సాక్షి, ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ నెగిటివ్‌గా స్పందించాయి. దీంతో దేశీయంగా కూడా అమ్మకాల జోరందుకుంది. ఆరంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమైంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 340 పాయింట్లు పతనమై 37,818 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 11,357వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాలూ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. హిందాల్కో, వేదాంతా, సన్ ఫార్మా, జేఎస్‌డబ్లూ స్టీల్, ఐబీ హౌసింగ్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, కొటక్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం 2.6-1.6 శాతం మధ్య నీరసించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్, డీఎల్‌ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్, సన్‌టెక్, పీనిక్స్, ప్రెస్టేజ్ 3-1 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు ఐవోసీ, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా 2-0.7 శాతం మధ్య బలపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment