
సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు లాభాలనుంచి వెనక్కి మళ్లీ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 132 పాయింట్లు పతనమైంది. మిడ్ సెషన్‌నుంచి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అమ్మకాల ఒత్తిడితో ఆరంభ నష్టాలన్నీ అవిరైపోయాయి. తద్వారా సెన్సెక్స్ 35వేల కిందికి, నిఫ్టీ 10450 కిందికి పతనమయ్యాయి. ప్రభుత్వ బ్యాంకు,ఆటో,మెటల్, ఫైనాన్షియల్, ఫార్మ సెక్టార్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. టాటా మోటార్స్, ఎస్‌బీఐఎన్, టాటా స్టీల్, మారుతి, అదానీ పోర్ట్స్, ఎస్‌బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్, బజాజ్ పైనాన్స్, బీపీసీఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. అలాగే రేమాండ్ గ్రూపు ఫౌండర్, ఛైర్మన్ విజయ్‌పాత్ సింఘానియాను తొలగించడంతో రేమండ్ 3శాతం నష్టపోయింది.
కాగా దసరా పండుగ సందర్బంగా రేపు (అక్టోబర్18, గురువారం) మార్కెట్లకు సెలవు.
Comments
Please login to add a commentAdd a comment