![Huge selling presure in Stockmarkets - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/22/sensex.jpg.webp?itok=qDiAkoeP)
సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. గతవారం భారీగా నష్టపోయిన కీలక సూచీలు సోమవారం కూడా ఏమాత్రం కోలుకోలేదు. సెన్సెక్స్ 271 పాయింట్లకు పైగా కోల్పోగా, నిఫ్టీ కూడా 80 పాయింట్లు పతనమైంది. తద్వారా నిఫ్టీ 11300 పాయింట్ల మధ్య ఊగిసలాడుతోంది.
సానుకూల ఫలితాలతో అమరరాజా, రిలయన్స్ లాభపడుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఇంటర్‌గ్లోబ్, ఇండిగో, ఎల్ అండ్‌టీ, ఎస్కార్ట్, ఎం అండ్‌ఎం, కోటక్ మహీంద్ర, ఇందస్ ఇండ్, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్, అదానీ తదితరాలు భారీగా నష్టపోతున్నాయి. వేదాంతా, టాటా మెటార్స్, యస్ బ్యాంకు, ఆసియన్‌పెయింట్స్, మారుతి సుజుకి, సన్‌ఫార్మ, ఇన్ఫోసిస్,టీసీఎస్, హీరోమోటా కార్ప్ లాభపడుతున్నాయి. దేశీయ కరెన్సీ రుపీ బలహీనంగా ఉంది. డాలరు మారకంలో 69 స్థాయికి దిగజారింది
Comments
Please login to add a commentAdd a comment