సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా నష‍్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల షాక్‌తో సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్లు పతనమైంది. నిప్టీ 178 పాయింట్లు కోల్పోయి 10,939 వద్ద ట్రేడవుతోంది. దీంతో సెన్సెక్స్ 37 వేల దిగువకు చేరగా, నిఫ్టీ కూడా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. అన్ని రంగాలూ నష్టపోతున్నాయి. ముఖ్యంగా మెటల్, మీడియా, ఫార్మా, బ్యాంకింగ్ 3-1 శాతం మధ్య నీరసించాయి.
ప్రమోటర్ 11 శాతం వాటా విక్రయంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ టాప్ లూజర్‌గా ఉంది. వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటామోటార్స్, యస్‌బ్యాంకు, హెచ్‌ఢీఎఫ్‌సీ భారీగా నష్టపోతుండగా, భారతి ఇన్‌ఫ్రాటెల్, విప్రో, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ నామమాత్రంగా లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment