సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో బలహీనంగా ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, దేశీయంగా ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆరంభం లాభాలు అవిరి కాగా సెన్సెక్స్ 289 పాయింట్లు కోల్పోయి 37,397 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 11,085 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 11100 స్థాయిని కూడా కోల్పోయింది.
ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు భారీగా నష్టపోయింది. ఐటీ మిగిలిన అన్ని రంగాలూ నష్టల్లోనే ముగిసాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్ 5 శాతం పతనంకాగా.. మెటల్, మీడియా, ఫార్మా, ఆటో రంగాలు 2 శాతం కుప్ప కూలాయి. ఇండియన్ బ్యాంక్ 13 శాతం కుప్పకూలగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీవోబీ, ఓబీసీ, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, జేఅండ్‌కే, పీఎన్‌బీ, కెనరా, సెంట్రల్ బ్యాంక్ 7-2.25 శాతం మధ్య నష్టపోయాయి. దీంతోపాటు ఐడీబీఐ, రిలయన్స్ ఇన్‌ఫ్రా, సెయిల్, దివాన్ హౌసింగ్ భారీ పతనాన్ని నమోదు చేశాయి.
యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్, ఐబీ హౌసింగ్, హీరో మోటో, సన్ ఫార్మా, గ్రాసిమ్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ 9.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. ఎయిర్‌టెల్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాలతో ముగిసాయి. ప్రధానంగా కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజి సిద్ధార్థ అదృశ్యం వార్త కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ షేరును కుదిపివేసింది. దీంతో 20శాతం నష్టాలతో లోయర్ సర్క్యూట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment