ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా ( ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ల పతనం పెట్టుబడుదారులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది. ముఖ‍్యంగా ఇండియన్ వారెన్ బఫెట్, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలాకు భారీ షాక్ తగిలింది. మిడ్ క్యాప్ హోల్డింగ్స్ లో దాదాపు 75శాతం ఆవిరైపోయింది. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా నిలకడగా మిడ్ క్యాప్ షేర్లు ఇటీవల వరుస పతనంతో భారీ నష్టపోయాయి. దీంతో ఆయన పోర్ట్ ఫోలియో వాల్యూ రూ.10,000 కోట్ల దిగువకు చేరింది. దలాల్ స్ట్రీట్ లోని బ్లడ్ బాత్‌తో దిగ్గజ ఇన్వెస్టర్లతో పాటు బడా బాబులకే కోలుకోలేని దెబ్బ తగలగా ఇక సామాన్య ఇన్వెస్టర్ల పరిస్థితి సరేసరి.
తాజా గణాంకాల ప్రకారం 2014 సంవత్సరంలో 55 శాతం, 2015లో 7.04 శాతం, 2016లో 8 శాతం, 2017లో 48 శాతం మిడ్ క్యాప్ షేర్లు పెరిగాయి. కానీ ఈ సంవత్సరం మార్కెట్ క్యాప్, మ్యూచువల్ ఫండ్స్‌ను పునర్‌నిర్వచించడంతో ఒక్కసారిగా మార్కెట్ క్రాష్ కు గురైంది. మిడ్ క్యాప్ కంపెనీలపై ఓవర్ వాల్యూషన్స్ పెరగడంతో ఒత్తిళ్ళకు గురైయ్యాయి. సుదీర్ఘ కాలం స్టాక్స్ ను హోల్డ్ చేసిన ఘనత కలిగిన రాకేష్ ఝన్‌ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలో లోని స్టాక్స్ ఒక్కసారిగా 75 శాతం పతనమయ్యాయి. పోర్ట్ ఫోలియోలోఉన్న 27 స్టాక్స్ లో కేవలం మూడు మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, వీఐపీ ఇండస్ట్రీస్, ల్యూపిన్ స్టాక్స్ తప్ప మిగతా అన్ని స్టాక్స్ 75 శాతం ఢమాల్ అన్నాయి.
నష్టపోయిన షేర్లు
మందన రిటైల్స్ వెంచర్స్ స్టాక్స్ 75శాతానికి పడిపోయాయి. జయప్రకాష్ అసోసియేట్స్ 74.16 శాతానికి పడిపోయాయి. డీబీ రియాలిటీ 63 శాతం, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 61 శాతం, ఆప్ టెక్ 58 శాతం, ప్రోజోన్ ఇన్ టూ ప్రోపర్టీస్ 58 శాతం, బిల్ కేర్ 51 శాతం, ఓరియంట్ సిమెంట్స్, టీవీ18 బ్రాడ్ కాస్ట్, ప్రకాష్ ఇండస్ట్రీస్, మ్యాన్ ఇన్ఫ్రా , అటోలైన్ ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ , డెల్టా గ్రూప్ షేర్లు 30- 50 శాతానికి పడిపోవడంతో రాకేష్ నష్టపోయారు.
Comments
Please login to add a commentAdd a comment