
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో నష్టాలనుంచి మరింత దిగజారాయి. కీలక సూచీల్లో అమ్మకాల తీవ్రత కొనసాగుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 34, 069 వద్ద నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 10217 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. నిఫ్టీ బ్యాంకు స్వల్పంగా లాభపడుతోంది. ముఖ్యంగా మెటల్ సెక్టార్ భారీగా నష్టపోతోంది. హిందాల్కో, నాల్కో, వేదాంత, ఎన్‌ఎండీసీ నష్టపోతున్నాయి. ఇంకా విప్రో, భారతి ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి. మరోవైపు గత కొన్ని సెషన్లుగా నష్టపోతూ వస్తున్న ఆయిల్ కంపెనీల షేర్లు 2-4శాతం లాభపడుతున్నాయి.
అటు డాలరు మారకంలో రూపాయి మరో చారిత్రక కనిష్టానికి చాలా సమీపంలో ఉంది. సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో 14పైసలు నష్టపోయిన రూపాయి 73.95 వద్ద మరో రికార్డు కనిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment