![Stock market crashes down over 800 points - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/3/sensex.jpg.webp?itok=KPZ68CAF)
సాక్షి, ముంబై : దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల వెల్లువ అప్రతిహతంగా కొనసాగింది. ఆరంభం నుంచి బలహీనంగా ఉన్న సూచీలు మిడ్ సెషన్ తరువాత మరింత పతనమయ్యాయి. ఒక దశలో 852 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ చివరికి 770 నష్టంతో 36652 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు పతనమై 10797వద్ద స్థిరపడ్డాయి. దీంతో నిఫ్టీ 10800 స్థాయిని కూడా బ్రేక్ చేసింది నిఫ్టీ. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలు ఢమాల్ అన్నాయి.
పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా, ఆటో, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐసీఐసీఐ, ఐవోసీ, టైటన్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్, వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, ఐషర్, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్ నష్టపోయాయి. అయితే ఐడీబీఐ 7శాతం ఎగిసింది. మరోవైపు టెక్ మహీంద్రా, బ్రిటానియా, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటో, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి.అటు డాలరుమారకంలో రూపాయి కూడా భారీగా నష్టపోయింది. డాలరు మారకంలో నేడు ( మంగళవారం) ఒక్కరోజునే ఒకరూపాయి నష్టపోయి 72.28కి స్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment