
సాక్షి, ముంబై: వరుసగా నాలుగో రోజు మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఆసియన్ మార్కెట్ల మిశ్రమ ధోరణి, ఇన్వెస్టర్లు అమ్మకాలతో సెన్సెక్స్ 257 పతనమై 31,342 వద్ద కీలక మద్దతుస్థాయి 31,500 దిగువకు చేరింది. అలాగే నిఫ్టీ 80 పాయింట్లు పతనమై 9,791ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,800 స్థాయిని కూడా బ్రేక్ చేసింది. దాదాపు అన్ని రంగాలు బలహీనంగా ఉండగా ముఖ్యంగా ఫార్మా, మెటల్ బ్యాంకింగ్ సెక్టార్ అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. నిఫ్టీ 50లో 40 షేర్లు నష్టపోతున్నాయి.
సన్ ఫార్మా, ఐబీహౌసింగ్, అదానీ పోర్ట్స్,రిలయన్స్,దివీస్ లాబ్స్ హెచ్‌యూఎల్, యాక్సిస్, డాక్టర్ రెడ్డీస్, వేదాంతా, సిప్లా, ఐసీఐసీఐ, టాటా మోటార్స్ డీవీఆర్, ఎస్‌బీఐ భారీగా నష్టపోతున్నాయి. ఒక్క ఐటీ లాభాల్లో ఉండటం విశేషం. టెక్ మహీంద్రా, ఇన్‌ఫ్రాటెల్, అంబుజా, ఐవోసీ, టీసీఎస్, ఐటీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు పిరామల్ సంస్థ హౌసింగ్ పైనాన్స్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో పిరామల్ భారీగా లాభపడుతోంది.
అటు డాలర్‌మారకంలో దేశీయ కరెన్సీ మరింత పతనాన్నినమోదు చేసింది. డాలర్‌తో పోలిస్తే 0.25పైసల నష్టంతో రూ.65.70 వద్ద ఉంది. రూ.66 స్థాయి పతనానికి చేరువలో ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పుత్తడి లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతోంది. పది గ్రా. రూ.30 నష్టపోయి రూ. 29, 842వద్ద ఉంది.