టమర్లకు చార్జీలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యాక్సిస్‌కు 4,415 శాఖలు, 12,173 ఏటీఎంలు, 2.6 కోట్ల మంది కస్టమర్లున్నారు. వేదాంత కూడా...: దినసరి కార్మికుల కోసం మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత రూ.100 కోట్ల ఫండ్ కేటాయించింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో జీతాలు కుదించబోమని, తాత్కాలిక కార్మికులను సైతం తొలగించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ వన్ టైం ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. కరోనాపె యుద్ధంలో భాగంగా ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలు అండగా నిలవాలని వేదాంత రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. అవసరమైతే మరింత ఫండ్ కేటాయిస్తామని చెప్పారు. కార్మికులకు రిలయన్స్ అండ న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్మికులకు అండగా నిలిచింది. కరోనా వైరస్ నేపథ్యంలో పనులు నిలిచినప్పటికీ కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రూ.30,000లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు చేతిలో నగదు ఉండేలా నెలలో రెండుసార్లు వేతనం చెల్లించనుంది. కరోనా పాజిటివ్ రోగుల చికిత్సకై 100 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని లోధివాలిలో ఐసోలేషన్ ఫెసిలిటీ సైతం అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ మాస్కుల తయారీ సామర్థ్యాన్ని రోజుకు లక్ష యూనిట్లకు పెంచింది. అలాగే సూట్స్, గార్మెంట్స్ వంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తయారీని పెద్ద ఎత్తున చేపట్టింది. స్వచ్చంద సంస్థల సహకారంతో పలు నగరాల్లో జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజనం అందిస్తోంది. అత్యవసర సర్వీసులు మినహా అత్యధిక మంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేలా ప్రోత్సహించింది. -
‘కోవిడ్’పైనే దృష్టి..!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్.. చైనా నుంచి మొదలుకుని అమెరికా స్టాక్ మార్కెట్ వరకు అన్ని దేశాల ప్రధాన సూచీలను కుప్పకూల్చేసింది. ఈ వైరస్ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా బుల్స్ వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దేశీ స్టాక్ మార్కెట్ గతవారంలో భారీ నష్టాలను చవిచూసింది. గడిచిన వారంలో సెన్సెక్స్ 2,873 పాయింట్లు (6.9 శాతం), నిఫ్టీ 879 పాయింట్లు (7.2 శాతం) నష్టపోయాయి. శుక్రవారం ఒక్కరోజులోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1,448 పాయింట్లు పతనమై 38,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 11,202 పాయింట్ల వద్దకు పడిపోయింది. సెన్సెక్స్ చరిత్రలోనే ఇది రెండో అత్యంత భారీ పతనంగా నమోదైంది. ఇంతటి పతనానికి కారణమైన కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారంలో సూచీలు కోలుకునేనా..? కరోనా వైరస్ గురించి ఎప్పుడు ఇంకేం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్లో కోవిడ్–19 కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చైనాలోని వూహాన్లో ఉద్భవించిన ఈ వైరస్.. చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా ఉన్న అమెరికాకు సైతం సోకడం మరింత కలవర పెడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు మార్కెట్ వర్గాల్లో పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం పట్ల ఎంత మేర విజయం సాధిస్తాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కోలుకోవడం అనే అంశం ముడిపడి ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఇక డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం.. జీడీపీ 4.7 శాతంగా నమోదైంది. ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా మార్కెట్ నిలదొక్కుకునేదని ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ విశ్లేషించారు. అంతర్జాతీయ అంశాలు, కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ సూచీలను నడిపిస్తాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్మోడీ అన్నారు. గణాంకాల ప్రభావం... మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం వెల్లడికానుండగా.. సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. అమెరికా మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం విడుదలకానుంది. మరోవైపు శుక్రవారం వెల్లడైన జీడీపీ డేటా ప్రభావం సోమవారం తొలి ట్రేడింగ్ సెషన్‌పై ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆదివారం వెల్లడైన ఆటో రంగ ఫిబ్రవరి నెల అమ్మకాలు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. దేశీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ విక్రయాలు గత నెలలో 1.6% పడిపోయాయి. ఫిబ్రవరిలో రూ. 6,554 కోట్ల పెట్టుబడి... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గతనెల్లో రూ. 6,554 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఫిబ్రవరి 3–28 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ. 1,820 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 4,734 కోట్లను వీరు కుమ్మరించారు. మార్కెట్ గతవారం భారీ నష్టాలను చవిచూసినప్పటికీ.. వీరి పెట్టుబడులు ఈ స్థాయిలో నమోదు కావడం విశేషం. -
భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంనుంచి బలహీనంగా సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఒక దశంలో సెన్సెక్స్ 400పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 11400 స్థాయిని కూడా కోల్పోయింది. మిడ్ సెషన్లో ప్రస్తుతం మెరుగు పడినప్పటికీ ఊగిసలాట కొనసాగుతోంది. ఆఖరి గంట కీలకం. ప్రస్తుతం సెన్సెక్స్ 302 పాయింట్లు కోల్పోయి 38520 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 11429 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ,ఫార్మ తప్ప అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. యస్‌బ్యాంకు, సిప్లా, వేదాంతా, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, హిందాల్కో ,సన్‌ఫార్మి, ఏషియన్ పెయింట్స్, భారతి ఇన్ఫ్రాటెల్ నష్టపోతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్,యూపిఎల్, బీపీసీఎల్ , యాక్సిస్ బ్యాంకు, టెక్‌మహీంద్ర, హీరో మోటా కార్ప్, రిలయన్స్, టైటన్ లాభపడుతున్నాయి. మరోవైపు ఐఆర్సీటీసీ ఐపీవో 30శాతం సబ్ స్కైబ్ అయింది. ఈరోజు ( సోమవారం) మొదలైన ఐపీవో అక్టోబర్ 3న ముగియనుంది. -
వీడని చమురు సెగ : భారీ అమ్మకాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. మిడ్ సెషన్ తరువాత అమ్మకాల ఒత్తిడి భారీగా పెరగడంతో దలాల్ స్ట్రీట్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఒక దశలో 680 పాయింట్లుపైగా పతనమైన సెన్సెక్స్ చివరికి 642 నష్టపోయి 36481 వద్ద ముగియగా, నిఫ్టీ 186 పాయింట్లు క్షీణించి 10817 వద్ద, 10850 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాలు నష్టపోగా, బ్యాంకింగ్, ఆటో, ఫార్మ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది. హీరో మోటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, మారుతి సుజుకి, ఎస్బీఐ, బజాజ్ఆటో, ఇండస్ ఇండ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు గెయిల్, హెచ్‌యూఎల్, ఆసియన్ పెయింట్స్, డీఆర్ఎల్ లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపీ కూడా నష్టపోతోంది. మళ్లీ 72 స్థాయివైపు కదులుతోంది. -
భారీ అమ్మకాలు : ఢమాలన్న దలాల్ స్ట్రీట్
సాక్షి, ముంబై : దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల వెల్లువ అప్రతిహతంగా కొనసాగింది. ఆరంభం నుంచి బలహీనంగా ఉన్న సూచీలు మిడ్ సెషన్ తరువాత మరింత పతనమయ్యాయి. ఒక దశలో 852 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ చివరికి 770 నష్టంతో 36652 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు పతనమై 10797వద్ద స్థిరపడ్డాయి. దీంతో నిఫ్టీ 10800 స్థాయిని కూడా బ్రేక్ చేసింది నిఫ్టీ. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలు ఢమాల్ అన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా, ఆటో, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐసీఐసీఐ, ఐవోసీ, టైటన్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్, వేదాంతా, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, ఐషర్, ఎంఅండ్ఎం, బీపీసీఎల్ నష్టపోయాయి. అయితే ఐడీబీఐ 7శాతం ఎగిసింది. మరోవైపు టెక్ మహీంద్రా, బ్రిటానియా, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటో, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి.అటు డాలరుమారకంలో రూపాయి కూడా భారీగా నష్టపోయింది. డాలరు మారకంలో నేడు ( మంగళవారం) ఒక్కరోజునే ఒకరూపాయి నష్టపోయి 72.28కి స్థాయికి చేరింది. -
భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల షాక్‌తో సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్లు పతనమైంది. నిప్టీ 178 పాయింట్లు కోల్పోయి 10,939 వద్ద ట్రేడవుతోంది. దీంతో సెన్సెక్స్ 37 వేల దిగువకు చేరగా, నిఫ్టీ కూడా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. అన్ని రంగాలూ నష్టపోతున్నాయి. ముఖ్యంగా మెటల్, మీడియా, ఫార్మా, బ్యాంకింగ్ 3-1 శాతం మధ్య నీరసించాయి. ప్రమోటర్ 11 శాతం వాటా విక్రయంతో జీ ఎంటర్టైన్మెంట్ టాప్ లూజర్‌గా ఉంది. వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటామోటార్స్, యస్‌బ్యాంకు, హెచ్‌ఢీఎఫ్‌సీ భారీగా నష్టపోతుండగా, భారతి ఇన్ఫ్రాటెల్, విప్రో, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ నామమాత్రంగా లాభపడుతున్నాయి. -
చివరికి నష్టాలే, 5 నెలల కనిష్టానికి నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో బలహీనంగా ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, దేశీయంగా ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆరంభం లాభాలు అవిరి కాగా సెన్సెక్స్ 289 పాయింట్లు కోల్పోయి 37,397 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 11,085 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 11100 స్థాయిని కూడా కోల్పోయింది. ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు భారీగా నష్టపోయింది. ఐటీ మిగిలిన అన్ని రంగాలూ నష్టల్లోనే ముగిసాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్ 5 శాతం పతనంకాగా.. మెటల్, మీడియా, ఫార్మా, ఆటో రంగాలు 2 శాతం కుప్ప కూలాయి. ఇండియన్ బ్యాంక్ 13 శాతం కుప్పకూలగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీవోబీ, ఓబీసీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, జేఅండ్‌కే, పీఎన్బీ, కెనరా, సెంట్రల్ బ్యాంక్ 7-2.25 శాతం మధ్య నష్టపోయాయి. దీంతోపాటు ఐడీబీఐ, రిలయన్స్ ఇన్ఫ్రా, సెయిల్, దివాన్ హౌసింగ్ భారీ పతనాన్ని నమోదు చేశాయి. యస్ బ్యాంక్, ఇండస్ఇండ్, ఐబీ హౌసింగ్, హీరో మోటో, సన్ ఫార్మా, గ్రాసిమ్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ 9.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాలతో ముగిసాయి. ప్రధానంగా కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజి సిద్ధార్థ అదృశ్యం వార్త కాఫీడే ఎంటర్ప్రైజెస్ షేరును కుదిపివేసింది. దీంతో 20శాతం నష్టాలతో లోయర్ సర్క్యూట్ అయింది. -
అమ్మకాల సెగ : భారీ నష్టాలు
సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. గతవారం భారీగా నష్టపోయిన కీలక సూచీలు సోమవారం కూడా ఏమాత్రం కోలుకోలేదు. సెన్సెక్స్ 271 పాయింట్లకు పైగా కోల్పోగా, నిఫ్టీ కూడా 80 పాయింట్లు పతనమైంది. తద్వారా నిఫ్టీ 11300 పాయింట్ల మధ్య ఊగిసలాడుతోంది. సానుకూల ఫలితాలతో అమరరాజా, రిలయన్స్ లాభపడుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఇంటర్‌గ్లోబ్, ఇండిగో, ఎల్ అండ్‌టీ, ఎస్కార్ట్, ఎం అండ్ఎం, కోటక్ మహీంద్ర, ఇందస్ ఇండ్, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్, అదానీ తదితరాలు భారీగా నష్టపోతున్నాయి. వేదాంతా, టాటా మెటార్స్, యస్ బ్యాంకు, ఆసియన్‌పెయింట్స్, మారుతి సుజుకి, సన్‌ఫార్మ, ఇన్ఫోసిస్,టీసీఎస్, హీరోమోటా కార్ప్ లాభపడుతున్నాయి. దేశీయ కరెన్సీ రుపీ బలహీనంగా ఉంది. డాలరు మారకంలో 69 స్థాయికి దిగజారింది -
వారాంతంలో అమ్మకాల సెగ : మార్కెట్ల పతనం
సాక్షి,ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల సెగ కొనసాగుతోంది. దీంతో ఆరంభ నష్టాలనుంచి సూచీలు మరింద కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 370కి పైగా పాయింట్లు పతనమైంది. అటు నిఫ్టీకూడా 11750 స్థాయిదిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 360 పాయింట్లు క్షీణించి 39,241 వద్ద నిఫ్టీ సైతం 91 పాయింట్లునష్టపోయి 11,741 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ వడ్డీ తగ్గింపు అంచనాలతో గురువారం అమెరికన్ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ.. ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ట్రేడర్లు చేపడుతున్న లావాదేవీలు మార్కెట్లను దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వారాంతంలో షార్ట్‌కవరింగ్ లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా ఫార్మా, ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్, ఐటీ నష్టపోతుండగా, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభపడుతోంది. యస్ బ్యాంక్ 5 శాతం పతనంకాగా, మారుతీ, ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు యూపీఎల్ 4 శాతం ఎగిసింది. హిందాల్కో, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, బ్రిటానియా, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్, ఐబీ హౌసింగ్ లాభపడుతున్న వాటిల్లో ఉన్నాయి. -
కార్పొరేషన్ బ్యాంకు భారీ నష్టాలు
ముంబై: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్ బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. మొండి బకాయిలకు పెద్ద మొత్తంలో చేసిన కేటాయింపులతో నష్టాలు భారీగా రూ.6,581 కోట్లకు పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలం లో వచ్చిన రూ.1,838 కోట్ల నష్టాలతో పోలిస్తే మూడున్నర రెట్లు పెరిగాయి. ఆదాయం సైతం ముందటేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.4,642 కోట్ల నుంచి రూ.4,187 కోట్లకు తగ్గిపోయింది. స్థూల ఎన్పీఏలు మాత్రం 17.35% నుంచి 15.35%కి తగ్గాయి. ఎన్పీఏలకు మార్చి త్రైమాసికం లో బ్యాంకు రూ.8,505 కోట్లను కేటాయించింది. ఇక 2018–19 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్ బ్యాంకు రూ.6,325 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.4,049 కోట్ల నష్టంతో పోలిస్తే పెరిగింది. బీఎస్ఈలో షేరు ధర ఫ్లాట్‌గా రూ.25.50 వద్ద క్లోజయింది. -
స్టాక్‌మార్కెట్లు భారీ పతనం : బ్యాంక్స్, మెటల్ డౌన్
సాక్షి, ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ నెగిటివ్‌గా స్పందించాయి. దీంతో దేశీయంగా కూడా అమ్మకాల జోరందుకుంది. ఆరంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 340 పాయింట్లు పతనమై 37,818 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 11,357వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాలూ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. హిందాల్కో, వేదాంతా, సన్ ఫార్మా, జేఎస్‌డబ్లూ స్టీల్, ఐబీ హౌసింగ్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, ఎస్బీఐ, కొటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం 2.6-1.6 శాతం మధ్య నీరసించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్, సన్‌టెక్, పీనిక్స్, ప్రెస్టేజ్ 3-1 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు ఐవోసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా 2-0.7 శాతం మధ్య బలపడ్డాయి. -
పీఎన్బీ .. మళ్లీ లాభాల్లోకి!!
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో వరుసగా మూడు త్రైమాసికాల పాటు భారీ నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మొత్తానికి మళ్లీ లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 247 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ. 230 కోట్లతో పోలిస్తే ఇది 7.12 శాతం అధికం. తాజాగా మొండిబాకీలకు కేటాయింపులు తగ్గటం ఇందుకు తోడ్పడింది. ఆదాయం సుమారు 3 శాతం క్షీణించి రూ. 15,257 కోట్ల నుంచి రూ. 14,854 కోట్లకు తగ్గింది. వరుసగా మూడు త్రైమాసికాలుగా నష్టాలు ప్రకటిస్తూ వస్తున్న పీఎన్బీ తాజా ఫలితాలు విశ్లేషకుల అంచనాలను తారుమారు చేశాయి. మూడో త్రైమాసికంలో పీఎన్బీ దాదాపు రూ. 1,063 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ‘మా బాధ్యతలన్నీ నిర్వర్తించాం. (నీరవ్ మోదీ ఫ్రాడ్‌కి సంబంధించి) పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేశాము‘ అని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మూడో క్వార్టర్లో దాదాపు రూ. 16,000 కోట్ల మేర మొండిబాకీలు రికవర్ కావడం కూడా పనితీరు మెరుగుపడటానికి తోడ్పడిందని ఆయన వివరించారు. ఎన్పీఏలు తగ్గుముఖం... గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే తాజా క్యూ3లో ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 12.11 శాతం నుంచి 16.33 శాతానికి పెరిగాయి. అయితే, నికర ఎన్పీఏలు మాత్రం 8.90 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఆదాయ పన్ను కాకుండా మొత్తం ప్రొవిజనింగ్ రూ. 4,467 కోట్ల నుంచి రూ. 2,754 కోట్లకు తగ్గాయి. ఇందులో మొండిబాకీలకు చేసిన కేటాయింపులు రూ. 2,566 కోట్లు (ఈ మొత్తంలో నీరవ్ మోదీ ఫ్రాడ్ ప్రొవిజనింగ్ సుమారు రూ. 2,014 కోట్లు). గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 2,996 కోట్లుగా ఉంది. మొండిబాకీలకు కేటాయింపులు సీక్వెన్షియల్‌గా చూస్తే 67 శాతం క్షీణించి రూ. 7,733 కోట్ల నుంచి రూ. 2,566 కోట్లకు తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో పీఎన్బీ షేరు అరశాతం పెరిగి రూ. 73.55 వద్ద క్లోజయ్యింది. -
సెన్సెక్స్ 300 పాయింట్ల పతనం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో భారీనష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు మధ్యలో కొంత కోలుకున్నా, తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభంలో 200పాయింట్లు పతనమైన సెన్సెక్స్ అమ్మకాల ఒత్తిడితో మరింత కుదేలైంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న మార్కెట్లలో సెన్సెక్స్ ప్రస్తుతం 318 పాయింట్ల నష్టంతో 35,937 వద్ద, 36వేల దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 105 పాయింట్ల పతనమై 10,805 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 10800 కిందికి చేరింది. ప్రధానంగా మెటల్, డిసెంబర్ అమ్మకాలు నెమ్మదించడంతో ఆటోరంగం దాదాపు 2శాతం బలహీనపడగా, రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీ 1 శాతం పుంజుకుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు తీవ్ర నిరాశపర్చడంతో ఐషర్ మోటార్స్ పతనం 6. 9 శాతం పతనంకాగా.. తమిళనాడులో స్టెరిలైట్ ఫ్యాక్టరీ విషయంలో ఎదురు దెబ్బ తగలడంతో వేదాంతా 4శాతం పతనమైంది. ఇంకా ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, గెయిల్, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్‌పీసీఎల్, పవర్‌గ్రిడ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంక్, టైటన్, విప్రో లాభపడుతున్నాయి. -
స్టాక్‌మార్కెట్ల భారీ పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలసంకేతాలతో ఆరంభంలోనే డబుల్ సెంచరీ నష్టాలు మూటగట్టకున్న అనంతరం మరింత దిగజారాయి. సెన్సెక్స్ 253 పాయింట్లు పతనమై 35630 వద్ద, నిఫ్టీ 88పాయింట్లు క్షీణించి 10,694 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ 10700 స్థాయికి దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే. మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఇంకా ఎస్బీఐ, ఐసీఐసీఐ తదితర బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. జెఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంతా, టాటా స్టీల్,హిందాల్కోకౌంటర్లు 3శాతం, ఐవోసీ2 శాతం నష్టాల్లో కొనసాగుతోంది. అయితే రూపాయి బలహీనంగాఉండటంతో ఐటీ లాభపడుతోంది. సన్‌ఫార్మ 3శాతం, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాభపడుతున్నాయి. -
భారీ నష్టాలు : 10700 కిందికి నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో ప్లాట్‌గా ఉన్నా అనంతరం అమ్మకాల జోరుతో ఏకంగా 300పాయింట్లకు పైగా పతనమైంది. సెన్సెక్స్ 331 పాయింట్లు కోల్పోయి 35, 437 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 10, 653 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే. మెటల్ బాగా నష్టపోతుండగా టెక్, పార్మా ,పీఎస్‌యూ బ్యాంక్స్ రంగ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. హిందాల్కో, యస్‌బ్యాంక్ 5 శాతం చొప్పున పతనం కాగా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యూపీఎల్, ఐబీ హౌసింగ్, విప్రో, వేదాంతా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అయితే ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఐషర్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలరు మారకంలో రుపీ మంగళవారం బాగా పుంజుకుంది. వరుస సెషన్లుగా స్థిరపడుతూ వస్తున్న రుపీ ప్రస్తుతం 71.48 వద్ద ఉంది. -
భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 450 పాయింట్లు పతనంనిఫ్టీ 100 పాయింట్లు దిగజారింది. ప్రస్తుతం సెన్సెక్స్359 పాయింట్లు పతనమై 33,675వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 10,120 వద్ద ట్రేడవుతోంది. ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే. ఇండియాబుల్స్, బ్రిగేడ్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్, శోభా నష్టపోతుండగా మెటల్ కౌంటర్లలో హిందాల్కో, వేదాంతా, జిందాల్ స్టెయిన్లెస్, ఎన్ఎండీసీ, హింద్ కాపర్, సెయిల్, జిందాల్ స్టీల్, నాల్కో, టాటా స్టీల్ క్షీణించాయి. వీటితోపాటు మదర్సన్ సుమీ, ఐషర్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, టీవీఎస్, హీరోమోటో, మారుతీ, బాష్ కూడా నష్టపోతున్నాయి. మరోవైపు విప్రో, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాభపడుతున్నాయి. -
భారీ పతనం : 34వేల కిందికి సెన్సెక్స్
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో ఆ తరువాత మరింత కుదేలయ్యాయి. దీంతో సెన్సెక్స్ 34వేల కిందికి దిగజారింది. అటు నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 10200కి దిగువకు చేరింది. వరుసగా రెండో రోజు కూడా ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీగా ఉండడంతో సెన్సెక్స్ ప్రస్తుతం దాదాపు 400 పాయింట్లు కుప్పకూలి 33,743 వద్ద నిఫ్టీ 105 పాయింట్లు క్షీణించి 10,105 వద్ద కొనసాగుతున్నాయి. ఒక్క రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగాలూ వెనుకంజలోనే ఉన్నాయి. ప్రధానంగా ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్ నష్టపోతున్నాయి. ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, బీపీసీఎల్, విప్రో, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, అల్ట్రాటెక్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, ఇన్ఫ్రాటెల్ నష్టపోతుండగా, ఐబీ హౌసింగ్ హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, యస్‌బ్యాంక్, ఇండస్ఇండ్, కోల్ ఇండియా, టైటన్, హిందాల్కో, ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ లాభపడుతున్నాయి. మరోవైపు కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా లాభపడింది. -
దలాల్ స్ట్రీట్‌లో భారీ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దసరా పండుగ ఉత్సాహాన్ని ఉసూరుమనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. ఒకదశలో సెన్సెక్స్ 500 పాయింట్ల వరకూ పతనమైంది. ప్రస్తుతం 350పాయింట్లు క్షీణించి 34,429 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు కోల్పోయి 10,333 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా తప్ప అన్ని రంగాల్లోనూ అమ్మకాల ధోరణి నెలకొంది. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఆటో రంగాలు నష్టపోతున్నాయి. మైండ్ ట్రీ 9శాతం కుప్పకూలగా.. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో 4-1.25 శాతం బలహీనంతో కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), యస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ , హీరోమోటో నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు ఇన్ఫ్రాటెల్, గెయిల్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఐవోసీ, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ లాభపడుతున్నాయి. -
ఆరంభ లాభాలు ఆవిరి: భారీ నష్టాలు
సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు లాభాలనుంచి వెనక్కి మళ్లీ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 132 పాయింట్లు పతనమైంది. మిడ్ సెషన్‌నుంచి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అమ్మకాల ఒత్తిడితో ఆరంభ నష్టాలన్నీ అవిరైపోయాయి. తద్వారా సెన్సెక్స్ 35వేల కిందికి, నిఫ్టీ 10450 కిందికి పతనమయ్యాయి. ప్రభుత్వ బ్యాంకు,ఆటో,మెటల్, ఫైనాన్షియల్, ఫార్మ సెక్టార్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. టాటా మోటార్స్, ఎస్బీఐఎన్, టాటా స్టీల్, మారుతి, అదానీ పోర్ట్స్, ఎస్‌బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్, బజాజ్ పైనాన్స్, బీపీసీఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. అలాగే రేమాండ్ గ్రూపు ఫౌండర్, ఛైర్మన్ విజయ్‌పాత్ సింఘానియాను తొలగించడంతో రేమండ్ 3శాతం నష్టపోయింది. కాగా దసరా పండుగ సందర్బంగా రేపు (అక్టోబర్18, గురువారం) మార్కెట్లకు సెలవు. -
భారీ నష్టాలు: మెటల్ మెల్ట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో నష్టాలనుంచి మరింత దిగజారాయి. కీలక సూచీల్లో అమ్మకాల తీవ్రత కొనసాగుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 34, 069 వద్ద నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 10217 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. నిఫ్టీ బ్యాంకు స్వల్పంగా లాభపడుతోంది. ముఖ్యంగా మెటల్ సెక్టార్ భారీగా నష్టపోతోంది. హిందాల్కో, నాల్కో, వేదాంత, ఎన్ఎండీసీ నష్టపోతున్నాయి. ఇంకా విప్రో, భారతి ఇన్ఫ్రాటెల్, హెచ్డీఎఫ్సీ నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి. మరోవైపు గత కొన్ని సెషన్లుగా నష్టపోతూ వస్తున్న ఆయిల్ కంపెనీల షేర్లు 2-4శాతం లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి మరో చారిత్రక కనిష్టానికి చాలా సమీపంలో ఉంది. సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో 14పైసలు నష్టపోయిన రూపాయి 73.95 వద్ద మరో రికార్డు కనిష్టాన్ని తాకింది. -
పెట్రో షాక్, ఆర్బీఐ రివ్యూ : 35వేల కిందికి సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం నాటి భారీ పతనంనుంచి ఎక్కడా కోలుకున్న లక్షణాలు కనిపించ లేదు. సెన్సెక్స్ దాదాపు 300పాయింట్లు పతనమై 35వేల కిందికి దిగజారింది. ప్రస్తుతం సెన్సెక్స్ 218 పాయింట్లు క్షీణించి 34,950 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 10,491వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, కోల్ ఇండియా ఎంఆర్‌పిఎల్ ఇలా అన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు ఐటీసీ, బజాజ్ ఆటో, అదానీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఎస్‌బ్యాంకు, టాటా స్టీల్, హీరో మోటో, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్టెల్ లాభపడుతున్నాయి. ఆర్బీఐ పాలసీ రివ్యూపై ఇన్వెస్టర్లు ప్రధానంగా వేచి చూస్తున్నారు. అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. డాలరు మారకంలో నిన్నటి ముగింపుతో పోలిస్తే శుక్రవారం రూపాయి 22 పైసలు నష్టపోయి 73.56 వద్ద వుంది. -
మార్కెట్ క్రాష్: ఝన్‌ఝన్ వాలా నష్టం ఎంత?
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ల పతనం పెట్టుబడుదారులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా ఇండియన్ వారెన్ బఫెట్, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలాకు భారీ షాక్ తగిలింది. మిడ్ క్యాప్ హోల్డింగ్స్ లో దాదాపు 75శాతం ఆవిరైపోయింది. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా నిలకడగా మిడ్ క్యాప్ షేర్లు ఇటీవల వరుస పతనంతో భారీ నష్టపోయాయి. దీంతో ఆయన పోర్ట్ ఫోలియో వాల్యూ రూ.10,000 కోట్ల దిగువకు చేరింది. దలాల్ స్ట్రీట్ లోని బ్లడ్ బాత్‌తో దిగ్గజ ఇన్వెస్టర్లతో పాటు బడా బాబులకే కోలుకోలేని దెబ్బ తగలగా ఇక సామాన్య ఇన్వెస్టర్ల పరిస్థితి సరేసరి. తాజా గణాంకాల ప్రకారం 2014 సంవత్సరంలో 55 శాతం, 2015లో 7.04 శాతం, 2016లో 8 శాతం, 2017లో 48 శాతం మిడ్ క్యాప్ షేర్లు పెరిగాయి. కానీ ఈ సంవత్సరం మార్కెట్ క్యాప్, మ్యూచువల్ ఫండ్స్‌ను పునర్నిర్వచించడంతో ఒక్కసారిగా మార్కెట్ క్రాష్ కు గురైంది. మిడ్ క్యాప్ కంపెనీలపై ఓవర్ వాల్యూషన్స్ పెరగడంతో ఒత్తిళ్ళకు గురైయ్యాయి. సుదీర్ఘ కాలం స్టాక్స్ ను హోల్డ్ చేసిన ఘనత కలిగిన రాకేష్ ఝన్‌ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలో లోని స్టాక్స్ ఒక్కసారిగా 75 శాతం పతనమయ్యాయి. పోర్ట్ ఫోలియోలోఉన్న 27 స్టాక్స్ లో కేవలం మూడు మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, వీఐపీ ఇండస్ట్రీస్, ల్యూపిన్ స్టాక్స్ తప్ప మిగతా అన్ని స్టాక్స్ 75 శాతం ఢమాల్ అన్నాయి. నష్టపోయిన షేర్లు మందన రిటైల్స్ వెంచర్స్ స్టాక్స్ 75శాతానికి పడిపోయాయి. జయప్రకాష్ అసోసియేట్స్ 74.16 శాతానికి పడిపోయాయి. డీబీ రియాలిటీ 63 శాతం, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 61 శాతం, ఆప్ టెక్ 58 శాతం, ప్రోజోన్ ఇన్ టూ ప్రోపర్టీస్ 58 శాతం, బిల్ కేర్ 51 శాతం, ఓరియంట్ సిమెంట్స్, టీవీ18 బ్రాడ్ కాస్ట్, ప్రకాష్ ఇండస్ట్రీస్, మ్యాన్ ఇన్ఫ్రా , అటోలైన్ ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ , డెల్టా గ్రూప్ షేర్లు 30- 50 శాతానికి పడిపోవడంతో రాకేష్ నష్టపోయారు. -
2 రోజుల్లో రూ. 4.14 కోట్లు హాంఫట్
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. గత ఏడు నెలల్లో స్టాక్ సూచీలు వరుసగా రెండు రోజుల పాటు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమం. భారీ అమ్మకాల ఒత్తిడితో మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ మద్దతు స్థాయిలకు దిగువకు పడిపోయింది. చివరలో సెన్సెక్స్ 509 పాయింట్ల పతనంతో 37,413 వద్ద ముగియగా, నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 11,288వద్ద ముగిసింది. వాణిజ్యలోటు, ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, డాలరు మారకంలో పాతాళానికి పడిపోతున్న రూపాయి, మండుతున్నచమురు ధర, ఫెడ్ రేట్ల పెంపు భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పూనుకున్నారు. దీంతో గత రెండు రోజుల్లో 4 లక్షల కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకు పోయింది. గత రెండు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.14 లక్షల కోట్లు ఆవిరైంది. కాగా సెన్సెక్స్ గత రెండు రోజుల్లో 977 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ రెండు రోజుల్లో రూ.4,14,122 కోట్లు తగ్గి రూ.1,53,25,666 కోట్లకు తగ్గింది. మరోవైపు కీలక సూచీలు మద్దతు స్థాయిల కిందికి చేరిన నేపథ్యంలో మరింత పతనం నమోదు కావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తథ్యమని, దీంతో డాలర్ మరింతగా బలపడుతుందని, విదేశీ నిధులు మరింతగా తరలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అకాల వర్షం..అపార నష్టం
పంటలు బాగా పండి, కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశించిన అన్నదాతకు ఈ ఏడాది నిరాశే మిగులుతోంది.ఆరుగాలం శ్రమించినా ఆవేదన తప్ప ఆనందం లేదు. కరువు, వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు దెబ్బమీద దెబ్బతీస్తున్నాయి. కష్టాల సాగులో కన్నీళ్లే మిగులున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. చేతికంది వచ్చిన పంటలు కళ్లముందే నేలకొరిగాయని వాపోతున్నారు. కడప అగ్రికల్చర్: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం జిల్లాలోని పలుచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. శనివారం ఉదయం వరకు సరాసరి జిల్లా వ్యాప్తంగా 44 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా 340 ఎకరాల్లో (136 హెక్టార్లు) పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతుండగా, అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 ఎకరాల్లో అరటి, మామిడి, కూరగాయ పంటలు, ఉల్లి, బొప్పాయి, ఆకుతోటలకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. 136 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు వర్షానికి జిల్లాలోని పలు మండలాల్లో అరటి, మిరప, బీర,ఉల్లి పంటలు 118 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. దీని కారణంగా రూ.1.75 కోట్ల దిగుబడికి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. రాజంపేట ఉద్యానశాఖ–2 డివిజన్లోని రైల్వేకోడూరు మండలం బొజ్జవారిపల్లె, తూర్పుపల్లె, ఉర్లగడ్డపోడు, ఎగువసూరపుపల్లి, వీపీఆర్ కండ్రిగ, కాపుపల్లి, నారాయణవారిపోడు, ఒ.కొత్తపల్లె గ్రామాల్లో 20 హెక్టార్లలో అరటి పంట దెబ్బతినడంతో రూ.30లక్షల నష్టం సంభవించింది. అలాగే ఓబుళవారిపల్లె మండలం వై.కోట, పెద్ద ఓరంపాడు, బొమ్మవరం, కోర్లకుంట గ్రామాల్లో 40 హెక్టార్లలో అరటి తోటలు నేలకొరిగి రూ.60 లక్షలు ఆదాయాన్ని రైతులు కోల్పోయారు. పుల్లంపేట మండలంలో ఉడుంవారిపల్లె, పెనగలూరు మండలం దామనచర్ల, రాజంపేట మండలం ఆకేపాడు, చెర్లోపల్లె గ్రామాల్లో అరటి, మిరప పంటలు 58 హెక్టార్లలో దెబ్బతినగా రూ.58 లక్షల నష్టం వాల్లింది. అలాగే కడప ఉద్యానశాఖ–1 పరిధిలోని సంబేపల్లె మండలం నారాయణరెడ్డిపల్లె, పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామాల్లో బీర, ఉల్లి పంటలు 0.88 హెక్టార్లలో దెబ్బతినగా రూ.88 వేలు నష్టం వాటిల్లింది. -
ఒక్క ట్వీట్‌తో 7వేల కోట్లకు ముంచేసింది
వాషింగ్టన్ : రియాల్టీ టీవీ స్టార్, ప్రముఖ మోడల్ కైలీ జెన్నర్ చేసిన ఒక్క ట్వీట్ సోషల్ మీడియా దిగ్గజం స్నాప్ ఛాట్ కొంపముంచింది. షేర్లు మొత్తం ఢమాల్ అన్నాయి. 1.3 బిలియన్ డాలర్లు (సుమారు 7వేల కోట్లకు పైగా) నష్టాన్ని సంస్థకు కలగజేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. స్నాప్ ఛాట్ ఇక మీదట ఎవరైనా తెరవకూడదనుకుంటున్నారా? అది నేనే అనుకుంటున్నారా? ఇది చాలా బాధకరం అంటూ 19 ఏళ్ల కైలీ ఓ ట్వీట్ చేసింది. 24.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె ట్విట్టర్ ఖాతా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే ఆ వెంటనే అయినప్పటికీ నువ్వే నా తొలిప్రేమ.. నువ్వంటే నాకిష్టం అంటూ స్నాప్ ఛాట్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 8శాతం పైగా షేర్లు పడిపోయి వాల్ స్ట్రీట్ వద్ద 6 శాతానికి చేరుకుని.. షేర్ విలువ 17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్నాప్ ఛాట్ స్థాపించిన సమయంలో షేర్ ఇదే విలువ ఉండటం విశేషం. కారణం.. ఇన్‌స్ట్రామ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటున్న స్నాప్ ఛాట్ లో మార్పులు కోరుతూ ఖాతాదారులు పెద్ద ఎత్తున్న సంతకాల సేకరణ చేపట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా పిటిషన్‌పై సంతకం చేసి స్నాప్ ఛాట్‌కు సమర్పించారు. అయినప్పటికీ మార్పులు చేసేందుకు స్నాప్‌ఛాట్ విముఖత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కైలీ కూడా అసంతృప్తి వ్యక్తం చేయటం.. వేల కోట్ల నష్టం వాటిల్లటం జరిగిపోయాయి. -
ఫార్మ క్రాష్: మార్కెట్ల భారీ పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో లాభాలతో రికార్డును నమోదు చేసినప్పటికీ భారీ అమ్మకాలతో భారీ పతనాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 360 పాయింట్లు పతనమై 33,370 వద్ద, నిఫ్టీ 102పాయింట్లు క్షీణించి 10,350 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ 10,400కి దిగువకు చేరింది. ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల్లోనూ నష్టాలే. ప్రధానంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ సెక్టార్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. అమెరికా మార్కెట్ రెగ్యులేటరీ వార్నింగ్ లెటర్‌తో లుపిన్ టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు సిప్లా, సన్ ఫార్మా, దివీస్, గ్లెన్‌మార్క్, అరబిందో, పిరమల్, కేడిలా, గ్లాక్సో, డాక్టర్ రెడ్డీస్ నష్టపోయాయి. అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో యూనియన్, పీఎన్బీ, ఓబీసీ, బ్యాంక్ ఆప్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, సిండికేట్, అలహాబాద్, కెనరా బ్యాంక్, బీవోబీ, ఎస్బీఐ, ఐడీబీఐతోపాటు , కాంకర్, బీహెచ్ఈఎల్, జస్ట్ డయల్, భారతి ఎయిర్ టెల్,ఓన్జీసీ, టాటాస్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. కాగా ఎన్బీసీసీ, హెసీఎల్, టెక్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, గోద్రెజ్ కన్జ్యూమర్, ఇన్ఫో ఎడ్జ్ లాభాల్లోముగిశాయి. -
దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాలు:9800 దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: వరుసగా నాలుగో రోజు మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఆసియన్ మార్కెట్ల మిశ్రమ ధోరణి, ఇన్వెస్టర్లు అమ్మకాలతో సెన్సెక్స్ 257 పతనమై 31,342 వద్ద కీలక మద్దతుస్థాయి 31,500 దిగువకు చేరింది. అలాగే నిఫ్టీ 80 పాయింట్లు పతనమై 9,791ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,800 స్థాయిని కూడా బ్రేక్ చేసింది. దాదాపు అన్ని రంగాలు బలహీనంగా ఉండగా ముఖ్యంగా ఫార్మా, మెటల్ బ్యాంకింగ్ సెక్టార్ అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. నిఫ్టీ 50లో 40 షేర్లు నష్టపోతున్నాయి. సన్ ఫార్మా, ఐబీహౌసింగ్, అదానీ పోర్ట్స్,రిలయన్స్,దివీస్ లాబ్స్ హెచ్‌యూఎల్, యాక్సిస్, డాక్టర్ రెడ్డీస్, వేదాంతా, సిప్లా, ఐసీఐసీఐ, టాటా మోటార్స్ డీవీఆర్, ఎస్బీఐ భారీగా నష్టపోతున్నాయి. ఒక్క ఐటీ లాభాల్లో ఉండటం విశేషం. టెక్ మహీంద్రా, ఇన్ఫ్రాటెల్, అంబుజా, ఐవోసీ, టీసీఎస్, ఐటీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు పిరామల్ సంస్థ హౌసింగ్ పైనాన్స్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో పిరామల్ భారీగా లాభపడుతోంది. అటు డాలర్‌మారకంలో దేశీయ కరెన్సీ మరింత పతనాన్నినమోదు చేసింది. డాలర్‌తో పోలిస్తే 0.25పైసల నష్టంతో రూ.65.70 వద్ద ఉంది. రూ.66 స్థాయి పతనానికి చేరువలో ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతోంది. పది గ్రా. రూ.30 నష్టపోయి రూ. 29, 842వద్ద ఉంది. -
టప..టపా..!
- యూరప్ మార్కెట్ల ప్రభావం - చివరి రెండు గంటల్లో అమ్మకాల వెల్లువ - సెన్సెక్స్ 541 పాయింట్లు డౌన్; 26 వేల దిగువకు - 165 పాయింట్ల నష్టంతో 7,812కు నిఫ్టీ యూరప్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలవడంతో మంగళవారం మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్లో అకస్మాత్తుగా పతనం ప్రారంభమైంది. అప్పటివరకూ స్వల్పలాభాలతో ట్రేడైన స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో భారీగా నష్టపోయింది. యూరోప్ మార్కెట్లో అమ్మకాలు పోటెత్తడం, అమెరికా డోజోన్స్ ప్యూచర్స్ భారీ నష్టాలతో ట్రేడవడం, మన వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తగ్గించడంతో మన మార్కెట్లో కూడా ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 66 స్థాయికి పడిపోవడం, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, లాభాల స్వీకరణ, ఫెడ్ రేట్ల పెంపుపై అనిశ్చితి కూడా ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 26 వేలు, నిఫ్టీ 7,900 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 541 పాయింట్లు క్షీణించి 25,652 పాయింట్ల వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు క్షీణించి 7,812 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు సూచీలూ 2.07 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. చివరి రెండు గంటల్లో అమ్మకాలు పోటెత్తాయి. బ్యాంక్, ఇన్ఫ్రా, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. - ఇంట్రాడేలో సెన్సెక్స్ 607 పాయింట్లు. నిఫ్టీ 189 పాయింట్ల చొప్పున పడిపోయాయి. ఇంట్రా డే గరిష్ట స్థాయి నుంచి చూస్తే సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల వరకూ పడిపోయింది. - 30 షేర్ల సెన్సెక్స్‌లోనూ, 50 షేర్ల నిఫ్టీలోనూ నాలుగు షేర్లు(విప్రో, ఇన్ఫీ, మహీంద్రా, సన్‌ఫార్మా)లు మాత్రమే లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో 26 షేర్లు, నిఫ్టీలో 46 షేర్లు నష్టపోయాయి. - వచ్చే వారం ఆర్బీఐ పాలసీ ఉన్న నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు-బ్యాంక్, రియల్టీ, వాహన షేర్లు నష్టపోయాయి. - లోహాలను అధికంగా వినియోగించే చైనాలో ఆర్థిక మందగమనం చోటుచేసుకుంటుందన్న తాజా ఆందోళనలతో లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్(ఎల్ఎంఈ)లో ప్రధాన లోహ ధరలు పతనమయ్యాయి. దీంతో మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు పోటెత్తి లోహ షేర్లు విలవిలలాడాయి. వేదాంత 6.2%, హిందాల్కో 6.2%, కోల్ ఇండియా 5.4%, జిందాల్ స్టీల్ 5%, టాటా స్టీల్ 3%, ఎన్ఎండీసీ 2%, సెయిల్ 2% చొప్పున పతనమయ్యాయి. - ఎన్టీపీసీ 4.5%, లార్సెన్ అండ్ టుబ్రో 4.3 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.5%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.4 శాతం, హెచ్డీఎఫ్సీ 3.2%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.1 శాతం, టాటా స్టీల్ 3 శాతం చొప్పున తగ్గాయి. - ఫోక్స్‌వ్యాగన్ వివాదం నేపథ్యంలో టాటా మోటార్స్ 4.79 శాతం క్షీణించింది. ఫోక్స్‌వ్యాగన్‌కు విడిభాగాలు సరఫరా చేసే మదర్సన్ సుమి షేర్ దాదాపు 8 శాతం పడిపోయింది. - రూ.1,400 కోట్ట జీఎస్టీ కాంట్రాక్టును దక్కించుకోవడం, అమెరికాకు చెందిన టీఓఎంఎస్ షూస్ కంపెనీతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇన్ఫోసిస్ పెరిగింది. - టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,729 కోట్లుగా, ఎన్ఎస్ఈ ఈక్విటీ విభాగంలో రూ.17,421 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,72,191 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,052 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.378 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. - ఆసియా మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. లక్ష కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఇన్వెస్టర్ల సంపద) రూ. 1.36 లక్షల కోట్లు తగ్గి రూ.93.33 లక్షల కోట్లకు పడిపోయింది. పతనం..ప్రధాన కారణాలు యూరో మార్కెట్ల దెబ్బ: ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు దాదాపు 3 శాతం వరకూ పతనమయ్యాయి. ఫోక్స్‌వ్యాగన్ పర్యావరణ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో దక్షిణ కొరియా దర్యాప్తుకు ఆదేశించడం, యూరప్ వ్యాప్తంగా వాహన కంపెనీలపై దర్యాప్తు చేయాలని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి పిలుపునివ్వడం. డోజోన్స్ ఫ్యూచర్స్ 225 పాయింట్ల వరకూ పతనమవడం, చైనా నుంచి డిమాండ్ తగ్గుతుందన్న ఆందోళనలతో రాగి ధరలు పడిపోవడం, వడ్డీరేట్ల పెంపుపై ఫెడ్ నిర్ణయం తర్వాత డాలర్ పుంజుకొని రెండు వారాల గరిష్ట స్థాయికి చేరడం తదితర అంశాలు ప్రభావం చూపాయి. చైనా చింత: చైనాలో బలహీనంగా ఉన్న వృద్ధి కారణంగా మిగిలిన ఆసియా దేశాల్లో కూడా మందగమనం చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెచ్చరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆందోళననలు అంతర్జాతీయంగా సెంటిమెంట్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఏడీబీ ఎఫెక్ట్: భారత వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) 7.8 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. వర్షాలు తగినంతగా లేకపోవడం, ఎగమతులకు డిమాండ్ లేకపోవడం, ఆర్థిక సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆశక్తత వంటి కారణాల వల్ల వృద్ధి అంచనాలను తగ్గించామని ఏడీబీ పేర్కొంది. ఫెడ్ అనిశ్చితి: రేట్ల పెంపు విషయమై ఫెడరల్ రిజర్వ్ అనిశ్చితి మార్కెట్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. రేట్ల పెంపు ఈ ఏడాదే ఉంటుందని ఫెడ్ ఉన్నతాధికారి ఒకరు, వచ్చే నెలలో ఉండొచ్చని మరొక ఫెడ్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడంతో గందరగోళం, అయోమయం పెరిగిపోతున్నాయని క్రెడిట్ సూసీ అసెట్ మేనేజ్మెంట్కు చెందిన రాబర్ట్ పార్కర్ వ్యాఖ్యానించారు. -
సంక్షోభం అంచున ఎర్రబస్సు!
భారీ నష్టాల మధ్య ఆవిర్భవించనున్న టీఎస్ఆర్టీసీ 2013-14లో రూ. 210 కోట్ల నష్టాలు ప్రభుత్వం ఆదుకోవాలంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతోంది. వరుస నష్టాలతో ఏటేటా మరింతగా కునారిల్లుతోంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉమ్మడి రవాణా సంస్థగా కొనసాగుతున్న ఏపీఎస్ ఆర్టీసీ మరికొద్ది రోజుల్లో విభజన కానున్న దశలో... రికార్డు స్థాయి నష్టాలను మూటగట్టుకుని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. త 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా వస్తున్న నష్టాలు.. గుదిబండగా మారనున్నాయి. ఇటీవలి మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణకు సంబంధించిరూ. 210 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం తొలి మాసం ఏప్రిల్‌లోనే రూ. 14.5 కోట్ల నష్టాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకుంటే సంస్థ కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చార్జీలు పెంచకుండానే.. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలంటూ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నష్టాల నుంచి కొంతమేర అయినా కోలుకోవాలంటే టికెట్ చార్జీలను 10శాతం వరకు పెంచేందుకు అనుమతివ్వాలని కోరింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చార్జీలు పెంచేందుకు సుముఖంగా లేరు. ఆర్టీసీని గట్టెక్కించాలంటే టికెట్ చార్జీల పెంపు మాత్రమే పరిష్కారం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంధన వ్యయం, మోటారు వాహనాల పన్ను విషయంలో ప్రభుత్వం ఆదుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. దీంతోపాటు సరైన పర్యవేక్షణ లేకపోవటంతో కొన్నేళ్లుగా ఆర్టీసీలో ఖర్చుల పద్దు గతి తప్పుతోందని, దీనిపై లోతుగా విశ్లేషిస్తే నియంత్రణలోకి వచ్చే అవకాశముందని అంటున్నారు. ‘‘సిబ్బంది జీతభత్యాలతో పాటు డీజిల్ ఖర్చు పెరుగుతోంది. పొదుపు చర్యలు లేకపోవటం, బస్సులు సరైన కండిషన్లో ఉండకపోవటం, డ్రైవర్లకు పునశ్చరణ శిక్షణ లోపించటంతో ఇంధనం వృథా కావడం, కార్యాలయాల నిర్వహణ పేర చూపుతున్న భారీ వ్యయం, తరుగుదల, వడ్డీలు, చిల్లర ఖర్చువంటివి కూడా ఉన్నాయంటున్నారు. * 2013-14 ఆర్థిక సంవత్సరంలో టీఎస్ఆర్టీసీ రూ. 3,742 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇది అంతకుముందు ఏడాది కంటే రూ. 335 కోట్లు మాత్రమే ఎక్కువ. అదే 2013-14 సంవత్సరంలో వ్యయాన్ని రూ. 3,950 కోట్లుగా చూపారు. ఇది ముందటి ఏడాది కంటే రూ. 537 కోట్లు ఎక్కువ. అంటే నష్టం మరింత పెరిగిందన్న మాట. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల (ఏప్రిల్)లో అంతకు ముందు నెల (మార్చి) కంటే ఆదాయం తగ్గిపోయింది. హైదరాబాద్ జోన్ పరిధిలో మార్చిలో రూ. 97 కోట్ల ఆదాయం వస్తే ఏప్రిల్‌లో అది రూ. 92 కోట్లు మాత్రమే. అదే హైదరాబాద్ సిటీ జోన్ పరిధిలో మార్చిలో రూ. 115 కోట్లు రాగా ఏప్రిల్‌లో రూ. 104 కోట్లే నమోదైంది. కరీంనగర్ జోన్ పరిధిలో మార్చిలో రూ. 136 కోట్ల ఆదాయం వస్తే ఏప్రిల్‌లో రూ. 130 కోట్లకు తగ్గింది. * డీజిల్ రూపంలో మార్చిలో రూ. 80 కోట్లు ఖర్చు చూపగా.. ఏప్రిల్‌కు అది రూ. 102 కోట్లకు పెరిగింది. డీజిల్ ఖర్చు పెరిగినా ఆదాయం తగ్గటం గమనార్హం. * ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే హైదరాబాద్ సిటీ జోన్లో రూ. 7.1 కోట్లు, హైదరాబాద్ జోన్లో రూ. 3.8 కోట్లు, కరీంనగర్ జోన్ రూ. 3.4 కోట్ల నష్టాలు నమోదయ్యాయి.