సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దసరా పండుగ ఉత్సాహాన్ని ఉసూరుమనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. ఒకదశలో సెన్సెక్స్ 500 పాయింట్ల వరకూ పతనమైంది. ప్రస్తుతం 350పాయింట్లు క్షీణించి 34,429 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు కోల్పోయి 10,333 వద్ద కొనసాగుతున్నాయి.
ఫార్మా తప్ప అన్ని రంగాల్లోనూ అమ్మకాల ధోరణి నెలకొంది. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఆటో రంగాలు నష్టపోతున్నాయి. మైండ్ ట్రీ 9శాతం కుప్పకూలగా.. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో 4-1.25 శాతం బలహీనంతో కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), యస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ , హీరోమోటో నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు ఇన్‌ఫ్రాటెల్, గెయిల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఐవోసీ, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment